Gunde Ninda Gudi Gantalu Today Episode: రోహిణికి ప్రభావతి గ్రీన్ సిగ్నల్- అయినా బాలుపై నిందలు- అరుణ్‌కు షాకిచ్చిన తల్లి

Gunde Ninda Gudi Gantalu Serial August 17th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ 17వ తేది ఎపిసోడ్‌లో శ్రుతి ఫ్రెండ్ తనకు పెళ్లి పిక్స్ అయిందని, మేకప్‌కి ఎవరినైనా చూడమని చెబుతుంది. అది రోహిణికి చెబుతుంది శ్రుతి. అత్తయ్య పర్మిషన్ ఇస్తే వెళ్తానని రోహిణి అంటుంది. ప్రభావతిపై సెటైర్లు వేస్తారు.

Published on: Aug 17, 2026, 07:55:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాత్రిపూట పార్లరమ్మను రోస్ట్ చేసుకుంటుందని, కాల్చుకుని తింటుందని బాలు అంటాడు. అత్తయ్య శిక్షిస్తున్నట్లు లేదు కక్ష్య తీసుకుంటునట్లు ఉందని మీనా అంటుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ 17 ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ 17 ఎపిసోడ్

రాక్షస అత్త అవార్డ్

మా అమ్మ అంతే వెంటనే కక్షావతి అవుతుంది. రాక్షస అత్త అవార్డ్ కూడా ఇస్తారు అని మనోజ్ పైనా పడుకుంటే బెడ్ మీద పడుకోమని, రోహిణిని కింద పడుకోమ్మని చెప్పిందని బాలుఅంటాడు. ఇంతలో మీనాకు విద్య కాల్ చేసి అరుణ్ లవ్ ప్రపోజ్ చేసింది చెబుతుంది. మంచి రోజు పెళ్లి చేసుకోండని. ఒక్కసారి ప్రేమ ఒప్పుకున్నాకా అనుమానాలు ఉండకూడదు అని మీనా అంటుంది.

త్వరలో శుభవార్తతో కాల్ చేస్తానని విద్య చెబుతుంది. విద్యకు చెప్పినదాని గురించి సూపర్ అంటాడు బాలు. నువ్వు విద్యకు సలహాలు ఇవ్వొచ్చు కానీ నేను మురళికి ఇవ్వకూడదా అని బాలు అంటాడు. మీరు ఇచ్చేది ఏదైనా మన కాపురానికి ఎసరు పెట్టకుంటే చాలని మీనా అంటుంది. మన కాపురం తనకు బాగా నచ్చిందని, మనం చెబితే తన జీవితం బాగుంటుందని అడిగిందని మీనా అంటుంది.

రోహిణి, విద్య ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకుంటారు బాలు, మీనా. తన సలహాలు బాగా ఉండవని మీనా అన్నదని బాలు హర్ట్ అయ్యానంటాడు. దాంతో ఎలా హర్ట్ అయ్యారు ముళ్లకంప అని బాలుకు చక్కిలిగింతలు పెడుతుంది మీనా. మరోవైపు శ్రుతికి తన ఫ్రెండ్ పెళ్లి ఫిక్స్ అయిందని, మేకప్ కోసం ఎవరినైనా చూడమని చెబుతుంది.

ఒంటరిగా ఉన్నప్పు డు చెప్పు

అది రవి వింటాడు. నా ఫ్రెండ్ పెళ్లి మేకప్ ఆర్డర్ రోహిణికి ఇవ్వనా. కానీ, అత్తయ్య ఏమైనా అంటుందా, ఈ విషయం చెబితే నన్ను ఏమైనా అంటుందేమో అని రవిని అడుగుతుంది శ్రుతి. నేను చెప్పింది ఫాలో అయ్యేదుంటే అవ్వు. రోహిణి వదిన ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పు. అప్పుడు వదినకు ఇంట్రెస్ట్ ఉంటే ఎలా వెళ్లాలో ప్లాన్ చేసుకుంటుంది అని రవి ఐడియా ఇస్తాడు.

ఇదేమైనా దొంగతనమా సీక్రెట్‌గా చెప్పడానికి. ఇన్నిరోజులు రోహిణి సీక్రెట్‌గా దాచడం వల్ల ఇదంతా జరిగింది. నువ్వు మంచి ఐడియా ఇస్తావనుకున్నా. నువ్వు కూడా మనోజ్‌లాగా మీ అమ్మకు భయపడుతున్నావ్ అని శ్రుతి అంటుంది. భయపడటం కాదు అనవసరమైన గొడవలు ఎందుకు అని. నీకు నచ్చింది చేయు తల్లి అని దండం పెడతాడు రవి.

మరోవైపు బాలును ఏం చేస్తున్నావని ప్రభావతి అడిగితే.. మటన్ కొడుతున్నా.. కనిపించట్లేదా అని బాలు సైటెర్ వేస్తాడు. మీనాను పిలిచి అదే అడిగితే.. మలేషియాకు పూలు ఇచ్చి వస్తున్నా పంచ్ వేస్తుంది. ఇద్దరు హై ఫై ఇచ్చుకుంటారు. ఇంతలో సత్యం వస్తే ఎక్కడికెళ్లారని ప్రభా అడుగుతుంది. జైలుకు.. ఇప్పుడే మలేషియా పోలీసులు విడుదల చేసి పంపించారని సత్యం కూడా సెటైర్లు వేస్తాడు.

వెర్రిదాన్ని చేస్తున్నారా

ఇంతలో రవి, శ్రుతి వస్తే మీరెక్కడి నుంచి వస్తున్నారని ప్రభావతి అడుగుతుంది. ఇప్పుడే పార్కులో పడుకుని వస్తున్నానని రవి అంటాడు. అంతా మనోజ్, రోహిణి పనుల గురించి చెబుతూ సెటైర్లు వేస్తారు. మీరందరు కలిసి నన్ను వెర్రిదాన్ని చేయాలనుకుంటున్నారా అని ప్రభావతి అంటే.. అందుకు రోహిణి ఉందిగా అని బాలు అంటాడు.

ఇంతలో రోహిణిని శ్రుతి పిలుస్తుంది. మనోజ్, రోహిణి వస్తారు. ఏం చేస్తున్నావురా అని ప్రభావతి అంటే మోసపోతున్నా అని మనోజ్ అంటాడు. అత్తయ్య పిలిచారా అని రోహిణి అంటే.. అమ్మా కోకిలా బాగానే కూస్తున్నావ్.. పిలిచింది నేను కాదని ప్రభావతి వెటకారంగా అంటుంది. పిలిచింది నేనే. నా ఫ్రెండ్ పెళ్లికి మేకప్ చేయడానికి బ్యూటిషియన్ కావాలట. నీకు కుదురుతుందా అని శ్రుతి అడుగుతుంది.

రోహిణి చేసిన మోసాలు, పోయిన పార్లర్, ఫర్నిచర్‌కు వెళ్లే పోస్టుల గురించి బాలు సెటైర్లు వేస్తాడు. అన్ని పుణ్యాలు నువ్వే కట్టుకుంటున్నావుగా బాలు. మాకింకా ఇంకేం పనేముందిలే అని రోహిణి అంటుంది. ఇంకా చెప్పడానికి అబద్ధాలు, చేయడానికి మోసాలు మిగల్లేదట అండి. చేయాల్సింది అంతా చేసి తీరిగ్గా మన మీద ఏడవడం మొదలుపెట్టిందని మీనా కౌంటర్ ఇస్తుంది.

ఏం నంగనాచివే

మీ ఇద్దరికి బాగా సంతోషంగా ఉన్నట్లుందని రోహిణి అంటే.. వాళ్లకేంటీ మాకు కూడా సంతోషంగా ఉందని రవి అంటాడు. ఎహే ఆపు రోహిణి.. నేను అడిగినదానికి చెప్పమని శ్రుతి అంటుంది. అత్తయ్య మీరు పర్మిషన్ ఇస్తే వెళ్తానని రోహిణి అంటుంది. ఏం నంగనాచివే, ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావే. నా దగ్గర నాటకాలు మొదలుపెట్టావా అని ప్రభావతి అంటుంది.

ఏమైంది, పర్మిషన్ ఎందుకు అడుగుతున్నావ్ అని సత్యం అంటాడు. ఫర్నిచర్ షాప్‌కి రోహిణి వెళ్లకూడదని తను చెప్పింది చెబుతుంది ప్రభావతి. దాని ఇనుపపాదం షాపులో మోపితే కుర్చీలకు కవలలు పుట్టరు అని అంటుంది ప్రభావతి. ఇది అన్యాయం. మేకప్ అయితే మీరు నేర్పించలేదుగా అని మీనా అంటుంది. ఏయ్ తిక్కలదానా దీన్ని వదిలేస్తే గోదావరిని మలేషియాకు అమ్మేస్తుందని ప్రభావతి అంటుంది.

నువ్వు మూర పూలు కొలిచేలోపు ఇది దేశాన్నే అమ్మొస్తుంది అని ప్రభావతి అంటుంది. అబ్బా జ్ఞాన ప్రభావతి అయిందని బాలు అంటాడు. అత్తయ్య ఒప్పుకుంటే వెళ్తాను.. లేకుంటే లేదని రోహిణి అంటుంది. పర్మిషన్ దేనికి అని బాలు అంటే.. గిచ్చి జోల పాడకు బాలు. దీనంతటికి కారణం నువ్వే అని రోహిణి, అవును నువ్వే.. భ్రమలో ఉన్నప్పుడే బాగుండేదని మనోజ్ బాలుపై నిందలు వేస్తారు.

రోహిణి ఓవరాక్షన్

రేయ్ మలేషియా భ్రమలోంచి బయటపడాలనే కదరా ఇలా చేసిందని బాలు అంటాడు. అంటే ఏంట్రా మోసం చేయడం తప్పుకాదు కానీ బయటపెట్టినవాళ్లదే తప్పంటున్నారా నువ్వు రోహిణి సత్యం అంటాడు. రోహిణిని పార్లర్‌కు పంపించమని శ్రుతి, మీనా, రవి, సత్యం సపోర్ట్ చేస్తారు. రోహిణి ఓవరాక్షన్ చేస్తుంది డబ్బు పడేస్తే చాలా మంది దొరుకుతారని శ్రుతి కోపంగా అంటుంది.

బాలు దీన్ని కూడా చెడగొడతాడని రోహిణి అంటుంది. ఏయ్.. వాడేమన్నాడే. ఇంత చేసిన కూడా వీళ్లంతా నీకే సపోర్ట్ చేస్తున్నారుగా. ఏదోటి చేసి చావు. ఫర్నిచర్ షాప్‌కు మాత్రం వద్దని ప్రభావతి అంటుంది. దాంతో రోహిణి థ్యాంక్స్ అత్తయ్య అని చెప్పి పైకి వెళ్తుంది. నాకు కాకుండా ఆంటీకి చెప్పిందేంటని శ్రుతి అంటుంది. పార్లరమ్మ పిలక అమ్మ చేతిలో ఉంది. ఎటు లాగితే అటే వెళ్తుందని బాలు అంటాడు.

మరోవైపు అరుణ్ ఇంటికి సుమతి వెళ్తుంది. ఇంతలో అరుణ్ వచ్చి మర్యాదలు చేస్తాడు. మీరు మాట్లాడండి చాలా పనులున్నాయని అరుణ్ తల్లి అంటుంది. అరుణ్ పెళ్లి గురించి తల్లి మాట్లాడుతుంది. ఆ అమ్మాయి ఒప్పుకుంటుందో లేదో అని తల్లి అంటుంది. కాఫీ తీసుకొస్తానని తల్లి వెళ్తుంది. నన్ను మా అత్తింటికి ఎప్పుడు తీసుకెళ్తావ్ అని అరుణ్ అంటాడు.

నోరు జారిన అరుణ్ తల్లి

ఇంకా మెయిన్ ఎగ్జామ్ ఉందని, కొంచెం వెయిట్ చేయమని సుమతి అంటుంది. త్వరగా రిజల్ట్స్ ఇవ్వమని చెప్పి లోపలికి వెళ్తాడు అరుణ్. కాఫీ బాగుందని సుమతి అంటే.. నీ చేత్తే ఎప్పుడు కాఫీ పెట్టిస్తావో అని అరుణ్ తల్లి నోరు జారుతుంది. అమ్మ బాంబ్ పేల్చేలా ఉందని అరుణ్ భయపడతాడు. అంటే సుమతి ప్రేమ గురించి తల్లికి అరుణ్ చెప్పినట్లుగా తెలుస్తోంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More