...
...
Next Story

Gunde Ninda Gudi Gantalu Today Episode: మీనా ఆర్డర్‌కు ప్రభావతి అడ్డు.. ఇల్లు తాకట్టు.. కాబోయే అల్లుడి ఇంటికి పార్వతి

Gunde Ninda Gudi Gantalu Serial August 27th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ 27 ఎపిసోడ్ లో మీనాకు వచ్చిన కొత్త ఆర్డర్ కు ప్రభావతి అడ్డుపుల్ల వేస్తుంది. అటు కాబోయే అల్లుడు అరుణ్ ఇంటికి సుమతితో కలిసి పార్వతి వెళ్తుంది.

Published on: Aug 27, 2026, 07:14:58 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో అత్తను ప్రసన్నం చేసుకోవడానికి రోహిణి పడే తంటాలు, శివను కాపాడటంలో సాయం చేసిన అరుణ్ కు థ్యాంక్స్ చెప్పడానికి సుమతి, పార్వతి అతని ఇంటికి వెళ్లడం, కొత్త ఆర్డర్ కోసం వెళ్లిన మీనాకు మరోసారి చింతామణి అడ్డుపడే సీన్లు చూడొచ్చు.

ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నానన్న రోహిణి

Gunde Ninda Gudi Gantalu Today Episode: మీనా ఆర్డర్‌కు ప్రభావతి అడ్డుపుల్ల.. కాబోయే అల్లుడి ఇంటికి పార్వతి.. ఇక పెళ్లే..
Gunde Ninda Gudi Gantalu Today Episode: మీనా ఆర్డర్‌కు ప్రభావతి అడ్డుపుల్ల.. కాబోయే అల్లుడి ఇంటికి పార్వతి.. ఇక పెళ్లే..

మేకప్ చేస్తే వచ్చిన డబ్బును అత్త ప్రభావతి చేతుల్లో రోహిణి పెట్టే సీన్ తో గుండె నిండా గుడి గంటలు లేటెస్ట్ ఎపిసోడ్ మొదలైంది. ఈ డబ్బు తనకు ఎందుకు ఇస్తున్నావని ప్రభావతి అడుగుతుంది. తాను చేసిన తప్పులకు ఇది ప్రాయశ్చిత్తం అని రోహిణి అంటుంది.

అంటే నేను డబ్బు మనిషిని అని, నన్ను డబ్బుతో కొంటున్నావా.. నాకు వద్దు అని ఆమె అనడంతో బాలు షాక్ తింటాడు. తన మార్క్ ఎగతాళితో ప్రభావతి, రోహిణి పరువు తీస్తాడు. అటు మనోజ్ కూడా చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం అంటోంది కదా తీసుకో అమ్మా అని చెబుతాడు.

అత్తకు డబ్బివ్వడం సరి కాదన్న సత్యం

దీంతో సత్యం కూడా అతన్ని తిడతాడు. నీ భార్య కష్టార్జితం మీ అమ్మకు ఇవ్వమంటావేంట్రా వెధవ అని అంటాడు. నీ డబ్బు అత్తకు ఇవ్వడం సరి కాదు అని రోహిణితో సత్యం చెబుతాడు. డబ్బు వద్దంటూనే వాటిని తీసుకొని లెక్కపెట్టడం చూసి బాలు, రవి, శృతి షాక్ తింటారు. గింజలు వేసి కోడిని ఎత్తుకుపోతుంది జాగ్రత్త అంటూ రోహిణి గురించి ప్రభావతికి బాలు వార్నింగ్ ఇస్తాడు. అయినా ఆమె ఏమీ పట్టనట్లే ఉంటుంది.

ఇంటికి చాక్లెట్లతో వచ్చిన మీనా.. ఎగతాళి చేసిన ప్రభావతి

ఈ మాత్రందానికే ఏదో నీ తమ్ముడు ఐఏఎస్ అయినట్లు బిల్డప్ ఇస్తావెందుకు.. అయినా రూపాయి చాక్లెట్లు పట్టుకొచ్చావ్.. రోహిణి చూడు రూ.20 వేలు ఇచ్చింది అని ప్రభావతి అంటుంది. ఆ డబ్బు మీరెందుకు తీసుకుంటున్నారు.. అది రోహిణి సంపాదన కదా అని మీనా అడుగుతుంది. కానీ ప్రభావతి పట్టించుకోదు.

కొత్త ఆర్డర్ గురించి బాలుకి చెప్పిన మీనా

ఆ తర్వాత రాత్రికి బాలు, మీనా మాట్లాడుకుంటూ ఉంటారు. బాలు కోసం తేనె వేసిన పాలు తీసుకొస్తుంది మీనా. మీ వల్లే శివ పరీక్ష రాయగలిగాడు అని అంటుంది. ఆ తర్వాత రోహిణి గురించి కూడా మాట్లాడుకుంటారు. అమ్మ డబ్బు మనిషి అని తెలిసి డబ్బుతోనే మళ్లీ ఆమెను కొనాలని చూస్తోందని బాలు అంటాడు.

అయినా ఆ మనోజ్ గాడు ఇంత వెధవ అని తెలిసినా.. ఎందుకు వాడిని ప్రేమించింది.. ఇంకా ఎందుకు వాడిని సపోర్ట్ చేస్తోందో అని మీనాతో అంటాడు. అదే సమయంలో మీనా తన కొత్త ఆర్డర్ గురించి చెబుతుంది. రేపు రమ్మన్నారని, కానీ చాలా మంది పోటీ పడుతున్నారని అంటుంది. ఆర్డర్ నీకే వస్తుందన్న నమ్మకం తనకు ఉందని బాలు అంటాడు.

అరుణ్ ఇంటికి సుమతి, పార్వతి..

మరోవైపు కాబోయే అల్లుడు అరుణ్ ఇంటికి సుమతితో కలిసి వెళ్తుంది పార్వతి. వాళ్లను చూసి అరుణ్ తల్లి చాలా సంతోషిస్తుంది. మీ అబ్బాయి వల్లే మా కొడుకు క్షేమంగా ఇంటికి వచ్చాడు.. పరీక్ష కూడా రాయగలిగాడు అందుకే థ్యాంక్స్ చెప్పి వెళ్దామని ఈ పూలు, పండ్లు తెచ్చామని పార్వతి చెబుతుంది.

ఇలా పూలు, పండ్లు తెస్తే అర్థమేంటో తెలుసా? అని అరుణ్ తల్లి అడుగుతుంది. అప్పుడే అరుణ్ రావడంతో పార్వతి అతన్ని చూసి థ్యాంక్స్ చెబుతుంది. ఈ మాత్రం దానికే థ్యాంక్స్ ఎందుకు అని అరుణ్ అంటాడు. అతని డ్యూటీ అతడు చేశాడని తల్లి అంటుంది.

పెళ్లి గురించి అడిగిన అరుణ్ తల్లి..

అప్పుడే సుమతి పెళ్లి ప్రస్తావన తీసుకొస్తుంది అరుణ్ తల్లి. దానికి సమయం రావాలి కదా అని పార్వతి అంటుంది. ఆమెను ఇల్లు చూపించడానికి తీసుకెళ్తుంది. సుమతితో తమ పెళ్లి గురించి అరుణ్ మాట్లాడుతుంటాడు. పార్వతి రావడంతో సుమతి కూడా ఇక వెళ్తాం అని అంటుంది.

అరుణ్ తల్లి పార్వతికి చీర పెట్టి, కాబోయే కోడలి తలలో పూలు పెట్టి ఆమెను ప్రేమతో ముద్దు పెట్టుకుంటుంది. అది చూసిన పార్వతి బయటకు వచ్చిన తర్వాత సుమతిని వాళ్లు అంతగా ప్రేమగా చూసుకుంటున్నారేంటి అని అడుగుతుంది. కానీ సుమతి మాత్రం ఏమీ చెప్పకుండా ఆటో వచ్చింది పదా అని తీసుకెళ్లిపోతుంది.

కొత్త ఆర్డర్ కోసం చింతామణితో మీనా పోటీ

మరుసటి రోజు కొత్త ఆర్డర్ కోసం మీనా వెళ్తుంది. అక్కడికి చింతామణి కూడా వస్తుంది. మీనాను చూడగానే ఈ ఆర్డర్ పోయినట్లే.. మీనా వచ్చింది చూడు అని ఆమె అసిస్టెంట్ చెబుతాడు. మీనాను చూడగానే చింతామణి ఆవేశంతో ఊగిపోతుంది. అక్కడి ఆర్గనైజర్ ను పిలిచి.. ఆర్డర్ కోసం ఇలాంటి కొత్తవాళ్లను కూడా ఎందుకు పిలిచారు.. తనకు ఇస్తే సరిపోతుంది కదా అని అంటుంది.

ఇది ఓ కార్పొరేట్ ఆర్డర్.. వాళ్లకు మీనా చేసిన డెకరేషన్లు చాలా బాగా నచ్చాయి.. మీవి చాలా ఓల్డ్ గా అనిపించాయి.. అందుకే ఈ ఏర్పాట్లు చేశారు అని అతడు చెప్పడంతో చింతామణి కంగు తింటుంది. అయితే ఈ ఆర్డర్ కోసం రూ.5 లక్షలు ముందే డిపాజిట్ చేయాలన్న షరతుతో మీనా షాక్ తింటుంది. అయినా సరే చింతామణికి సవాలు చేసి వెళ్తుంది.

మీనా ఆర్డర్‌కు ప్రభావతి అడ్డుపుల్ల

తన కొత్త ఆర్డర్ కోసం మూడు రోజుల్లో రూ.5 లక్షలు కావాలని బాలుతో చెబుతుంది మీనా. ఆ తర్వాత ఇంట్లో అందరి ముందు సత్యంకు కూడా బాలు, మీనా ఈ విషయం చెబుతారు. డబ్బు కోసం వాళ్ల సాయం కోరుతారు. దీనికి తన దగ్గర ఓ మార్గం ఉందని అనడంతో.. ప్రభావతి ఇంటి విషయం తీస్తుంది. ఈ పనికిమాలిన పని కోసం తాను ఇవ్వాలా.. ఇవ్వనే ఇవ్వను అని తేల్చి చెబుతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks