Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కార్పొరేట్ వాళ్లు డెకరేషన్ ఆర్డర్ వేలం నడుస్తుంటుంది. ఈ ఆర్డర్‌కు ముందు రూ. 5 లక్షలు డిపాజిట్ చేయాలని, దాంతోపాటు డిజైన్స్ కూడా నచ్చాలని మేనేజర్ చెబుతాడు.
3 రోజుల గడువు

5 లక్షల డిపాజిట్ అనగానే మీనా షాక్ అవుతుంది. అంత డబ్బు డిపాజిట్ చేయలేమని చాలా మంది వెళ్లిపోతారు. డిపాజిట్ చేయడానికి ఎన్ని రోజులు టైమ్ ఉందని మీనా అడుగుతుంది. 3 రోజులు టైమ్ ఇచ్చారని చెబుతారు. 3 రోజుల్లో 30 వేలు అయిన తేగలవా, అడ్వాన్స్ కూడా ఇవ్వరు. అది కూడా నవ్వే తెచ్చుకోవాలని చింతామణి అంటుంది.
పది లక్షల కాంట్రాక్టే పూర్తి చేశాను. ఇది చేయలేనా. అయినా నేను తెస్తానో తేనో అది నా సంగతి. నీకెందుకు. ఇలా అన్నింట్లో దూరి కాపురాన్ని చెడగొట్టుకున్నావని ఓనర్ గారు చెప్పారని మీనా అంటుంది. ఇది అందరికి తెలిసిందా. మా అక్కను బావ మెడపట్టి గెంటేశాడని కూడా తెలిసిందా అని చింతామణి అసిస్టెంట్ అంటాడు.
5 లక్షలు నీ స్థాయికి చాలా ఎక్కువ అని చింతామణి అంటే.. మా ఆయన జేబులో నువ్వెప్పుడు చేయి పెట్టావని పంచ్ ఇస్తుంది మీనా. ఈ పోటీలో నేను పాల్గొంటున్నాను. 3 రోజుల్లో 5 లక్షలు కడతాను అని సంతకం పెట్టి ఛాలెంజ్ చేసి వెళ్తుంది మీనా. అత్తింటికి వెళ్లి ఛాలెంజ్ చేసి వచ్చాను. చేతిలో చిల్లి గవ్వ లేదు. ఎవరిని అడగాలి అని కంగారుపడుతుంది మీనా.
బాలుకు 5 వేల టెన్షన్
మీనా పైకి వెళ్తుంది. ఫోన్లో సాయంత్రం వరకు 5 వేలు కడతానని, లేకుంటే కారు తాళాలు నీ చేతిలో పెడతానని ఎవరికో చెబుతుంటాడు బాలు. ఆ మాటలు విన్న ఐదు లక్షల గురించి చెప్పకుండా ఆగిపోతుంది మీనా. కాల్ మాట్లాడిన తర్వాత ఏదో చెప్పాలని వచ్చి చెప్పలేకపోతున్నావ్. ఏంటని, నీకు ఏం కావాలని బాలు అడుగుతాడు.
{{/usCountry}}మీనా పైకి వెళ్తుంది. ఫోన్లో సాయంత్రం వరకు 5 వేలు కడతానని, లేకుంటే కారు తాళాలు నీ చేతిలో పెడతానని ఎవరికో చెబుతుంటాడు బాలు. ఆ మాటలు విన్న ఐదు లక్షల గురించి చెప్పకుండా ఆగిపోతుంది మీనా. కాల్ మాట్లాడిన తర్వాత ఏదో చెప్పాలని వచ్చి చెప్పలేకపోతున్నావ్. ఏంటని, నీకు ఏం కావాలని బాలు అడుగుతాడు.
{{/usCountry}}5 లక్షల డబ్బు కావాలని మీనా చెబుతుంది. దాంతో బాలుకు ఎక్కిళ్లు పడతాయి. బాలు షాక్ అవుతాడు. ఇందుకే చెప్పలేదని మీనా అంటుంది. అంత డబ్బు ఎందుకు అని బాలు అడిగితే.. పెద్ద ఫంక్షన్ ఆర్డర్ వచ్చింది. లాభాలు కూడా బాగా వస్తాయి. కానీ, 5 లక్షలు డిపాజిట్ కట్టాలి. చింతామణి కూడా వచ్చింది. చాలా చిన్నచూపు చూసింది. పౌరుషంతో ఈ ఆర్డర్ చేస్తానని చెప్పి వచ్చానని మీనా అంటుంది.
చింతామణికి బుద్ధి చెప్పాలని బాలు అంటాడు. తర్వాత సత్యంను అడిగితే మంచి సలహా అయినా ఇస్తారని బాలు అంటాడు. కట్ చేస్తే ఇంట్లో అందరు హాల్లో ఉంటారు. ఏం సమస్య వచ్చిందని సత్యం అంటాడు. ఎవరి సీక్రెట్ బయటపెట్టాలనుకుంటున్నారు అని శ్రుతి అడుగుతుంది. కొంపదీసి మా అమ్మ గురించి చింటు గురించి తెలిసిపోయిందా అని రోహిణి భయపడిపోతుంది.
ఏనుగుతో చీమ పోటీ ఏంటీ
డెకరేషన్ ఆర్డర్ గురించి, చింతామణి అడ్డుపడటం గురించి మీనా చెబుతుంది. ఇంకా చింతామణితో ప్రభావతితో మాట్లాడుతుందా అని కోపంగా చూస్తాడు. మనం డిపాజిట్ చేస్తే చింతామణితో ఏ సమస్య లేదు. కానీ, అత్తయ్య ఏం చెప్పకుంటే చాలు అని మీనా అంటుంది. నేనేం నూరిపోయట్లేదు. తనకు చాలా అనుభవం ఉంది. తనతో పోటీపడితే చాలా కష్టమని, ఏనుగుతో చీమకు పోటీ ఏంటని ప్రభావతి అంటుంది.
ఎదుటి వాళ్ల బలం గురించి నాకు అవసరం లేదు. నా బలం తెలుసు అని మీనా అంటుంది. అయితే నీ పుట్టింటి నుంచి తెప్పించుకోవే అని ప్రభావతి అంటుంది. మాట్లాడితే కోడళ్ల పుట్టింటి మీద పడతారా. ఇలా చేసే రోహిణి ఇక్కడికి దాకా తెచ్చుకుంది అని మీనా అంటుంది. మీనాను తక్కువ చేసి మాట్లాడుతుంది అత్త ప్రభావతి. అనేది రోహిణినా అని శ్రుతి రివర్స్ పంచ్ ఇస్తుంది.
రిటైర్ అయిన డబ్బులు వస్తే అందరికి సమానంగా పంచాలనుకున్నా. కానీ, వీడు రెండుసార్లు దోచుకెళ్లాడు. అయినా నా స్నేహితులను అప్పు అడుగుతాను అని సత్యం అంటాడు. వీళ్లు ఆర్డర్ పూర్తి చేస్తారో లేదో అనే అనుమానంతోనే డిపాజిట్ పెట్టమంటున్నారు. అప్పు ఎందుకు చేయాలని నాన్న అని మనోజ్ అంటాడు. అన్ని మింగినోడు ఏం మిగలక ఉచిత సలహాలు ఇస్తున్నాడని బాలు సెటైర్లు వేస్తాడు.
ఇది ఉమ్మడి ఆస్తి
నా నగలు ఉన్నాయి, తాకట్టు పెట్టుకోండని శ్రుతి అంటుంది. బాలు వద్దంటాడు. ఇందుకోసం నా దగ్గర ఓ ఐడియా ఉంది. కానీ, దానికి మీరంతా ఒప్పుకోవాలని అని బాలు అంటాడు. నువ్వు అందరిని సమావేశపరిచినప్పుడే అర్థమైంది. మీరు ఏది అడగాలనుకుంటున్నారో. ఇదివరకు అప్పు ఉన్న ఆస్తి పత్రాలపైనే అప్పు తేవాలని చూస్తున్నారా అని ప్రభావతి అంటుంది.
ఇది ఉమ్మడి ఆస్తి, అలా ఎలా అప్పు తెస్తారని మనోజ్ అంటే.. అది వదినకు పార్లర్ పెట్టించినప్పుడు ఎందుకు అడగలేదని రవి కౌంటర్ ఇస్తాడు. నేను చచ్చినా ఇంటి తాకట్టుపెట్టనివ్వను అంటుంది ప్రభావతి. నేను చెప్పానుకుంది అది కాదు అని బాలు అంటాడు. బాలును మాట్లాడనివ్వకుండా అడ్డుపడితే మెడపట్టి గెంటేస్తాను. రూపాయి సాయం చేయరు కానీ నా కోడలని తక్కువ చేస్తారా అని సత్యం వార్నింగ్ ఇస్తాడు.
బామ్మ పొలం ఉందిగా. బామ్మను అడిగి ఆ పొలం మీద లోన్ తీసుకుందామనుకుంటున్నా అని బాలు అంటాడు. అది కూడా ఉమ్మడి ఆస్తి కాదా అని ప్రభావతి అంటే.. కాదు. అది మీ నాన్న కట్టిన ఇల్లు కాదు. మా అమ్మ ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్లకిస్తుందని సత్యం అంటాడు. అదైనా అందరి ఆస్తే కదా. వీళ్లు విడిపించకపోతే నష్టం వస్తుందిగా అని మనోజ్ అంటాడు.
నాన్న 40 లక్షలు ఇచ్చావా
నాన్న 40 లక్షలు ఇప్పటికీ ఇచ్చావా, మీనా నగలు అమ్మిన డబ్బు ఇచ్చావా, మొన్నటి మొన్న నీ కళ్లకు మీనా పుస్తెలు తాడుకోసం దాచిన డబ్బులు ఇచ్చాను. ఇచ్చావా. ఇంకోసారి మాట్లాడితే చెప్పుతో కొడతాను. నాన్న తప్పా ఇంకెవరు అడ్డుపడిన ఊరుకోను అని బాలు అంటాడు. నన్ను చెప్పమంటే అని రోహిణి అంటే.. నిన్ను ఎవరు అడగలేదమ్మా అని రోహిణికి షాక్ ఇస్తాడు మామ సత్యం.
బాలు అమ్మను మీరు అడిగితే కచ్చితంగా ఇస్తుందని సత్యం అంటాడు. తర్వాత కిచెన్‌లో ప్రభావతి ఏయ్ అంటూ పిలిస్తే మీనా పలకదు. నువ్వేంటీ ఆవిడ పొలం మీద కన్నేశావ్. నువ్వు చేసేది ముష్టి పూల వ్యాపారం. ఆస్తులు అమ్మితే ఊరుకోను అని ప్రభావతి అంటుంది. ఇప్పటివరకు తాకట్టు పెట్టాలని మాత్రమే అనుకున్నాం. మీరన్నది బాగుంది. అమ్మేస్తే అయిపోతుంది. ఆయనుంటే చాలా సంతోషించేవారు అని మీనా అంటుంది.
నేను అడిగితే అమ్మమ్మ కాదనరు. ఆ పొలం అమ్మేసి నా ముష్టి పూల వ్యాపారాన్ని నిలబెట్టుకుంటాను అని మీనా అంటుంది. శ్రుతి చప్పట్లు కొడుతు ఆంటీని ఫటఫటలాండించేది నువ్వేనా అని మెచ్చుకుంటుంది. తర్వాత ప్రభావతి కోపంగా బయటకు వెళ్తుంది. ప్రభావతికి మీనా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిందని తెలిసి మీనాను ఎత్తుకుంటాడు బాలు.
చింతామణితో ప్రభావతి ప్లాన్
మీనా పొగరు తగ్గాలంటే ఆ ఆర్డర్ రాకూడదు అని మళ్లీ చింతామణితో చేతులు కలుపుతుంది ప్రభావతి. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.