...
...
Next Story

Gunde Ninda Gudi Gantalu Today Episode: ఏడిపించిన అన్నాచెల్లి- మనోజ్ రోహిణి ఇంగ్లీషు ముద్దు- మౌనిక ఇంటి ముందు బాలు ధర్నా

Gunde Ninda Gudi Gantalu Serial August 30th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ 30వ తేది ఎపిసోడ్‌లో చెత్తబుట్టలో రాఖీలు పడేసిన సంజు మౌనికను పుట్టింటికి వెళ్లనివ్వడు. మనోజ్‌కు రోహిణి ఇంగ్లీషు ముద్దు పెట్టిందని ప్రభావతి రచ్చ చేస్తుంది. మౌనిక ఇంటి ముందు బాలు ధర్నా చేస్తాడు.

Published on: Aug 30, 2026, 12:54:07 IST
Advertisement

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మౌనిక రాఖీలు కట్టేందుకు వెళ్తానంటే సంజు ఒప్పుకోడు. నేను వెళ్తానను మౌనిక గట్టిగా అంటే.. అయితే, నేను కట్టిన తాళి తీసి మీ ఇంటికే వెళ్లిపోయి ఉండు అని సంజు అంటాడు.

చెత్తబుట్టలో రాఖీలు

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ 30 ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ 30 ఎపిసోడ్

దాంతో మౌనిక షాక్ అవుతుంది. నాతో నా ఇంట్లో ఉండాలంటే నీ హక్కులన్నీ నా కాళ్లకిందే ఉండాలని, రాఖీలు చెత్తబుట్టలో పడేసేందుకు వెళ్తాడు సంజు. మౌనిక వద్దని వారిస్తుంటే ముందుకు తోసేస్తాడు సంజు. మౌనికను సంజు తల్లి సువర్ణ పట్టుకుంటుంది. రాఖీలను చెత్తబుట్టలో పడేస్తాడు సంజు. రాఖీల గురించి అత్తకు చెబుతుంది మౌనిక.

సంజును వారిస్తుంది సువర్ణ. వెళ్లనివ్వురా అని సువర్ణ అంటుంది. సంజు వద్దంటాడు. తన బాలు అన్నయ్య ఎంతగానో ఏడుస్తాడని మౌనిక చెబుతుంది. వాడి ఏడుపు నాకెందుకు అని సంజు అంటాడు. ఆ బాధ మీకెలా తెలుస్తుంది. కట్టుకున్న భార్య బాధ తెలియదు. ఇందుకే మీకు తోడబుట్టిన వాళ్లనివ్వలేదని మౌనిక అంటుంది. సంజు కొట్టబోతుంటే సువర్ణ ఆపుతుంది.

ఇప్పుడే చెబుతున్నా ఇది వాళ్లకు రాఖీ కడితే అది ఇంట్లో ఉండే ఆఖరి రోజు ఇదే అవుతుందని సంజు వెళ్లిపోతాడు. ఆ దరిద్రుడు రేపు వెళ్లగానే నిన్ను పంపిస్తానంటుంది సువర్ణ. ఆయన మనల్ని నమ్మరు. అలా చేస్తే నా బతుకు ఇంకా దరిద్రంగా తయారవుతుంది. ఇక్కడే ఉండి ఏడుస్తాను అని మౌనిక అంటుంది. మరోవైపు రాత్రి పడుకున్న మీనాను లేపి రేపు క్యారెట్ హల్వా చేయమని, అది మౌనికకు ఇష్టమని చెబుతాడు బాలు.

చిన్నపిల్లాడిలా బాలు

ఇక్కడ మనోజ్, రవిగాడికి మౌనికతో రాఖీ కట్టించేది. నాకు మాత్రం కట్టనివ్వలేదు. ఇక్కడికి వచ్చాకా అమ్మలాగే మనోజ్ గాడు చూసేవాడు. రవిగాడికి ఏం తెలియదు. నన్ను తల్లిలా మౌనిక చూసుకునేది. పెళ్లయితే ఏంటీ అన్ని హక్కులు తనకే ఉంటాయా అని బాలు చిన్నపిల్లాడిలా అంటాడు. మౌనిక వస్తుందిగా. పంపిస్తాడులే. మౌనిక ఒప్పిస్తుందిలే అని బాలు అంటాడు.

చిన్నపిల్లాడిలా మారారు. మీరు దేనికైనా సిద్ధంగా ఉండాలి. రేపు మౌనిక వచ్చినా రాకున్నా అని మీనా అంటుంది. వాళ్ల అత్తను ఒప్పించైనా మౌనిక వస్తుంది. నాకు తెలుసు అని అలాగే అంటాడు బాలు. పాలు తోడు పెట్టడం మర్చిపోయానని చెప్పి కిచెన్‌లోకి వెళ్లి మౌనిక పరిస్థితి గురించి ఆలోచిస్తుంది మీనా. మౌనికకు కాల్ చేస్తుంది.

మెడలో బాంబులు వేసుకుని

ఎలా ఉన్నావని మీనా అడిగితే.. నాకున్న ఐశ్వర్యం మెడలో బాంబులు వేసుకుని తిరుగుతున్నట్లుందని మౌనిక అంటుంది. రేపు అని మీనా అంటే.. తెలుసు ఆ ఇంట్లో రాఖీ పౌర్ణమి, ఈ ఇంట్లో అమావాస్య అని మౌనిక అంటుంది. నువ్వు వస్తావని మీ అన్నయ్య కలలు కంటున్నారు. నువ్వు రావట్లేదా అని బాలు గురించి చెబుతుంది మీనా.

ఆశలు పెట్టుకోకని చెప్పమని మౌనిక అంటుంది. జరిగింది చెబుతుంది. ఇబ్బంది, మాటలు పడి రావాల్సిన అవసరం లేదు. మీ అన్నయ్యను నేను చూసుకుంటాను అని మీనా అంటుంది. రాఖీల్లో ఏం లేవు. మెరుపులు, రంగులు తప్పా. నేను రాకపోతే ప్రేమ లేదని కాదు అని మౌనిక కాల్ పెట్టేస్తుంది. అటు బాలు, ఇటు మౌనిక అన్నాచెల్లెళ్లు ఏడిపించేస్తారు.

బాలు పక్కన పడుకుని ఎలాగైనా ఈయనకు మౌనిక రాఖీ కట్టేలా చేయమని దేవుడుని కోరుకుంటుంది మీనా. ఉదయం మనోజ్ బ్రేక్‌ఫాస్ట్ కావాలని అంటే మీ ఆవిడను పెట్టమని మీనా చెబుతుంది. రోహిణికి మీనా చెబుతుంది. దాంతో సంతోషంగా మనోజ్‌కు రోహిణి టిఫిన్ పెడతానంటే అవసరం లేదని తనే పెట్టుకుంటాడు మనోజ్. తనకు టిఫిన్ తినిపించమని రోహిణి అడుగుతుంది.

మనోజ్‌కు రోహిణి లిప్ కిస్

మనోజ్ పెట్టనంటాడు. నేనే తీసుకుంటానని రోహిణి అంటే.. నేను ఒకరి ఎంగిలి తినను మనోజ్ అంటాడు. కోడిగుడ్లు బాగానే తింటావుగా అని రోహిణి అంటే.. డర్టీ కంపారిజన్ అని ప్లేట్ ఎత్తేస్తాడు. దాంతో ప్లేట్‌లో ఉన్న కారణం మనోజ్ కళ్లలో పడుతుంది. మంటతో మనోజ్ అరిస్తే రోహిణి ఊదుతుంది. కానీ, అది చూసేందుకు మనోజ్‌కు రోహిణి లిప్ కిస్ పెట్టినట్లు కనిపిస్తుంది.

అది ప్రభావతి చూసి గట్టిగా అరిచి తిడుతుంది. అందరు వచ్చి ఏమైందని అడుగుతారు. ఆ నికృష్ణమైన పని గురించి నేను చెప్పలేను. ఎవరు లేని సమయం చూసి నా కొడుకును వలలో వేసుకోవాలని చూస్తున్నావా అని రోహిణిని తిడుతుంది ప్రభావతి. వీడు మాత్రం తక్కువ పెళ్లాం కావాల్సి వచ్చిందని ప్రభావతి తిడుతుంది. రేయ్ చెప్పురా అని బాలు అడుగుతాడు.

ఇది వాన్ని ము.. ము.. ఇంగ్లీష్ ముద్దు అని ప్రభావతి అంటుంది. రోహిణి సిగ్గుపడుతుంది. నువ్వు సిగ్గుపడకు బొగ్గులా ఉందని మనోజ్ అంటాడు. మధ్యలో ఈవిడెందుకురా అరుస్తుందని బాలు అంటాడు. అమ్మా నువ్వు అనుకున్నట్లు ఏం జరగలేదమ్మా అని కారం పడిన విషయం చెబుతాడు మనోజ్. తర్వాత బాలు, మనోజ్, రవి రాఖీ కట్టించుకునేందుకు మౌనిక ఇంటికి వెళ్తారు.

బాలు ధర్నా

సంజు ఇంట్లో రాజకీయ ప్రచార ఏర్పాట్లు జరుగుతుంటాయి. బాలు వాళ్లను సంజు తండ్రి రానివ్వడు. దాంతో రాఖీ కట్టించుకునేవరకు వెళ్లను అని మౌనిక ఇంటి ముందు ధర్నాకు కూర్చుంటాడు బాలు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe