...
...
Next Story

Gunde Ninda Gudi Gantalu Today Episode: రోహిణిని చితగ్గొట్టిన ప్రభావతి.. గొంతు పిసికి చంపబోయి.. అగ్నికి ఆజ్యం పోసిన మీనా

Gunde Ninda Gudi Gantalu Serial August 5th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ 5 ఎపిసోడ్ లో రోహిణి బండారం మొత్తం బయటపడుతుంది. మేక మామను ఇంటికి తీసుకొచ్చి బాలు, మీనా అతనితో మొత్తం నిజం చెప్పించడంతో ప్రభావతి ఆమెను చితకబాదుతుంది.

Published on: Aug 5, 2026, 07:16:19 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో అతిపెద్ద ట్విస్ట్ వచ్చేసింది. ఎన్నాళ్లుగానో కూలుతాయనుకున్న రోహిణి అబద్ధాల గోడలు పూర్తిగా కూలాయి. మేక మామ తన ఇంటికే వచ్చి నోరు విప్పడంతో ప్రభావతి ఉగ్రరూపం దాలుస్తుంది. రోహిణిని చితకబాదుతుంది.

బాలు, మీనాకు అడ్డంగా దొరికిపోయిన మేక మామ

Gunde Ninda Gudi Gantalu Today Episode: రోహిణిని చితగ్గొట్టిన ప్రభావతి.. గొంతు పిసికి చంపబోయి.. అగ్నికి ఆజ్యం పోసిన మీనా
Gunde Ninda Gudi Gantalu Today Episode: రోహిణిని చితగ్గొట్టిన ప్రభావతి.. గొంతు పిసికి చంపబోయి.. అగ్నికి ఆజ్యం పోసిన మీనా

బాలు, మీనా చేసిన పనికి పెళ్లి కొడుకు మేనమామ సన్మానించడానికి వస్తున్నాడని రంగారావు చెప్పే డైలాగుతో సీరియల్ బుధవారం (ఆగస్ట్ 5) ఎపిసోడ్ మొదలైంది. మేళతాళాలతో డ్యాన్స్ చేస్తూ వస్తున్న మేక మామను చూసి బాలు, మీనా షాక్ తింటారు. వాళ్లను చూసి మాణిక్యం బిక్కమొహం వేస్తాడు.

ఇతడు ఎవరు అని బాలు అడిగితే.. సుందరి భర్తకు మేన మామ.. ఇక్కడే మటన్ కొట్టు ఉంది.. ఇతన్ని మటన్ కొట్టు మాణిక్యం అని కూడా అంటారు అని చెప్పడంతో బాలు, మీనా మొహాలు చూసుకుంటారు. దీంతో మాణిక్యం తెచ్చిన దండలను బాలు అతనికే వేసి సన్మానిస్తాడు. బాలు ఏం చేస్తున్నాడో రంగారావు, కామాక్షిలకు అర్థం కాదు. ఆ తర్వాత మాణిక్యాన్ని బాలు తన వెంట తీసుకెళ్తాడు.

మాణిక్యాన్ని ఇంటికి తీసుకొచ్చిన బాలు, మీనా

ఇటు ఇంట్లో మీనాపై ప్రభావతి మండిపడుతూ ఉంటుంది. అప్పుడే ఇంటికి వస్తారు బాలు, మీనా. వెంటనే ఓ వాటర్ బాటిల్ తెచ్చి అమ్మ ముందు పెట్టు అని మీనాకు చెప్పడంతో ఆమె వెంటనే వెళ్లి బాటిల్ తెస్తుంది. ఇంట్లో అందరినీ పిలుస్తాడు బాలు.

మేక మామను ఇంట్లోకి తీసుకొస్తాడు బాలు. అతన్ని చూసి రోహిణి షాక్ తింటుంది. మాణిక్యాన్ని చూసి మీరా.. ఎప్పుడొచ్చారు అంటూ ప్రభావతి కుశల ప్రశ్నలు అడుగుతుంది. మాణిక్యాన్ని చూసి మామయ్య అంటూ పిలిచిన రోహిణి.. మరో నాటకాన్ని మొదలుపెట్టడానికి చూస్తుంది.

వెంటనే వెళ్లిపో అని అంటుంది. మాణిక్యం వెళ్లిపోవడానికి చూస్తే కాళ్లు విరగ్గొట్టి నీతోనే పాయా సూప్ చేయిస్తా అంటూ బాలు వార్నింగ్ ఇస్తాడు. ఈ గాడిద కొడుకు ఎవరి మేన మామో తెలుసా అంటూ బాలు అసలు నిజం చెప్పేస్తాడు.

బాలు నిజం విని ప్రభావతి షాక్.. ఆడుకున్న మీనా

ఈ మాణిక్యం రోహిణి మేన మామ కాదు.. సుందరి భర్తకు మేన మామ.. అతనిది ఇదే ఊరు.. ఎప్పుడూ మలేషియా వెళ్లలేదు.. ఇక్కడే మటన్ కొట్టు నడుపుతుంటాడు.. వీడు పెద్ద ఫ్రాడ్ అని బాలు అంటాడు. అది విని తాగొచ్చి మాట్లాడుతున్నావా అని ప్రభావతి అనడంతో మా ఆయన తాగడం కాదు కాసేపట్లో మీరే నీళ్లు తాగుతారు అని మీనా అంటుంది.

ఇంత అవమానం జరుగుతుంటే ఇంకా ఇక్కడే ఎందుకున్నావ్ మామయ్య అని రోహిణి అంటే.. నిజం బయటపెట్టడానికి ఫ్రాడ్ పార్లరమ్మ అని బాలు అంటాడు. ఆ నిజం విని ప్రభావతి, మనోజ్ నీళ్లు తాగుతారు. అక్కడి నుంచి మీనా అందుకుంటుంది. మా పెద్ద కోడలు కోటీశ్వరురాలు.. మా వియ్యంకుడిది మలేషియా.. అని గొప్పలు చెప్పుకునే అత్తయ్య అవాక్కయ్యారే.. పూలదాన్ని పక్కనపెట్టి ఓ మోసగత్తెను నెత్తిన పెట్టుకున్నాననే నిజం మింగుడు పడటం లేదా అని మీనా అనడంతో ప్రభావతి నోట మాటరాదు.

అబ్బాయి మేన మామకు మటన్ కొట్టు ఉందని రంగారావు చెప్పాడు.. అతడు ఇతడేనా అని సత్యం అడిగితే అవును మామయ్య.. ఇతని కొట్టు నుంచే నేను మటన్ తెచ్చాను.. అప్పుడు ముఖానికి ముసుగు వేసుకున్నాడు.. తర్వాత కూడా అనుమానం వచ్చి ఫాలో అయితే తప్పించుకొని పారిపోయాడని మీనా చెబుతుంది.

నోరు విప్పిన మాణిక్యం.. రోహిణి ఆటకట్టు

మొత్తానికి ప్రభావతి నిజం చెప్పండని అడగడంతో మాణిక్యం నోరు విప్పుతాడు. బాలు చెప్పిందంతా నిజమే.. నా పేరు మాణిక్యం.. మటన్ కొట్టు నడుపుతాను.. నేను రోహిణి మేన మామను కాదు.. సుందరి భర్తకు మేన మామను.. నేను తెచ్చినవి మేక తలకాయ ఎముకలు, బొగ్గులు తప్ప అవి రోహిణి తండ్రి అస్తికలు కాదు.. గొర్రె కోసేవాడినే నమ్మినట్లు మీరందరూ నన్ను నమ్మారు.. నేనే ఏరోజూ మోసం చేయాలనుకోలేదు.. చేసిందంతా మీ కోడలు రోహిణియే అని మాణిక్యం స్పష్టం చేస్తాడు. దీంతో రోహిణి గుట్టు పూర్తిగా బట్టబయలవుతుంది.

దీంతో సత్యం కూడా రోహిణికి క్లాస్ పీకుతాడు. ఎందుకు మమ్మల్ని మాయలో పడేశారని నిలదీస్తాడు. దీంతో రోహిణి, విద్య గురించి మొత్తం చెప్పేస్తాడు మాణిక్యం. సినిమాలో వేషం కోసం ఆశపడి ఇదంతా చేశానని, ఆస్తి ఆస్తి అని ఈ ప్రభావతి గారు ఒత్తిడి తెచ్చిన ప్రతిసారీ తనను మలేషియా నుంచి వచ్చినట్లు తీసుకొచ్చే వారని అంటాడు. దీంతో అన్ని రోజులూ రోహిణి, మాణిక్యం కలిసి ఆడిన డ్రామాలన్నీ ప్రభావతికి గుర్తుకు వచ్చి ఆవేశంతో రగిలిపోతుంది.

రోహిణికి క్లాస్ పీకి వెళ్లిపోయిన మాణిక్యం

ఏమైంది.. ఇప్పుడేమీ మాట్లాడటం లేదు.. మీ పెద్ద కోడలు మలేషియా నుంచి కోట్లు తీసుకొచ్చి కుమ్మరిస్తే అవి దాచ్చి పెట్టుకోడానికి ఇల్లు చాలదన్నట్లు మా కుటుంబం గురించి తక్కువ చేసి మాట్లాడిన మీరు ఇప్పుడేమీ మాట్లాడటం లేదేంటి అని ప్రభావతితో మీనా అంటుంది. మా పుట్టింటికి, రోహిణి పుట్టింటికి ఏమాత్రం పోలిక లేదు.. మేము ఏనాడు లేనిది ఉన్నట్లు చూపించలేదు అని మీనా అగ్నికి మరింత ఆజ్యం పోస్తుంది.

అదంతా విని మనోజ్ ఆవేశంతో రగిలిపోతాడు. మాణిక్యం కాలర్ పట్టుకొని నిలదీస్తాడు. దీంతో ఈ మాట నీ పెళ్లాన్ని అడగమని మాణిక్యం అంటాడు. నీ మోసాన్ని నీ భర్తే కనిపెట్టలేకపోయాడు.. అబద్ధం బతికించలేదు.. దానిని బతికించడానికి ఎన్నో నిజాలను చంపేస్తూ పోవాలి అంటూ రోహిణికి క్లాస్ పీకి మాణిక్యం వెళ్లిపోతాడు.

రోహిణిని నిలదీసిన ఇంట్లో వాళ్లు

అదంతా విన్న తర్వాత ఇంట్లో వాళ్లందరూ రోహిణిని నిలదీస్తారు. ఇన్నాళ్లూ తండ్రి గురించి అడిగినప్పుడల్లా రోహిణి అబద్ధం చెప్పి తప్పించుకోవాలని చూసిందని మీనా అంటుంది. దీంతో సత్యం రోహిణి దగ్గరికి వెళ్లి ఆమెను నిలదీస్తాడు. ఎందుకిదంతా చేశావ్.. నిన్ను కోడలిగా కాకుండా సొంత కూతురిలా చూసుకున్నాను కదా అని సత్యం అంటాడు.

మనోజ్ ఎమోషనల్.. ఎదురు తిరిగిన రోహిణి

ఆ తర్వాత మనోజ్ ను బాలు నిలదీస్తాడు. ఇన్నాళ్లుగా ఇన్ని అబద్ధాలు చెప్పిన నీ భార్య నీ గదిలోనే ఉంటే ఏమాత్రం కనిపెట్టలేకపోయావా అంటాడు. దీంతో మనోజ్ ఎమోషనల్ అవుతాడు. నేను గొప్పవాడిని కావాలనుకున్నాను కానీ.. ఇలా భార్య చేతుల్లోనే ఫూల్ ని కావాలని అనుకోలేదని మనోజ్ అంటాడు. నా భార్యే నన్ను ఇంత పెద్ద ఫూల్ ని చేసిన తర్వాత ఎవరితో కలిసి కాపురం చేస్తున్నానో తెలియక అయోమయంలో పడ్డానని చెబుతాడు. దీంతో రోహిణి ఎదురు తిరుగుతుంది. నేనేం మోసం చేశాను.. కోట్లు ముంచానా.. ఇల్లు అమ్మానా అని బాలుపైకి తిరగబడుతుంది.

రోహిణిని చితకబాదిన ప్రభావతి

దీంతో ప్రభావతి రంగంలోకి దిగుతుంది. నోర్ముయ్ అంటూ రోహిణిని చితకబాదుతుంది. అడ్డొచ్చిన బాలు, మీనాలను తోసేస్తుంది. ఆమె గొంతు పట్టుకొని చంపబోతుంది. ముదనష్టపుదానా.. ఎవత్తివే నీవు.. ఏం పుట్టుకే నీది అంటూ రోహిణిపై విరుచుకుపడుతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks