...
...
Next Story

Gunde Ninda Gudi Gantalu Today Episode: డబ్బు కోసం మీనా తంటాలు.. చింతామణి ఫోన్‌తో ఎగిరి గంతేసిన ప్రభావతి.. రవి, శృతి అండ

Gunde Ninda Gudi Gantalu Serial July 16th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ జులై 16 ఎపిసోడ్ లో రూ.10 లక్షల ఆర్డర్ వచ్చినా అది పూర్తి చేయడానికి డబ్బు కోసం మీనా తంటాలు పడుతుంది. అటు చింతామణి ఫోన్ చేసి మీనాకు ఇదే చివరి ఆర్డర్ అని చెప్పడంతో ప్రభావతి ఎగిరి గంతేస్తుంది.

Published on: Jul 16, 2026, 07:29:39 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో బాలు తనకు వచ్చిన ట్రిప్ కోసం వెళ్లగా.. ఇటు మీనా మాత్రం డబ్బు కోసం నానా తంటాలు పడుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో రవి, శృతి ఆమెకు అండగా నిలుస్తారు. అటు చింతామణి ప్లాన్ విని ప్రభావతి ఎగిరి గంతేస్తుంది.

ఒకరికొకరం అనుకున్న బాలు, మీనా

Gunde Ninda Gudi Gantalu Today Episode: డబ్బు కోసం మీనా తంటాలు.. చింతామణి ఫోన్‌తో ఎగిరి గంతేసిన ప్రభావతి.. రవి, శృతి అండ
Gunde Ninda Gudi Gantalu Today Episode: డబ్బు కోసం మీనా తంటాలు.. చింతామణి ఫోన్‌తో ఎగిరి గంతేసిన ప్రభావతి.. రవి, శృతి అండ

సీరియల్ గురువారం (జులై 16) ఎపిసోడ్ మొదట్లోనే బాలు, మీనా తాము ఒకరికొకరం అనుకునే సీన్ బాగా ఆకట్టుకుంటుంది. మీనా దొరకడం తన అదృష్టం అని బాలు అంటాడు. తాను కూడా చదువు మధ్యలో ఆపడం వల్లే మీరు దొరికారు.. అది నాా అదృష్టం అని మీనా అంటుంది. ఒకరికొకరం ఇలా తోడుగా ఉంటే ఇద్దరం కలిసి ఒక్కో మెట్టు పైకి ఎక్కొచ్చని అనుకుంటారు.

బ్యాంకు లోన్ తీసే ప్లాన్‌లో మీనా

ఇంటికి వచ్చిన తర్వాత కూడా మీనాతో బాలు ప్రేమగా ఉంటాడు. కిచెన్ లోనే కాసేపు రొమాన్స్ జరుగుతుంది. ఈ సమయంలోనే ఆర్డర్ గురించి మాట్లాడుకుంటారు. అంత డబ్బు ముందే ఏర్పాటు చేయడం కష్టమవుతోందని, బ్యాంకు వెళ్లి లోన్ ఇస్తారేమో కనుక్కుంటానని మీనా చెబుతుంది. వడ్డీ కూడా తక్కువగా ఉంటుందని, ఇప్పటికిప్పుడు అంత డబ్బుకు ఇదే మంచి మార్గమని మీనా అంటుంది. బాలు కూడా సరే అంటాడు.

ప్రభావతికి చింతామణి ఫోన్.. చివరి ఆర్డర్ ఇదే అంటూ..

అటు మీనా ఆర్డర్ గురించి విన్నప్పటి నుంచీ ప్రభావతికి నిద్ర పట్టదు. చిరాగ్గా ఉంటుంది. అప్పుడే చింతామణి ఆమెకు ఫోన్ చేస్తుంది. ఆ ఆర్డర్ వచ్చేలా చేసిందే తాను అని చెబుతుంది. అది విని ప్రభావతి మరింత విసుక్కుంటుంది. అలా అయితే నీకు మరింత పోటీ తప్పదు కదా అంటుంది.

ఆ తర్వాత మరోసారి బాలు, ప్రభావతి మధ్య ఓ సరదా ఫైట్ జరుగుతుంది. కాఫీ విషయంలో మీనాను ప్రభావతి మాటలు అనడం, తల్లిని బాలు ఏడిపించడం జరుగుతాయి. తనకు పెద్ద ట్రిప్ వచ్చిందని, రెండు, మూడు రోజులు ఉండటం లేదని తండ్రికి చెబుతాడు బాలు. అది విని ప్రభావతి మరింత సంతోషిస్తుంది.

నువ్వు లేకపోతే మీనా ఆటలు అస్సలు సాగవు.. ఆ ఆర్డర్ ఎలా చేస్తుందో నేనూ చూస్తాను అని మనసులో అనుకుంటుంది. కానీ ఏదో అన్నావ్ అంటూ బాలు అడుగుతాడు. నీ మనసులో మా గురించి అనుకున్నవి కూడా తనకు వినిపిస్తాయని అంటాడు. ఇక వెళ్లే ముందు కిచెన్ లోకి వెళ్లి మీనాతో సరసాలాడతాడు. ఆమెకు ముద్దు పెట్టి పరుగెత్తుకుంటూ బయటకు వస్తాడు. మీనా కూడా వచ్చి బాలుకి ముద్దు పెట్టి పంపిస్తుంది.

లోను కోసం బ్యాంక్‌కు మీనా.. కుదరదన్న మేనేజర్

బాలు వెళ్లిపోయిన తర్వాత లోను కోసం మీనా బ్యాంక్‌కు వెళ్తుంది. మేనేజర్ ను కలిసి తన ఆర్డర్ గురించి చెప్పి రూ.8 నుంచి 9 లక్షల లోన్ కావాలని అడుగుతుంది. డాక్యుమెంట్స్ ఇస్తుంది. ఇవి బాగానే ఉన్నాయి కానీ.. అంత మొత్తం లోన్ ఇవ్వాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి.. మీ బిజినెస్ లోన్ కు సరిపడా యాక్టివిటీస్ అకౌంట్ లో జరగలేదు.. అందుకే లోన్ ఇవ్వడం కుదరదు అని స్పష్టం చేస్తాడు. మీనా ఎంత బతిమాలినా కుదరదు అని అంటాడు.

ఇంతలో మీనాకు అకౌంట్ ఓపెన్ చేయించిన క్లర్క్ ఆమెను కలిసి ఓ ఫైనాన్షియర్ అడ్రెస్ ఇస్తాడు. వడ్డీ కాస్తా ఎక్కువే అయినా ఎలాంటి ష్యూరిటీ లేకుండా అమౌంట్ ఇస్తారని, అక్కడికి వెళ్లమని చెబుతాడు. సరే అంటూ బయటకు వచ్చిన మీనాకు తమ్ముడు శివ కలుస్తాడు. ఆర్డర్ ఇవ్వడానికి వచ్చానని, పార్ట్ టైమ్ గా డెలివరీలు చేస్తున్నట్లు శివ చెబుతాడు. అతని కష్టం చూసి మీనా చలించిపోతుంది. ఆ తర్వాత మీనా గురించి శివ ఆరా తీస్తాడు. వచ్చిన విషయం మీనా చెబుతుంది. ఆ ఫైనాన్షియర్ కంపెనీ తనకు తెలుసని, తాను కూడా వస్తానని చెబుతాడు.

రవికి బాలు ఫోన్.. ధైర్యం చెప్పిన శృతి

రెస్టారెంట్ లో ఓ కస్టమర్ దగ్గర శృతి ఆర్డర్ తీసుకుంటుంది. ఆ కస్టమర్ తనకు ఎలా చేసి పెట్టాలో పెద్ద లిస్ట్ చెబుతాడు. దానిని తీసుకెళ్లి రవికి ఇస్తుంది శృతి. అప్పుడే రవికి బాలు ఫోన్ చేస్తాడు. ఇద్దరూ కలిసి బయటకు వెళ్లి ఫోన్ మాట్లాడతారు. తాను ట్రిప్ కు వెళ్తున్నానని చెబుతాడు. మీనాకు పెద్ద ఆర్డర్ వచ్చింది కదా.. డబ్బు కోసం ఆమె బ్యాంక్ కు వెళ్తానని చెప్పింది.. అక్కడ ఏం జరుగుతుందో ఏమో కాస్త నువ్వు చూసుకో అని బాలు అడుగుతాడు.

డబ్బు కోసం బ్యాంక్ కు ఎందుకు.. ఎంత కావాలో చెబితే ఏదో రకంగా మనమే చూసుకునేవాళ్లం కదా అని రవి అంటాడు. అటు శృతి కూడా బాలుకి ధైర్యం చెబుతుంది. తాము చూసుకుంటాం కానీ.. మీరు ట్రిప్ జాగ్రత్తగా పూర్తి చేసుకొని తిరిగి రండని చెబుతుంది. దీంతో బాలుకి ఊరట చెందుతాడు.

మీనాకు రవి ఫోన్.. డబ్బు ఏర్పాటు చేస్తామని హామీ

ఆ తర్వాత మీనాకు రవి ఫోన్ చేస్తాడు. డబ్బు కోసం తమను అడగొచ్చు కదా వదినా.. ఎక్కడెక్కడికో ఎందుకు తిరుగుతావు అని అంటాడు. ముందు నా ప్రయత్నం నేను చేద్దామని వచ్చినట్లు మీనా చెబుతుంది. శృతి ఫోన్ తీసుకొని నీకు ఎంత కావాలో చెప్పు.. వీలైనంత వరకు మేము సాయం చేస్తామని అంటుంది. రూ.8, 9 లక్షలు కావాలనడంతో అంత డబ్బా అని అడుగుతుంది.

తమ పుట్టింటి వాళ్ల దగ్గరగా అప్పుగా తీసుకుందామని అంటుంది. కానీ మీనా మాత్రం వద్దని వారిస్తుంది. బ్యాంక్ కు వెళ్లానని, అక్కడ కుదరలేదని, కానీ వాళ్లే ఓ ఫైనాన్షియర్ అడ్రెస్ ఇచ్చినట్లు చెబుతుంది. ప్రస్తుతం అక్కడే ఉన్నానని, ముందు తన వంతు ప్రయత్నం తాను చేస్తానని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. మీనా పట్టుదల చూసి రవి, శృతి ఆశ్చర్యపోతారు. ఆమెకు వీలైనంత సాయం చేయాలని ఇద్దరూ అనుకుంటారు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe