Gunde Ninda Gudi Gantalu Today Episode: బాలు అదిరిపోయే ప్లాన్.. అడ్డంగా దొరికిన చింతామణి, మేనేజర్.. మీనా డబ్బు సేఫ్
Gunde Ninda Gudi Gantalu Serial July 21st Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ జులై 21 ఎపిసోడ్ లో బాలు వేసిన ప్లాన్ కు చింతామణి, మేనేజర్ ఇద్దరూ అడ్డంగా దొరికిపోయారు. మీనా ముందే వాళ్లిద్దరి మోసం బయటపడేలా రవి, శృతితో కలిసి బాలు ప్లాన్ చేస్తాడు.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో మీనా కష్టాన్ని రవి, శృతి ద్వారా తెలుసుకున్న బాలు.. వాళ్లతో కలిసే చింతామణి, మేనేజర్ కు సరైన బుద్ధి చెబుతాడు. ఓనర్ ముందే వాళ్లు అడ్డంగా దొరికిపోతారు. దీంతో మీనాకు రావాల్సిన రూ.9 లక్షలు సేఫ్ గా ఆమె చేతుల్లోకే వస్తాయి.

డబ్బు కోసం మీనా టెన్షన్
డెకరేషన్ తర్వాత మీనాను ఆమెకు సాయం చేసిన వాళ్లు డబ్బు అడిగే సీన్ తో సీరియల్ మంగళవారం (జులై 21) ఎపిసోడ్ మొదలవుతుంది. డబ్బు పోయిందని చెప్పలేక.. రేపటిలోగా కచ్చితంగా డబ్బు ఇస్తానని వాళ్లకు చెప్పి పంపిస్తుంది. కానీ అసలు డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలో అని ఆలోచిస్తూ ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంది.
ప్రభావతి శాడిజం.. మీనాను ఎలా వేధించాలో ప్లాన్.. శృతి కౌంటర్
ఇటు ఇంట్లో మీనాకు వచ్చిన కష్టంతో తెగ సంబరపడిపోతున్న ప్రభావతి.. మరింత శాడిజం చూపిస్తుంది. ఇక నుంచి మీనా ఇంట్లోనే ఉంటుంది.. ఆమెతో అన్ని పనులూ చేయించుకోవాలని ప్లాన్ చేస్తుంది. బట్టలు ఉతికించాలి.. బీరువాలు సర్దించాలి.. వంటలు చేయించుకోవాలి.. వీటన్నింటినీ ఎలా చేయించాలో కూడా ఓ ప్లాన్ వేసుకుంటుంది. ఆ తర్వాత మీనా మీనా అంటూ అరుస్తూ హాల్లోకి వస్తుంది.
ఆమె కనిపించదు. శృతి వచ్చి ఎందుకలా అరుస్తున్నారని అంటుంది. మీనా ఎక్కడ కాఫీ కావాలి అని అడుగుతుంది. మీనా లేదు కదా.. మీ కాఫీ మీరే పెట్టుకోండి.. కాళ్లూ, చేతులు బాగానే ఉన్నాయి కదా.. అయినా అంకుల్ పెళ్లయిన కొత్తలో ఆంటీ కాఫీ పెట్టేది కదా.. మరి ఇప్పుడు ఏమైంది అని క్లాస్ పీకి వెళ్లిపోతుంది. ఎందుకు అందరితో గడ్డి పెట్టించుకుంటావని సత్యం కూడా ప్రభావతిని తిడతాడు.
మీనాకు బాలు ఫోన్.. ఆమె మాటలతో అనుమానం
తర్వాత మీనాకు బాలు ఫోన్ చేస్తాడు. మొదట వీడియో కాల్ చేస్తే ఆమె లిఫ్ట్ చేయదు. దీంతో నార్మల్ కాల్ చేస్తాడు. మీనా డల్లుగా మాట్లాడుతుంది. ఏం జరిగిందని అడిగినా చెప్పదు. అందరికీ డబ్బులు ఇచ్చేశావా అని బాలు అడుగుతాడు. లేదు మండపం వాళ్లు రేపు డబ్బు ఇస్తానన్నారు.. వాళ్లకు ఇస్తానని మీనా అంటుంది. ఫోన్ పెట్టేసిన తర్వాత బాలులో మరింత అనుమానం కలుగుతుంది. మీనా ఎందుకు ఇలా మాట్లాడుతోందని అనుకుంటాడు.
శృతికి బాలు ఫోన్.. మీనా సమస్యేంటో తెలుసుకోమన్న బాలు
తనకు చెప్పకపోతే డబ్బుడమ్మకు కచ్చితంగా చెబుతుంది కదా.. ఆమెకు ఫోన్ చేద్దామనుకొని శృతికి ఫోన్ చేస్తాడు. మీనాకు ఏమైంది.. చాలా డల్లుగా మాట్లాడుతోందని అంటాడు. అవును బాలు.. రాత్రి కూడా తినలేదు.. ఏమైందో చెప్పడం లేదు అని శృతి అంటుంది. అసలు ఏమైందో తెలుసుకో అని బాలు చెప్పడంతో ఆమె సరే అని మీనా దగ్గరికి వెళ్తుంది.
దేవుడికి మొర పెట్టుకున్న మీనా.. నిలదీసిన సుమతి, గుడికి శృతి
ఇటు గుడిలో దేవుడి ముందు మీనా కన్నీళ్లు కారుస్తూ మొర పెట్టుకుంటుంది. తాను మోసపోయానని, రూ.9 లక్షలు ముంచారని, ఆ విషయం ఎవరికీ చెప్పలేకపోతున్నానని అంటుంది. ఇంతలో సుమతి అక్కడికి వస్తుంది. ఏమైంది అక్క అని మీనాను అడిగితే మొదట చెప్పదు.
కానీ సుమతి మరోసారి గట్టిగా అడగడంతో తనకు జరిగిన మోసాన్ని అంతా వివరిస్తుంది. అప్పుడే గుడికి వచ్చిన శృతి.. దూరంగా ఉండి ఇదంతా వింటుంది. మీనాకు ఇంత మోసం జరిగిందా అనుకొని మొదట రవికి ఫోన్ చేసి బాలు ఉన్న ట్యాక్సీ స్టాండ్ దగ్గరికి రమ్మని చెబుతుంది.
మీనాకు జరిగిన మోసం గురించి రవి, బాలుకి చెప్పిన శృతి
రవి, బాలు ట్యాక్సీ స్టాండ్ లో ఉండగా.. శృతి అక్కడికి వెళ్తుంది. మీనాకు చాలా పెద్ద మోసమే జరిగిందని, ఆ మేనేజర్ ఆమెను ముంచాడని వాళ్లకు చెబుతుంది. దీంతో బాలు ఆవేశంతో ఊగిపోతాడు. ఆ మేనేజర్ గాడిని చంపేస్తానంటూ బయలుదేరే ప్రయత్నం చేస్తాడు. దీంతో రవి, శృతి అతన్ని అడ్డుకుంటారు.
ఇందుకే మీనా నీకు అసలు విషయం చెప్పలేదు. నువ్విలా ఆవేశపడి ఏదైనా చేస్తావనే నిజం దాచిందని శృతి అంటుంది. ఇప్పుడు కావాల్సింది ఆవేశం కాదు ఆలోచన.. వాడిని కొడితే కేసు అవుతుంది తప్ప డబ్బు రావలని అనడంతో బాలు శాంతిస్తాడు.
మేనేజర్ దగ్గరికి బాలు, రవి, శృతి..
ఆ తర్వాత ముగ్గురూ కలిసి ఆ మేనేజర్ దగ్గరికి వెళ్తారు. అప్పటికే అతడు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటాడు. మీనాను తాను, చింతామణి కలిసి ఎలా మోసం చేశామో చెబుతాడు. ఈ ప్లాన్ అంతా చింతామణిదే అని, లక్ష ఇచ్చి రూ.9 లక్షలు సంపాదించామని అంటాడు. ఇదంతా దూరం నుంచి బాలు,రవి, శృతి వింటారు. అప్పుడు కూడా బాలు ఆవేశంతో మేనేజర్ దగ్గరికి వెళ్లాలని చూడగా రవి, శృతి అడ్డుపడతారు.
బాలు ప్లాన్.. రవి, శృతిలను రంగంలోకి దించి..
ముగ్గురూ బయటకు వస్తారు. ఇదంతా చింతామణి ప్లాన్ అన్నమాట అని బాలు అనుకుంటాడు. వీళ్లకు బుద్ధి చెప్పి మన డబ్బు మనం తీసుకోవాలని బాలు ఓ ప్లాన్ వేస్తాడు. దీనికోసం రవి, శృతిలను రంగంలోకి దించుతాడు. బాలు చెప్పినట్లే వాళ్లు మేనేజర్ దగ్గరికి వెళ్తారు. తమ తొలి మ్యారేజ్ యానివర్సరీ ఉందని, చాలా గ్రాండ్ గా చేయాలని, డెకరేషన్ చేసే వాళ్ల గురించి ఆరా తీస్తాడు.
దీంతో అతడు చింతామణి నంబర్ తోపాటు తన నంబర్ కూడా ఇస్తాడు. డబ్బు ఎంతయినా సరే డెకరేషన్ అదిరిపోవాలని రవి అంటాడు. మీరు ఆమె ఫోన్ చేసి మాట్లాడండి అని అతడు చెబుతాడు. సరే అని వాళ్లు వెళ్లిపోతారు.
చింతామణికి రవి ఫోన్.. మీనా ఉన్న గుడికి రమ్మని..
బయటకు వచ్చిన తర్వాత చింతామణికి ఫోన్ చేయమని బాలు చెప్పడంతో రవి చేస్తాడు. పక్క నుంచి శృతి ఆమెను బండ బూతులు తిడుతూ ఉంటుంది. ఆమెను రవి, బాలు కంట్రోల్ చేస్తారు. తమ యానివర్సరీ కోసం డెకరేషన్ కావాలని, అడ్వాన్స్ ఇస్తాను తాను చెప్పిన గుడికి రావాలని అనడంతో ఆమె అరగంటలో వస్తానని అంటుంది.
ఇటు శృతితో మేనేజర్ కు ఫోన్ చేయిస్తాడు బాలు. ఆమె చింతామణి గొంతుతో మాట్లాడుతూ.. మనం మీనాను మోసం చేసిన రూ.9 లక్షలు ఉన్నాయి కదా.. ఆ డబ్బు తీసుకొని గుడికి రా.. కొత్తగా వచ్చిన వాళ్ల నుంచి కూడా కమీషన్ తీసి నీకు ఇస్తానని చెబుతుంది. దీంతో ఆ మేనేజర్ సరే అంటాడు.
మీనా ముందే చింతామణి, మేనేజర్‌కు బుద్ధి చెప్పిన బాలు
అందరూ కలిసి మీనా ఉన్న గుడికి వెళ్తారు. అప్పుడే మొదట మేనేజర్ వస్తాడు. ఆ తర్వాత చింతామణి వస్తుంది. అప్పటికే మీనా దగ్గరికి శృతిని పంపించిన బాలు.. అక్కడ ఏం జరుగుతుందో చూడాలని చెప్పమంటాడు. మరోవైపు బాలు ఓనర్ కు ఫోన్ చేసి రమ్మని తాను చెట్టు చాటు నుంచి వీడియో తీస్తుంటాడు. మేనేజర్ ను చూసిన చింతామణి ఇతడు ఇక్కడేం చేస్తున్నాడని అనుకుంటుంది.
అతడు చింతామణి దగ్గరికి వచ్చి మనం మీనాను మోసం చేసిన రూ.9 లక్షలు తెమ్మన్నారు కదా.. తెచ్చాను.. ఇందులో నుంచి నా కమీషన్ ఇస్తే వెళ్లిపోతాను అని అంటాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావని అడిగితే మీరే కదా రమ్మన్నారని అంటాడు. తాను రమ్మనలేదని చింతామణి అనడంతో ఎవరో ప్లాన్ చేసినట్లున్నారు.. వెంటనే వెళ్లిపో అని చింతామణి చెబుతుంది. మేనేజర్ వెళ్లిపోతుండగా ఓనర్ తోపాటు బాలు, మీనా, రవి, శృతి అందరూ కలిసి వాళ్లను చుట్టుముడతారు. దీంతో డబ్బుతోసహా వాళ్లు అడ్డంగా దొరికిపోతారు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


