...
...
Next Story

Gunde Ninda Gudi Gantalu Today Episode: చింతామణితో ప్రభావతి గొడవ.. మీనాకు అండగా చింతామణి మాజీ భర్త.. బిర్యానీ పార్టీతో..

Gunde Ninda Gudi Gantalu Serial July 22nd Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ జులై 22 ఎపిసోడ్ లో చింతామణికి తగిన బుద్ధి చెప్పిన మీనా ఇంట్లో పార్టీ చేసుకోగా.. అటు అదే చింతామణికి ప్రభావతి క్లాస్ పీకుతుంది. ఇటు ఆమె మాజీ భర్త మీనాకు అండగా నిలుస్తాడు.

Published on: Jul 22, 2026, 07:10:17 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో సీన్ మొత్తం రివర్సవుతుంది. మీనాకు జరిగిన మోసాన్ని ప్రభావతి సెలబ్రేట్ చేసుకోగా.. సగర్వంగా గెలిచి ఇంటికి వచ్చిన మీనా అందరికీ బిర్యానీ పార్టీ ఇస్తుంది. చింతామణి మాజీ భర్త సింగరాజును కలిసి డబ్బు ఇవ్వడమే కాదు.. అతని సపోర్ట్ ను మూటగట్టుకుంటుంది.

పరువు తీసుకున్న చింతామణి, మేనేజర్

Gunde Ninda Gudi Gantalu Today Episode: చింతామణితో ప్రభావతి గొడవ.. మీనాకు అండగా చింతామణి మాజీ భర్త.. బిర్యానీ పార్టీతో..
Gunde Ninda Gudi Gantalu Today Episode: చింతామణితో ప్రభావతి గొడవ.. మీనాకు అండగా చింతామణి మాజీ భర్త.. బిర్యానీ పార్టీతో..

చింతామణి, మేనేజర్ అడ్డంగా దొరికిపోయే సీన్ తో సీరియల్ బుధవారం (జులై 22) ఎపిసోడ్ మొదలవుతుంది. ఏం చేయాలో తెలియక ఇద్దరూ తలదించుకోగా.. బాలు, రవి, మీనా, శృతి, సుమతి అందరూ కలిసి వాళ్లకు క్లాస్ పీకుతారు. కష్టపడి పైకి ఎదగాలి కానీ.. అవతలి వాళ్లు ఎదగకుండా కష్టపడకూడదు అని బాలు అంటాడు. ఆడదానివని పోలీసులకు చెప్పకుండా వదిలేస్తున్నానని చెబుతాడు. శృతి అయితే ఆమెను కొట్టడానికి వెళ్తుంది. మేనేజర్ ను ఎడాపెడా బాదేస్తుంది.

ఆర్డర్లన్నీ మీనాకే వచ్చేలా చేస్తానన్న ఓనర్

ఆ డబ్బు ఎవరిది అని బాలు అడుగుతాడు. ఇది మీనా డబ్బే అని కెమెరా ముందు కూడా మేనేజర్ ఒప్పుకుంటాడు. ఆమె చెబితేనే తాను అలా చేశానని అంటాడు. ఆమె ఎవరు చింతామణియేనా అంటూ కెమెరాను ఆమె ముఖంపై పెడతాడు బాలు. దీంతో ఆమె ముఖం కనిపించకుండా తన కొంగుతో దాచుకుంటుంది. మేనేజర్, చింతామణి ఇద్దరికీ క్లాస్ పీకిన ఓనర్.. ఇక నుంచి ఏ ఆర్డర్ కూడా నీకు దక్కకుండా చేస్తానంటాడు. అసోసియేషన్లోనూ అదే చెబుతానని, ఇక నుంచి ఆర్డర్లన్నీ మీనాకు ఇస్తానని కూడా చెబుతాడు. నీ బుద్ధి ఇలాంటిది కాబట్టే నీ మొగుడు కూడా నిన్ను వదిలేశాడని చెప్పి అతడు వెళ్లిపోతాడు.

డబ్బు తిరిగి రావడంతో బాలుని మీనా అక్కడే హగ్ చేసుకుంటుంది. ఇంట్లో బిర్యానీ పార్టీ చేసుకుందామని అందరూ డిసైడవుతారు. ఇంటికి ఓ దండ, బిర్యానీ పార్శిల్ తో అందరూ వెళ్తారు. వాళ్లను చూడగానే ప్రభావతి మైండ్ బ్లాక్ అవుతుంది. ఇంట్లో పార్టీ ఇస్తున్నామని, అందరికీ బిర్యానీ తీసుకొచ్చామని బాలు అంటాడు. తన భార్య పది లక్షల ఆర్డర్ విజయవంతంగా పూర్తి చేసిందని కూడా చెబుతాడు. అలా ఎలా పూర్తి చేసిందని ప్రభావతి అనడంతో చేయదని నీకెవరైనా చెప్పారా అంటూ బాలు, మీనా, రవి, శృతి ఆమెను నిలదీస్తారు.

జరిగిన మోసం, చింతామణికి గుణపాఠం గురించి చెప్పిన మీనా, బాలు

అసలు ఏం జరిగింది? నిన్న ఆమె ఎందుకు డల్లుగా ఉంది.. ఇప్పుడు ఎందుకు సంతోషంగా ఉందని ప్రభావతి అడుగుతుంది. దీంతో ఆమెకు జరిగిన మోసం, తర్వాత చింతామణికి చెప్పిన గుణపాఠం గురించి బాలు, మీనా చెబుతారు. దీంతో సత్యం ఎంతో సంతోషిస్తాడు. అంతేకాదు అందరి ముందూ మీనా మెడలో దండ వేసి ఆమెను బాలు సత్కరిస్తాడు.

ఆ అర్హత ఈ ఇంట్లో నీకు ఒక్కదానికే ఉందని సత్యం అంటాడు. అందుకే సంతకం పెట్టే ముందు చదవాలి.. చదువు చాలా ముఖ్యం అని మనోజ్ అంటాడు. అందుకే కదరా నువ్వు కనీసం అగ్రీమెంట్ కూడా లేకుండా రూ.30 లక్షలు ఎవడికో ఇచ్చావ్ అని బాలు క్లాస్ పీకుతాడు.

ప్రభావతికి శృతి క్లాస్.. బుద్ధి చూపించుకున్న అత్త

సరే అవన్నీ వదిలేయండి.. అందరం కలిసి బిర్యానీ తిందామని బాలు అంటాడు. ప్రభావతి మాత్రం తనకు ఆకలిగా లేదని, మొన్నే కదా అజీర్తి చేసింది అని అంటుంది. మరి నిన్న మీరు బిర్యానీ తిన్నారు కదా అని ప్రభావతికి శృతి క్లాస్ పీకుతుంది. కానీ మీనా సక్సెస్ చూసి ఓర్వలేకపోయిన అత్త.. తన బుద్ధి చూపించుకుంటుంది. తాను తిననంటూ పైకి వెళ్లిపోతుంది.

ఆ చింతామణి చెప్పింది ఒకటి.. జరిగింది మరొకటి.. అది ఇప్పుడు పది లక్షల ఆర్డర్ పూర్తి చేసింది.. రేపు 20, ఎల్లుండి 30 లక్షలు చేస్తే నా పరిస్థితి ఏంటని కుళ్లుకుంటుంది. మీనా మజ్జిగ తీసుకొస్తే నిన్నెవడు తీసుకురమ్మన్నాడని అంటుంది. అజీర్తి అన్నారు కదా అని తీసుకొచ్చానని అంటుంది. చింతామణి గురించి పరోక్షంగా చెబుతూ మీ ముద్దుల శిష్యురాలు ఉంది కదా.. డ్యాన్స్ క్లాస్ కి వెళ్లి ఆమెతో మాట్లాడితే మీ అజీర్తి పోతుందేమో చూడండి అని అనడంతో ప్రభావతికి మరింత మండుతుంది.

చింతామణితో ప్రభావతి గొడవ

డ్యాన్స్ క్లాస్ కు వెళ్లిన ప్రభావతి.. చింతామణిని చూడగానే చిటపటలాడుతుంది. ఆమెకు కాలీఫ్లవర్ తో చేసిన బొకే ఇస్తుంది. మీనా ఇక ఆర్డర్లు చేయదన్నావ్.. అటు ఇంట్లో అది బిర్యానీ పార్టీ చేసుకుంటోందంటూ దెప్పి పొడుస్తుంది. ఆమెను పది లక్షలు ముంచడానికి చూస్తావా.. బాలు గాడు తెలివైన వాడు కాబట్టి ఆ మోసాన్ని పసిగట్టి ఆ డబ్బు తిరిగి సంపాదించగలిగాడు అని కామాక్షి ముందే చెబుతుంది. మీనా నాలుగు డబ్బులు సంపాదిస్తుంటే ఇద్దరూ కళ్లలో నిప్పులు పోసుకుంటారా.. ఇప్పుడేం పీకారని అంటూ కామాక్షి క్లాస్ పీకుతుంది. చింతామణి పరువు తీసేలా మాట్లాడుతుంది ప్రభావతి. మీకోసమే ఇదంతా చేశానని చెప్పినా వినదు.

సింగరాజుకు చింతామణి గురించి చెప్పిన మీనా..

అటు మీనా తనకు అప్పు ఇచ్చిన సింగరాజు దగ్గరికి వెళ్తుంది. సమయానికి తిరిగి డబ్బు ఇవ్వనందుకు క్షమాపణ చెబుతుంది. నీ గురించి నాకు తెలుసమ్మా.. ఒకవేళ ఇవ్వొద్దని అనుకుంటే.. నువ్వు వచ్చేదానివే కాదు కదా.. ఏదో బలమైన కారణం లేకపోతే ఇలా చేయవని తెలుసు అని అంటాటు. దీంతో జరిగిన విషయం మీనా చెబుతుంది. ఈ డెకరేషన్ ఫీల్డ్ లో ఇప్పటికే పాతుకుపోయిన ఓ వ్యక్తి ఉందని, ఆమె తన ఎదుగుదలను చూసి ఓర్వలేక మోసం చేయాలని చూసిందని అంటుంది.

ఎవరామె అని సింగరాజు అడగ్గా.. ఆమె పేరు చింతామణి అని చెప్పడంతో అతడు షాక్ తింటాడు. ఆమె తన మాజీ భార్య కావడంతో సింగరాజుకు షాక్ తగులుతుంది. నీలాంటి వాళ్లకు అన్యాయం చేయాలని చూస్తే వాళ్లే అన్యాయమైపోతారు.. ఇక నుంచి నేను నీకు అండగా ఉంటాను.. ఎంత పెద్ద ఆర్డర్ వచ్చినా సరే తాను డబ్బు సాయం చేస్తానని మీనాకు సింగరాజు హామీ ఇస్తాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe