...
...
Next Story

Gunde Ninda Gudi Gantalu Today Episode: రవి, శృతి జీవితంలో మరో చిచ్చు పెట్టిన శోభన.. రోహిణికి ముంచుకొస్తున్న పెళ్లి గండం

Gunde Ninda Gudi Gantalu Serial July 27th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ జులై 27 ఎపిసోడ్ లో రవి, శృతి జీవితంలో శోభన మరో చిచ్చు పెడుతుంది. రెస్టారెంట్ అమ్మాలంటూ నీతూ దగ్గరికి వెళ్లడంతో ఆమె చెక్కు చించి పారేస్తుంది.

Published on: Jul 27, 2026, 07:18:10 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో శృతి తల్లి శోభన మరోసారి చెక్కు బుక్కు పట్టుకొని రచ్చ చేస్తుంది. ఇవి రవి, శృతి జీవితాల్లో మరో చిచ్చుకు కారణమయ్యే పరిస్థితి తీసుకొస్తుంది. అటు రోహిణికి మాణిక్యం రూపంలో మరో పెళ్లి గండం ముంచుకొస్తోంది.

మనోజ్‌తో మరోసారి ఆడుకున్న బాలు

Gunde Ninda Gudi Gantalu Today Episode: రవి, శృతి జీవితంలో మరో చిచ్చు పెట్టిన శోభన.. రోహిణికి ముంచుకొస్తున్న పెళ్లి గండం
Gunde Ninda Gudi Gantalu Today Episode: రవి, శృతి జీవితంలో మరో చిచ్చు పెట్టిన శోభన.. రోహిణికి ముంచుకొస్తున్న పెళ్లి గండం

బాలు, మీనా కలిసి పూలు సర్దే సీన్ తో సీరియల్ సోమవారం (జులై 27) ఎపిసోడ్ మొదలైంది. అప్పుడే మనోజ్ అక్కడికి వస్తాడు. తానో పెద్ద బిజినెస్ మ్యాన్ అంటూ మరోసారి పోజులు కొడతాడు. కూర మాడిపోతోందని మీనా లోనికి వెళ్లడంతో తనకు పూలు సర్దడంలో సాయం చేయాలని మనోజ్ ను బాలు అడుగుతాడు. అతడు మరింత బిల్డప్ ఇవ్వడంతో ఏదో శాపం పెట్టడానికి వెళ్తాడు. దీంతో మనోజ్ సరే అంటూ పూలు సర్దుతాడు.

తాయత్తు పోగొట్టుకున్న మనోజ్

ఈ క్రమంలో మనోజ్ తనకు రోహిణి ఇచ్చిన తాయత్తు పోగొట్టుకుంటాడు. దానికోసం ఇల్లంతా వెతుకుతూ నానా రచ్చ చేస్తాడు. తన గదిలో వెతుకుతాడు. రోహిణికి ఈ విషయం చెప్పడంతో ఆమె పోతే పోనీలే అని లైట్ తీసుకుంటుంది. నా కోసం హిమాలయాల నుంచి నువ్వు ఆ తాయత్తు తీసుకొచ్చావ్.. ఇప్పుడద పోయిందంటూ మనోజ్ బాధపడతాడు.

ఇంతకుముందు పూలు సర్దినప్పుడు అక్కడ పోయిందేమో అని కిందికి వచ్చి మరోసారి వెతుకుతాడు. పూలన్నీ చిందరవందర చేస్తాడు. దీంతో బాలు అతనికి వార్నింగ్ ఇస్తాడు. అతన్ని కొట్టబోవడంతో రోహిణి, సత్యం అడ్డుకుంటారు. అటు మీనా కూడా తిట్టడంతో మనోజ్, రోహిణి అక్కడి నుంచి వెళ్లిపోతారు.

నీతూకి శోభన ఆఫర్.. చెక్కు చించేసిన నీతూ

అందుకే ఈ రెస్టారెంట్ అమ్ముతావా అని అడుగుతుంది. చెక్కు తీసి సంతకం పెట్టి.. ఎంత కావాలో నువ్వే రాసుకో అని అంటుంది. దీంతో నీతూ ఆవేశంతో ఊగిపోతుంది. శోభన ఇచ్చిన చెక్కును చించేస్తుంది. మీ అల్లుడికి రెస్టారెంట్ కొనివ్వాలంటే కొనివ్వండి.. కానీ మరోసారి తన దగ్గరికి మాత్రం ఇలాంటి ఆఫర్ తో రావద్దని గట్టిగానే చెప్పడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

విద్య, రోహిణికి మాణిక్యం వెడ్డింగ్ కార్డ్స్

ఇటు విద్య దగ్గరికి వస్తాడు మాణిక్యం. తన మేనల్లుడి పెళ్లి ఉందని, తప్పకుండా రావాలని వెడ్డింగ్ కార్డు ఇస్తాడు. రోహిణికి కూడా ఇవ్వాలని అతడు చెబుతాడు. తాను వాళ్ల ఇంటికి లేదంటే షాప్‌కి వెళ్లలేనని, నువ్వే ఇవ్వు అని మరో కార్డు ఆమెకు ఇస్తాడు. రోహిణి అంటే తనకు చాలా అభిమానం అని చెబుతాడు. సరే తాను రోహిణి దగ్గరికి వెళ్తున్నాను.. ఇస్తాను లే అని విద్య అంటుంది.

మీనాతో బాలు సరసాలు.. కారు లేకపోవడంతో..

ఇటు బాలు ఇంట్లోనే ఉంటూ రోజంతా మీనా చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆమెతో సరసాలాడతాడు. ఆమె పూలు అల్లుతూ బిజీగా ఉంటే బాలు బాగా డిస్టర్బ్ చేస్తుంటాడు. తన కారు సర్వీస్ కు ఇవ్వడంతో ఖాళీగా ఉన్న బాలు.. మీనాతో రొమాన్స్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. అప్పుడే శృతి వస్తుంది. బాలుని వెక్కిరిస్తుంది. మీనాకు కూడా బాలు కారు లేకపోవడం వల్లే తనతో సరసాలు ఆడుతున్నాడని అర్థం చేసుకుంటుంది.

రోహిణిని నిలదీసిన సుగుణ..

ఇటు రోహిణి తల్లి సుగుణ ఇంటికి విద్య వెళ్తుంది. అప్పుడే రోహిణి కూడా అక్కడికి వస్తుంది. తన దగ్గర ఎందుకు నిజం దాచావు.. అల్లుడిగారికి యాక్సిడెంట్ అయిన విషయం ఎందుకు చెప్పలేదని సుగుణ నిలదీస్తుంది. చెబితే ఏం చేసేదానివి.. వచ్చి పరామర్శిస్తావా అని రోహిణి అంటుంది. అయినా అప్పుడు డబ్బులు కావాలని అడిగాను కదా.. అది మనోజ్ సర్జరీ కోసమే అని చెబుతుంది. తన కష్టాల్లో సగం తన తల్లి వల్లే వచ్చాయని విద్యతో రోహిణి అంటుంది.

మాణిక్యం వెడ్డింగ్ కార్డు గురించి చెప్పిన విద్య

ఆ తర్వాత మాణిక్యం ఇచ్చిన వెడ్డింగ్ కార్డు గురించి రోహిణికి చెబుతుంది విద్య. అతడు ఎంతో ఆప్యాయంగా వచ్చి పిలిచాడని, వెళ్దామని అంటుంది. రోహిణి మాత్రం తనకు కుదరదని, అయినా ఎల్లుండి రంగారావు మామయ్య ఇంట్లోనే పెళ్లి ఉందని, అక్కడ మేకప్ చేయడానికి వెళ్లాలని చెబుతుంది. నువ్వు కూడా వెళ్లకు.. ఎందుకొచ్చిన గొడవ.. అనవసరంగా వెళ్లిలేనిపోని తలనొప్పులు ఎందుకు తెచ్చుకోవడం అని రోహిణి అంటుంది.

రవికి క్లాస్ పీకిన నీతూ.. శోభన ఆఫర్ గురించి చెబుతూ..

ఇటు రెస్టారెంట్ లో రవి రకరకాల వంటలు చేసి కస్టమర్ల దగ్గరికి వెళ్లి ఫీడ్ బ్యాక్ అడుగుతుంటాడు. అది చూసి నీతూ కోప్పడుతుంది. అసలు నువ్వు ఛెఫ్ అనే విషయం మరచిపోయావా.. నీకు ఇక్కడేం పని.. ప్రతిసారీ ఎందుకు బయటకు వచ్చి కస్టమర్లతో మాట్లాడతావు అని క్లాస్ పీకుతుంది. ఆమె ఎందుకలా మాట్లాడుతుందో రవికి అర్థం కాదు. అసలు నేనేం తప్పు చేశానని అడుగుతాడు.

నువ్వేమైనా పెద్ద ఇంటర్నేషనల్ చెఫ్ వని అనుకుంటున్నావా.. నీవల్లే ఈ రెస్టారెంట్ నడుస్తోందా అని నీతూ అనడంతో రవి షాక్ తింటాడు. అసలు ఏం జరిగిందని అడిగితే.. మీ అత్తయ్య వచ్చి రెస్టారెంట్ అమ్మాలంటూ బ్లాంక్ చెక్కు ఇచ్చింది.. మరోసారి ఆమె ఇక్కడికి రాకుండా చూసుకో.. నువ్వో, నీ భార్యో, నీ ఇంట్లో వాళ్లో రెస్టారెంట్ గురించి ఆమెకు చెప్పి ఉంటారు అని నీతూ నానా మాటలు అంటుంది. కానీ రవి మాత్రం తానే ఆమెకు గట్టిగా చెబుతానని, తాను ఎవ్వరిపైనా ఆధారపడే మనిషిని కాను అని అంటాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe