Gunde Ninda Gudi Gantalu Today Episode: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో బాలు, మీనా చేసిన త్యాగానికి అర్థమే లేకుండా పోతుంది. తన కళ్లు బాగవుతున్నాయని తెలిసిన వెంటనే మనోజ్ తన చిల్లర బుద్ధి చూపిస్తాడు. అయితే హాస్పిటల్లోనే అతనికి తగిన గడ్డి పెడతారు బాలు, మీనా.
చూపు పోతుందేమో అని మనోజ్ భయం

మనోజ్ తన కళ్లు పోతాయేమో అని భయపడే సీన్ తో సీరియల్ గురువారం (జులై 9) ఎపిసోడ్ మొదలవుతుంది. మీనా, శృతి సహా ఇంట్లో వాళ్లందరూ తనకు ధైర్యం చెప్పడంతో మనోజ్ కుదుటపడతాడు. దీంతో ఇదేరా కుటుంబం అంటే అంటూ సత్యం అతనికి చెబుతాడు. ఎన్ని గొడవలు ఉన్నా ఒకరికి కష్టం వచ్చినప్పుడు అందరూ అండగా నిలవడమే ఓ కుటుంబం అవుతుందని అంటాడు.
మనోజ్ యాక్సిడెంట్ కేసుపై పోలీస్ విచారణ
అదే సమయంలో డాక్టర్ రావడంతో అందరూ బయటకు వెళ్తారు. బాలు, మీనా వెళ్లగానే రిసెప్షన్ లో పోలీస్ కనిపిస్తాడు. మనోజ్ గురించి ఆరా తీయడంతో అతడు తన అన్నే అని బాలు చెబుతాడు. మీరు పోలీస్ స్టేషన్ లో చెంపదెబ్బ కొట్టిన వ్యక్తే ఇప్పుడు లోపల ఉన్నాడని చెప్పడంతో అతడు తన చెవిలో ఆ రోజు ఆ మాట చెప్పినప్పుడు అతని కళ్లు పోతాయని అనుకున్నట్లు ఆ కానిస్టేబుల్ అంటాడు. లోనికి వెళ్లి మనోజ్ ను ఏం జరిగిందో ఆరా తీస్తాడు.
విల్లా విజయ్ వెంట పడినట్లు చెప్పిన మనోజ్
ఓ వ్యక్తి వెంట పడటం వల్లే ఇలా ప్రమాదం జరిగిందని చూసిన వాళ్లు చెప్పారని, అసలు ఆ వ్యక్తి ఎవరు అని కానిస్టేబుల్ తోపాటు బాలు కూడా మనోజ్ ను నిలదీస్తారు. దీంతో తన రూ.30 లక్షలు ముంచిన విల్లా విజయ్ కనిపిస్తే వెంట పడ్డానని మనోజ్ చెబుతాడు. అతన్ని పట్టుకొని తన డబ్బు ఇప్పించాలని, అలాగే ఈ కేసు కూడా పోయేలా చేయాలని కోరతాడు. దీంతో కానిస్టేబుల్ సరే అని వెళ్లిపోతాడు.
రోహిణి, మనోజ్ ఎమోషనల్ సీన్
{{/usCountry}}ఓ వ్యక్తి వెంట పడటం వల్లే ఇలా ప్రమాదం జరిగిందని చూసిన వాళ్లు చెప్పారని, అసలు ఆ వ్యక్తి ఎవరు అని కానిస్టేబుల్ తోపాటు బాలు కూడా మనోజ్ ను నిలదీస్తారు. దీంతో తన రూ.30 లక్షలు ముంచిన విల్లా విజయ్ కనిపిస్తే వెంట పడ్డానని మనోజ్ చెబుతాడు. అతన్ని పట్టుకొని తన డబ్బు ఇప్పించాలని, అలాగే ఈ కేసు కూడా పోయేలా చేయాలని కోరతాడు. దీంతో కానిస్టేబుల్ సరే అని వెళ్లిపోతాడు.
రోహిణి, మనోజ్ ఎమోషనల్ సీన్
{{/usCountry}}అందరూ వెళ్లిపోయిన తర్వాత రోహిణి, మనోజ్ మధ్య ఓ ఎమోషనల్ సీన్ వస్తుంది. తన కళ్లు పోతాయేమో అని మనోజ్ పదే పదే అంటాడు. కానీ రోహిణి అతనికి ధైర్యం చెబుతుంది. నా కళ్లు ఇచ్చి అయినా నీ కళ్లను కాపాడుతాను.. నీ చూపు కోసం ఎంత వరకైనా వెళ్తాను.. నిన్ను వదలి వెళ్లను.. ఐలవ్యూ మనోజ్ అని రోహిణి అతనికి ధైర్యం చెబుతుంది.
ప్రభావతికి క్లాస్ పీకిన శృతి, సత్యం
అటు మరుసటి రోజు ఇంట్లో ఉదయాన్నే ప్రభావతి తన దండకం మొదలుపెడుతుంది. టిఫిన్ చేయకుండా మీనా ఎక్కడికి వెళ్లిందని అడుగుతుంది. రవి, శృతి చెబుతున్నా వినదు. హాస్పిటల్లో వాడు పడి ఉన్నా పట్టించుకోకుండా పూలు అమ్ముకోడానికి వెళ్లిందా అని చిందులేస్తుంది. దీంతో సత్యం ఆమెను తీసుకెళ్లి మీనా టిఫిన్, టీ చేసి పెట్టిందని చూపిస్తాడు.
అంతేకాదు మనోజ్ కు అయిన బిల్లు కూడా బాలు, మీనానే కట్టారని శృతి చెబుతుంది. దీంతో ప్రభావతి నోట మాట రాదు. బాలుకి చెప్పి మీ పెద్ద కొడుకుని శపించినట్లే మీకు కూడా నోరు పడిపోవాలని శపించామని శృతి తిడుతుంది. అటు సత్యం కూడా ఆమెకు క్లాస్ పీకుతాడు. తన కొడుకు కోసం తాను గుడికి వెళ్తానంటూ ప్రభావతి వెళ్లిపోతుంది.
తల్లి గురించి అడిగిన మనోజ్
ఆ తర్వాత అందరూ హాస్పిటల్ కు వెళ్తారు. రోహిణి, మనోజ్ లకు మీనా, బాలు టిఫిన్ తీసుకెళ్తారు. అందరూ వచ్చినా ప్రభావతి రాకపోవడంతో ఆమె గొంతు వినిపించడం లేదు.. మా అమ్మ రాలేదా అని మనోజ్ అడుగుతాడు. నీకోసం గుడికి వెళ్లిందని చెప్పగానే పొంగిపోతాడు. తన తల్లి దేవత అని అంటాడు.
మనోజ్ కట్లు విప్పిన డాక్టర్.. మురిసిపోయిన మనోజ్
అప్పుడే డాక్టర్ వచ్చి మనోజ్ కట్లు విప్పి చెక్ చేయాలని మనోజ్ ను తీసుకెళ్తాడు. లోనికి వెళ్లిన తర్వాత కట్లు విప్పి చూసి అంతా బాగానే ఉందని చెప్పడంతో మనోజ్ మురిసిపోతాడు. టెస్టు రిజల్ట్ వచ్చిన తర్వాత కట్లు పూర్తి విప్పేస్తానని చెప్పడంతో ఇక తాను చూడగలనని మనోజ్ అంటాడు.
బాలు బిల్లు కట్టడంపై మనోజ్ సెటైర్లు..
అయితే అప్పుడే తన చిల్లర బుద్ధిని బయటపెట్టుకుంటాడు. అంత వరకూ భయంగా భయంగా ఉన్న అతడు బిల్లు బాలు కట్టాడని తెలియగానే రెచ్చిపోతాడు. ఏదో రూ.20, 30 వేలు అయి ఉంటుందిలే.. నీ డబ్బు నాకు అవసరం లేదు.. తిరిగి ఇచ్చేస్తాను అని అంటాడు. దీంతో బాలుకి ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. మొత్తం బిల్లు లెక్కలు వేసి రూ.2 లక్షలకుపైగా అయిందని రోహిణి చేతుల్లో పెడతాడు. అది విని మనోజ్ దిమ్మదిరిగిపోతుంది.
మొత్తం బిల్లు చేతిలో పెట్టిన బాలు.. షాక్ తిన్న మనోజ్
ఆ బిల్లు సరిగ్గా చూడు.. నా దగ్గర ఎక్స్‌ట్రా డబ్బులు కొట్టేయడానికి వాడు ఏవేవో బిల్లులు వేసి ఉంటాడు అని రోహిణితో అంటాడు. ఆమె కూడా అక్కడ తన బుద్ధి చూపిస్తుంది. అవును రూ.30 వేలు ఎందుకు ఖర్చు చేశారు.. వీటికి రసీదులు ఎక్కడ అని అడుగుతుంది. వీడు రోడ్డుపై ఎవరెవరినో గుద్దుకుంటూ వెళ్లి వాళ్లకు నష్టం చేశాడు.. వాళ్లకు ఇచ్చానని బాలు చెబుతాడు.
అయినా అంత అయిందా అసలు.. నువ్వు వాళ్లకు డబ్బు ఇచ్చావన్న గ్యారెంటీ ఏంటి అని మనోజ్ సిగ్గు లేకుండా అడుగుతాడు. దీంతో మీనా కూడా అందుకుంటుంది. రోహిణికి క్లాస్ పీకుతుంది. ఇంత జరుగుతున్నా తల్లి జాడ ఉండదు. పక్కనే ఉన్న తండ్రి సత్యం నోట మాట రాదు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.