...
...
Next Story

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: విద్యను నిలదీసిన బాలు.. దొరికిపోయిన పార్లరమ్మ.. మనోజ్, ప్రభావతిలను చితక బాది..

Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూన్ 10 ఎపిసోడ్ లో తన ఫోన్ ను కొట్టేసింది విద్యనే అని తెలుసుకొని ఆమెను బాలు నిలదీస్తాడు. ఆమె ఏవో మాటలు చెప్పి తప్పించుకున్నా అది పార్లరమ్మ పనే అని బాలుకు స్పష్టంగా అర్థమవుతుంది.

Published on: Jun 10, 2026, 07:27:28 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Gunde Ninda Gudi Gantalu Today Episode: స్టార్ మా టాప్ సీరియల్స్ లో ఒకటైన గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఓవైపు ఫ్యామిలీ డ్రామాను పండిస్తూనే.. అందులోని వాళ్ల కుట్రలు, కుతంత్రాలతో రంజుగా సాగుతోంది. తాజా ఎపిసోడ్ లో రోహిణి మరింత దొరికిపోతుంది. తన ఫోన్ దొంగతనం రోహిణి, విద్య పనే అని బాలు తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

పూలగంప అలక.. బతిమాలిన ముళ్లకంప

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: విద్యను నిలదీసిన బాలు.. దొరికిపోయిన పార్లరమ్మ.. మనోజ్, ప్రభావతిలను చితక బాది..
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: విద్యను నిలదీసిన బాలు.. దొరికిపోయిన పార్లరమ్మ.. మనోజ్, ప్రభావతిలను చితక బాది..

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (జూన్ 10) ఎపిసోడ్ మీనా అలగడం, ఆమెను బాలు బతిమాలే సీన్ తో మొదలవుతుంది. తన కారును విడిపించింది నువ్వే అని తెలిసి ఆశ్చర్యపోయాను.. నీకు ఇంత ఫాలోయింగ్ ఉందా అంటూ మీనాను బాలు కూల్ చేసే ప్రయత్నం చేస్తాడు.

బిజినెస్ చేయాలంటే ఆ మాత్రం ఉండాల్సిందే.. అయినా ఎంత ఉన్నా ఇంట్లో మాత్రం భర్తతో తిట్లు తప్పవు కదా అని మీనా బెట్టు చేస్తుంది. కానీ బాలు ఆమెను బతిమాలి కూల్ చేస్తాడు.

రవి, శృతి పెళ్లి రోజు సెలబ్రేషన్స్.. ప్రభావతి అకాడెమీ డ్యాన్స్

అటు రవి, శృతి తమ తొలి పెళ్లి రోజు సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తారు. ఇంటికి ఇన్విటేషన్ కార్డులతో వచ్చి ఇంట్లో వాళ్లకు ఇస్తారు. అంతేకాదు ఈ సెలబ్రేషన్స్ లో ప్రభావతి డ్యాన్స్ అకాడెమీ వాళ్లు డ్యాన్స్ చేస్తారని చెబుతారు. మీనా డెకరేషన్ చేస్తుందని కూడా అంటారు. అటు రోహిణి తాను మేకప్ వేస్తానని అంటుంది. ఈ పనికి మాలిన వాడు ఏం చేస్తాడని మనోజ్ ను బాలు ఆట పట్టిస్తాడు. అందరూ కలిసి పెళ్లి రోజుకు ప్లాన్ చేస్తారు.

విద్యను గుర్తు పట్టిన తాత.. బాలులో బలపడిన అనుమానం

దీంతో బాలులో రోహిణిపై మరింత అనుమానం బలపడుతుంది. గతంలో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు తన ఫోన్ కోసం విద్య, రోహిణి చేసిన ప్రయత్నాలన్నీ బాలు గుర్తు చేసుకుంటాడు. మీనాకు ఇదే విషయం చెబుతాడు. ఇంట్లో పక్కనే ఉండి రోహిణి ఇంత పని చేసిందా అని మీనాకు కూడా ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. ఆ విద్యను నిలదీసి నిజం రాబడతానని మీనా అంటే.. వద్దని వారిస్తాడు బాలు. నిన్ను మాటలతో మాయ చేస్తుంది.. నేనే వెళ్తాను అని చెప్పి వెళ్లిపోతాడు.

విద్యను నిలదీసిన బాలు.. మాట మార్చిన విద్య

తర్వాత విద్య ఇంటికి వెళ్తాడు. తన ఫోన్ చూపించి దీనిని చూస్తే ఏమైనా గుర్తుకు వచ్చిందా అని అడుగుతాడు. విద్య మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి మాట్లాడుతుంది. తన ఫోన్ పాడవడంతో ప్లాట్‌ఫామ్ పై రూ.2 వేలకు ఈ ఫోన్ కొన్నానని, తర్వాత ఎక్కడో పోయిందని, అది నీ ఫోన్ అని తెలియదని అబద్దం చెబుతుంది.

ఆ చెప్పుల షాపు దగ్గర పోయిందని తెలిసినప్పుడు మళ్లీ అక్కడికి వెళ్లి ఎందుకు అడగలేదు అని బాలు అడుగుతాడు. ఆ విషయం నువ్వు చెబితేనే తెలిసిందని మరో అబద్ధం చెబుతుంది. ఆమె అబద్ధం చెబుతున్నట్లు బాలుకు అర్థహవుతున్నా స్పష్టమైన ఆధారాలతో పట్టుకుంటానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

ఇంటికి వచ్చి మీనాకు జరిగిన విషయం చెబుతుంటే రోహిణి వింటుంది. విద్య ఇప్పటి వరకైతే తన గురించి నిజం చెప్పలేదు కదా అని ఊపిరి పీల్చుకుంటుంది.

విద్యను క్షమాపణ అడిగిన రోహిణి

వెంటనే విద్య దగ్గరికి వెళ్లిన రోహిణి ఏడుస్తూ ఆమెను హగ్ చేసుకొని సారీ చెబుతుంది. నిన్ను అపార్థం చేసుకున్నానని ఏడుస్తుంది. నువ్వు నా గురించి ఏమనుకున్నా.. నేను మాత్రం నిన్ను ఫ్రెండ్ అనే అనుకున్నానని విద్య అంటుంది. తర్వాత రోహిణిని పట్టుకోబోగా ఆమె నొప్పితో విలవిల్లాడుతుంది. ఏం జరిగిందని విద్య అడిగితే.. తనకు దెయ్యం పట్టిందనుకొని మనోజ్ కొట్టాడని చెబుతుంది. తన తండ్రి ఆత్మ తనలో ఉందని వాళ్లు నమ్ముతున్నారని, తాను కూడా అదే నటన కొనసాగిస్తానని అంటుంది.

దెయ్యం పట్టినట్లు నటించిన రోహిణి.. మనోజ్‌, ప్రభావతిలను చితకబాది..

ఇంటికి వచ్చిన తర్వాత మనోజ్ గదిలోకి రాగానే రోహిణిని చూసి వణికిపోతాడు. ఆ స్వామీజీ ఇచ్చిన కర్ర పట్టుకొని వస్తాడు. అది చూసి రోహిణి భయపడుతుంది. వద్దని బతిమాలుతున్నా రోహిణిని కొడతాడు. ఇక లాభం లేదనుకొని రోహిణి కూడా నాటకం మొదలుపెడుతుంది. తనలో నిజంగానే తన తండ్రి ఆత్మ ఉందని నమ్మించేలా మనోజ్ వెంట పడి కొడుతుంది. అతడు ప్రభావతి దగ్గరికి వెళ్లడంతో ఆమెను కూడా రోహిణి చితకబాదుతుంది. ఆ తర్వాత కళ్లు తిరిగి పడిపోయి మళ్లీ మెలుకువ వచ్చినట్లు నటిస్తుంది. ఆమె నటన చూసి మనోజ్, ప్రభావతి వణికిపోతారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks