గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: దెయ్యంలా మారి రోహిణిని ఎడాపెడా బాదిన మీనా.. రోహిణిలోకి తండ్రి ఆత్మ.. బాలుకి పిచ్చి
Gunde Ninda Gudi Gantalu June 8th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూన్ 8 ఎపిసోడ్ లో మీనా దెయ్యంలా మారి రోహిణి గొంత పట్టుకుంటుంది. అటు రోహిణిలోనూ వాళ్ల తండ్రి ఆత్మ వచ్చిందంటూ మనోజ్, ప్రభావతి వణికిపోతూ క్షుద్ర పూజ చేయాలని చూస్తారు.
Gunde Ninda Gudi Gantalu June 8th Episode: స్టార్ మాలో టాప్ రేటింగ్స్ తో దూసుకెళ్తున్న గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఫన్నీగా సాగిపోయింది. రోహిణి కుట్రలు, కుతంత్రాలతో సాగిపోతున్న ఈ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ మాత్రం దెయ్యాల చుట్టూ నడిపించారు. మీనా, రోహిణి దెయ్యాలుగా మారడం ఇందులో చూడొచ్చు.

రోహిణిపైనే బాలు అనుమానం
గుండె నిండా గుడి గంటలు సీరియల్ సోమవారం (జూన్ 8) ఎపిసోడ్ విద్య, రోహిణి ఫొటోలను బాలు ఆ తాతకు పంపే సీన్ తో మొదలైంది. అయితే తాత ఊళ్లో లేడని, రెండు రోజుల తర్వాత వస్తాడని మనవడు చెబుతాడు. రాగానే ఆ ఫొటోలు చూయించి వాళ్లు తెలుసా అని అడిగి చూడమని బాలు అతనితో అంటాడు. మరో రెండు రోజులు ఆడాల్సిందే అని మీనాతో చెబుతాడు. అయితే ఇదంతా చేసింది కచ్చితంగా రోహిణియే అని బాలు ఫిక్సవుతాడు.
దెయ్యంలా మీనా.. రోహిణికి మళ్లీ పీడకల
ఇటు మీనా దెయ్యంలా మారుతుంది. తన దగ్గరికి వచ్చిన రోహిణి గొంతు పట్టుకుంటుంది. ఆమెను ఎడాపెడా బాదుతుంది. నిజం చెప్పు.. బాలు ఫోన్ కొట్టేసి అందులో శివ వీడియో బయట పడటానికి కారణం నువ్వే కదా అంటూ రోహిణిని నిలదీస్తుంది.
ఆమెను బాగా కొడుతుంది. కానీ ఇదంతా రోహిణికి వచ్చిన పీడకలలోని సీన్. ఆమె నిద్రలోనే మరోసారి నన్ను కొట్టొద్దు కొట్టొద్దు అంటూ భయపడుతుంది. పక్కనే పడుకున్న మనోజ్ ను మళ్లీ తన్నడంతో అతడు కింద పడతాడు. వెంటనే వెళ్లి తల్లిని తీసుకొస్తాడు. ఆమె వచ్చి రోహిణిని నిద్ర లేపుతుంది. ఏదో పీడకల వచ్చిందని ఆమె చెబుతుంది.
రోహిణిలో నాన్న ఆత్మ.. మనోజ్‌లో వణుకు
మనోజ్, ప్రభావతి బయటకు వెళ్లిన తర్వాత రోహిణిపై అనుమానం కలుగుతుంది. తండ్రి చనిపోయినప్పటి నుంచీ ఇలాగే చేస్తోందని మనోజ్ అనడంతో అతని ఆత్మ ఆమెలోకి వచ్చిందేమో అని ప్రభావతి అంటుంది. వస్తే తన కూతురిని చూసి వెళ్లిపోవాలి కానీ.. ఇలా చేయడమేంటని మనోజ్ అనుకుంటాడు. అప్పటి నుంచీ అతనిలో వణుకు మొదలవుతుంది. విభూతి తీసుకెళ్లి రోహిణికి పెట్టి, తనచుట్టూ చల్లుకొని పడుకుంటాడు.
రవి, శృతి మళ్లీ గొడవ
ఇటు రవితో శృతి మళ్లీ గొడవ పడుతుంది. వీడియో గేమ్ ఆడుకుంటూ కూర్చున్న శృతి దగ్గరికి వచ్చిన రవి.. ఇక నుంచి యోగా చేద్దాం అని అంటాడు. ఎందుకు నేను లావుగా ఉన్నానా.. ఫిట్‌గా లేనా, అందంగా లేనా.. అంటూ శృతి రివర్స్ అవుతుంది. రవితో ఆడుకుంటుంది. అతన్ని నానా మాటలు అంటుంది. రవి ఏమన్నా కూడా దానికి రివర్స్ లో మాట్లాడటంతో అతడు భయంతో పారిపోతాడు.
అది చూసిన మీనా ఏమైందని శృతిని అడుగుతుంది. టైంపాస్ కాకపోవడంతో తానే సరదాగా రవితో గొడవ పడ్డానని చెబుతుంది. ఇలా కూడా చేస్తారా అని మీనా అంటే.. నువ్వు కూడా బాలుతో ఇలాగే చేయమని అంటుంది. మొదట వద్దనుకున్నా.. తర్వాత మీనా కూడా సై అంటుంది.
బాలుతో ఆడుకున్న మీనా, శృతి
బాలు ఇంటికి రాగానే మీనా తన ఆట మొదలుపెడుతుంది. మీనా అంటూ పిలుస్తూ వచ్చిన బాలు.. కిచెన్ లో ఆమెను చూసి ఉన్నావా అంటే.. లేదు పోయాను అని అంటుంది. టీ పెట్టు అంటే బర్రె పాలా ప్యాకెట్ పాలా అంటుంది. ఏమడిగినా.. ఆమె అన్నీ కావాలని రివర్స్ లో మాట్లాడుతుంది. దీంతో బాలుకి పిచ్చి పట్టి వెళ్లిపోవాలని చూస్తాడు. బయటకు చిరాగ్గా వచ్చిన బాలుని చూసి శృతి బాగా నవ్వుతుంది. ఆ వెంటనే మీనా కూడా వచ్చి నవ్వడంతో ఏం జరిగిందని బాలు అడుగుతాడు. కావాలని తామే సరదాగా అనుకొని గొడవ పడినట్లు చెబుతారు. దీంతో బాలు షాక్ తింటాడు.
రోహిణితో క్షుద్ర పూజ చేయించాలని చూసిన ప్రభావతి, మనోజ్
అటు రోహిణిలోకి వాళ్ల తండ్రి ఆత్మ వచ్చిందని ఫిక్సయిన మనోజ్, ప్రభావతి.. ఆమెను కామాక్షి ఇంటికి తీసుకెళ్తారు. అక్కడ క్షుద్ర పూజకు ఆమె ఏర్పాట్లు చేస్తుంది. అదంతా చూసి రోహిణి తనకు ఏం కాలేదని అంటున్నా.. నీకు దెయ్యం పట్టిందని కామాక్షి అంటుంది. అప్పుడే ఓ స్వామీజీ వస్తాడు. రోహిణిని బలవంతంగా ఓ ముగ్గు దగ్గర కూర్చోబెడతాడు.
ఆమె ఏం కాలేదని చెబుతున్నా ఎవరూ వినకపోవడం, ఆ స్వామీజీ ఫేక్ అని తేలడంతో రోహిణి కూడా నిజంగానే తనలో తండ్రి ఆత్మ ఉన్నట్లు నటిస్తుంది. దీంతో స్వామీజీ ఆమెను కర్రతో ఎడాపెడా బాదేస్తాడు. అది సరిపడదన్నట్లు ఆ కర్రను మనోజ్ కు ఇచ్చి రోజూ మూడుసార్లు దీనితో ఆమెను బాదమని చెబుతాడు. దీంతో రోహిణిలో భయం మొదలవుతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


