Gunde Ninda Gudi Gantalu Today Episode: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ కూడా చాలా ఆసక్తికరంగా సాగింది. బాలు, మీనా వల్ల సుందరి లేయిపోయిన సమస్య సామరస్యంగా పరిష్కారమవుతుంది. మాణిక్యం అల్లుడితోనే పెళ్లి ఫిక్స్ అయినా.. అతడు మాత్రం బాలు కంట పడడు. దీంతో ప్రస్తుతానికి రోహిణి సేఫ్ అయినా.. తర్వాత మాత్రం ఆమెకు ముప్పు తప్పేలా లేదు.
సుందరి పెళ్లికి ఒప్పుకున్న రంగా

రంగా ఇంటికి బాలు, మీనా వెళ్లే సీన్ తో గుండె నిండా గుడి గంటలు శుక్రవారం (జూన్ 26) ఎపిసోడ్ ప్రారంభమవుతుంది. సుందరి, నగలు రెండూ సేఫ్ గానే ఉన్నాయని, మీరు పెళ్లికి ఒప్పుకుంటే వాళ్లను ఇంటికి తీసుకొస్తామని రంగాతో చెబుతాడు.
అబ్బాయి బుద్ధిమంతుడు అని బాలు అనగానే రంగా కోపంతో ఊగిపోతాడు. పిల్లను లేపుకెళ్లిన వాడు బుద్దిమంతుడెలా అవుతాడని అంటాడు. ఈకాలం పిల్లలు అంతే.. అయినా వాళ్లు మీ అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు.. అదీ గొప్ప విషయం.. వాళ్ల ఫ్యామిలీని కూడా కలిసి ఒప్పిస్తాం అని చెప్పడంతో రంగా శాంతించి సరే అంటాడు.
తృటిలో బాలు కంట పడకుండా తప్పించుకున్న మాణిక్యం
బాలు, మీనా బయటకు వస్తుంటే.. రంగా ఇల్లు వెతుక్కుంటూ మాణిక్యం వస్తుంటాడు. ఇంటి బయట బాలు, మీనా మాట్లాడుకుంటుండటంతో మాణిక్యంను వాళ్లు చూసేస్తారేమో అన్న ఉత్కంఠ కలుగుతుంది.
అయితే ఇంటికి దగ్గరగా వచ్చిన మాణిక్యం.. ఉత్త చేతులతో వెళ్తే బాగుండదని, పండ్లు తీసుకురావడానికి తిరిగి వెళ్తాడు. ఆలోపు బాలు, మీనా కూడా అబ్బాయి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడదామని బయలుదేరుతారు. దీంతో తృటిలో వాళ్లకు కనిపించకుండా తప్పించుకుంటాడు మాణిక్యం.
అబ్బాయి వాళ్ల ఇంటికి బాలు.. కిశోర్ తండ్రిని ఒప్పించి..
ఇటు బాలు, మీనా కలిసి అబ్బాయి కిశోర్ వాళ్ల ఇంటికి వెళ్తారు. సుందరి తరఫున వచ్చామని చెప్పగానే అబ్బాయి తండ్రి మండిపడతాడు. పెళ్లికి అంగీకరించే ప్రసక్తే లేదని అంటాడు.
{{/usCountry}}ఇటు బాలు, మీనా కలిసి అబ్బాయి కిశోర్ వాళ్ల ఇంటికి వెళ్తారు. సుందరి తరఫున వచ్చామని చెప్పగానే అబ్బాయి తండ్రి మండిపడతాడు. పెళ్లికి అంగీకరించే ప్రసక్తే లేదని అంటాడు.
{{/usCountry}}మీరు ఒప్పుకోకపోయినా వాళ్లు పెళ్లి చేసుకుంటారు.. తర్వాత కాపురం చేసి పిల్లలను కన్న తర్వాత మీ మనసు కరిగి వాళ్లను చేరదీసినా.. వాళ్లలో ఆ అసంతృప్తి మిగిలిపోతుంది.. ఇప్పుడే పెద్ద మనసు చేసుకొని అంగీకరిస్తే వాళ్లూ సంతోషంగా ఉంటారని బాలు చెబుతాడు. దీంతో కిశోర్ తండ్రి మనసు కరుగుతుంది. అప్పుడే మాణిక్యం కూడా ఫోన్ చేసి తాను రంగాతో మాట్లాడానని, వాళ్లు చాలా మంచి వాళ్లని చెప్పడంతో అతడు ఇక పెళ్లికి ఒప్పుకుంటాడు.
ఇంటికి సుందరి.. రంగా కాళ్లు పట్టుకొని సారీ..
ఆ తర్వాత సుందరిని తీసుకొని రంగా ఇంటికి వెళ్తారు బాలు, మీనా. ఆమెను చూసి కామాక్షి ఆవేశంతో ఊగిపోయినా వాళ్లు అడ్డుకుంటారు. తర్వాత రంగా కాళ్ల మీద పడి సుందరి క్షమాపణ అడుగుతుంది. ముందే చెప్పి ఉంటే ఆ సంబంధం చూసే వాడిని కాదు కదా.. మీ పెళ్లికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని రంగా అంటాడు.
ఆ అబ్బాయి మేనమామ కూడా ఇంటికి వచ్చి వెళ్లాడని, సుందరి వచ్చిన తర్వాత మళ్లీ వస్తా అన్నాడని బాలుతో రంగా చెబుతాడు. అతనికి ఫోన్ చేస్తాను.. వచ్చిన తర్వాత మాట్లాడి వెళ్లండి అని అంటే.. బాలు మాత్రం ఉదయం నుంచీ ఇక్కడే ఉన్నాను.. ఒక్క ట్రిప్ కైనా వెళ్లాలని చెప్పి వెళ్లిపోతాడు.
ప్రభావతి దెప్పిపొడుపులు
ఇంటికి వెళ్లగానే ప్రభావతి దెప్పిపొడుపులు మొదలవుతాయి. అందరి సమస్యలు పరిష్కరించారా.. వీళ్లు లేకపోతే ఈ ఊరే నడవదు అన్నట్లుగా చేస్తున్నారు అంటూ తనదైన స్టైల్లో బాలు, మీనాలపై పడి ఏడుస్తుంది. అయితే వాళ్లు చేసిన పని విన్న తర్వాత సత్యం సంతోషిస్తారు. సుందరి పెళ్లి ఖాయం చేసి వచ్చామని, అన్ని సమస్యలు తీరిపోయినట్లే అని బాలు చెబుతాడు. దీంతో ప్రభావతి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
రంగా ఇంటికి మాణిక్యం.. పెళ్లి ఖాయం
మరోవైపు రంగా ఇంటికి మాణిక్యం మరోసారి వెళ్తాడు. మావాడిని పూర్తిగా నీ గుప్పిట్లోకి తీసుకున్నావుగా అంటూ సుందరిని ఆటపట్టిస్తాడు. మా అక్కాబావ కూడా పెళ్లికి అంగీకరించారని, అందరం కలిసి నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందామని మాణిక్యం అంటాడు. అదే సమయంలో మీ ఫ్రెండ్ వాళ్లబ్బాయి అంటూ బాలు గురించి మాణిక్యం మాట్లాడతాడు.
వాళ్లు లేకపోతే ఇది ఇంత సులువుగా పరిష్కారం అయ్యేది కాదని అంటాడు. అతన్ని పిలిపిస్తానని, మాట్లాడుదామని రంగా అంటే.. ఇప్పుడు వద్దులెండి తర్వాత మాట్లాడుదాం.. పెళ్లి ఖాయం అయింది కాబట్టి ఇక నుంచి కలుస్తూనే ఉంటాం కదా అని మాణిక్యం వెళ్లిపోతాడు.
కామాక్షి ఇంటికి చింతామణి.. ప్రభావతిని పట్టించుకోకుండా..
అటు కామాక్షి ఇంటికి వచ్చిన చింతామణి రుసరుసలాడుతుంది. ప్రభావతి గురించి ఏదో అనుకున్నాను.. కానీ ఆమెకు అత్తకు ఉండాల్సిన పవర్ అసలు లేనట్లుంది.. మీనాను అడ్డుకోమని చెప్పినా ఆమె ఇంట్లో నుంచే పనులన్నీ పూర్తి చేసింది అని అంటుంది. మీనా చాలా తెలివైన అమ్మాయి అని కామాక్షి కూడా మెచ్చుకుంటుంది.
అప్పుడే ప్రభావతి వస్తుంది. ఆమెను చూసి కూడా చింతామణి ఏమీ పట్టనట్లు కాలి మీద కాలేసుకొని కూర్చొంటుంది. ప్రభావతికి పరిస్థితి అర్థమై సైలెంట్ గా లోనికి వెళ్లిపోతుంది. మీనా విషయంలో గుర్రుగా ఉందని కామాక్షి చెబుతుంది. తాను అడ్డుకున్నా అది అలా చేస్తే నేనేం చేయాలని ప్రభావతి అంటుంది.
సుందరి విషయంలో కామాక్షి కూడా మీనాను పొగడటంతో ప్రభావతికి మరింత మండుతుంది. తర్వాత చింతామణి దగ్గరికి వెళ్లి కొత్త డ్యాన్స్ స్టెప్ నేర్పిస్తానని ప్రభావతి చెప్పినా ఆమె అవసరం లేదు అని అంటుంది. దీంతో ప్రభావతి షాక్ తింటుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.