Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రోహిణికి దెయ్యం పట్టిందని ఓ స్వామిజీతో బడితపూజ చేయిస్తారు. మనోజ్‌ను పిలిచి కర్ర ఇచ్చి రోజుకు మూడు పూటల కొట్టమని చెబుతాడు స్వామిజీ.
స్వామిజీ దెబ్బలకు రోహిణి ఏడుపు

రోహిణి లేచి నిల్చుని వాష్ రూమ్‌కి వెళ్తుంది. స్వామిజీ వెళ్లిపోతాడు. స్వామిజీ కొట్టిన దెబ్బలకు రోహిణి ఏడుస్తుంటుంది. మరోవైపు టాక్సీలో బాలు ప్యాసెంజర్ తండ్రి చనిపోయాడని, త్వరగా వస్తానని ఫోన్‌లో ఏడుస్తూ బాధపడుతాడు. తాను త్వరగా తీసుకెళ్తానని బాలు అంటాడు. రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది. పక్కన దారి కనిపిస్తే అందులో నుంచి వెల్దామని బాలు అంటాడు.
అయితే నో ఎంట్రీ బోర్డ్ ఉన్న రోడ్డు. సరి అది రాంగ్ రూట్ అని ప్యాసెంజర్ అంటాడు. అత్యవసరమైనప్పుడు రూల్స్ అతిక్రమించిన తప్పు లేదని రాంగ్ రూట్‌లో కారు తీసుకెళ్తాడు బాలు. నో ఎంట్రీ బోర్డ్ దగ్గరే బాలు గొడవ పెట్టుకున్న ట్రాఫిక్ పోలీస్ ఉంటాడు. బాలును చూసి కారును ఫాలో అవుతాడు. ట్రాఫిక్ పోలీసులు మనల్ని ఫాలో అవుతున్నారని ప్యాసెంజర్ అంటాడు.
ముందు మిమ్మల్ని రైల్వే స్టేషన్‌లో దించాక చూసుకుంటా అని బాలు అంటాడు. నా వల్ల మీకు సమస్య వస్తుందని అతను అంటే.. సాటి మనిషికి సహాయం చేయకుంటేనే తప్పు అని బాలు అంటాడు. ప్యాసెంజర్‌ను రైల్వే స్టేషన్‌లో దించేసి బాలు వెళ్తాడు. దారిలో బాలును ట్రాఫిక్ పోలీసు ఆపుతాడు. కిందకు దిగమని నో ఎంట్రీ బోర్డ్ కనిపించలేదా అని అడుగుతాడు.
బాలు కారు సీజ్
ప్యాసెంజర్ ఎమర్జెన్సీ గురించి బాలు చెబుతాడు. అయినా ట్రాఫిక్ పోలీస్ వినడు. కారు సీజ్ చేస్తాడు. ఎలా తిరిగి తెచ్చుకుంటావో చూస్తాను అని అతను అంటాడు. ఫైన్ కడతాను అంటున్నా ట్రాఫిక్ పోలీస్ అంటాడు. అయినా ట్రాఫిక్ పోలీస్ వినకుండా వెళ్లిపోతాడు. మరోవైపు తనతో ఎలా శ్రుతి మాట్లాడిందే రవి కూడా అలాగే మాట్లాడుతాడు.
{{/usCountry}}ప్యాసెంజర్ ఎమర్జెన్సీ గురించి బాలు చెబుతాడు. అయినా ట్రాఫిక్ పోలీస్ వినడు. కారు సీజ్ చేస్తాడు. ఎలా తిరిగి తెచ్చుకుంటావో చూస్తాను అని అతను అంటాడు. ఫైన్ కడతాను అంటున్నా ట్రాఫిక్ పోలీస్ అంటాడు. అయినా ట్రాఫిక్ పోలీస్ వినకుండా వెళ్లిపోతాడు. మరోవైపు తనతో ఎలా శ్రుతి మాట్లాడిందే రవి కూడా అలాగే మాట్లాడుతాడు.
{{/usCountry}}దాంతో శ్రుతి సారీ చెబుతుంది. దానికి రవి నవ్వుతాడు. సరదాగా రివేంజ్ తీర్చుకున్నాని అంటాడు రవి. పెళ్లి ఎలాగు సరిగా చేసుకోలేదు. ఫస్ట్ యానివర్సరీ బాగా చేసుకుందామా. మీ అన్నయ్య మనోజ్ వాళ్లలా అని శ్రుతి చెబితే.. వాళ్లు బాగా ఖర్చు చేశారని రవి అంటాడు. దాంతో తనకు పెళ్లి రోజు ఎలా చేసుకోవాలో ఓ డ్రీమ్ చెబుతుంది శ్రుతి.
హనీమూన్‌కు వెళ్దామని, ఫొటోషూట్ చేయాలని, నచ్చిన సాంగ్స్ మనిద్దరం పాడాలని కోరికలు చెబుతుంది శ్రుతి. నీ కోరికలు తీర్చడమే నా కోరిక అని రవి అంటాడు. ట్రాఫిక్ పోలీస్ గురించి బాలు ఫోన్‌లో కోపంగా మాట్లాడుకుంటూ ఇంటికి వస్తాడు. ఏమైందని మీనా అడుగుతుంది. ట్రాఫిక్ పోలీస్ అరుణ్‌తో జరిగింది చెబుతాడు బాలు. నా మీద పగ తీర్చుకుంటున్నాడని, వాడి సంగతి చెబుతానని బాలు అంటాడు.
బాలుది తప్పన్నా మీనా
వాళ్లకు కూడా ఏవేవే ట్రాఫిక్ రూల్స్ ఉంటాయిగా అని మీనా అంటుంది. ప్యాసెంజర్ తన నాన్నను చివరి చూపు చూసుకోలేడని చేశాను అని బాలు అంటాడు. కోపంతో సమస్యను ఇంకా పెద్దది చేసుకోకండని మీనా అంటుంది. ఏ పూలగంప నాకు ఇంకా కోపం తెప్పించకు అని బాలు అంటాడు. అది కాదండి. మంచివాళ్లు కాబట్టి సహాయం చేశారు. కానీ, మీరు చేసింది తప్పే కదా. ఆవేశం తెచ్చుకోకండని మీనా అంటుంది.
భార్యవి అయిండి భర్త పరిస్థితి అర్థం చేసుకోలేకపోతున్నావ్ అని బాలు అంటాడు. ఇప్పుడు మీరెళ్లి వాళ్లతో గొడవ పడితే సమస్య పెరుగుతుంది. ముందు వచ్చి భోజనం చేయండి అని మీనా అంటుంది. నా కారు వచ్చేవరకు నాకు ఏది వద్దని కోపంగా ఓ వస్తువు పగులగొట్టి వెళ్లిపోతాడు బాలు. ఇంతకోపం ఎవరికి నష్టం మనకే. అందుకే అంటాను ముళ్లకంప అని మీనా అనుకుంటుంది.
మరోవైపు పూలు డెలీవరి ఇచ్చిన మీనా బాధగా ఉండటంతో కస్టమర్ అడుగుతుంది. ధర్మం గొప్పదా.. నియమం గొప్పదా అని మీనా అడిగితే ధర్మమే గొప్పది అని ఆమె అంటుంది. దాంతో పోలీసులు అది తప్పంటున్నారని జరిగింది చెబుతుంది మీనా. ఈ విషయంలో ఏదైనా సహాయం చేయగలరా. సీఐ గారితో మాట్లాడి ఏమైనా చేయగలరా అక్క అని మీనా అంటుంది.
సీఐ భార్యతో మీనా
ఆయన జాబ్ విషయంలో చాలా స్ట్రిక్ట్. కానీ, అక్క అని పిలిచావ్ కాబట్టి ప్రయత్నిస్తానని సీఐ భార్య హామీ ఇస్తుంది. మరోవైపు రోహిణి పడుకుని ఉంటే.. మనోజ్ కర్ర పట్టుకుని ఆలోచిస్తాడు. స్వామిజీ చెప్పింది గుర్తు తెచ్చుకుని కొట్టడం పాపం కదా, ఆత్మ ఇంకా ఉండి నన్ను కొడితే ఎలా అని భయపడిపోతాడు మనోజ్. అమ్మను అడుగుదాం పాపం తగిలితే తనకే తగులుతుంది అని మనోజ్ వెళ్లిపోతాడు.
మనోజ్‌ను చూసి ప్రభావతి ఏంట్రా నీలో ఆత్మ దూరిందా అని అడుగుతుంది. దానికి చెక్ చేస్తుంది. మూడు ప్రశ్నలు అడిగి నువ్వు మీ మామ ఆత్మ కాదు, నా కొడుకు మనోజ్ అని ప్రభావతి అంటుంది. కొట్టడం ఎలా అని మనోజ్ అడిగితే.. ముందు కొడితే తర్వాత నిద్ర లేస్తుంది. అప్పుడు కంటిన్యూ అవ్వమని ప్రభావతి చెబుతుంది. లోపలికి వెళ్లి పడుకున్న రోహిణి అరికాళ్లపై మనోజ్ కర్రతో కొడతాడు.
నొప్పి అంటూ రోహిణి అరుస్తుంది. అలాగే కొట్టమని ప్రభావతి అంటుంది. ఆపమని రోహిణి అంటుంది. కొట్టమని ప్రభావతి చెబుతుంది. మనోజ్ కొట్టబోతుంటే కర్ర పట్టుకుంటుంది రోహిణి. దాంతో ప్రభావతి పారిపోతుంది. భయంతో ఒకటి వస్తుందని మనోజ్ అంటాడు. మనోజ్ మళ్లీ కొట్టబోతుంటే కర్ర పట్టుకుని నేను రోహిణిని అని గట్టిగా చెబుతుంది. దాంతో మనోజ్ ఆగిపోతాడు.
నా గొయ్యి నేనే తవ్వుకున్నా
నొప్పితో రోహిణి ఏడవటంతో బయటకు వెళ్తారు ప్రభావతి, మనోజ్. నా గొయ్యి నేనే తవ్వుకున్నాను అని ఏడుస్తుంది రోహిణి. రోహిణి ఏడుస్తుందని మనోజ్ ఫీల్ అవుతాడు. ముసలి ఆత్మ కాబట్టే నొప్పితో ఏడుస్తుంది. ఆ అరుపులు అన్ని మీ మామవేరా. ఆత్మ ఇంకా ఉండే ఉంటుంది. మీ మామ ఆత్మ పోయేసరికి రోహిణికి కాస్తా దూరంగా పడుకో అని ప్రభావతి అంటుంది.
అనసవరంగా అబద్ధం చెప్పి దెబ్బలు తింటున్నాను. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలని రోహిణి ఆలోచిస్తుంది. పోలీస్ స్టేషన్‌కు బాలు వెళ్తాడు. పరిచయం ఉన్న కానిస్టేబుల్‌తో కారు సీజ్ గురించి జరిగింది చెబుతాడు బాలు. సీజ్ చేసింది ఎవరని అడిగితే.. ట్రాఫిక్ కానిస్టేబుల్ అరుణ్ సర్, నేను పెట్టుకున్న పేరు ట్రాకా అని బాలు చెబుతాడు. ఎస్సై వచ్చేవరకు ఆగమని కానిస్టేబుల్ చెబుతాడు. ఇంతలో బాలుకు ట్రిప్ వస్తుంది.
ట్రాకా వచ్చి బాలును మెడపట్టి గెంటేయమంటాడు. కానిస్టేబుల్ చూడటంతో బాలు సైలెంట్‌గా వెళ్లిపోతాడు. బాలుకు వచ్చిన ట్రిప్‌కు సురేష్‌ను వెళ్లమని, ఇంకేం అడగకురా ఏడిచేలా ఉన్నానను అని కారు గురించి బాధపడుతాడు బాలు. ఇంతలో సీఐ వచ్చి బాలును లోపలికి రమ్మంటాడు. అరుణ్‌ను పిలుస్తాడు. కారు ఎందుకు సీజ్ చేశావని సీఐ అడిగితే.. నో ఎంట్రీ బోర్డ్‌లోకి వచ్చాడని ట్రాకా చెబుతాడు.
బాలు కారు విడిపించిన మీనా
మరి నో ఎంట్రీ బోర్డ్‌లో నువ్వేం చేస్తున్నావ్. అలా ఎంటర్ అయితే ఫైన్ వేయి కారు ఎందుకు సీజ్ చేశావ్. ఆ కారు అతనికి జీవనాధారం. అలా చేయడం కరెక్ట్ కాదు కదా అని సీఐ అంటాడు. ఎవరికైనా అయితే ఫైన్ వేయొచ్చు. కానీ, ఇతన్ని కోర్టుకు పంపించాలి అని ట్రాకా అంటాడు. ఏంటీ అంత కసి. ఏదైనా ఉంటే సివిల్ డ్రెస్‌లో చూసుకో. రూల్స్ బ్రేక్ చేయకు. అతని కారు కీస్ ఇవ్వు అని సీఐ చెప్పడంతో టేబుల్‌పై పెట్టి వెళ్లిపోతాడు ట్రాఫిక్ కానిస్టేబుల్ అరుణ్.
మీనా నీ గురించి గొప్పగా చెప్పింది. అందుకే ఫైన్ కట్టేసి వెళ్లిపో అని సీఐ అంటాడు. హో నా భార్యకు అంత పరపతి ఉందా అని బాలు అనుకుంటాడు. మీనా తన ప పవర్ వాడి భర్త బాలు కారుని విడిపిస్తుంది మీనా.
తర్వాత ఇంట్లోకి వెళ్లిన బాలుతో మీనా కోపంగా ఉంటుంది. మీనాకు థ్యాంక్స్ చెబుతాడు. ఉదయం అరిచినందుకు క్షమించమంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.