గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో సత్యం ఫ్యామిలీ లుక్ ను పూర్తిగా మార్చేస్తారు మనోజ్, రోహిణి. తన బిజినెస్ ప్లాన్ కోసం మనోజ్ పెద్ద నటకానికే తెర తీస్తాడు. ఈ క్రమంలో సత్యం అండ్ ఫ్యామిలీని ఇప్పటి వరకూ ఎప్పుడూ చూడని లుక్ లో ఆడియెన్స్ చూడబోతున్నారు. ముఖ్యంగా బాలు, మీనా సూపర్ లుక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది.
కళ్లు తిరిగి పడిపోయిన బాలు

గుండె నిండా గుడి గంటలు సీరియల్ సోమవారం (మార్చి 16) ఎపిసోడ్ సుమతి పెళ్లి గురించి బాలు చెప్పే సీన్ తో మొదలవుతుంది. అది వినగానే ప్రభావతి తప్ప అందరూ సంతోషిస్తారు. మరోవైపు మనోజ్ మాత్రం ఆమె పెళ్లిని మనమే దగ్గరుండి ఘనంగా జరిపిద్దామంటాడు. అది విని బాలు కళ్లు తిరిగి పడిపోతాడు.
అందరూ కంగారు పడతారు. ముఖాన నీళ్లు కొట్టి మీనా అతన్ని లేపుతుంది. ఆ మాటన్నది వీడేనా.. వీడి నోటి నుంచి ఇంత మంచి మాటలా అంటూ బాలు అంటాడు. అటు రోహిణి కూడా అదే మాట అంటుంది. అందరం కలిసి ఆమె పెళ్లి ఘనంగా చేద్దామంటుంది.
గుడ్ న్యూస్ చెప్పిన మనోజ్.. ముగ్గురూ కలిసి ఈవెంట్ ప్లాన్
ఆ తర్వాత మనోజ్ కూడా గుడ్ న్యూస్ చెప్పాలంటే. వచ్చే శనివారం అని అనగానే ఆ రోజు నీ షాపు మొదలు పెట్టి 100 రోజులైందని బాలు అంటే.. ఆ రోజే వాళ్ల పెళ్లి రోజు అని మీనా చెబుతుంది. ఆ రెండూ నిజమే అని, ఈ సందర్భంగా హోటల్లో గ్రాండ్ గా పార్టీ ప్లాన్ చేస్తున్నట్లు మనోజ్ చెబుతాడు.
ఎందుకు అంత ఖర్చు అని సత్యం అంటే.. ఓ పెద్ద బిజినెస్‌మ్యాన్ వస్తున్నాడని, అతన్ని ఇంప్రెస్ చేయడానికి ఇదంతా తప్పదని, అదే జరిగితే తన బిజినెస్ మరో లెవెల్ కు వెళ్తుందని మనోజ్ అంటాడు. ఈ ఈవెంట్ ను గ్రాండ్ సక్సెస్ చేయడానికి తమకు సహకరించాలని మనోజ్, రోహిణి కోరతారు.
బాలు, రవిలను ఒప్పించిన మనోజ్
{{/usCountry}}ఎందుకు అంత ఖర్చు అని సత్యం అంటే.. ఓ పెద్ద బిజినెస్‌మ్యాన్ వస్తున్నాడని, అతన్ని ఇంప్రెస్ చేయడానికి ఇదంతా తప్పదని, అదే జరిగితే తన బిజినెస్ మరో లెవెల్ కు వెళ్తుందని మనోజ్ అంటాడు. ఈ ఈవెంట్ ను గ్రాండ్ సక్సెస్ చేయడానికి తమకు సహకరించాలని మనోజ్, రోహిణి కోరతారు.
బాలు, రవిలను ఒప్పించిన మనోజ్
{{/usCountry}}బాలు, రవిలను తీసుకొని మనోజ్ పైకి వెళ్తాడు. టెన్షన్ పడుతూ అటూ ఇటూ తిరుగుతుంటాడు. ఏం జరిగిందని అడిగితే జరిగింది చెబుతాడు మనోజ్. అయితే ఆ బిజినెస్‌మ్యాన్ ను ప్రసన్నం చేసుకోవాలంటే తనతోపాటు ఇంట్లో వాళ్లందరూ గొప్పగా కనిపించాలని అంటాడు. అందుకే నువ్వు 50 కార్లు ఉన్న ట్రావెల్స్ ఓనర్ అని చెప్పానని బాలుతో, రెస్టారెంట్ కు ఓనర్ వని చెప్పానని రవితో మనోజ్ అంటాడు. మీరు కూడా అలాగే కనిపించాలని అనడంతో బాలు, రవి తిడతారు.
దీనికోసమేనా అప్పటి నుంచి తమతో చాలా బాగా మాట్లాడుతున్నావ్.. సుమతి పెళ్లి దగ్గరుండి చేద్దామన్నావ్ అని బాలు అంటాడు. ఇది జరిగితే మన ఫ్యామిలీ అంతా బాగుంటుందని, సక్సెస్ అయితే తాను తీసుకున్న డబ్బుకు డబుల్ ఇస్తానని మనోజ్ చెబుతాడు. అంతేకాదు తనను పొగుడుతూ మాట్లాడితే.. ప్రతి పొగడ్తకు వెయ్యి ఇస్తానని కూడా బాలుకు ఆఫర్ ఇస్తాడు. ఇక వాళ్లు వేసుకునే బట్టలతోపాటు మొత్తం ఖర్చు తానే చూసుకుంటాననీ చెబుతాడు. దీంతో మొత్తానికి ఇష్టం లేకపోయినా సరే అని బాలు, రవి అంటారు.
శృతి, మీనాలతో రోహిణి ప్లాన్
ఇటు శృతి, మీనాలతో రోహిణి కూడా అదే చెబుతుంది. వాళ్ల ముందు రిచ్ గా కనిపించాలని, ఈవెంట్ రోజు మొత్తం మేకప్, మిగిలినవన్నీ తానే చూసుకుంటానని అంటుంది. మీనా కూడా బాలులాగే అలా చేయడం వల్ల ఏం లాభం.. వచ్చిన వాడు ఫ్యామిలీ వేసుకునే బట్టలు ఎందుకు చూస్తాడని అడుగుతుంది.
అప్పుడు శృతి జోక్యం చేసుకుంటూ.. ఇప్పుడు సొసైటీ అలాగే ఉందని, వేసుకునే బట్టలను బట్టే విలువ ఇస్తున్నారని అంటుంది. అప్పుడే మనోజ్ రోహిణికి ఫోన్ చేసి బాలు, రవి ఒప్పుకున్నారని అంటాడు. అదే విషయం రోహిణి చెప్పగానే మీనా, శృతి కూడా సరే అంటారు.
ఫ్యామిలీ డ్రామా స్టార్ట్
ఈవెంట్ రోజు సత్యం ఫ్యామిలీ మొత్తం ఇంతకుముందు ఎప్పుడూ చూడని విధంగా రెడీ అవుతుంది. అందరూ కాస్ట్ లీ బట్టలు వేసుకుంటారు. సూటుబూట్లు, పట్టుచీరలు, నగలు.. ఇలా ఫ్యామిలీ మెరిసిపోతూ ఉంటుంది. అయితే అందరి కన్నా బాలు, మీనా చివర్లో అదిరిపోయే డ్రెస్సుల్లో ఇచ్చే ఎంట్రీ మరో లెవెల్లో ఉంటుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.