...
...
Next Story

Gunde Ninda Gudi Gantalu Today Episode: తాగి నిజం వాగేసిన బాలు.. లక్షలు పోసి మనోజ్ చేసిన పార్టీ ఫెయిల్.. మళ్లీ రచ్చ

Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ మార్చి 17 ఎపిసోడ్ లో మనోజ్ తన బిజినెస్ కోసం పెద్ద పార్టీ ప్లాన్ చేస్తాడు. అందుకు తగినట్లే అందరూ రెడీ కాగా.. చివర్లో తాగి ప్లాన్ అంతా చెడగొట్టేస్తాడు బాలు.

Published on: Mar 17, 2026, 07:49:11 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో మనోజ్ వేసిన ప్లాన్ మొత్తాన్ని బాలు చెడగొట్టేస్తాడు. ముగ్గురు అన్నదమ్ములు తాగి తందనాలు ఆడతారు. ఈ క్రమంలో మత్తులో బాలు అసలు నిజం చెప్పేస్తాడు. దీంతో మనోజ్ పార్టీ ఫెయిలవుతుంది. మరో రచ్చకు బాలు రంగం సిద్ధం చేస్తాడు.

రవి, శృతి పీ అండ్ జీ శిక్ష ప్రమోషన్

Gunde Ninda Gudi Gantalu Today Episode: తాగి నిజం వాగేసిన బాలు.. లక్షలు పోసి మనోజ్ చేసిన పార్టీ ఫెయిల్.. మళ్లీ రచ్చ
Gunde Ninda Gudi Gantalu Today Episode: తాగి నిజం వాగేసిన బాలు.. లక్షలు పోసి మనోజ్ చేసిన పార్టీ ఫెయిల్.. మళ్లీ రచ్చ

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (మార్చి 17) ఎపిసోడ్ మనోజ్, రోహిణి వేసిన ప్లాన్ పై బాలు, మీనా మాట్లాడుకునే సీన్ తో మొదలవుతుంది. ఈ పార్టీలో తాను అబద్ధం ఎలా చెప్పగలనో చూస్తానని బాలు అంటాడు. అటు రవి, శృతి కలిసి పీ అండ్ జీ శిక్ష యాప్ ప్రమోషన్ చేస్తుంటారు. ఈ యాప్ ద్వారా అణగారిన వర్గాల పిల్లలు ఎంతలా లాభపడుతున్నారో వాళ్లు చెప్పడం చూడొచ్చు.

బాలు ఫోన్ కొట్టేయడానికి రోహిణి, విద్య ప్లాన్

మనోజ్, రోహిణి యానివర్సరీ రోజు వచ్చేస్తుంది. రోహిణి, విద్య చాలా బాగా రెడీ అవుతారు. అదే సమయంలో ఈ పార్టీలోనే బాలు ఫోన్ కొట్టేయడానికి రోహిణి మళ్లీ ప్లాన్ చేస్తుంది. ఆ బాధ్యతను విద్యకు అప్పగిస్తుంది. బొమ్మల కొలువు సమయంలో ప్లాన్ ఫెయిలైందని, ఈసారి అలా జరగొద్దని అనుకుంటారు.

ఆ తర్వాత మనోజ్ దగ్గరికి వెళ్తారు. రోహిణిని చూడగానే మనోజ్ ఫ్లాట్ అవుతాడు. చాలా అందంగా ఉన్నావంటాడు. ఇద్దరూ యానివర్సరీ విషెస్ చెప్పుకుంటారు. తమ బిజినెస్ ను భారీ స్థాయిలోకి తీసుకెళ్లేందుకు వచ్చిన ఈ చివరి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దని అంటాడు.

ప్రభావతిని ఆట పట్టించిన సత్యం

ప్రేమావతి, హైమావతి, పంకజం అంటూ సత్యమే ఆమెను ఆట పట్టిస్తాడు. తర్వాత ప్రభావతిని చూసి ఎవరు మీరు.. ఇలా చేయడం చూస్తే మా ఆవిడ ఏమనుకుంటుందని కావాలని అంటాడు. తర్వాత సత్యం అని ప్రభావతి పిలవడంతో నువ్వా అంటూ ఆశ్చర్యపోతాడు. ఆమె పక్కకు వెళ్లగానే ఈ వయసులో ఇంత డెకరేషన్ అవసరమా అని కామాక్షితో అంటాడు.

బాలు, మీనా స్పెషల్ అట్రాక్షన్

ఈ పార్టీకి రవి, శృతి కూడా చాలా బాగా తయారై వస్తారు. అందరూ బాలు, మీనా కోసం ఎదురు చూస్తుంటారు. వీళ్లందరి ముందు వాళ్లు చద్దన్నంలో ఉల్లిపాయలా ఉంటారంటూ ప్రభావతి అంటుంది. చివరికి బాలు, మీనా ఎంట్రీ ఇవ్వగానే ప్రభావతి నోరెళ్లబెడుతుంది. అందరూ ఆశ్చర్యపోతారు. ఇద్దరూ చాలా అందంగా, చాలా డబ్బున్న వాళ్లలా కనిపిస్తారు.

హాల్లోకి వచ్చీ రాగానే సెల్ఫీలు తీసుకుంటూ బాలు, మీనా హడావిడి చేస్తారు. ఆ తర్వాత ప్రభావతిని చూసిన బాలు ఏ విలేజ్ మీది అంటూ ఆటపట్టిస్తాడు. బాలు ఫోన్ కోసం రోహిణి, విద్య ట్రై చేస్తుండగా అతడు మాత్రం మీనాతో సెల్ఫీల మీద సెల్ఫీలు దిగుతూనే ఉంటాడు.

ముగ్గురు అన్నదమ్ముల మందు సిట్టింగ్

ఇటు పార్టీ స్టార్టవుతుంది. ఆ పెద్ద బిజినెస్‌మ్యాన్ వచ్చేస్తాడు. అతనితో కలిసి మనోజ్, బాలు, రవి మందు తాగుతుంటారు. ముగ్గురికీ చాలా ఎక్కువగా ఎక్కేస్తుంది. తన గురించి పొగడాలని మనోజ్ అంటాడు. దీంతో బాలు అసలు నిజం కక్కేస్తాడు.

తనకు 40 కార్లు లేవని, రెండే ఉన్నాయని.. తన భార్యది బొకే షాపు కాదని, ఇంటింటికీ వెళ్లి పూలు అమ్ముతుందని అంటాడు. ఇక రవి కూడా రెస్టారెంట్ ఓనర్ కాదు.. అందులో పని చేస్తాడని చెబుతాడు. అది విని ఆ బిజినెస్‌మ్యాన్ షాకవుతాడు. ఇంట్లో మరో రచ్చకు బాలు రంగం సిద్ధం చేస్తాడు. అంతటితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe