...
...
Next Story

Gunde Ninda Gudi Gantalu Today Episode: శివను చెప్పుతో కొట్టిన ప్రభావతి.. అన్నంత పనీ చేసిన రోహిణి.. మీనా, పార్వతి షాక్

Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో శివ వీడియో చూసి ఊగిపోయిన ప్రభావతి.. అతన్ని చెప్పుతో కొడుతుంది. రోహిణి వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుంది. దీంతో మీనాకు కొత్త కష్టాలు మొదలవుతాయి.

Published on: Mar 25, 2026, 07:53:01 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ టుడే ఎపిసోడ్ లో శివ వీడియోను వైరల్ చేయాలన్న రోహిణి ప్లాన్ సక్సెస్ అవుతుంది. అంతేకాదు ఆమె తన కన్నింగ్ ఆలోచనలతో ఆ వీడియోను ఇంట్లో వాళ్లు కూడా చూసేలా చేస్తుంది. దీంతో ప్రభావతి ఉగ్రరూపం చూపిస్తూ శివను చెప్పుతో కొడుతుంది.

మీనా నెత్తిపై బల్లి.. బల్లి శాస్త్రం చెప్పిన రోహిణి

Gunde Ninda Gudi Gantalu Today Episode: శివను చెప్పుతో కొట్టిన ప్రభావతి.. అన్నంత పనీ చేసిన రోహిణి.. మీనా, పార్వతి షాక్
Gunde Ninda Gudi Gantalu Today Episode: శివను చెప్పుతో కొట్టిన ప్రభావతి.. అన్నంత పనీ చేసిన రోహిణి.. మీనా, పార్వతి షాక్

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (మార్చి 25) ఎపిసోడ్ మీనా నెత్తిపై బల్లి పడే సీన్ తో మొదలవుతుంది. ఆమె కంగారు ఆ బల్లిని తీసి పారేస్తే అది మొదట ప్రభావతిపై, తర్వాత రోహిణి, మనోజ్ లపై పడుతుంది.

ఏం జరుగుతుందో అని ప్రభావతి కంగారు పడుతుంటే.. రోహిణి ఫోన్ చూసి బల్లిశాస్త్రం చెబుతుంది. తమ ముగ్గురికీ మంచే జరుగుతుందని, అయితే మీనాకు తలపై పడటం వల్ల ప్రాణగండంతోపాటు చాలా కష్టాలు కూడా రానున్నాయని చెబుతుంది.

ప్రాణగండం, కష్టాలంటూ మీనా టెన్షన్

దీంతో మీనాలో ఆందోళన మొదలవుతుంది. దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే సుమతి ఫోన్ చేస్తుంది. జరిగింది చెబుతుంది. బాలు ఫోన్ పోయిందని, అతనికి కొత్త ఫోన్ తీసుకోవాలని అంటుంది. అయితే ఫోన్ల గురించి శివకు బాగా తెలుసని, అతన్ని పంపిస్తానని సుమతి చెబుతుంది.

ఫోన్ ఎక్కడుందో గుర్తొచ్చిందన్న బాలు

ఆ తర్వాత బాలు కూడా మరో ఫోన్ నుంచి మీనాకు ఫోన్ చేస్తాడు. అతనికి కూడా ఇంట్లో జరిగిన విషయం చెప్పి మీనా కంగారు పడుతుంది. బల్లి పడితే ఏం కాదంటూ అతడు లైట్ తీసుకుంటాడు. అయితే తన ఫోన్ ఎక్కడుందో గుర్తొచ్చిందని, మనోజ్ గాడు ఇచ్చిన కోటులోనే ఉందని మీనాతో బాలు చెబుతాడు. తన ఫోన్ పోలేదని, ఎవరో ప్లాన్ చేసి కొట్టేశారని అంటాడు. మీరు వచ్చిన తర్వాత చూద్దాంలే అని మీనా చెబుతుంది.

బాలు కోసం మీనా కొత్త ఫోన్

ఇటు విద్య కూడా ఆ వీడియో చూస్తుంది. అప్పుడే వచ్చిన రోహిణికి చూపిస్తే ఆమె చాలా సంతోషిస్తుంది. మీనా పాపమే అని విద్య అంటున్నా కూడా రోహిణి మరో మాస్టర్ ప్లాన్ వేస్తుంది. ఆ వీడియోను ఇంట్లో వాళ్లకు చూపించడం కోసం ఓ మెసేజ్ ను టైప్ చేసి ఇవ్వమని విద్యకు చెబుతుంది.

ఆమె రోహిణి చెప్పినట్లే చేస్తుంది. నేరుగా మనోజ్ దగ్గరికి వెళ్లిన రోహిణి.. ఎవరో ఈ లెటర్ నీకు ఇచ్చారని చెబుతుంది. అది ఓపెన్ చేసి చూస్తే మీ ఇంట్లో వాళ్ల వీడియో ఒకటి వైరల్ అవుతోంది చూడమని అందులో ఉంటుంది. ఆ మెసేజ్ అంతకుముందు విద్యకు చెప్పి రోహిణి టైప్ చేయించిందే ఉంటుంది.

ఆ వీడియో చూసి మనోజ్ షాక్ తింటాడు. దొంగతనం చేసింది మీనా తమ్ముడు శివ అని అతడు గుర్తిస్తాడు. రోహిణి ఏమీ తెలియనట్లు నాటకం ఆడుతుంది. ఈ వీడియోను వెంటనే అమ్మకి చూపించాలని మనోజ్ అంటాడు. వద్దన్నట్లుగా రోహిణి నాటకమాడుతుంది. కచ్చితంగా చూపించాల్సిందే.. అది నువ్వే చేయు అంటూ రోహిణిని పంపిస్తాడు.

ప్రభావతికి కూడా వీడియో చూపించిన రోహిణి

డ్యాన్స్ క్లాస్ లో ఉన్న ప్రభావతికి రోహిణి ఆ వీడియో చూపిస్తుంది. దీంతో ప్రభావతి ఆవేశంతో ఊగిపోతుంది. వెంటనే పార్వతి ఇంటికి వెళ్తుంది. అప్పటికే మీనా కూడా అక్కడ ఉంటుంది. ఎక్కడ వాడు అంటూ వెళ్లి శివ కాలర్ పట్టుకొని ఈడ్చుకొని వస్తుంది. తర్వాత చెప్పుతో కొడుతుంది.

మీనా అడ్డుపడితే.. తన లక్ష కొట్టేసిందని వీడే అని చెబుతుంది. తర్వాత రోహిణి ఆ వీడియోను వాళ్లకు చూపిస్తుంది. దీంతో మీనా, పార్వతి షాక్ తింటారు. తన డబ్బు కొట్టేసిన వీడిని వదలనని, అంతకంతకూ పగ తీర్చుకుంటానని ప్రభావతి వార్నింగ్ ఇస్తుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe