...
...
Next Story

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: సత్యంకు ఓనర్ పట్టాభిషేకం, నౌకరుగా మనోజ్- అత్తకు గడ్డిపెట్టిన మీనా- ముఖేష్ వార్నింగ్

Gunde Ninda Gudi Gantalu Serial May 18th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ మే 18వ ఎపిసోడ్‌లో ఫర్నిచర్ షాప్‌లో సత్యంకు ఓనర్‌గా పట్టాభిషేకం చేస్తారు. ఓనర్‌గా సత్యంను కూర్చోబెడతాడు బాలు. సబ్ డీలర్స్ వచ్చి మనోజ్, రోహిణితో గొడవ పడతారు. వారికి ముంబై ముఖేష్ గ్యారెంటీ ఇచ్చి పంపిస్తాడు.

Published on: May 18, 2026, 07:47:06 IST
Advertisement

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మనోజ్, రోహిణి గదిలో గొడవ పడతారు. డాబా పైన మనోజ్‌లా బాలు, రోహిణిలా మీనా యాక్ట్ చేస్తారు. ఇద్దరు గొడవ పడుతున్నట్లుగా చేస్తారు. ఒకరిపై మరొకరు సెటైర్లు వేసుకుంటారు. ఇప్పుడు వాళ్లిద్దరు గదిలో ఇలాగే గొడవ పడుతుంటారు అని బాలు అంటాడు.

పార్లరమ్మా బండారం బయటపెడతా

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మే 18 ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ మే 18 ఎపిసోడ్

ఏది ఏమైనా మా నాన్న ఫర్నిచర్ షాప్‌కు ఓనర్ కావాలి. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. పార్లరమ్మా ఇంకా చాలా తప్పులు చేస్తున్నట్లు అనుమానంగా ఉంది. పార్లరమ్మా బండారం నేనే బయటపెడతాను అని బాలు అంటాడు. మరోవైపు మనోజ్ గదిలోకి ప్రభావతి వెళ్తుంది. మీరిద్దరు కలిసి నన్ను పిచ్చిదాన్ని చేశారు. నాతో ఒక్కమాట చెప్పి ఉంటే ఈ పరిస్థితి ఇక్కడిదాకా రాకుండా చేసేదాన్నిగా అని ప్రభావతి అంటుంది.

సారీ చెబుతుంది రోహిణి. సరే. ఇప్పుడు ఆ బాలుగాడు చెప్పింది విన్నారుగా. మీ మావయ్యను షో రూమ్‌కో ఓనర్ చేస్తానంటున్నాడు. ఆయనకు ఇష్టం లేకుంటే రేపు ఇంకేం చేస్తాడో తెలియదు. అన్నిటికి కారణం ఆ డబ్బు. ఆ డబ్బు వాడి మొహం మీద కొడితే సరిపోతుంది. ఇప్పుడు డబ్బు కష్టమే. కానీ, రోహిణి నువ్వు అనుకుంటే జరుగుతుంది. మీ మావయ్యకు కాల్ చేసి పరిస్థితి చెప్పి డబ్బు పంపించమను. ఆ డబ్బు వాడికి ఇస్తేనే మీపై ఇంట్లో గౌరవం ఉంటుంది అని ప్రభావతి అంటుంది.

కానీ, మా నాన్న జైలులో ఉన్నాడుగా. ఎలా కుదురుతుందని రోహిణి అంటుంది. ఆస్తులు బయటే ఉన్నాయిగా. మీ మావయ్యను అడిగి పాతిక లక్షలు అరెంజ్ చేయమని చెప్పు. అంత ఆస్తి పెట్టుకుని ఆ మాత్రం 25 లక్షలు ఏర్పాటు చేయకుంటే ఎలా. అదేదో అయ్యేలా చూడు. లేకుంటే అవమానాలు తప్పవు అని ప్రభావతి తెగేసి చెప్పి వెళ్లిపోతుంది. మళ్లీ డబ్బు గోల, షో రూమ్ ఓనర్ సమస్య రోహిణి మెడకే చుట్టుకుంటుంది.

ప్రభావతికి గడ్డి పెట్టిన మీనా

బాలు చెప్పింది సమంజసంగానే ఉందని సత్యం అంటాడు. మీనా కూడా కరెక్ట్ అని చెబుతుంటే నువ్వు వాడికి బిజినెస్ చెబుతావా అని ప్రభావతి అంటుంది. మరి మీరు మూడోసారి లక్షలు ఎలా మింగాలో చెబుతారా. రోహిణి ఒక్కదాన్నే కొట్టి మనోజ్‌ను ఏమనలేదు. మిమ్మల్ని నమ్ముకుంటే న్యాయం బాగానే చెబుతారు అని అత్త ప్రభావతికి మీనా గడ్డి పెడుతుంది. బాగా అయిందా, ఇంకా కావాలా అని సత్యం అంటాడు.

ప్రభావతిని రెడీ అవ్వమని సత్యం అంటాడు. అత్తయ్య ఇంకా ఏమైనా కావాలా అని మీనా అడిగితే.. వద్దు. పెట్టావుగా గడ్డి అని ప్రభావతి వెళ్లిపోతుంది. మరోవైపు షాపులో ఉద్యోగిని చైర్స్ డెలివరీకి ఎందుకు పంపించలేదని మనోజ్ తిడతాడు. రోహిణి వచ్చి మనోజ్‌ను ఆపి అతన్ని పంపిస్తుంది. ప్రభావతి దిష్టి బొమ్మ గురించి రోహిణి అడిగితే.. అది పెట్టుకున్నాకే 30 లక్షలు మోసపోయాను, అందుకే తీయించేశాను అని మనోజ్ అంటాడు.

కోపంతో కాదు

ఇంతలో రవి, శ్రుతి వస్తారు. బాలు, మీనా షాప్‌కు రమ్మన్నారని చెప్పారని వారు చెబుతారు. తర్వాత బాలు, సత్యం వస్తారు. ఏం జరుగుతుందని మనోజ్ అంటే.. ఓనర్ పట్టాభిషేకం అని బాలు అంటాడు. పదవిమార్పు ఫంక్షన్. నిన్ను ఓనర్ సీట్ నుంచి లాగేసి నాన్నను ఆ సీటులో కూర్చొబెట్టే ఫంక్షన్‌రా అని బాలు చెబుతాడు. దాంతో మనోజ్, రోహిణి షాక్ అవుతారు.

నాన్న రిటైర్‌మెంట్ డబ్బుల మీద మాకు ఏం ఆశ లేదు. కానీ, దానివల్ల రవిగాడు రెస్టారెంట్ పెట్టుకునేవాడు. కేవలం నీ వల్ల వాడు చెఫ్‌గా పని చేస్తున్నాడని బాలు అంటాడు. ప్రతిసారి నాకు ఏం వస్తుందని నిన్ను ఏడిపిస్తాను. నాకేమైనా శాడిజం అనుకున్నావా. సిగ్గు తెచ్చుకుని అయినా బాగుపడతావని. ఇది నీ మీద కోపంతో తీసుకున్న నిర్ణయం కాదు. ఇందులో ప్రతి వస్తువుపై నాన్న కష్టం ఉంది ఇప్పుడు కూడా నువ్వు తప్పటడుగు వేస్తే షాప్ మూతపడుతుంది. అలా జరగకుండా ఉండేందుకే ఈ పదవి మార్పు అని బాలు అంటాడు.

అమ్మ నీ నిర్ణయం కూడా ఇదేనా అని మనోజ్ అంటే.. ఎక్కువ మాట్లాడితే కుర్చీతో కొడతా. మీ నాన్న కష్టానికి ఏ కొడుకులు ఇవ్వని విలువ ఇస్తున్నారు. మనకు నచ్చనవాళ్లు మంచి చెబితే అది మంచి కాకుండా పోతుందా. నోరు మూసుకో అని బాలుకు సపోర్ట్‌గా మాట్లాడుతుంది ప్రభావతి. స్టాఫ్ అంతా రావాలని బాలు పిలిచి ఓనర్ సీట్‌లో సత్యంను కూర్చొబెడతాడు బాలు. అంతా చప్పట్లు కొడతాడు. సత్యం పక్కన ప్రభావతిని వచ్చి నిల్చోమంటాడు బాలు.

నౌకర్‌గా మనోజ్

సత్యం, ప్రభావతికి పూలదండలు వేస్తారు. బాలు స్వీట్ పెడతాడు. స్టాఫ్ అందరికి సత్యం ఓనర్ అని, మనోజ్ సాటి నౌకరు అని చెబుతాడు బాలు. దాంతో ఇందాక తిట్టించుకున్న ఉద్యోగి మనోజ్‌పై పంచ్‌లు వేస్తాడు. ఓనర్‌వి అయితే బూతులు తిడతావ. ఆ పాపం ఎలా కొట్టిందో చూశావా. ఇకనుంచి ఇక్కడ నువ్వు కూడా మాలాగే నౌకర్‌వి. అది గుర్తుపెట్టుకుని పని చేయి అని సహోద్యోగి వార్నింగ్ ఇస్తాడు.

మనోజ్‌ను స్వీట్స్ పంచమని రాజేష్ చెబితే కోపంగా వెళ్లిపోతాడు మనోజ్. 40 లక్షలు కొట్టేసినప్పుడు మా ఆయన మొహంలో రక్తం చుక్క లేదు. కన్నకొడుకు మోసం చేసినందుకు మొహమంతా పాలిపోయింది. వాడు ఎక్కడికి పోడు. ఏం కాదు అని మనోజ్‌కు సపోర్ట్ చేయకుండా సత్యం వైపు మాట్లాతుంది ప్రభావతి. అంతలో కొన్ని కార్లు రావడం చూసి మనోజ్ భయంతో లోపలికి వస్తాడు. సత్యంను సీట్‌లో నుంచి లేవమంటాడు.

సబ్ డీలర్స్ వచ్చారు. వారి దగ్గర తీసుకున్న డబ్బుతోనే విల్లాకు అడ్వాన్స్ ఇచ్చాను. ఇంకా డెలివరి చేయలేదు అని మనోజ్ అంటాడు. సబ్ డీలర్స్ వచ్చి డబ్బు తీసుకుని ఇంతవరకు ఫర్నిచర్ పంపించలేదు. మీ మీద యాక్షన్ తీసుకుంటాం. షాప్ టేకప్ తీసుకుని ఫర్నిచర్ పంచుకుంటాం. మమ్మల్ని చీటింగ్ చేసినందుకు కేసు పెడతాం. అరెస్ట్ చేయించి జైలుకు పంపిస్తామని డీలర్స్ అంటారు.

ముఖేష్ గ్యారెంటీ

ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. ఇక్కడ ఓనర్ మారిపోయాడు అని మనోజ్ అంటాడు. మనోజ్‌పై చులకనగా మాట్లాడుతాడు అక్కడ పనిచేసే ఉద్యోగి. తమ్ముడు ఆగు నువ్వు అని బాలు అంటాడు. మనోజ్, రోహిణి ఇద్దరిని తిడతారు సబ్ డీలర్స్. రండి పోలీస్ స్టేషన్‌కు అని మనోజ్ చేయి పట్టుకుంటాడు డీలర్. అంతలో ముంబై ముఖేష్ ఎంట్రీ ఇస్తాడు. మనోజ్‌ చేయి వదలమని కాపాడుతాడు ముంబై ముఖేష్.

ఫర్నిచర్ ఇస్తామంది నిజమే. కానీ, ఫర్నిచర్ సప్లై చేసేందుకు అయింది. మావైపు కూడా డిలే ఉంది. మీ అడ్వాన్స్‌కు నేను గ్యారెంటీ. 2 రోజుల్లో మీ ఫర్నిచర్ మీ దగ్గరికి చేరుతుంది. మళ్లీ ఇతన్ని ఇబ్బంది పెట్టకూడదు అని ముంబై ముఖేష్ హామీ ఇస్తాడు. మీరు చెప్పాక ఇంకేముంది. కానీ, ఈ భార్యాభర్తలు ఇద్దరు ఫ్రాడ్‌ల్లా ఉన్నారు, కొంచెం ఎంక్వైరీ చేసి డీలర్‌షిప్ ఇవ్వండని వారు అంటారు.

అదేం లేదని వాళ్లను పంపించిన ముఖేష్ మనోజ్‌ను అడ్వాన్స్ తీసుకుని ఫర్నిచర్ ఎందుకు పంపలేదు, ఆ డబ్బు మాకెందుకు కట్టలేదు. ఫర్నిచర్ ఎందుకు కొనుగోలు చేయలేదు అని అడుగుతాడు. మనోజ్ చెప్పకుంటే బాలును చెప్పమంటాడు ముఖేష్. దాంతో 3 కోట్ల విల్లా, 30 లక్షలు మోసపోవడం గురించి చెప్పిన బాలు అందుకే వాడిని ఓనర్ సీట్ నుంచి లేపేసి మా నాన్నను పెట్టాం. ఇకనుంచి ఎలాంటి మోసం జరగదని చెబుతాడు.

మనోజ్‌కు ముఖేష్ వార్నింగ్

సిగ్గుందా నీకు. ఈ డీలర్‌షిప్ నిన్ను చూసి ఇవ్వలేదు. మీ వెనుకాల ఉన్న మీ నాన్నని, బాలును చూసి ఇచ్చాను. ఇప్పుడు కూడా వాళ్లు ఉన్నారు కాబట్టి ఆ 30 లక్షలు ఎటు పోవని నమ్మకం వచ్చింది. ఇంకోసారి ఇలా మోసం చేస్తే డీలర్‌షిప్ క్యాన్సిల్ చేయడమే కాదు లీగల్‌గా యాక్షన్ తీసుకుంటాను అని మనోజ్‌కు వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు ముంబై ముఖేష్. తర్వాత మనోజ్ ఇంట్లో ఉంటే నాన్నకు అకౌంట్స్ చూపించు పో అని తిడతాడు బాలు.

ప్రభావతి అడ్డుకుంటుంది. షాపులో నౌకర్లు వీడిని మరి చులకనగా అంటున్నారని ప్రభావతి అంటుంది. అంతలో సత్యం, రోహిణి వస్తారు. మనోజ్‌ను బాలు తిడతాడు. అసుల ఆ ముంబై ముఖేష్‌కు నువ్వే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటావ్. నేను ఎదుగుతున్నాని నీకు అసూయగా ఉంది. అందుకే నా కాళ్లు పట్టుకుని లాగుతున్నావ్ అని మనోజ్ అంటాడు. నేను నీలాంటి అడ్డగాడిద కాళ్లు పట్టుకోను అని బాలు అంటాడు.

మీ ఆయన ఏం మాట్లాడుతున్నాడు. ఆ షాప్ చూసి పెట్టిందే మా ఆయన. తక్కువ డబ్బుకు వచ్చేలా చేసిందే మా ఆయన. మావయ్య 40 లక్షలు మింగారు. మొన్నటికి మొన్న 30 లక్షలు మింగారు. మళ్లీ నిండా మునిగి ఏ పార్కులో పడుకుంటారో అని మావయ్యను ఓనర్‌గా కూర్చోబెట్టారు అని రోహిణి, మనోజ్‌పై మీనా ఫైర్ అవుతుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe