Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో బాలు, అరుణ్ నడిరోడ్డుపైనే గొడవ పడటం.. సుమతి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వాళ్లను ఆపడం.. ఇటు మనోజ్ ను దారికి తెచ్చుకోవడానికి రోహిణి ఓ కొత్త నాటకానికి తెరలేపడం.. అటు రెస్టారెంట్ విషయంలో మరోసారి రవి, శృతి గొడవ పడటం చూడొచ్చు.
మీనాపై ఆవేశంతో రగిలిపోయిన బాలు

మీనా తనకు అబద్ధం చెప్పి పుట్టింటికి వెళ్లిందన్న నిజం తెలిసి బాలు ఇంటి బయటే ఆవేశంతో రగిలిపోయే సీన్ తో సీరియల్ సోమవారం (నవంబర్ 16) ఎపిసోడ్ మొదలైంది. ప్రభావతి వెళ్లి అడిగినా అతడు ఏమీ చెప్పడు. సత్యం వెళ్లి అడిగితే మీనా కోసం వేచి చూస్తున్నానని, సమస్యేమీ లేదని చెప్పి పంపిస్తాడు. అయితే మీనా రాగానే గొడవకు దిగుతాడు. తనకు అబద్దం చెప్పి సుమతిని పెళ్లిచూపులకు సిద్ధం చేయడానికి వెళ్లావా అని నిలదీస్తాడు.
అరుణ్ వాళ్ల అమ్మ వస్తుందని చెబితే వెళ్లాను అని మీనా అంటుంది. మీ పంతం మీదే కానీ.. అవతలి వాళ్లు చెప్పింది వినరా అని అడుగుతుంది. కానీ బాలు వెనక్కి తగ్గడు. తాను వద్దని చెబుతున్నా ఎందుకు వినడం లేదని నిలదీస్తాడు. సుమతి కారు షెడ్డుకు వచ్చిందని, ఇంట్లో జరిగిందంతా చెప్పిందని, పెళ్లికి ఒప్పించాలని చూసిందని అంటాడు. మీరేమన్నారు అని అడిగితే.. నీకు ఏం చెప్పానో తనకూ అదే చెప్పానని, నిప్పు ఎవరికైనా నిప్పే ముట్టుకోవద్దన్నానని చెప్పి బాలు వెళ్లిపోతాడు.
రెస్టారెంట్ విషయంలో రవి, శృతి గొడవ.. కోటి ఖర్చవుతుందంటూ..
మరోవైపు రెస్టారెంట్ విషయంలో ఇంట్లో రవి, శృతి మరోసారి గొడవ పడతారు. మనమే రెస్టారెంట్ పెడదామంటే ఎందుకు వినడం లేదు.. ప్రతిదానికీ ఎందుకు భయపడతావ్.. నీలాంటి పిరికోడిని ఎలా పెళ్లి చేసుకున్నానో.. బాలు, మీనా అయితే అనుకున్నది చేసేస్తారు అని శృతి అంటుంది. అది అంత ఈజీ కాదు.. కనీసం రూ.50 లక్షల నుంచి కోటి ఖర్చవుతందని అనడంతో శృతి షాకవుతుంది. అయినా మనం బ్యాంకు లోనుకు వెళ్తాం కదా అని అంటుంది.
{{/usCountry}}మరోవైపు రెస్టారెంట్ విషయంలో ఇంట్లో రవి, శృతి మరోసారి గొడవ పడతారు. మనమే రెస్టారెంట్ పెడదామంటే ఎందుకు వినడం లేదు.. ప్రతిదానికీ ఎందుకు భయపడతావ్.. నీలాంటి పిరికోడిని ఎలా పెళ్లి చేసుకున్నానో.. బాలు, మీనా అయితే అనుకున్నది చేసేస్తారు అని శృతి అంటుంది. అది అంత ఈజీ కాదు.. కనీసం రూ.50 లక్షల నుంచి కోటి ఖర్చవుతందని అనడంతో శృతి షాకవుతుంది. అయినా మనం బ్యాంకు లోనుకు వెళ్తాం కదా అని అంటుంది.
{{/usCountry}}నువ్వు వెళ్లగానే లోను ఇవ్వరు.. రెస్టారెంట్ గురించి పూర్తిగా వాళ్లకు చెప్పాలి.. మన యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటి.. టార్గెటెడ్ కస్టమర్లు ఎవరు.. ఏడాదిలో టర్నోవర్ ఎంత వస్తుందిలాంటి ఎన్నో చూసి ఇస్తారని రవి చెబుతాడు. ఇంత తెలిసీ ఎందుకు ఇంకొకరి దగ్గర పని చేయడం, అన్నీ తెలిసి సైలెంట్ గా ఉండేవాళ్ల కంటే ఏమీ తెలియకుండా ధైర్యంగా పని చేస్తూ వెళ్లే వారినే విజయం వరిస్తుంది.. నేను రెస్టారెంట్ పెట్టి తీరతానని శృతి తేల్చి చెబుతుంది.
రోహిణి కొత్త ప్లాన్.. మహేష్ అంటూ నాటకమాడి..
అటు మనోజ్ ను దారికి తెచ్చుకోవడానికి రోహిణి కొత్త నాటకానికి తెర తీస్తుంది. మనోజ్ స్నానం చేస్తున్నాడని తెలుసుకొని.. ఫోన్ లో మహేష్ అనే వ్యక్తితో మాట్లాడుతున్నట్లు నాటకమాడుతుంది. నన్ను మిస్ అవుతున్నావా మహేష్.. కచ్చితంగా కలుద్దాం.. నీలాంటి వాళ్లతోనే మనసు విప్పి మాట్లాడాలని అనిపిస్తుంది అని రోహిణి అంటుంది. అదంతా బాత్రూమ్ లో నుంచి విన్న మనోజ్.. స్నానం మధ్యలోనే వదిలేసి టవల్ కట్టుకొని బయటకు పరుగెత్తుకు వస్తాడు.
ఎవరితో మాట్లాడుతున్నావని అడుగుతాడు. నా కాలేజ్ ఫ్రెండ్ మహేష్ తో.. నన్ను చాలా మిస్ అవుతున్నాడట.. కలుద్దామన్నాడని అంటుంది. నువ్వు, మహేష్ ఎంత క్లోజ్ అని అడుగుతాడు. కలిసే క్లాస్ కు వెళ్లే వాళ్లు.. లంచ్ చేసేవాళ్లం అంటూ రోహిని చెబుతుంటే మనోజ్ కుళ్లుకుంటాడు. మొత్తానికి రోహిణి వేసిన కొత్త ఉచ్చులో అతడు చిక్కుకున్నట్లే కనిపిస్తాడు.
కారులోనూ బాలు, మీనా వాగ్వాదం
మరుసటి రోజు ఉదయం బాలు, మీనా కారులో వెళ్తుంటారు. మీనా తననే చూస్తుంటే రోడ్డు వైపు చూడు.. నన్నెందుకు చూస్తున్నావంటూ బాలు అడుగుతాడు. మరోసారి సుమతి పెళ్లి విషయంలో వాగ్వాదం జరుగుతుంది. మీరు నాకు విలువ ఇవ్వడం లేదని, నా మాట వినడం లేదని బాలు అంటాడు. అలా అనేవాళ్లమే అయితే.. మా అల్లుడి నిర్ణయమే మా నిర్ణయం అని మా అమ్మ అరుణ్ వాళ్ల అమ్మతో ఎందుకు అంటుంది అని మీనా అడుగుతుంది. అప్పుడే బాలు కారుకి అరుణ్ బైకుపై అడ్డు పడతాడు.
నడిరోడ్డుపై బాలు, అరుణ్ గొడవ.. సుమతి జోక్యంతో తగ్గిన అరుణ్
ఇద్దరూ హారన్లు కొడుతుంటారు. ఎవరూ పక్కకు తప్పుకొని వెళ్లరు. వెనక్కి తగ్గేదే లేదని అంటారు. బాలు కారు దిగి అరుణ్ తో గొడవ పడతాడు. ఎందుకు ప్రతిదానికీ అడ్డొస్తున్నావ్.. నువ్వు అడ్డు తొలగితే అన్నీ సర్దుకుంటాయి అని అరుణ్ అంటాడు. నువ్వే తన దారికి అడ్డొస్తున్నావని బాలు అంటాడు. ఇద్దరూ పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారా లేక ఈ సందు గురించా అని మీనా సందేహిస్తుంది. అప్పుడే వెనుక ఆటోలో సుమతి వస్తుంది. ట్రాఫిక్ జామ్ కావడంతో వెళ్లి చూస్తుంది. బాలుతో అరుణ్ గొడవ పడటం చూసి షాకవుతుంది.
మెల్లగా వెళ్లి బాలు వెనుక నుంచి అరుణ్ కు సైగ చేస్తుంది. గొడవ పడొద్దని, ప్లీజ్ అని కంటి చూపుతోనే అరుణ్ కు రిక్వెస్ట్ చేస్తుంది. దీంతో అరుణ్ తగ్గి బైకు పక్కకు తీస్తాడు. తర్వాత బాలు కారు ముందుకు తీసి సుమతిని పిలిచి మాట్లాడతాడు. ఇక్కడేం చేస్తున్నావని అడిగితే.. ఆటోలో హాస్పిటల్ కు వెళ్తున్నానని అంటుంది. వాడికి దూరంగా ఉండు.. మాట్లాడకు.. వాడితో వెళ్లకు అని వార్నింగ్ ఇస్తాడు. లేదు నేను ఆటోలోనే వెళ్తానని సుమతి చెప్పి వెళ్లిపోతుంది.
బాలు ఇంటికి శివ
మరోవైపు అదే రోజు రాత్రి అక్క, బావ ఇంటికి శివ వస్తాడు. సుమతి తప్పు చేసిందని అంటాడు. కానీ పెళ్లికి ఒప్పుకోండి అన్నట్లుగా బావను అడుగుతాడు. అందరూ తననే నిందిస్తున్నారని, తాను చెప్పింది ఎందుకు వినడం లేదని, మీకు నచ్చింది చేసుకోండి అంటూ కోపంగా వెళ్లిపోతాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.