...
...
Next Story

Gunde Ninda Gudi Gantalu Today Episode: మొగుడి మాట లెక్క చేయని మీనా.. పెళ్లి చేస్తానని శపథం.. బాలుని రెచ్చగొట్టిన తల్లి

Gunde Ninda Gudi Gantalu Serial November 26th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ 26 ఎపిసోడ్ లో సుమతి పెళ్లి చేయాల్సిందే అని మీనా గట్టిగా డిసైడవుతుంది. మొగుడి మాట లెక్క చేయకుండా ముందుకెళ్తుంది. దీంతో కోడలి విషయంలో కొడుకును ప్రభావతి రెచ్చగొడుతుంది.

Published on: Nov 26, 2026, 07:06:44 IST
Advertisement

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో సుమతి పెళ్లి మీనా కాపురాన్ని కూల్చే పరిస్థితి తీసుకొచ్చేలా కనిపిస్తుంది. అయినా మీనా మాత్రం మొండిగా ముందుకే వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. హాస్పిటల్లో బాలు, అరుణ్.. బాలు, మీనా.. మీనా, పార్వతి మధ్య వాగ్వాదం జరుగుతుంది.

మీనాకు పార్వతి ఫోన్.. హాస్పిటల్‌కు మీనా, బాలు

గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ 26 ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ 26 ఎపిసోడ్

మనోజ్ గురించి బాలు, మీనా మాట్లాడుకునే సీన్ తో సీరియల్ గురువారం (నవంబర్ 26) ఎపిసోడ్ మొదలైంది. ఏదైనా అనకూడని మాట మీ అన్నయ్య అన్నాడా అని మీనా అడుగుతుంది. అవును.. కానీ అదేంటో నేను తర్వాత చెబుతాను అని బాలు అంటాడు. అప్పుడే మీనాకు పార్వతి ఫోన్ చేసి సుమతి కళ్లు తిరిగి పడిపోయిందని, హాస్పిటల్ కు తీసుకొచ్చామని ఏడుస్తూ చెబుతుంది. దీంతో బాలు, మీనా హాస్పిటల్ కు పరుగెత్తుతారు.

హాస్పిటల్లో మీనా, పార్వతితో బాలు గొడవ

అక్కడ సుమతిని చూసి అసలు ఏం జరిగిందని బాలు అడుగుతాడు. తిండీతిప్పలు లేవు.. మనసు మనసులో లేదు.. దీంతో సుమతికి ఈ పరిస్థితి వచ్చింది అని పార్వతి చెబుతుంది. ఆమె ఆ మాట చెబుతుంటే బాలుని చూస్తుంది మీనా. సుమతికి ఈ పరిస్థితి రావడానికి నేను కారణం కాదు.. నన్నలా చూడకు.. ఆరోగ్యం చెడిపోతే డాక్టర్లు ఉన్నారు.. కానీ జీవితమే చెడిపోతే ఎవరు బాగు చేస్తారు.. ఆ పరిస్థితి రాకుండా నేను చూస్తున్నాను అని బాలు అంటాడు.

అప్పుడే సుమతి గురించి అడుగుతూ హాస్పిటల్ కు వస్తాడు అరుణ్. అతన్ని చూడగానే బాలు రెచ్చిపోతాడు. అసలు వీడికి ఎవరు చెప్పారని శివను నిలదీస్తే.. తనకు తెలియదని అతడు అంటాడు. సుమతికి ఎలా ఉంది.. అసలు ఏం జరిగింది అని అరుణ్ ఆరా తీస్తాడు. మా ఇంటి అమ్మాయి గురించి అడగడానికి నువ్వెవడివిరా ముందుకు బయటకు పో అని బాలు అంటాడు.

నీ మూర్ఖత్వం వల్లే సుమతికి ఇలా జరిగింది.. ముందు నువ్వు బయటకు పో అని అరుణ్ ఎదురు తిరుగుతాడు. దీంతో అక్కడే అరుణ్ కాలర్ పట్టుకుంటాడు బాలు. అరుణ్ కూడా బాలు కాలర్ పట్టుకుంటాడు. అరుణ్ ను బాలు బయటకు గెంటేస్తాడు. నాపై కోపంతో సుమతిని ట్రాప్ చేసి ఆమె జీవితాన్ని నాశనం చేద్దామనుకుంటున్నావా అని అరుణ్ ను బాలు నిలదీస్తాడు. సుమతికి నీ వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అంటాడు. ఇద్దరూ మాటామాటా అనుకుంటారు. కొట్టుకోవడానికి వెళ్లడంతో మీనా, శివ వచ్చి విడదీస్తారు.

బాలును నిలదీసిన మీనా.. తప్పంతా మీదేనంటూ..

బాలుని మీనా దూరంగా తీసుకెళ్తుంది. చూశావా వాడు తప్పంతా నాదే అంటున్నాడు అని బాలు అంటే.. అవును తప్పంతా మీదే అని మీనా అంటుంది. దీంతో బాలు షాకవుతాడు. వాడు నాతో గొడవ పడుతున్నాడు అని బాలు అంటే.. అతడు గొడవ పడటం లేదు.. తను ప్రేమించిన అమ్మాయికి ఈ పరిస్థితికి కారణం మీరేనని తెలిసి మిమ్మల్ని మందలిస్తున్నాడు అని మీనా అంటుంది. మందలించడానికి వాడెవడు అని బాలు నిలదీస్తాడు. వాడిది నిజమైన ప్రేమ కాదని చెబితే అర్థం కాదా అని బాలు అంటాడు.

దీంతో మీనా మరింత రెచ్చిపోతుంది. అతనిది నిజమైన ప్రేమ కాదని ఎలా అంటారు.. అతని మనసులోకి దూరి చూశారా.. అయినా అతనిది నిజమైన ప్రేమ కాకపోతే అతని మాయ మాటలు నమ్మి మోసపోయేంత అమాయకురాలు కాదు నా చెల్లెలు అని వాదిస్తుంది. దీంతో బాలు ఇక చేసేది లేక.. తాను వెళ్తున్నానని, నిన్ను కట్టుకున్నాను కాబట్టి.. రోడ్డుపై వదిలేయలేక తీసుకెళ్తానని, తాను బయట వెయిట్ చేస్తానని వెళ్లిపోతాడు.

కూతురి సంసారం పాడవుతోందంటూ అరుణ్‌ను వెళ్లిపొమ్మన్న పార్వతి

ఆ తర్వాత సుమతి దగ్గరికి వెళ్తాడు అరుణ్. తాను నిజంగానే సుమతిని ప్రేమిస్తున్నానని, అర్థం చేసుకోండని మీనా, పార్వతిలతో అంటాడు. ఇక చాలు బాబు.. అది కుదరదు.. నీ వల్ల మా పెద్ద కూతురు సంసారంలో ఇప్పటికే కలతలు వచ్చాయి.. ఇంకా ఇది ఇలాగే కొనసాగితే కాపురమే కూలిపోయే పరిస్థితి కనిపిస్తోంది.. సుమతిని మరచిపో అని పార్వతి తేల్చి చెబుతుంది. ప్రస్తుతానికి మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి.. తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం అని మీనా కూడా చెప్పి అరుణ్ ను పంపిస్తుంది.

మనసులో బాధ పోగొట్టాలన్న డాక్టర్..

తర్వాత సుమతి గురించి మాట్లాడటానికి డాక్టర్ పిలుస్తుంది. మీనా, పార్వతి వెళ్తారు. ప్రమాదం ఏమీ లేదు కదా డాక్టర్ అని అడుగుతారు. ప్రస్తుతానికి లేదు.. కానీ భవిష్యత్తులో లేదని చెప్పలేం.. ఆమె శరీరంలో సమస్య ఏమీ లేదు.. కానీ మనసులో ఏదో బాధ ఉంది.. అది పోగొట్టాలి.. అది మీ వ్యక్తిగత విషయం అయితే చెప్పొద్దు అని డాక్టర్ అంటుంది. ఇష్టపడిన అబ్బాయితో పెళ్లి చేయడం లేదు.. అదే సమస్య అని మీనా చెబుతుంది. ఆ సమస్యను వెంటనే తీర్చండి.. లేకపోతే ఆమెకు బీపీ పెరిగి భవిష్యత్తులో గుండె సంబంధిత సమస్యలు వస్తాయి అని డాక్టర్ వార్నింగ్ ఇస్తుంది. దీంతో పార్వతి కంగారు పడుతుంది.

మీనా, పార్వతి వాదన.. పెళ్లి చేస్తానన్న మీనా

బయటకు వచ్చిన తర్వాత మీనా, పార్వతి వాదించుకుంటారు. ఎందుకు ఏడుస్తున్నావ్.. సుమతికి ఈ పరిస్థితి తీసుకొచ్చిన మనకు ఏడ్చే అర్హత కూడా లేదు అని మీనా అంటుంది. తాను ఏం చేయగలనని, ఓ కూతురి కోసం మరో కూతురి కాపురాన్ని కూల్చలేను కదా.. ఇద్దరూ రెండు కళ్లు అని పార్వతి వాపోతుంది. కాపురం కూల్చుకునే పని నేనేమీ చేయడం లేదు.. అయినా సుమతి పెళ్లి నేను చేసి తీరతాను.. మా ఆయనను ఒప్పిస్తాను.. కానీ అరుణ్ గురించి నీ అభిప్రాయం ఏంటి అని పార్వతిని అడుగుతుంది.

మంచివాడు.. బాగా చదువుకున్నాడు.. మంచి ఉద్యోగం, సొంత ఇల్లు.. మనమే అతనికి సరిపోతామా అనిపిస్తుంది.. పైగా వాళ్ల అమ్మ సుమతిని నాకంటే బాగా చూసుకుంటుంది అని పార్వతి అంటుంది. అది చాలు.. సుమతి పెళ్లి చేసే బాధ్యత నాది.. దానికి చెప్పు.. ఆ బాధ పోగొట్టు అని చెప్పి మీనా వెళ్లిపోతుంది.

మనోజ్‌కు బాలు మూతి చిక్కం.. రోహిణిని తిట్టిన ప్రభావతి

ఇటు ఇంట్లో మనోజ్ కోసం బాలు పశువుల మూతికి కట్టే మూతి చిక్కం తెస్తాడు. అది చూసి రోహిణి షాకవుతుంది. అతనికి జ్యూస్, జావా ఇస్తూ సేవలు చేస్తూ ఉంటుంది. అప్పుడే వచ్చిన ప్రభావతి మళ్లీ ఆమెను కసురుకుంటుంది. మనోజ్ కు దూరంగా జరగమంటుంది. తర్వాత షాప్ కి వెళ్లే విషయం మాట్లాడుకుంటారు.

మనోజ్ మాట్లాడలేడు కదా.. తనను రమ్మంటున్నాడు అని రోహిణి అంటుంది. అదే అంటున్నావా అని మనోజ్ ను ప్రభావతి అడిగితే అవునన్నట్లు తలాడిస్తాడు. నువ్వు అవసరం లేదు.. రోహిణి ఒక్కతే షాప్ కి వెళ్తుందని ప్రభావతి ట్విస్ట్ ఇస్తుంది.

బాలుని రెచ్చగొట్టిన ప్రభావతి

ఇంటికి వచ్చిన తర్వాత కూడా బాలు, మీనా మధ్య వాగ్వాదం జరుగుతుంది. దీంతో సత్యం జోక్యం చేసుకొని ఎందుకు కోడలిని తిడుతున్నావని కొడుకును మందలిస్తాడు. ఈ మధ్య నీ పెళ్లాం నీ మాట వినడం లేదు.. పూచిక పుల్లలా తీసి పారేస్తోంది అని బాలుని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది ప్రభావతి. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 

ABOUT THE AUTHOR

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks