Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో సత్యం దగ్గరికి వెళ్లిన ప్రభావతి నా మీద కోపంగా ఉందా అని అడుగుతుంది. విచిత్రంగా లేదు. నువ్వు కూడా మాలాగే మోసపోయావు. కొడుకు కోసం రెండున్నర లక్షలకు సంతకం పెట్టడం తప్పు కాదు. కానీ, అందరికి సంబంధించిన ఆస్తిని వాడు అలా చేయడం మాత్రం తప్పు అని సత్యం అంటాడు.
ప్రభావతి ఆత్మవంచన

అందరిముందు ఒప్పుకోలేదు కానీ వాడు అలా కావడానికి మాత్రం నేనేనండి కారణం. వాడిని అతిప్రేమతో గారాబంగా పెంచి తప్పు చేశానండి. అందుకే వాడు ఇంత జరిగిన చాలా తేలిగ్గా చేతులెత్తేశాడు. మీ దగ్గర నా తప్పు ఒప్పుకోకపోతే ఆత్మవంచనే అవుతుందండి అని ప్రభావతి మనోజ్ విషయంలో పశ్చాత్తాపపడుతుంది. వారి మాటలు బాలు వింటుంటాడు.
ఎలాగో అప్పు కట్టి ఇల్లు సొంతం చేసుకోవాలని ప్రభావతి అంటే.. ఎలా.. 50 లక్షలు, కోర్టు ఇచ్చిన గడువు 6 నెలలు. ఇంత తక్కువ టైమ్‌లో అంత డబ్బు ఎలా సంపాదిస్తాం. నా సర్వీస్ అంతా ధారపోస్తేనే 40 లక్షలు వచ్చాయని సత్యం అంటాడు. ముగ్గురు కొడుకులు మూడు స్తంభాల్లా ఉన్నారని ప్రభావతి అంటుంది.
అవి వదిలేస్తే కూలిపోతాయి. అంతా చేసిన పెద్దోడు ఏం పట్టనట్లు ఉన్నాడు, బాలుకు తలకుమించిన భారం పెట్టలేను. చిన్నోడు ఇంకా సరిగ్గా సెటిల్ కాలేదు. ఇవాళ ఉన్నట్లు రేపు ఉండదు. కోర్టు ఇచ్చిన టైమ్ అయిపోతూ ఉంటుంది. ఇకనైనా కొడుకు మీద మమకారంతో మోసపోకు. మిగతా వారికి సమస్య తీసుకురాకు అని సత్యం చెబుతాడు. సత్యం భుజాలపై తలవాల్చి ఏడుస్తుంది ప్రభావతి.
మనోజ్‌ను ఆడుకున్న బాలు, రవి
ఆ మాటలు వింటాడు బాలు. పైన డాబాపై ముగ్గురు కొడుకులు, కోడళ్లు సమావేశమవుతారు. అందరం కలిసి ఒక్కటై ఇంటిని కాపాడుకోవాలని అనుకుంటారు. ఏదోటి చేసి ఇల్లును కాపాడండ్రా అని మనోజ్ అంటే.. బాలు గిచ్చుతాడు. అంతా చేసి ఆర్డర్లు వేస్తావేంట్రా అని తిడతాడు బాలు. మనోజ్ బీ సీరియస్. నువ్వు ఎంత పెద్ద ఫ్రాడ్ చేసిన పక్కనే పెట్టుకునే మాట్లాడుతున్నారని రోహిణి అంటుంది.
{{/usCountry}}ఆ మాటలు వింటాడు బాలు. పైన డాబాపై ముగ్గురు కొడుకులు, కోడళ్లు సమావేశమవుతారు. అందరం కలిసి ఒక్కటై ఇంటిని కాపాడుకోవాలని అనుకుంటారు. ఏదోటి చేసి ఇల్లును కాపాడండ్రా అని మనోజ్ అంటే.. బాలు గిచ్చుతాడు. అంతా చేసి ఆర్డర్లు వేస్తావేంట్రా అని తిడతాడు బాలు. మనోజ్ బీ సీరియస్. నువ్వు ఎంత పెద్ద ఫ్రాడ్ చేసిన పక్కనే పెట్టుకునే మాట్లాడుతున్నారని రోహిణి అంటుంది.
{{/usCountry}}నువ్వేమైనా తక్కువ నువ్వు కూడా ఫ్రాడ్వేగా అని మనోజ్ అంటాడు. శ్రుతి నవ్వుతుంది. మీనా ఓ బుక్ తీసుకురా ఈ ఇద్దరిలో ఎవరెక్కువ ఫ్రాడ్స్ చేశారో లిస్ట్ రాద్దామని బాలు అంటాడు. పరమసుంట, అడ్డగాడిద, వెధవన్నర వెధవ అని తిట్టలేనంటూనే మనోజ్‌ను తిడుతుంది శ్రుతి. నేను కూడా మోసపోయానని మనోజ్ అంటే రవి కూడా గిచ్చుతాడు.
అమ్మనాన్నలకు కనీసం ఇల్లయిన తిరిగి ఇవ్వాలి. అప్పుడైనా కొడుకులుగా సాటిస్ఫ్యాక్షన్ ఉంటుందని రవి అంటాడు. సీరియస్‌గా మాట్లాడుతుంటే బీర్లు తెప్పించండ్రా తాగుతూ మాట్లాడదాం అంటాడు మనోజ్. దాంతో రవి, బాలు కొడతారు. మీ దోస్త్ కచ్చి అని వెళ్లిపోతాడు మనోజ్. మరుసటి రోజు ఉదయం షాప్ సేల్స్ మెన్ పెళ్లి ఉంది వెళ్తానంటాడు మనోజ్.
మీనాకు విముక్తి
తాళి కట్టే టైమ్‌కి వెళ్లి మళ్లీ తిరిగి షో రూమ్‌కి వెళ్లిపో అని ప్రభావతి చెబుతుంది. భోజనాలు మంచి క్యాటరింగ్‌కి ఇచ్చారంటా అది కూడా చూసుకుని వెళ్తానంటాడు మనోజ్. బాలు పంచ్‌లు వేస్తాడు. పెళ్లికి నేను రోహిణితోపాటు వెళ్తానని మనోజ్ అంటాడు. దాంతో ప్రభావతి కోపంగా చూస్తుంది. రోహిణి వెళ్లడానికి చచ్చినా ఒప్పుకోనంటుంది ప్రభావతి.
షోరూమ్‌కి అసలైన ఓనర్ నాన్న కాబట్టి, అమ్మా నాన్న ఇద్దరు వెళ్తారని బాలు అంటాడు. నిజమే. మావయ్య, అత్తయ్య ఇద్దరు వెళ్లడమే కరెక్ట్ అని రోహిణి అంటుంది. పార్లరమ్మా ఏంటీ ఇలా ప్లేట్ పిరాయించేందేంటీ అని బాలు అంటాడు. మనోజ్ బతిమిలాడుకుంటాడు. ప్రభావతి వినదు. వెళ్లే ఒక్కడివే వెళ్లు లేకుంటే మానేయ్. ఇక్కడ పంచాయతీ పెట్టకని ప్రభావతి అంటుంది.
నిన్ను జన్మకు క్షమించను. వెల్లి గోరువెచ్చని నీళ్లు తీసుకురా అని రోహిణికి పని చెప్పి వెళ్లిపోతుంది ప్రభావతి. ఇన్నాళ్లకు నీకు విముక్తి కలిగింది, శ్రమ తగ్గిందని బాలు అంటాడు. వంట చేయడం నా బాధ్యత అని మీనా అంటుంది. రోహిణి పాపమండి అని మీనా అంటే.. పాపాల మీద పాపాలు చేసేవారిని పాపం అనడం మహాపాపం. నా బ్రేక్ వైర్ కట్ అవడానికి మేడమ్ గారికి ఏదో లింక్ ఉందని నా డౌట్ అని బాలు అంటాడు.
రోహిణికి గుణ దెబ్బ
మరోవైపు దెబ్బలతో మూలుగుతుంటాడు గుణ. వాళ్ల అమ్మ, భార్య కొట్టారంటే అర్థముంది రోహిణి కొట్టడమేంటన్న. తనకు ఎంత చేశావ్ అని రౌడీ అంటాడు. నేను కూడా దాన్ని కొడతాను. మ్యాన్ హ్యాండ్లింగ్ కాదు. నేనే కొట్టే దెబ్బ గట్టిగా తగలాలి అని గుణ అంటాడు. పాకెట్ నుంచి చోర్ మార్కెట్ నుంచి వచ్చిన చైన్ తీసి దీని ఒరిజినల్ ఓనర్ అని చెప్పి దానికి అంటగట్టి లక్ష వసూలు చేస్తాను గుణ అంటాడు.
నన్ను కొట్టినందుకు ఆమాత్రం పెనాల్టీ వేయాలిగా అని గుణ అంటాడు. ఇంతలో రోహిణి వస్తుంది. నేను నిన్ను కావాలని కొట్టలేదు. బ్రేక్ వైర్ విషయంలో నా గురించి ఎక్కడ బయటపడుతుందో, నువ్వు ఎక్కడ నిజం చెబుతావో అని కొట్టానని రోహిణి అంటుంది. అసలు కారు బ్రేక్స్ ఎందుకు తీశావ్. ఇలా చేస్తావని తెలిస్తే కారు కీస్ ఇచ్చేదాన్ని కాదని రోహిణి అంటుంది.
బాలు ట్రిప్‌కి వెళ్లకుండా చేయమంది నువ్వేగా అని గుణ అంటాడు. అలా అని ప్రాణాలు పోయేలా చేస్తావా. మాకు మాకు ఏమైనా ఉండొచ్చు కానీ మేమంతా ఒకటే కుటుంబం. ఒకరినొకరు చంపుకునేంతగా కాదని, ఎందుకు రమ్మన్నావో చెప్పమని అంటుంది రోహిణి. నీకు ఫేవర్ చేయడానికే పిలిపించాను చోర్ బజార్ గోల్డ్ చైన్ ముందు పెడతాడు గుణ.
రోహిణికి ప్రభావతి రివర్స్
ఇది 22 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ చైన్. ఇది తాకట్టులో ఉన్న బంగారం. వాడు డబ్బు కట్టలేక వదిలేశాడు. ఇది వేలానికి వచ్చింది. వేలంలో సగం ధరకే వస్తుంది. నువ్వు అసలే కష్టాల్లో ఉన్నావు. నీకు ఉపయోగపడుతుంది. దీని మార్కెట్ వాల్యూ రెండు, మూడు లక్షలు ఉంది. నువ్వు అంత ఇవ్వలేవు కాబట్టి లక్ష రూపాయలు ఇస్తే సరిపోతుందని గుణ అంటాడు.
ఆ నకిలి గోల్డ్ చైన్‌ను లక్షకు తీసుకుని వెళ్తుంది రోహిణి. ఆ నగను ప్రభావతికి గిఫ్టుగా ఇస్తుంది రోహిణి. కానీ, ఈ బంగారంతో నన్ను కొనలేవని రోహిణికి రివర్స్ అవుతుంది ప్రభావతి. డబ్బుకోసం హుండీ పెడతాడు బాలు. ఆ హుండీలో ఆ గోల్డ్ చైన్ వేయమంటాడు బాలు. ప్రభావతి ఆలోచిస్తుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.