...
...
Next Story

Gunde Ninda Gudi Gantalu Today Episode: బాలుకి ప్రాణగండం.. కింద పడిన మీనా పసుపుకుంకుమ.. గుణ ప్లాన్ రోహిణి సాయం

Gunde Ninda Gudi Gantalu Serial October 14th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 14 ఎపిసోడ్ లో బాలుని చంపేందుకు గుణ ప్లాన్ చేస్తాడు. దానికి రోహిణి సాయం చేస్తుంది. అటు బాలుకి ప్రాణగండం ఉందని తెలిసి గుడిలో మీనా పూజలు చేయబోతే పసుపు కుంకుమ కింద పడతాయి.

Published on: Oct 14, 2026, 06:59:59 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో తన ఫ్రెండ్ కోసం బాలు పేరు చెప్పి మీనా మరోసారి గుణతో ఫైట్ చేస్తుంది. దీంతో బాలు అడ్డు తొలగించుకోవాలని గుణ ప్లాన్ చేస్తాడు. మరోసారి దినేష్ ను రంగంలోకి దింపుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

దరిద్రపు సంత అంటూ రోహిణిని మళ్లీ నిందించిన ప్రభావతి

గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 14 ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 14 ఎపిసోడ్

బాలు, మీనా వల్ల తనకు ఎప్పుడూ నష్టమే అంటూ మనోజ్ ఆవేశంతో రగిలిపోయే సీన్ తో సీరియల్ బుధవారం (అక్టోబర్ 14) ఎపిసోడ్ మొదలైంది. తాను చదువులో తప్ప అన్నింట్లోనూ ఫెయిలవుతున్నానని బాధపడతాడు. తనకు ఎందులోనూ కలిసి రావడం లేదని రోహిణిని చూస్తూ అంటాడు. నన్ను చూస్తూ ఆ మాట ఎందుకన్నావ్.. నేనేం చేశాను అని మనోజ్ ను నిలదీస్తుంది రోహిణి.

అక్కడే ఉన్న ప్రభావతి వెంటనే గదిలోకి వస్తుంది. ఎందుకు చూడకూడదే.. నీవల్లే వాడికి ఈ కష్టాలు.. వాడు ఎప్పుడు బాగు పడతాడో ఏంటో ఏంటో.. నువ్వేమైనా కోట్లు తీసుకొచ్చావా అని అంటుంది. కోట్లు తీసుకొస్తేనే బాగా చూసుకుంటారా అని రోహిణి ఎదురు మాట్లాడటంతో ప్రభావతి మరింత రెచ్చిపోతుంది. నువ్వో దరిద్రపుగొట్టుదానివి.. దరిద్రపు సంత.. నువ్వు లేకపోతే వాడికి ఓ కోటీశ్వరురాలు దొరికేది అని దారుణంగా తిట్టి వెళ్లిపోతుంది. మనోజ్ కూడా ప్రభావతి మాటలను సమర్థించడంతో రోహిణి బాధపడుతుంది. ఇంట్లో అందరూ తననే టార్గెట్ చేస్తున్నారని అంటుంది.

ఫీలైన మీనా.. సర్దిచెప్పిన బాలు

ఇటు మీనా రాత్రి పడుకోకుండా మనోజ్, రోహిణి అన్న మాటలను గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. బాలు చూసి ఏమైందని అంటాడు. మంచి చేయబోయినా చెడు జరుగుతోంది.. వాళ్లకు మంచి చేయాలనుకున్న ప్రతిసారీ వాళ్లు మనల్ని ఏదో ఒకటి అంటూనే ఉన్నారు అని మీనా బాధపడుతుంది. వాళ్లు అలా ఉంటేనే కరెక్ట్.. మనల్ని అర్థం చేసుకుంటే వాళ్లెందుకు అవుతారు.. వాళ్లు మారరు.. ఆ రోహిణి కాపురం కూలిపోతుంటే చక్కదిద్దాం.. అయినా కనీస కృతజ్ఙత లేదు అని బాలు అంటాడు. దాని గురించి ఎక్కువగా ఆలోచించొద్దని చెబుతాడు. రేపు ఉదయమే పూలు తీసుకురావడానికి వెళ్లాలని మీనా అంటే.. తానూ వస్తానని బాలు చెబుతాడు.

రోహిణికి చింటు వీడియో కాల్.. సుగుణను చూసి ఆపిన బాలు, మీనా

అతన్ని కలవడానికి వెళ్తుండగా బాలుకి ఫోన్ వస్తుంది. ఇంతలో అమ్మమ్మ ఎక్కడ అని చింటూని రోహిణి అడుగుతుంది. ఆటో బయట బాలు, మీనాతో సుగుణ మాట్లాడటం చూపిస్తాడు. అది చూసి రోహిణి షాక్ తింటుంది. వెంటనే ఫోన్ పెట్టేసి స్విచ్ఛాఫ్ చేయమంటుంది. చింటూ అలాగే చేస్తాడు. చింటూ దగ్గరికి వెళ్లి అతని వేషం చూసి మురిసిపోతారు. మీ అమ్మను చూపించమని అడిగితే కాల్ కట్ అయింది.. ఫోన్ స్విచ్ఛాఫ్ అయిందని చింటూ చెబుతాడు. దీంతో రేపు మీ స్కూలుకు వచ్చి మీ అమ్మతో వీడియో కాల్ మాట్లాడతామని చెప్పడంతో సుగుణ టెన్షన్ పడుతుంది. ఆటో బాగవడంతో వాళ్లు వెళ్లిపోతారు.

సుగుణపై మీనాలో అనుమానం

అయితే సుగుణ తీరుపై మీనాలో అనుమానం మొదలవుతుంది. చింటూ వాళ్ల అమ్మ గురించి ఎప్పుడు అడిగినా సుగుణమ్మ కావాలనే ఆమెతో మాట్లాడకుండా చేస్తుందేమో అని మీనా సందేహపడుతుంది. చింటూని దత్తత తీసుకుంటామని చెప్పినప్పటి నుంచి ఆమె ఇలా చేస్తోందని అంటుంది.

బాలు మాత్రం అలాంటిదేమీ ఉండదులే.. అయినా రేపు స్కూలుకి వెళ్లి ఆమెతో వీడియో కాల్ మాట్లాడదామని అంటాడు. అప్పుడే బాలుకి ఓ ట్రిప్ వస్తుంది. దీంతో మీనాను మధ్యలోనే దింపుతాడు. తాను తన ఫ్రెండ్ రాజేశ్వరి దగ్గరికి వెళ్లి పూలు తీసుకెళ్తానులే అని మీనా చెబుతుంది.

రాజేశ్వరి దగ్గర గుణ.. మీనా వార్నింగ్

అప్పుడే అటు రాజేశ్వరితో గుణ గొడవ పడుతుంటాడు. నువ్వు డబ్బులు తీసుకున్నప్పుడు వడ్డీ 5 రూపాయలని, కానీ ఇప్పుడు 10 చేశానని, అది ఇవ్వాల్సిందేనని పట్టుబడతాడు గుణ. అప్పుడే మీనా వచ్చి ఇవ్వకపోతే ఏం చేస్తావని అంటుంది. మా ఆయన నీ వెంట పడి మరీ కొట్టినా, పోలీసులకు పట్టించినా నీకు బుద్ధి రాలేదా.. మరీ 10 వడ్డీ ఎలా వసూలు చేస్తావంటూ నిలదీస్తుంది. నీకు అనవసరం అని గుణ అంటే.. ఇప్పుడే మా ఆయన నన్ను దించి వెళ్లాడు.. ఒక్క ఫోన్ చేస్తే వచ్చి నిన్ను ఉరికించి మరీ కొడతాడని చెప్పడంతో గుణ వెళ్లిపోతాడు.

బాలుని చంపేందుకు గుణ ప్లాన్.. రోహిణికి ఫోన్

అయితే పక్కకు వెళ్లిన తర్వాత ఈ బాలు గాడి వల్ల ఎప్పుడూ సమస్య వస్తోంది.. అతన్ని ఈ భూమి మీది నుంచే లేకుండా చేయాలని తన అసిస్టెంట్ తో అంటాడు. బాలుని చంపడానికి ప్లాన్ చేస్తాడు. వెంటనే రోహిణికి ఫోన్ చేసి తనకు బాలు కారు కీస్ కావాలని అడుగుతాడు. కానీ రోహిణి మాత్రం తనకు ఇప్పటికే చాలా సమస్యలు ఉన్నాయని, తాను చేయనని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక లాభం లేదని మళ్లీ దినేష్ ను రంగంలోకి దింపుతాడు గుణ.

రోహిణికి దినేష్ ఫోన్.. మళ్లీ బ్లాక్‌మెయిల్

దినేష్ ద్వారా రోహిణికి ఫోన్ చేయిస్తాడు. అతడు మళ్లీ రావడంతో రోహిణి భయంతో వణికిపోతుంది. మళ్లీ ఎందుకు ఫోన్ చేశావని అంటుంది. తనకు డబ్బు కావాలని దినేష్ అంటాడు. లేదంటే నీ సీక్రెట్లన్నీ ఇంట్లో వాళ్లకు చెబుతానని బ్లాక్‌మెయిల్ చేస్తాడు. తనను వదిలెయ్ అని బతిమాలినా వినడు. కచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. నేనే అంటే నువ్వు నాకంటే దేశముదురువు కదా అని దినేష్ తో అంటాటు గుణ.

బాలుకి ప్రాణగండం.. పడిపోయిన పసుపు కుంకుమ

దీంతో రోహిణి వెంటనే గుణకు ఫోన్ చేస్తుంది. ఆ దినేష్ గాడి పీడ విరగడయ్యేలా చూడు అని వేడుకుంటుంది. బాలు కారు కీస్ ఇస్తే చేస్తానని గుణ అంటాడు. రోహిణి చేసేది లేక సరే అంటుంది.

అటు గుడికి వెళ్లిన మీనాతో బాలుకి గండం ఉందని పంతులు చెబుతాడు. పసుపుకుంకుమ అమ్మవారి దగ్గర పెడతాను ఇవ్వమని అంటాడు. అది ఇవ్వబోతుండగా కింద పడిపోతుంది. దీంతో మీనా మరింత కంగారు పడుతుంది. పంతులు ఓ తాయత్తు ఇస్తాడు. ఇది ఉండగా బాలుకి ఏ ఆపదా రాదని చెబుతాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks