Gunde Ninda Gudi Gantalu Today Episode: చింతామణిని తరిమేసిన ప్రభావతి- శివ కంపెనీ- చింటూ రోహిణి వీడియో కాల్‌లో బాలు మీనా
Gunde Ninda Gudi Gantalu Serial October 12th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 12వ తేది ఎపిసోడ్‌లో చింతామణి వస్తే తనకు డ్యాన్స్ నేర్పను అని, మీనా విషయంలో చేసింది తప్పని తరిమేస్తుంది ప్రభావతి. ఇకపై తానే కంపెని పెట్టి ఉద్యోగాలు ఇస్తానని మాజీ మంత్రి మల్లారెడ్డిని ఉదాహరణగా చెబుతాడు శివ.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ప్రభావతిని గదిలోనుంచి బయటకు పొమ్మనడంపై మనోజ్‌ను సత్యం నిలదీస్తాడు. నేను నార్మల్‌గా అన్నాను అని మనోజ్ అంటాడు. నాపై గట్టిగా అరవలేదా అని ప్రభావతి అడుగుతుంది.

మోకాళ్లపై కూర్చున్న మనోజ్
ఏదో టెన్షన్‌లో అన్నానని, గట్టిగా అరవడం అంతగా అబ్జర్వ్ చేయలేదని మనోజ్ అంటాడు. అయితే, శిక్ష పడాల్సిందే అని మనోజ్‌ను మోకాళ్లపై కూర్చోబెడతాడు బాలు. చిన్నప్పటి పగ తీరిందని బాలు అంటాడు. రేయ్ అమ్మకోసం ఈ మాత్రం చేయలేనా. ఇదేకాదు ఏదైనా చేస్తాను అని మనోజ్ అంటాడు. హమ్మయ్య తాయిత్తు పనిచేస్తుంది అని ప్రభావతి అనుకుంటుంది.
రేయ్ లేవురా అని సత్యం అంటే.. అమ్మ చెప్పేవరకు లేవనని మనోజ్ అంటాడు. సరే మాటలు అని ఇప్పుడు మోకాళ్లపై కూర్చుంటే ఏమొస్తుంది అని ప్రభావతి అంటుంది. దాంతో నాపై కోపం పోయినట్లేగా అని మనోజ్ అడిగితే.. ఏడ్చావ్‌లే అని క్షమించేసినట్లుగా అంటుంది ప్రభావతి. మొదటిసారి తల్లిని ఎదురించాడు. నా తాయిత్తు పనిచేస్తున్నట్లే అని రోహిణి అనుకుంటుంది.
నాకోసం మోకాళ్లపై కూర్చున్నాడు. తాయిత్తు పనిచేస్తున్నట్లే అని ప్రభావతి అనుకుంటుంది. కామాక్షి దగ్గరికి వెళ్తుంది ప్రభావతి. ఆకలిగా ఉంది ఏమైనా తీసుకురా అని ప్రభావతి అడిగితే.. జీడిపప్పు ఉప్మా తీసుకొస్తుంది కామాక్షి. ఉప్మా తింటుంది. మనోజ్ గురించి మాట్లాడుకుంటారు. బాలుగాడు ఒక్కటి పీకేసరికి సెట్ అయ్యాడంటుంది ప్రభావతి.
మీనాకోసం మాట్లాడిన ప్రభావతి
ఇంతలో చింతామణి వస్తుంది. ప్రభావతి కోపంగా ఉంటుంది. మొహంలోనే నవరసాలు చూపించగలవు వదినా అని రౌద్రం, అసహ్యం అన్ని చూపిస్తుందని కామాక్షి అంటుంది. బాలు ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌గా వచ్చాడని, తప్పని చింతామణి అంటుంది. ఇంకా నయం నాలుగు పీకలేదు. వాడికి కంపరం వస్తే ఉతుకుతాడు. వాడు మనోజ్ గాడిలా వెర్రోడు కాదు తెలివైనోడు అని కామాక్షి అంటుంది.
ఇప్పుడు డబ్బులు పోయాయి, ఆర్డర్ పోయిందని చింతామణి అంటుంది. మీనాపై ఈగ వాలితేనే చేత్తో కొట్టాలా, కాలుతో తన్నాలా అని బాలు ఆలోచిస్తాడని ప్రభావతి అంటే.. ఎవరిని అని కంగారుగా అడుగుతుంది చింతామణి. ఆ ఈగని. అలాంటిది దాని దగ్గరి నుంచి డబ్బులు కొట్టేసి గాయం చేస్తే ఊరుకుంటాడా. వాళ్ల డబ్బులు వాళ్లు తీసుకెళ్లారు. అందులో తప్పులేదని ప్రభావతి అంటుంది.
మీకు ఇష్టం లేని మీనా, బాలుని సపోర్ట్ చేస్తున్నారేంటని చింతామణి అంటుంది. నువ్వు మీనా విషయంలో చేసిన పనికి నాకు మండిపోతుందని ప్రభావతి అంటే.. వదినేంటీ మీనా గురించి ఇంత బాధపడుతుందని కామాక్షి మనసులో అనుకుంటుంది. ఆర్డర్ రావొద్దని మీనాను చావుదెబ్బ కొడతావా. ఇకనుంచి ఇక్కడికి రాకు. చింతామణికి మాత్రం డ్యాన్స్ నేర్పను అని ప్రభావతి అంటుంది.
చింతామణిని తరిమేసిన ప్రభావతి
గజపూజ పూర్తి చేసి అరంగేట్రం చేద్దామనుకుంటున్నాను అని చింతామణి అంటుంది. అవి ఇంకా ఏం జరగవు. ఆ అర్హత కోల్పోయింది. నీతో సావాసం చేయొద్దని మా ఆయన గట్టిగా చెప్పారు అని ప్రభావతి అంటుంది. నేను స్టేజ్ మీద నాట్యం చేద్దామనుకుంటున్నాను. నా చిన్నప్పటి ఆశ. దానిమీద నీళ్లు చల్లకండని చింతామణి అంటుంది.
నేను నిర్ణయం తీసుకున్నాను.ఇక నిన్ను క్షమించలేను. నా కోడలి విషయంలో తప్పు చేశావ్. నిన్ను చూడటం కూడా నాకు ఇష్టం లేదు. వెళ్లిపో ఇక్కడి నుంచి అని ప్రభావతి అంటుంది. దాంతో చింతామణి వెళ్లిపోతుంది. మీనాపై ఇంత అభిమానం చూపించడం. మీనాకోసం చింతామణిని తరిమేయడం నిజమా అని స్పృహ తప్పి కోల్పోతుంది కామాక్షి.
నీళ్లు చల్లి లేపుతుంది. మీనాకు ఏమైనా అయితే ఇంటి పనులు ఎవరు చేస్తారు. అంతేకాకుండా చింతామణితో చేతులు కలిపి నాశనం చేద్దామనుకున్న ప్రతిసారి అవకాశాలు అందిపుచ్చుకుని మరింత ఎదుగుతోంది. దాని ఎదుగుదలను చూడలేకపోతున్నాను అని ప్రభావతి మనసులో ఉన్న అసలు విషయం బయటపెడుతుంది.
కంపెనీ పెడతానన్న శివ
గుడికి శివ వెళ్తాడు. రాత్రిపూట డెలివరీలు ఎక్కువగా ఉన్నాయని చెబుతాడు. రాత్రిపూట వద్దని, అంతా తాగి జూలాయిగా తిరుగుతుంటారని, వద్దని పార్వతి అంటుంది. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేదాకానేగా అని నచ్చజెప్పుతాడు శివ. మీనా వస్తుంది. సుమతి ఇచ్చిన డబ్బులు తిరిగి ఇస్తుంది మీనా. శివను రిజల్ట్స్ గురించి అడిగితే వచ్చే నెలలో అని శివ అంటాడు.
రేయ్ శివ నువ్వు ఇంకా చదువుకుంటానంటే చెప్పురా. మీ బావ చదివిస్తానన్నాడు అని మీనా అంటుంది. నాకు ఇంకా చదవాలని లేదు. చదివిన చదువుకు తగ్గ జాబ్స్ దొరుకుతాయో లేదో. బయటపరిస్థితి బాగోలేదు. నేనే మంచి కంపెనీ పెట్టి కొంతమందికి ఉద్యోగాలు ఇద్దామనుకుంటున్నాను అని శివ అంటాడు. మీనా, సుమతి మెచ్చుకుంటారు.
మనకెందుకని పార్వతి అంటే.. ఓ పెద్దాయన పూలమ్మీ, పాలమ్మీ పెద్ద పొలిటిషియన్ అయ్యాడని ఇన్‌డైరెక్ట్‌గా మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డిని ఉదాహరణగా చెబుతాడు శివ. వెళ్లిపోతాడు శివ. పూలు ఇచ్చేందుకు పార్వతి వెళ్తుంది. అరుణ్‌కు డబ్బులిచ్చేటప్పుడు నేను కూడా వస్తానని మీనా అంటుంది. ఇలా సడెన్‌గా కాదు. అతనికి ఓ మాట చెప్పి కలిపిస్తానని సుమతి అంటుంది.
మీరు డబ్బు మనిషి కాదు
నీ పెళ్లికి ఆయన అండగా ఉంటారు. నీకు మా ఫుల్ సపోర్ట్ ఉంటుందని మీనా అంటుంది. నాకు తెలుసు. నేను చెప్పినట్లుగా బావ బంగారం అంటుంది సుమతి. మరోవైపు మురళి, విద్య విల్లా కొనేందుకు బయలుదేరుతారు. ఇంతలో రోహిణి వస్తుంది. రోహిణిని పరిచయం చేస్తుంది విద్య. మీనా ఎవరని మురళి అడిగితే.. తను నా లవ్ గురు అని విద్య అంటుంది.
విద్య లవర్ ఇల్లు కొనడంపై రోహిణి సంతోషంగా ఉందంటుంది. ఇల్లు ప్రతి ఒక్కరి కల. విద్య ఎంత డబ్బు సాయం చేసిందని రోహిణి అడిగితే.. నేను విద్యను ప్రేమించాను. తన నుంచి ఒక్క రూపాయి కూడా వద్దని మురళి అంటాడు. దాంతో తన ఇంట్లో డబ్బు గురించి ప్రభావతి చేసే జరిగే గొడవ గుర్తు చేసుకుంటుంది రోహిణి. మీరు డబ్బు మనిషి కాదని తెలుస్తోంది. ఇది నా క్లోజ్ ఫ్రెండ్ చాలా జాగ్రత్తగా చూసుకోండని. విద్య చాలా లక్కీ అని రోహిణి అంటుంది.
మీకు వీలైతే మీరు కూడా రావొచ్చుగా అని మురళి అడిగితే.. వద్దు కొంచెం తలనొప్పిగా ఉంది. రాలేను అని రోహిణి అంటుంది. సరేనని మురళి, విద్య వెళ్తారు. బాలు వచ్చి ఇల్లు చూసి చాలా బాగుంది. మంచి సెంటర్‌లో ఉంది. నీ లవర్ ఏదని అడుగుతాడు. తన ఫ్రెండ్‌కి అడ్రస్ తెలియకుంటే వీధి చివరకి వెళ్లిందని మురళి చెబుతాడు.
చింటుతో రోహిణి వీడియో కాల్
విద్య, మీనా వస్తారు. మీనాను చూసి మురళి, బాలు షాక్ అవుతారు. ఆటోలో చింటు, సుగుణ బయలుదేరుతుండగా ఆటో పాడవుతుంది. సుగుణ బయట ఉంటుంది. ఆ గ్యాపులో రోహిణికి వీడియో కాల్ చేసి చింటు మాట్లాడుతుంటాడు. ఇంతలో బాలు, మీనా వస్తారు. సుగుణను చూసి చింటు గురించి అడుగుతారు. ఆటోలో ఉన్నాడని సుగుణ చెబుతుంది.
ఆటోవైపుకు బాలు మీనా వెళ్తారు. ఇంకోవైపు అమ్మమ్మ ఏదిరా అని రోహిణి అడిగితే.. బయట ఉందని ఫోన్ బయటకు పెడతాడు. వీడియో కాల్‌లో బాలు మీనా కనిపిస్తారు. వాళ్లను రోహిణి చూసి తెగ షాక్ అవుతుంది. అలా రోహిణి దొరికిపోయినట్లుగా చూపించారు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


