Gunde Ninda Gudi Gantalu Today Episode: దొరికిపోయిన విల్లా విజయ్- మనోజ్‌ను కొట్టమన్న ప్రభావతి- బాలును చితకబాదిన తల్లి
Gunde Ninda Gudi Gantalu Serial October 9th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 9వ తేది ఎపిసోడ్‌లో మనోజ్ మళ్లీ ఎప్పటిలామారేందుకు బాలు కొడతాడు. రెండు చెంపలు ఒకేసారి వాయించమని బాలుకు చెబుతుంది తల్లి. బాలును చితకబాదుతుంది ప్రభావతి. విల్లా విజయ్‌ను పట్టుకుంటారు బాలు, మీనా, మురళి, విద్య.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మనోజ్ చిన్నపిల్లాడిలా ఓ కారు బొమ్మ తీసుకొచ్చుకుని ఆడుకుంటాడు. వీడు బయట ఎవరిదో బొమ్మ ఎత్తుకొచ్చాడనుకుంటారు. ఇంతలో ఒక ఆవిడ వచ్చి మీ అబ్బాయి మా అబ్బాయి బొమ్మ ఎత్తుకొచ్చాడని కోపంగా చెబుతుంది.

రెండు చెంపలు ఒకేసారి వాయించాలి
వయసు తగ్గినా బుద్ధి మారలేదని బాలు అంటాడు. ఆ బొమ్మ లాక్కుని వాళ్లకు ఇచ్చేస్తుంది ప్రభావతి. ఏవండి మీరే ఏదోటి చేయండని మీనా అంటుంది. దాంతో మనోజ్‌ను బాలు కొడతాడు. ఏంట్రా నువ్వు చేసింది అని ప్రభావతి తిట్టినట్టే తిట్టి రెండు చెంపలు ఒకేసారి వాయించాలని చెబుతుంది. అంతా షాక్ అవుతారు. ఒకేసారి మనోజ్ రెండు చెంపలను బాలు కొడతాడు.
దాంతో మనోజ్ కిందపడిపోతాడు. నీళ్లు కొట్టి లేపుతాడు. మనోజ్ ఎప్పటిలా మారిపోతాడు. ఏమైందని అడుగుతాడు. ఏం కాలేదని రోహిణితో పంపిస్తారు. మాతాజీ చెప్పినట్లు రెండు తాయిత్తులు కట్టుకోవడం వల్లే ఇలా జరిగిందా అని మనోజ్ అనుకుంటాడు. మనోజ్ బట్టలను రోహిణి ఇస్త్రీ చేస్తుంటుంది. ప్యాంట్ కోసం వెతుక్కుంటూ బయటకి వెళ్తుంది.
నేను చిన్నాపిల్లాడిలా మారడం ఏంటీ. మూడో తాయిత్తు కూడా కట్టించుకోవాలని మనోజ్ అనుకుంటాడు. వెళ్లి వెంటనే ఇస్త్రీ పెట్టను ముట్టుకుంటాడు మనోజ్. కాలడంతో అరుస్తాడు మనోజ్. రోహిణి వచ్చి ఏమైందని అడుగుతుంది. ఐరన్ బాక్స్ ఆన్‌లో ఎందుకు పెట్టావ్. చూసుకోవా అని మనోజ్ కోప్పడుతాడు. ఐరన్ బాక్స్ ఆన్‌లో ఉందో లేదో ఆమాత్రం చూసుకోలేవా అని రోహిణి కూడా రివర్స్ అవుతుంది.
ప్రభావతిని వెళ్లమన్న మనోజ్
మనోజ్, రోహిణి ఇద్దరు గొడవ పడతారు. అదంతా ప్రభావతి చూసి నా తాయిత్తు మహిమ పనిచేస్తుందని సంతోషిస్తుంది. లోపలికి వెళ్లి ఇద్దరిని ఆపుతుంది. నా కొడుకుకు ఇలా ఎందుకు చేశావ్ అని తిడుతుంది ప్రభావతి. అంత కాలుతుందా అని ప్రభావతి కూడా ముట్టుకుని కాల్చుకుంటుంది. రోహిణిని ప్రభావతి తిడుతుంది. నీ పీడ ఎప్పుడు విరగడవుతుందో. నిన్ను నా కొడుకుకి ఇచ్చి తప్పు చేశానంటూ నానా మాటలు అంటుంది ప్రభావతి.
అమ్మా చాలు ఆపు.. ఇప్పటికీ చాలా సార్లు అన్నావ్‌గా. మళ్లీ ఎందుకు అంటున్నావ్. ముందు నువ్వు బయటకెళ్లు.. వెళ్లు అమ్మా అని మనోజ్ కోపంగా అరుస్తాడు. దాంతో ప్రభావతి షాక్ అవుతుంది. ఏమన్నావ్. నన్ను బయటకు వెళ్లమంటున్నావా అని ప్రభావతి అంటుంది. షాప్‌కి వెళ్లాలి టైమ్ అవుతుంది. బట్టలు వేసుకోవాలని మనోజ్ అంటాడు.
ఏదో ఒక రోజు నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేస్తావ్. ఏం మందు పెట్టిందిరా ఇది నీకు అని ప్రభావతి ఏడుస్తుంది. తను వేరే ఉద్దేశంతో అనలేదని రోహిణి అంటుంది. కేవలం నీవల్లే నా కొడుకు నన్ను వెళ్లిపోమన్నాడు. నిన్ను అందరికంటే ఎక్కువ అందెలం ఎక్కించాలనుకున్నా కానీ నువ్వు మాత్రం నన్ను పాతాళానికి తొక్కేసావ్ అని ఏడుస్తూ వెళ్లిపోతుంది ప్రభావతి.
ప్రభావతి గగ్గోలు
రోహిణి సంతోషిస్తుంది. హాల్లో కూర్చిని ప్రభావతి ఏడుస్తుంటే మీనా చూసి ఏమైంది అని అడుగుతుంది. నేను ఏడిస్తే నీకు దానికి ఆనందమే అని కన్నీళ్లు పెట్టుకుంటుంది ప్రభావతి. బాలు వచ్చి సెటైర్లు వేస్తాడు. శోకావతి, దుఃఖావతి అంటాడు బాలు. సత్యం వచ్చి కూడా అడుగుతాడు. నువ్వు ఏడవటం ఏంటీ, అందరిని ఏడిపించడమే తప్పా నువ్వు ఏడ్చింది లేదు అని సత్యం అంటాడు.
రవి, శ్రుతి వచ్చి అడుగుతారు. రోహిణి వాళ్ల గదిలోనుంచి వచ్చి ఏడుస్తూనే ఉన్నారని మీనా చెబితే ఇది ఎంత చారిత్రకమైన రోజు అని శ్రుతి సంతోషిస్తుంది. వీడియో తీస్తానని తీస్తుంది. మహానటిలా రెండే రెండు కన్నీటి బొట్లు రాల్చండని శ్రుతి అంటుంది. ఎవరి మీద ఎక్కువ ప్రేమ పెంచుకుంటామో వాళ్ల వల్లే కన్నీళ్లు వస్తాయని ప్రభావతి అంటుంది.
ఆ మనోజ్ గాడే ఏదో అన్నాడు అని బాలు అంటాడు. నన్ను బయటకు వెళ్లమన్నాడు. గదిలోనుంచి అని ప్రభావతి అంటుంది. వాడికెందుకు అంత కోపం వచ్చిందని సత్యం అడుగుతాడు. వాడి పెళ్లాన్ని అన్నాను అని ప్రభావతి అంటే.. ఏమన్నావని బాలు అడుగుతాడు. ఏమో కోపంలో గుర్తులేదని ప్రభావతి అంటుంది. దాంతో నువ్వు అసలు మనిషివేనా అని బాలు అంటాడు.
బాలును చితకబాదిన ప్రభావతి
ఏంట్రా అన్నావ్ అని ప్రభావతి అంటే.. ఏమో కోపంలో ఏమన్నానో గుర్తు లేదని బాలు అంటాడు. దాంతో రేయ్ నిన్ను అని బాలుని కిందపడేసి చితకబాదుతుంది ప్రభావతి. అమ్మో చంపేసిందిరా బాబాయ్ అని బాలు నొప్పితో బాధపడతాడు. మనోజ్, రోహిణి కిందకు వస్తారు. అమ్మను ఎందుకు బయటకు వెళ్లమన్నావురా అని నిలదీస్తాడు బాలు.
రేయ్ నువ్వు ఆపురా అని మనోజ్ అంటే.. చిన్నప్పుడు చాడీలు చెబితే అమ్మ నన్ను మోకాళ్లపై కూర్చొబెట్టేదని బాలు చెబుతాడు. అంత కఠినంగా శిక్షించేదా అని మీనా అంటుంది. ఇంత శాడిస్ట్ తల్లిని నేనెక్కడ చూల్లేదని శ్రుతి అంటుంది. మనోజ్ కోసం చేసిందంతా ఏడుస్తూ ప్రభావతి చెబుతుంది. నేను ఈ ఇంట్లోనుంచే పోతానంటుంది ప్రభావతి.
మరి వెళ్లు. మేము పండగ చేసుకుంటామని బాలు అంటాడు. బాలు అత్యాశకు పోయి అంటున్నాడు. నీది అత్యాశ కాకపోతే మనకంత అదృష్టం ఎక్కడిది బాలు అని శ్రుతి అంటుంది. మనోజ్‌ని నిలదీస్తాడు సత్యం. ఏదో అలా అన్నాను. గట్టిగా అన్నట్లు అనిపించలేదని మనోజ్ అంటాడు. అయితే, వీడిని మోకాళ్లపై కూర్చోబెట్టాలని బాలు అంటాడు.
దొరికిపోయిన విల్లా విజయ్
తర్వాత మురళితో బాలు, విద్యతో మీనా వస్తారు. నలుగురు కలుసుకుని మీరా మీరా అని జరిగింది చెప్పుకుంటారు. మురళి కొనాలనుకుంటున్నా విల్లాను మనోజ్‌కి అమ్మి మోసం చేసిన విల్లా విజయ్ దంపతులే అమ్మేందుకు వస్తారు. విల్లా విజయ్‌ని చూసిన బాలు, మీనా షాక్ అవుతారు. మీనా వెళ్లి తలుపులు వేస్తుంది.
రేయ్ ఈ ఇల్లు కూడా మీదేనా అని బాలు అంటే.. ఏమైందని మురళి అడుగుతాడు. మనోజ్, రోహిణిలను మోసం చేసింది వీళ్లేనని మీనా చెబుతుంది. విల్లా విజయ్ దంపతులు పారిపోతుంటే బాలు, మీనా, విద్య, మురళి పట్టుకుంటారు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


