Gunde Ninda Gudi Gantalu Today Episode: చింతామణికి నేనేంటో తెలిసేలా చేస్తానన్న ప్రభావతి- మీనా కోవర్ట్- కూపీ లాగిన బాలు

Gunde Ninda Gudi Gantalu Serial September 24th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ సెప్టెంబర్ 24వ తేది ఎపిసోడ్‌లో కామాక్షి వచ్చి దొంగతనం వెనుకున్నవాళ్లపై తిట్లదండకం చదువుతుంది. ఫంక్షన్ హాల్‌కి వెళ్లిన బాలు, రాజేష్ కూపీ లాగుతారు. చింతామణినే దొంగతనం చేయించి ఉంటుందని డౌట్ పడతారు.

Published on: Sep 24, 2026, 07:21:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ప్రభావతి దగ్గరికి కామాక్షి వచ్చి మీనా 5 లక్షల దొంగతనం గురించి అడుగుతుంది. మీనాను అపార్థం చేసుకున్నందుకు ప్రభావతిని తిట్టి.. నీకు రోహిణియే కరెక్ట్ అంటుంది. మీనాను పిలుస్తుంది కామాక్షి.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ సెప్టెంబర్ 24 ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ సెప్టెంబర్ 24 ఎపిసోడ్

కామాక్షి తిట్లదండకం

మీనా చేయి చూసి జాలిపడుతుంది. దొంగతనం ఎలా జరిగిందో అడిగితే.. మీనా చెబుతుంది. దాంతో దొంగతనం చేయించినవాళ్లను తిడుతుంది కామాక్షి. ప్రభావతి చాలా కాలం తర్వాత వంట వండటంపై సెటైర్లు వేస్తుంది కామాక్షి. జాగ్రత్తగా ఉండమని కామాక్షి చెబుతుంది. ఇంకెప్పుడైనా డబ్బుతో బయటకు వెళ్లేటప్పుడు ఎవరికి చెప్పకు. ఏ శాడిస్ట్, కోపిస్టి, పాపిస్టి కళ్లు పడతాయో అని ఇన్‌డైరెక్ట్‌గా ప్రభావతినే అంటుంది.

నువ్వు ఇంట్లోకెళ్లి తీసుకెళ్లిన డబ్బు విషయం ఎక్కడో పుట్టిన దొంగలకెలా తెలిసిందని కామాక్షి అంటుంది. దాంతో నువ్వు నా ఇంట్లో చిచ్చు పెట్టకు. ఈ మాట బాలుగాడు విన్నాడంటే నా మీద పడి ఏడుస్తాడు. దొంగావతి అని పేరు పెడతాడు అని ప్రభావతి అంటుంది. నిన్ను అనడం కాదు మీనా బాగుపడితే కళ్లలో నిప్పులు పోసుకునేది ఎవరు. నువ్వేగా.. మాటవరసకు అన్నాను. నీ తర్వాత ఆ చింతామణే కదా. ఆ చింతామణి దొంగలను పంపించి దోచుకెళ్లమని పంపించిదేమో అని కామాక్షి అంటుంది.

అది అన్నీ కూపీలు లాగుతుంది. లాగి కొట్టేయమని దొంగలను పంపించి ఉంటుందని కామాక్షి అంటుంది. దాంతో ప్రభావతి వైపు మీనా చూస్తుంది. ఈ మాటలన్నీ కథలా వింటున్నావ్. వెళ్లి పడుకో పో అని మీనాను పంపిస్తుంది ప్రభావతి. ఏం వాగుతున్నావే. వాళ్లు అదే నిజమనుకోరు అని ప్రభావతి అంటుంది. అదే నిజం వాళ్ల కళ్లో దుమ్ము కొట్టా, మట్టి కొట్టా అంటూ తిట్లదండకం చదవుతుంది కామాక్షి.

చింతామణికి నేనేంటో తెలిసేలా చేస్తా

అదే జరిగితే ఆ చింతామణికి నేనంటే ఏంటో తెలిసేలా చూపిస్తాను అని ప్రభావతి మనసులో అనుకుంటుంది. మరోవైపు ఫంక్షన్‌కు వెళ్లి బాలు, రాజేష్ వెళ్తారు. ఇక్కడే ఏదో జరిగి ఉంటుందని బాలు అంటాడు. మేనేజర్‌కు మీనా గురించి చెబుతాడు. తనకు యాక్సిడెంట్ అయిందని, ఆర్డర్ తీసుకోదని విన్నాను. అందుకే వేరేవాళ్లకు ఆర్డర్ ఇచ్చామని అతను చెబుతాడు.

యాక్సిడెంట్ జరిగిన విషయం మీకు ఎలా తెలిసిందని రాజేష్ అడుగుతాడు. చింతామణి చెప్పిందని మేనేజర్ అంటాడు. దాంతో ఇద్దరు షాక్ అవుతారు. ఈ దొంగతనం వెనుక చింతామణి హస్తం ఉందని బాలు అంటాడు. దొంగతనమా అని మేనేజర్ అంటాడు. దాంతో బాలు జరిగింది చెబుతాడు. అయ్యో పాపం. మా ఓనర్‌కి మీనా డిజైన్స్ చాలా నచ్చాయి. మీనాకే ఆర్డర్ ఇవ్వాలని ఎక్కువసేపే వెయిట్ చేశాం. కానీ, మరి లేట్ చేయడం వ్యాపార ధర్మం కాదని చింతామణికి ఆర్డర్ ఇచ్చామని మేనేజర్ చెబుతాడు.

చింతామణి ఎప్పటినుంచి ఎదురుచూస్తున్నారని బాలు అడిగితే.. ఉదయం నుంచే చూశారు. మీనా రాదంటే రాదని చెప్పారని మేనేజర్ అంటాడు. ఇది కచ్చితంగా చింతామణి పనేరా. మీనా ఎప్పుడు ఎక్కడికి వెళ్తుంది, ఏ రూట్‌లో వెళ్తుంది అనేది ఎలా తెలుసు. మీనా గురించి బాగా తెలిసినవాళ్లే ఎవరో కోవర్ట్‌లా పనిచేస్తున్నారని రాజేష్ అంటాడు. దీనివెనుక ఎవరున్న వదలని బాలు అంటాడు.

మీనాపై పూలవర్షం

మరోవైపు మీనా పూలు కడుతూ దొంగతనం గురించి, 3 లక్షల గురించి ఆలోచిస్తుంది. బాలు వచ్చి ఒక్క పూవు లేకుండా మాలకడుతున్నావేంటని బాలు అంటాడు. నాకు ఏం చేయాలో తెలియడం లేదని, పోయిన డబ్బు గుర్తు వస్తుందని మీనా బాధపడుతుంది. మీనాపై పూలు చల్లుతూ దేవతలా పూజిస్తాడు. కిందకు వచ్చిన రోహిణి చూసి అసూయపడుతుంది.

కోపంగా మనోజ్ దగ్గరికి వెళ్తుంది. బాలు మీనా హాయిగా సంతోషంగా పండగ చేసుకుంటున్నారు. నీ మైండ్ ఎక్కడుందని రోహిణి అంటే.. నీ క్రిమినల్ మైండ్ చూసి పోయిందని మనోజ్ సెటైర్లు వేస్తాడు. మీనా 5 లక్షలు పోగొట్టుకుంది, నువ్వు ఎన్నోసార్లు లక్షలు మింగావ్. నేను వెనుకేసుకొచ్చాను అని రోహిణి అంటుంది. నేను తెలియకుండా మోసపోయా. నువ్వు అన్నీ కావాలనే చేశావ్ అని కోపంగా వెళ్లిపోతాడు మనోజ్.

కింద బాలు, మీనాలను చూసి చిరాకుగా మళ్లీ గదిలోకి వెళ్తాడు. బాలు మీనా చదువుకోకపోయినా గొడవ తర్వాత అర్థం చేసుకుని సారీలు చెప్పుకుని సంతోషంగా ఉంటుంది అని రోహిణి అంటుంది. భార్యకు తండ్రి, మేనమామలు ఉండటం గురించి అల్లుడికి అత్తింట్లో జరిగే మర్యాదల గురించి మాట్లాడుతాడు మనోజ్. లేకపోవడం తప్పుకాదు ఉన్నారనే అబద్ధాలు, మోసాలు, పార్లర్ అమ్మేయడం దగా, మా నాన్నను మోసం చేయించడం తప్పని మనోజ్ అంటాడు.

కాలం కలిసిరానివాళ్లు చెడ్డవాళ్లు కాదు

న్యాయంగా బాలు, రవికి వాటా ఇవ్వాలి. అలా చేయకుండా వాళ్ల నోట్లో మట్టికొట్టించావ్. నేనేం చేసిన కలిసిరాదు. వాళ్ల దృష్టిలో మోసగాడిలా మిగిలిపోయాను. ఎన్నిసార్లు మోసాలు చేసిన నీకు కలిసి వచ్చింది. అందువల్ల నువ్వు మంచిదానిలా ఏం మిగల్లేదు. కాలం కలిసిరానివాళ్లు చెడ్డవాళ్లు కాదు. కాలం తమవైపు కలిసి వచ్చేలా చేసుకునేవాళ్లే చెడ్డవాళ్లు అని మనోజ్ అంటాడు.

మోసం చేసి పెళ్లిచేసుకోవడం ప్రేమ అనుకుంటున్నావా అని మనోజ్ అంటాడు. నేను కోరుకుంది ఉమ్మడి కుటుంబం అని రోహిణి అంటుంది. ఇదంతా మోసం చేయకుండా కూడా చేయొచ్చు అని మనోజ్ అంటాడు. ఇప్పుడు ఏం చేయమంటావ్ అని రోహిణి అంటే.. నోర్మూసుకుని పడుకో అని మనోజ్ అంటాడు. రోహిణి ఏడుస్తుంది.

నా ముందు ఏడవకు వెళ్లు అని చీదరించుకుంటాడు మనోజ్. బాత్రూమ్‌లో ఏడుస్తానని వెళ్లిపోతుంది రోహిణి. ప్రభావతి కిందకు వచ్చి బాలు, మీనాలను చూసి పైకి వెళ్తుంది. సత్యంను తీసుకొస్తుంది. సత్యం మాత్రం చాలా సంతోషిస్తాడు. వాళ్లు పూలు పోసుకుంటున్నారు, నువ్వు నిప్పులు పోసుకుంటున్నావ్ అని సత్యం తిడతాడు.

మీనాకు తెలిసిన నిజం

సుమతి మీనా చెల్లెలు అని అరుణ్ తల్లికి చెబుతుంది. ఆ మూడు లక్షలు ఇచ్చింది వీళ్ల అబ్బాయి అరుణ్ అక్క అని సుమతి చెబుతుంది. ఇప్పుడు నా భయం మరింత పెరిగిందని మీనా అంటుంది. తర్వాత బాలుతో తన వల్ల సుమతికి ఎలాంటి సమస్య రావొద్దని అంటుంది. కామాక్షి ఇంటికి వెళ్లి మరింత కూపీ లాగుతాడు బాలు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More