Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో శ్రుతి ఉప్మా చేసింది చెప్పి అందిరిని పిలుచుకుని వస్తారు. ఏంటే నువ్వు శ్రుతితో వంట చేయించావంట అని ప్రభావతి అంటుంది.
నీకంటే బాగానే వండుతుంది

అవును. ఈరోజు నుంచి శ్రుతి వండిందే మీకు పెడతానని మీనా అంటుంది. రెస్టారెంట్‌లో చూసి నేర్చుకుంటున్నట్లుంది. నువ్వు పెట్టే చింతకాయ పచ్చడి కంటే బాగానే ఉంటుందిలే అని ప్రభావతి అంటుంది. అయితే, రేపటి నుంచి డబ్బుడమ్మా ఏది చేసిన నీ మీద ప్రయోగం చేయమంటానులే అని బాలు అంటాడు.
శ్రుతి చేసిన ఉప్మా తీసుకొస్తుంది. అందులోనుంచి స్పూన్ రాదు. రవి, బాలు ఇద్దరు కలిసి లాగిన స్పూన్ రాదు. అదంతా చూసి ప్రభావతి, సత్యం, మనోజ్ షాక్ అవుతారు. చివరికి గరిట వస్తుంది. ఫస్ట్ మా అమ్మకు పెట్టు ఆవిడే మా ఇంటి ఇలవేల్పు అని బాలు అంటాడు. ఒరిజినల్ కోటీశ్వరుడి కూతురు మాకోసం వంట వండింది. నువ్వు ఎంత బిల్డప్ ఇచ్చావే అని రోహిణిని తిడుతుంది ప్రభావతి.
ఇలాంటివి పెడితే మీ రెస్టారెంట్ మూసుకోవాల్సిందే. అయిన వంట చేయడానికి మనిషి ఉందిగా అని మనోజ్ అంటాడు. రేయ్ అంటే నా భార్య పని మనిషిలా కనిపిస్తుందా. నీ భార్యను ఏమనాలు, నిన్ను ఏమనాలి అని చేసినవి గుర్తు చేస్తాడు బాలు. ఆపండ్రా. మొదటిసారి చిన్న కోడలు వంట చేసింది. తినండని సత్యం అంటాడు.
శ్రుతికి మీనా వంట క్లాసులు
అది తిని షాక్ అవుతారు. శ్రుతికి రవి పెడతాడు. అది ఉమ్మేస్తుంది. ఇంత చెండాలంగా ఉందా. మీనా రేపటి నుంచి నాకు కుకింగ్ క్లాసెస్ తీసుకోవాలని శ్రుతి అంటుంది. మీనా సరేనంటుంది. బాలు, మీనా వెళ్లేందుకు బయలుదేరుతారు. ఇంతలో మేనేజర్ నిన్నే రమ్మంటున్నాడని ఫ్రెండ్ కాల్ చేసి చెబుతుంది. అదే విషయం బాలుకు చెబుతుంది మీనా.
{{/usCountry}}అది తిని షాక్ అవుతారు. శ్రుతికి రవి పెడతాడు. అది ఉమ్మేస్తుంది. ఇంత చెండాలంగా ఉందా. మీనా రేపటి నుంచి నాకు కుకింగ్ క్లాసెస్ తీసుకోవాలని శ్రుతి అంటుంది. మీనా సరేనంటుంది. బాలు, మీనా వెళ్లేందుకు బయలుదేరుతారు. ఇంతలో మేనేజర్ నిన్నే రమ్మంటున్నాడని ఫ్రెండ్ కాల్ చేసి చెబుతుంది. అదే విషయం బాలుకు చెబుతుంది మీనా.
{{/usCountry}}ఈరోజు మనల్ని విడదీయడానికి విధి కంకణం కట్టుకున్నట్టుందని, చింటు గురించి ఇద్దరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటారు. అది చూసిన రౌడీలు మన పెళ్లాలు ఉన్నారు ఎందుకు అనికుళ్లుకుంటారు. ఇదే వాడికి చివరి నవ్వు అని రౌడీ అంటాడు. బాలు కారు ఎక్కి స్టార్ట్ చేస్తాడు. కారు స్టార్ట్ కాదు. కాసేపటికి అవుతుంది. బాలు కారులో వెళ్తాడు.
రౌడీలు ఫాలో చేస్తారు. కారు స్టార్ట్ కాకపోవడంపై బాలు డౌట్ పడతాడు. కొన్న ఇన్నిరోజుల్లో ఎప్పుడు కాలేదు. నిన్ను సర్వీసింగ్ సెంటర్‌కి తీసుకెళ్లి బాగా సర్వీస్ చేయిస్తా అని కారుతో అంటాడు బాలు. ఇంతలో రౌడీలు వచ్చి హారన్ కొడుతూ రెచ్చగొడతారు. ఏం బంటి నీ బండి స్లోనా ఏంటీ అని కారు స్పీడుగా నడిపేలా చేస్తారు. కారు స్పీడుగా వెళ్లదా.. రాదా అని రౌడీలు ఏడిపిస్తారు.
అరుణ్‌ను గుద్దిన బాలు
దాంతో బాలు స్పీడ్ పెంచుతాడు. కారు బ్రేకులు పడవు. దాంతో బాలు కంగారు పడతాడు. కారు బ్రేకులు పడట్లేదు. తప్పుకోండని అరుస్తాడు. ఎదురుగా ఆటో పక్కన తల్లిపిల్లాడు ఉంటారు. దాంతో పక్కకు తిప్పుతాడు. కానిస్టేబుల్ అరుణ్ బైక్‌ను గుద్దుతాడు బాలు. దాంతో అరుణ్ కోపంతో రెచ్చిపోతాడు. కారు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. కావాలని గుద్దలేదని బాలు అంటాడు.
కానీ, కానిస్టేబుల్ అరుణ్ వినడు. నాకు నీ గురించి ర్యాష్ డ్రైవింగ్ గురించి తెలుసు అని అరుణ్ అంటాడు. మరో కానిస్టేబుల్‌కి కీస్ ఇచ్చి కారు తీసుకురమ్మంటాడు. బాలు బ్రేకులు పడట్లేదని వద్దంటాడు. నన్ను కారుతో గుద్ది చంపాలని ప్లాన్ చేసిన నీతో మర్యాదగా మాట్లాడాలా. పోలీస్ స్టేషన్‌లో ఉంటాయి మర్యాదలు. ఈరోజు నీ సంగతి అటో ఇటో తేలుస్తాను అని అరుణ్ అంటాడు.
బాలు చెబుతున్నా పోలీస్ కానిస్టేబుల్ బాలు కారు తీసుకొస్తాడు. బాలును అరుణ్ తీసుకెళ్తాడు. అది చూసిన రౌడీలు నవ్వుకుంటూ వెళ్తారు. మరోవైపు చింటును కలిశారో లేదో అని బాలుకు మీనా కాల్ చేస్తుంది. ఆ ఫోన్ కానిస్టేబుల్ తీసుకుని డ్యూటీలో ఉన్న పోలీస్ బండిని ఢీ కొట్టాడు అని జరిగింది చెబుతాడు. దాంతో కంగారుగా మీనా బయలుదేరుతుంది.
లైసెన్స్ క్యాన్సిల్ చేయిద్దామా
ఇంతలో ఎస్సై వస్తే బాలు జరిగింది చెబుతాడు. అరుణ్ వచ్చి బాలు గురించి చెడుగా చెబుతాడు. అరుణ్ చెప్పింది ఎస్సై నమ్ముతాడు. లైసెన్స్ క్యాన్సిల్ చేయించి కారు ఇక్కడే ఉంచేద్దామా అని ఎస్సై అంటాడు. అంతే సర్ అని అరుణ్ అంటాడు. సర్ అదే నా జీవనాధారం సర్ అని బాలు వేడుకుంటాడు. లెసెన్స్ తీసుకుని కారు సీజ్ చేయమని ఎస్సై చెబుతాడు.
బాలు ఎంత చెప్పిన ఎస్సై వినడు. ఇతని సంగతేంటో నువ్వే చూసుకో అని అరుణ్‌కు అప్పజెప్పి వెళ్లిపోతాడు. ఇక్కడ ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు నేను ఏం చేస్తానో చూపిస్తా అని అరుణ్ అంటాడు. చేతిలో పవర్ ఉందిగా అని అంటున్నావుగా. ఏదో ఒకరోజు కచ్చితంగా బాధపడతావ్‌గా గుర్తుపెట్టుకో అని బాలు అంటాడు. బాలును పంపించేస్తారు.
బాలు బయటకు వెళ్తాడు. ఇంతలో మీనా వస్తుంది. కారు బ్రేకులు ఫెయిల్ అయింది, జరిగింది అంతా బాలు చెబుతాడు. మన కారు మనకు తిరిగి వచ్చేలా లేదని బాలు అంటాడు. ఇంతలో కానిస్టేబుల్ బాలు ఫోన్ తీసుకొచ్చి ఇచ్చి సర్ చూడకముందే వెళ్లమంటాడు. ఇలా కారు లాక్కోవడం అన్యాయం అని మీనా అంటుంది.
నిజం కప్పిపెట్టేసిన అరుణ్
ఏది అన్యాయమో ఏది న్యాయమో కోర్టు తేలుస్తుంది. అక్కడ తేల్చుకోండని కానిస్టేబుల్ వెళ్లమంటాడు. ఇదంతా వాడి వల్లే అని బాలు కోప్పడితే మీనా ఆపుతుంది. ఇప్పుడేం మాట్లాడిన వాళ్లు తప్పుగా తీసుకుంటారు. ముందు ఇంటికెళ్దాం పదండని మీనా అంటుంది. ఇంటికెళ్తారు. సత్యం వాళ్లు అడిగితే కారు సీజ్ చేసిన విషయం మీనా చెబుతుంది.
పోలీసోడిని కావాలనే గుద్ది ఉంటాడని ప్రభావతి నిందలు వేస్తుంది. మరోవైపు బాలు కారు తీసుకొచ్చిన కానిస్టేబుల్ కట్లతో అరుణ్‌కు బ్రేక్ వైర్ కట్టయింది సర్. కారు బ్రేకులు నిజంగానే ఫెయిల్ అయ్యాయని చెబుతాడు. ఈ విషయం తెలిస్తే మన పరువు పోతుందని అంటాడు. ఈ విషయం ఎవరికి తెలియొద్దని నిజం కప్పిపెట్టాలని అరుణ్ అంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.