Gunde Ninda Gudi Gantalu Promo: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ప్రోమోలో రోహిణిని మరోసారి బుక్ చేసేలా కనిపిస్తాడు మటన్ కొట్టు మాణిక్యం. మీనా బిర్యానీ పార్టీ అతని చావుకు వస్తుంది. ఆమె నుంచి అతడు తప్పించుకుంటాడా లేదా అన్న సస్పెన్స్ నెలకొంది.
మీనాకు పెద్ద పూల ఆర్డర్

గుండె నిండా గుడి గంటలు సీరియల్ తాజా ప్రోమోలో మీనాకు పెద్ద పూల ఆర్డర్ వచ్చినట్లుగా చూపించారు. ఆమె సాధారణ పూల బిజినెస్ నుంచి ఫంక్షన్లలో డెకరేషన్లు చేసే స్థాయికి ఎదిగిన విషయం తెలుసు కదా. అందులో భాగంగా రెగ్యులర్ గా భారీ ఆర్డర్లు వచ్చే వ్యక్తి మీనాకు పరిచయం అవుతాడు.
అదే సంతోషంలో మీనా ఇంటికి స్వీటు తీసుకొని వస్తుంది. షరా మామూలుగానే ప్రభావతి, మనోజ్ ఆమెను అవమానించేలా మాట్లాడతారు. అయితే బాలు మాత్రం స్వీట్లు కాదు.. అందరికీ మటన్ బిర్యానీ పెడదామంటూ మీనాకు డబ్బులు ఇస్తాడు.
మటన్ కొట్లో మాణిక్యం
దీంతో మీనా మటన్ తీసుకురావడానికి షాపుకు వెళ్తుంది. ఫోన్ రావడంతో ఆమె పక్కకెళ్లి మాట్లాడుతుండగా.. మీనా ఫ్రెండ్ వెళ్లి నాలుగు కిలోల మటన్ కావాలని అడుగుతుంది. ఆ షాపులో మాణిక్యం ఉంటాడు. ఎవరికి అని అడిగితే తన ఫ్రెండ్ కంటూ మీనాను చూపిస్తుంది. ఆమెను చూడగానే మాణిక్యం భయంతో వణికిపోతాడు. అంతటితో గుండె నిండా గుడి గంటలు ప్రోమో ముగుస్తుంది.
మాణిక్యం మీనాకు దొరికిపోతాడా లేక తప్పించుకుంటాడా అన్నది ఆసక్తికరంగా మారింది. మలేషియా మామగా రోహిణి అతన్ని ఇంట్లో పరిచయం చేస్తే.. అతడు మాత్రం ప్రతిసారీ ఆమెను ఇరుకునపెట్టేలా కనిపిస్తున్నాడు. ఈసారి అతడు దొరుకుతాడా? అతనితోపాటు రోహిణి గుట్టు కూడా బయటపడుతుందా అన్నది చూడాలి.
తాజా ఎపిసోడ్ ఇలా..
{{/usCountry}}మాణిక్యం మీనాకు దొరికిపోతాడా లేక తప్పించుకుంటాడా అన్నది ఆసక్తికరంగా మారింది. మలేషియా మామగా రోహిణి అతన్ని ఇంట్లో పరిచయం చేస్తే.. అతడు మాత్రం ప్రతిసారీ ఆమెను ఇరుకునపెట్టేలా కనిపిస్తున్నాడు. ఈసారి అతడు దొరుకుతాడా? అతనితోపాటు రోహిణి గుట్టు కూడా బయటపడుతుందా అన్నది చూడాలి.
తాజా ఎపిసోడ్ ఇలా..
{{/usCountry}}గుండె నిండా గుడి గంటలు తాజాగా ఎపిసోడ్లో మనోజ్ తోపాటు ప్రభావతికి కూడా గండం ఉందని స్వామీజీ చెప్పడంతో అతడు సూచించిన పరిహారం చేయాలని మనోజ్ నిర్ణయించుకుంటాడు. కానీ ప్రభావతి మాత్రం అందుకు ఒప్పుకోదు. అయితే ఆమెపై ఫ్యాన్ విరిగి పడటం, కరెంట్ షాక్ తగలడం లాంటి ప్రాణగండాలు జరుగుతుంటాయి. ఇవన్నీ చూసిన తర్వాత ప్రభావతి.. మనోజ్ చెప్పిన పరిహారం చేయడానికి ఒప్పుకోక తప్పని పరిస్థితిలో పడుతుంది.