Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో రోహిణి, మనోజ్ ఇష్యూతోపాటు మీనా తన కొత్త ఆర్డర్ కోసం సింగరాజు దగ్గరికి వెళ్లే సీన్ కూడా ఆసక్తి రేపింది. అయితే మీనాకు సింగరాజు గట్టి షాకే ఇస్తాడు. డబ్బు ఇవ్వనని తేల్చి చెబుతాడు.
రోహిణికి క్లాస్ పీకిన ప్రభావతి

రోహిణికి ప్రభావతి క్లాస్ పీకే సీన్ తో సీరియల్ శుక్రవారం (సెప్టెంబర్ 11) ఎపిసోడ్ మొదలైంది. వ్రతానికి కూర్చోకుండా ఎక్కడికి వెళ్లావంటూ నిలదీస్తుంది. బార్ కు వెళ్లానని చెప్పడంతో మరింత తిడుతుంది. మోసాలు కాదు తాగుతావా అని అడుగుతుంది. అప్పుడే బాలు కూడా వచ్చి తాను కూడా బార్ కు వెళ్లానంటాడు. మనోజ్ గాడు తాగి ఊగుతుంటే తీసుకురావడానికి వెళ్లానని చెబుతాడు. పార్లరమ్మ కూడా అందుకే వచ్చిందని అంటాడు. ఇంతకీ మనోజ్ ఎక్కడ అని ప్రభావతి అడుగుతుంది.
ఇంట్లోకి పాకుతూ వచ్చిన మనోజ్.. రోహిణి కాళ్లు మొక్కి..
అప్పుడే మనోజ్ ఇంట్లోకి పాకుతూ వస్తాడు. తాగింది దిగకపోవడంతో నానా రచ్చ చేస్తాడు. అమ్మ, మీనా బార్ కు వచ్చారేంటి అని అడుగుతాడు. ఎలా ఉండేవాడు ఎలా అయ్యాడు.. అంతా ఈ దరిద్రపుదాని వల్లే అని మళ్లీ రోహిణిని తిడుతుంది ప్రభావతి. ఆ తర్వాత వ్రతం పూర్తయిందని, మనోజ్ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకోమని చెబుతుంది.
అది విని రోహిణి కాళ్లపై పడతాడు మనోజ్. దీంతో బాలు అతన్ని లేపి రోహిణితో అతని కాళ్లు మొక్కిస్తాడు. తర్వాత అతన్ని తీసుకొని రోహిణి గదిలోకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత బాలు కాళ్లు మీనా, రవి కాళ్లు శృతి మొక్కుతారు. తనను బార్ కెళ్లానని అవమానించావని, కాళ్లు ఇవ్వనని బాలు మొండికేసినా మౌనిక చెప్పడంతో మీనా మొక్కడానికి ఒప్పుకుంటాడు.
మౌనికను పంపిస్తూ ప్రభావతి రచ్చ.. నోరు జారిన మీనా
ఆ తర్వాత మౌనికను అందరూ కలిసి సాగనంపడానికి బయటకు వస్తారు. అప్పుడు కూడా ప్రభావతి నోరు అదుపులో ఉంచుకోదు. మౌనిక కారు చూసి ఎంత బాగుందో.. నీ కారూ ఉంది అంటూ బాలుని దెప్పిపొడుస్తుంది. అదే సమయంలో మీనా పుట్టింటి గురించి కూడా ప్రభావతి మరోసారి అవమానించేలా మాట్లాడుతుంది. మరి మీ పుట్టిల్లు మలేషియానా అని శృతి కౌంటర్ వేస్తుంది. నడిమంత్రపు సిరి నెత్తిమీద ఆడుతున్నట్లుగా ఆమె తీరు ఉందని సత్యం కూడా తిడతాడు.
{{/usCountry}}ఆ తర్వాత మౌనికను అందరూ కలిసి సాగనంపడానికి బయటకు వస్తారు. అప్పుడు కూడా ప్రభావతి నోరు అదుపులో ఉంచుకోదు. మౌనిక కారు చూసి ఎంత బాగుందో.. నీ కారూ ఉంది అంటూ బాలుని దెప్పిపొడుస్తుంది. అదే సమయంలో మీనా పుట్టింటి గురించి కూడా ప్రభావతి మరోసారి అవమానించేలా మాట్లాడుతుంది. మరి మీ పుట్టిల్లు మలేషియానా అని శృతి కౌంటర్ వేస్తుంది. నడిమంత్రపు సిరి నెత్తిమీద ఆడుతున్నట్లుగా ఆమె తీరు ఉందని సత్యం కూడా తిడతాడు.
{{/usCountry}}ఆ తర్వాత మౌనికను సాగనంపుతూ జాగ్రత్తగా ఉండు.. బాధ కలిగినా మనసుపైకి తీసుకోకు అని మీనా చెబుతుంది. అది విని మౌనికకు ఏం కష్టాలు ఉన్నాయి.. సంజూ బాగా చూసుకోవడం లేదా అని ప్రభావతి, బాలు, శృతి అడుగుతారు. అదేం లేదు.. వదిన ఏదో అలా మాటవరసకి చెప్పిందని మౌనిక కవర్ చేస్తుంది. ఆ తర్వాత మౌనిక కోసం తెచ్చిన మామిడి కాయలు, చింతకాయలు, వ్రతం ప్రసాదం అన్నీ బాలు తెచ్చి ఇచ్చి సాగనంపుతాడు.
రోహిణిపై బాలుకి అనుమానం
అదే రోజు రాత్రి బాలుకి మీనా పాలు తెచ్చి ఇస్తుంది. బాలు ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఏమైందని మీనా అడిగితే.. అసలు పార్లరమ్మ బార్లరమ్మ ఎలా అయిందో అని అంటాడు. రోహిణి అసలు బార్ కు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు.. అక్కడే గుణ కూడా ఉన్నాడు.. ఆమెను అడిగితే మనోజ్ ఫోన్ చేశాడని చెప్పింది.. కానీ వాడు చేయలేదన్నాడు.. మణికంఠ కూడా అసలు ఫోన్ బయటకు తీయలేదని చెప్పాడు.. గుణకు, రోహిణికి ఏమైనా సంబంధం ఉందా అని బాలు అనుమానిస్తాడు. గతంలో కూడా గుణ రోహిణికి తెలుసు కదా అని మీనా అంటుంది. ఏదో జరుగుతోంది అని బాలు సందేహిస్తాడు.
సింగరాజును కలుస్తానన్న మీనా
ఆ తర్వాత టాపిక్ మీనా ఆర్డర్ పైకి వెళ్తుంది. తన కొత్త ఆర్డర్ గురించి మీనా చెబుతుంది. దానికి రూ.5 లక్షలు కావాలి అని అంటుంది. బామ్మ పొలం తాకట్టు పెడదామనుకున్నాం కదా అని బాలు అంటే.. అదేం వద్దు.. నేను సింగరాజుగారిని కలిసి డబ్బు అడుగుతాను.. ఏం సాయం కావాలన్నా అడగమని అప్పుడు ఆయన చెప్పారు అని మీనా అంటుంది. అలాగే చేయమని బాలు అంటాడు.
సింగరాజు దగ్గరికి వెళ్లిన మీనా.. పోటీ నుంచి తప్పుకోవాలంటూ..
మరుసటి రోజు ఉదయాన్నే సింగరాజు దగ్గరికి వెళ్తుంది మీనా. తనకు ఆర్డర్ వచ్చిందని, అయితే డిపాజిట్ గా రూ.5 లక్షలు ఇవ్వాలని చెబుతుంది. ఎప్పుడు అవసరమొచ్చిన డబ్బు ఇస్తానన్నారు కదా.. సాయం చేస్తారా అని అడుగుతుంది. అయితే డిపాజిట్ ఎందుకు అని సింగరాజు అడుగుతాడు. అది పెద్ద కంపెనీ ఆర్డర్.. నా డెకరేషన్ నచ్చి పిలిచారు.. కానీ ముందే కాస్త డబ్బు డిపాజిట్ చేయాలన్నారు అని చెబుతుంది.
పోటీలో చింతామణి కూడా ఉండటంతో కాస్త కంగారుగా ఉందని మీనా అంటుంది. చింతామణి పోటీలో ఉందా.. అయితే నువ్వు పోటీ నుంచి తప్పుకోవడమే మంచిది.. ఆమెతో పోటీ మంచిది కాదు.. అయినా నీకు ఆర్డర్ వచ్చిన తర్వాత ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను.. డిపాజిట్ కోసం ఇచ్చి ఆర్డర్ రాకపోతే డబ్బు తిరిగి ఇవ్వరు.. నువ్వెలా తిరిగి ఇస్తావు.. అప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు.. అందుకే ఇప్పుడు ఇవ్వలేను అని సింగరాజు చెప్పడంతో మీనా షాక్ తింటుంది.
చేసేది లేక సరే అని వెళ్లబోతుంది. అయితే చింతామణి విషయంలో మాత్రం తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని మీనా తేల్చి చెబుతుంది. పోటీ అంటూ నిజంగా ఉంటే ఆమెను తానేంటో చూపిస్తానని శపథం చేసి మరీ వెళ్తుంది. బయటకు వెళ్లిన తర్వాత సింగరాజు అలా ఎందుకు మాట్లాడాడా అని ఆలోచనలో పడుతుంది.
అరుణ్‌తో బాలు గొడవ
మరోవైపు అరుణ్ ఓ ట్రిప్ కు వెళ్తాడు. కారులో ప్రయాణికులు ఉండగా అరుణ్ అతన్ని ఆపుతాడు. మందు తాగి నడిపిస్తున్నావా.. ఒకసారి ఊదు అని అంటాడు. తాను తాగలేదని చెబుతున్నా వినడు. కారులో ఉన్న వాళ్లను మరో కారు చూసుకోవాలని పంపించేస్తాడు. ఊదకపోతే కేసు పెడతానని వార్నింగ్ ఇస్తాడు. ఎలా పెడతావో పెట్టు అంటూ బాలు కూడా తెగిస్తాడు.