...
...
Next Story

Gunde Ninda Gudi Gantalu Today Episode: మీనా అందానికి బాలు ఫిదా.. నీతూ ఫోన్‌తో అలక వీడిన శృతి.. రోహిణి కష్టాలు కంటిన్యూ

Gunde Ninda Gudi Gantalu Serial September 17th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ సెప్టెంబర్ 17 ఎపిసోడ్ లో మీనా అందానికి ఫిదా అయిన బాలు ఆమె మీద అలక వీడతాడు. అటు నీతూ ఫోన్ తో శృతి కూడా దిగి వస్తుంది. మరోవైపు రోహిణి కష్టాలు మాత్రం కంటన్యూ అవుతూనే ఉంటాయి.

Published on: Sep 17, 2026, 06:54:51 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో రోహిణి విషయంలో ప్రభావతి రచ్చ చేస్తుంది ఆమెను మనోజ్ దగ్గరికి అస్సలు వెళ్లనీయదు. మరోవైపు మీనా మీద అలిగిన బాలు తల్లిని కాఫీ అడగడం, రెస్టారెంట్ విషయంలో రవితో శృతి గొడవ పడటంలాంటి సీన్లతో సాగిపోయింది.

రోహిణి పేరు విని ఆవేశంతో ఊగిపోయిన ప్రభావతి

Gunde Ninda Gudi Gantalu Today Episode: మీనా అందానికి బాలు ఫిదా.. నీతూ ఫోన్‌తో అలక వీడిన శృతి.. రోహిణి కష్టాలు కంటిన్యూ
Gunde Ninda Gudi Gantalu Today Episode: మీనా అందానికి బాలు ఫిదా.. నీతూ ఫోన్‌తో అలక వీడిన శృతి.. రోహిణి కష్టాలు కంటిన్యూ

మనోజ్ కు జ్వరమని తెలిసి టాబ్లెట్ పట్టుకొని ప్రభావతి అతని దగ్గరికి వెళ్లే సీన్ తో సీరియల్ గురువారం (సెప్టెంబర్ 17) ఎపిసోడ్ మొదలైంది. మనోజ్ ఒళ్లు కాలిపోతుండటంతో టాబ్లెట్ వేసుకోవాలని తల్లి అడుగుతుంది. రోహిణి ఇచ్చిందంటాడు. ఏమైనా తాగుతావా.. రాగి జావా తీసుకొస్తానంటే రోహిణి ఇచ్చిందంటాడు. దీంతో ప్రభావతి ఆవేశంతో ఊగిపోతుంది.

వాడి దగ్గరికి ఎవరు వెళ్లమన్నారు.. నువ్వు దూరంగా ఉంటేనే వాడికి జ్వరం వచ్చింది.. దగ్గరికి వెళ్తే ఇంకేం జరిగేదో.. నీలాంటి అబద్ధాల కోరు వాడి దగ్గరికి వెళ్లకూడదు.. వరలక్ష్మీ వ్రతం చేసి ఉంటే వాడికి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా.. దరిద్రపు దానివి అని చెడామడా తిడుతుంది. సత్యం వారిస్తున్నా ప్రభావతి వినదు. దీంతో రోహిణి బిక్కమొహం వేస్తుంది.

రవితో శృతి గొడవ.. ఉద్యోగం మానేయమంటూ..

మరోవైపు రెస్టారెంట్ లో జరిగింది తలచుకొని శృతి మండిపోతుంది. రవి రాగానే అతనితో గొడవకు దిగుతుంది. రెస్టారెంట్ లో తనను అవమానించారని చెబితే అది పట్టించుకోకుండా రెస్టారెంట్ గురించి ఆలోచిస్తావా అంటూ రవిని నిలదీస్తుంది. నేను ఉన్నప్పుడు నువ్వెందుకు వాళ్లపై సూప్ పోసి రచ్చ చేయడం.. నన్ను పిలవొచ్చగా అని రవి అంటాడు.

అప్పుడే రవికి నీతూ ఫోన్ చేస్తుంది. అది చూసి శృతి మరింత రెచ్చిపోతుంది. ఫోన్ ఎత్తిన రవి మరోసారి శృతి తరఫున తాను సారీ చెబుతున్నానని అంటాడు. కానీ నీతూ మాత్రం ఫోన్ స్పీకర్ లో పెట్టు తాను శృతితో మాట్లాడాలని అంటుంది. ఆ తర్వాత ఆమెకు సారీ చెబుతుంది. తాను ఇంటికి వచ్చిన తర్వాత చాలా ఆలోచించానని, రెస్టారెంట్ కోణంలో ఆలోచించానే తప్ప.. ఓ ఆడపిల్ల కోణంలో ఆలోచించలేదని వివరణ ఇస్తుంది.

అంతేకాదు శృతిని బెస్ట్ ఎంప్లాయీ అంటూ ఆకాశానికెత్తేలా మాట్లాడుతుంది. దీంతో శృతి కూల్ అవుతుంది. తిరిగి ఉద్యోగంలో చేరడానికి ఒప్పుకుంటుంది. ఫోన్ పెట్టేసిన తర్వాత ఇలాంటి పోకిరీల నుంచి లేడీ ఉద్యోగులను కాపాడటానికి ఓ బెల్ పెట్టాలని కూడా రవితో అంటుంది. తర్వాత ఇద్దరూ కలిసి ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తారు.

మీనాపై బాలు అలక.. ప్రభావతి చేత్తో కాఫీ కావాలంటూ..

మరోవైపు ఉదయాన్నే బాలు ఇంకా రాలేదా అని మీనాను సత్యం అడుగుతాడు. ఎక్కడ తాగి పడిపోయాడో అని ప్రభావతి నోరు పారేసుకుంటుంది. అప్పుడే బాలు వస్తాడు. బాలు, మీనా ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటారు. కానీ బాలు తనతో మాట్లాడని సంగతి గుర్తుకొచ్చి మీనా మళ్లీ కోపంగా చూస్తుంది. బాలు కూడా మీనాతో మాట్లాడడు. తనకు కాఫీ కావాలని మీనాను కాకుండా తల్లిని అడుగుతాడు. కాఫీవతి.. నాకు కాఫీ పెట్టవా అని తనదైన స్టైల్లో అడుగుతాడు.

దీంతో సత్యం షాక్ తింటాడు. ప్రభావతి మాత్రం తాను కాఫీ పెట్టనని, నీ పెళ్లాన్నే అడుక్కోమని అంటుంది. అదే అదునుగా సత్యం ఆమెపై సెటైర్లు వేస్తాడు. నీ చేత్తో కాఫీ ఎప్పుడూ ఆస్వాదించలేదని, మీనా ఇంటికి వచ్చినప్పటి నుంచే కాఫీ ఇష్టంగా తాగుతున్నానని అంటాడు. ఆ తర్వాత బాలుని మందలించి స్నానం చేసి రమ్మని పంపిస్తాడు. తర్వాత మీనాను కాఫీ పెట్టమంటాడు.

మనోజ్ కోసం రోహిణి రాగి జావా.. ప్రభావతి రచ్చ

అటు మనోజ్ ఉదయాన్నే లేచి కూర్చొంటాడు. రోహిణి పక్కనే ఉండటం చూసి చిరాకు పడతాడు. అమ్మ లేదా.. అని అడుగుతాడు. ఏం కావాలా.. ఏమైనా తాగడానికి తేవాలా అని రోహిణి అడిగితే వద్దు అమ్మ తెస్తుంది అని అంటాడు. ఆమె బద్ధకంగా ఎలా ఉండాలో బుక్కు రాస్తోందని అని రోహిణి సెటైర్ వేసి తానే రాగి జావా తెస్తానని వెళ్తుంది. కిచెన్ లో జావా కాస్తుండగా మీనా వచ్చి ఏం చేస్తున్నావని అడిగితే.. ఏం చేయకూడదా అని రోహిణి వెటకారంగా అడుగుతుంది.

దీంతో మీనా రుసరుసలాడుతూ వెళ్లిపోతుంది. ప్రభావతి కాఫీ అడిగితే కిచెన్ లో రోహిణి జావా కాస్తోందని, టైమ్ పడుతుందని చెబుతుంది. దీంతో ప్రభావతి కిచెన్ లోకి వెళ్లి రోహిణిని నిలదీస్తుంది. అందులో ఏం కలిపావే.. నా కొడుకును మళ్లీ నీ వలలో వేసుకోవాలని అనుకుంటున్నావా.. బయటకు నడవవే నంగనాచి అంటూ లాక్కెళ్తుంది. అడ్డొచ్చిన మీనాను కూడా తిట్టి రచ్చరచ్చ చేస్తుంది. అది అక్కడితో ముగుస్తుంది.

మీనా అందానికి బాలు ఫిదా

మరోవైపు మీనాపై అలిగిన బాలు.. ఆమె అందం చూసి ఫిదా అయిపోతాడు. ఆమెను ప్రేమగా హత్తుకుంటాడు. కానీ మీనా మాత్రం అలక వీడదు. బాలు కూడా నీపై అలిగాను కదా.. మళ్లీ ఎందుకు పట్టుకున్నాను అనుకొని దూరంగా జరుగుతాడు. మళ్లీ ఇద్దరూ సరదాగా మాటామాటా అనుకుంటారు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks