...
...
Next Story

Gunde Ninda Gudi Gantalu Today Episode: శివకు రాఖీ కట్టిన మీనా, అవమానం- చిల్లర ఏరుకున్న ప్రభావతి- సత్యంకు మాటిచ్చిన బాలు

Gunde Ninda Gudi Gantalu Serial September 1st Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ సెప్టెంబర్ 1వ తేది ఎపిసోడ్‌లో సత్యం ఇంటికి శివ వస్తాడు. ప్రభావతి ఘోరంగా అవమానిస్తుంది. శివకు మీనా రాఖీ కడుతుంది. మౌనిక వచ్చేట్టు లేదని ఇంటికే వెళ్లమని మీనా చెబుతుంది. బాలుతో సత్యం మాట తీసుకుంటాడు.

Published on: Sep 1, 2026, 08:10:26 IST
Advertisement

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రోహిణి, మనోజ్‌ను అనడంతో బాలు ఏదోటి అంటాడు. బాలును పక్కకి తీసుకెళ్లి అత్తయ్య చెప్పినట్లు మౌనికకు చాలా పనులు ఉంటాయి. వస్తాయని గ్యారెంటీ లేదంటుంది. అలా అనకను బాలు వెళ్లిపోతాడు.

మా అమ్మను ఎత్తుకెళ్లి గోదాట్లో పడేయ్

గుండె నిండా గుడి గంటలు సీరియల్ సెప్టెంబర్ 1 ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ సెప్టెంబర్ 1 ఎపిసోడ్

మౌనిక కోసం చాలా సేపటి నుంచి అంతా ఎదురుచూస్తుంటారు. ఇంకెంత సేపు వెయిట్ చేయాలిరా అని మనోజ్ అంటాడు. మౌనిక రాదు కానీ శివ వస్తాడు. ఈసారి దేనిమీద కన్నేశావని శివను అవమానిస్తుంది ప్రభావతి. ఈసారి మా అమ్మను ఎత్తుకెళ్లి గోదాట్లో పడేయ్ అని బాలు అంటాడు. మనింట్లోనే పెద్ద దొంగల ముఠా ఉంది. ఇంకా వేరేవాళ్లను అంటున్నావా అని బాలు గడ్డిపెడతాడు.

దీన్నే చెప్పులిచ్చి మరి చెప్పుతో కొట్టించుకోవడం అంటారని సత్యం అంటాడు. గెస్టులు వచ్చినప్పుడు ఇలా అనొద్దని శ్రుతి అంటే.. ఈ ముష్టోడు గెస్ట్ ఏంటని ప్రభావతి అంటుంది. మాటలు జాగ్రత్తగా రాని ప్రభా.. అతను ఇంటి కోడలి తమ్ముడు. గౌరవించాల్సిన అవసరం లేదు కానీ అవమానించొద్దు అని సత్యం అంటాడు. ఇది ఈ ఇంట్లో మనకున్న గౌరవం. ఎందుకు వచ్చావురా అని బాధగా అడుగుతుంది మీనా.

శివకు రాఖీ కట్టిన మీనా

రాఖీ పండుగ కదా అక్క. నీకు రావడానికి కుదురుతుందా లేదో అని నేనే వచ్చాను అని శివ అంటాడు. రాఖీ కూడా కొన్నానురా. పనుండి లేట్ అయింది అని మీనా అంటుంది. ఎలాగు వచ్చాడుగా ఇక్కడే కట్టు మీనా అని శ్రుతి అంటుంది. ఏర్పాట్లు ఏమైనా చేయమంటారా అని ప్రభావతి వెటకారం ఆడుతుంది. నోటికి తాళం వేయమని సత్యం అంటాడు.

సూది దారంతో కుట్టిన ఆ నోరు మూతపడదని బాలు అంటాడు. మీ ఇద్దరి కాంబినేషన్‌తో రీల్స్ చేస్తే బాగా వైరల్ అవుతాయని శ్రుతి అంటుంది. నువ్వు నోర్మూయ్ అని ప్రభావతి అంటే.. అబ్బా బాగా డబ్బులు వస్తాయని శ్రుతి అంటుంది. దాంతో నోరెళ్లబెట్టిన ప్రభావతి హా పెట్టు పెట్టు అని అంటుంది. దాంతో ప్రభావతిపై కౌంటర్స్ వేస్తాడు బాలు.

శివ కట్నం పెడతాడు. రూపాయి బిల్ల కింద పడుతుంది. ఆ డబ్బు డబ్బు అంటూ ఏరుతుంది ప్రభావతి. రూపాయి బిల్ల చూసి గోల్డ్ కాయిన్ అనుకున్నా. వీళ్ల స్థాయి తెలిసి కూడా అలా ఎలా అనుకుంటాను. జాగ్రత్తగా దాచుకో అని ప్రభావతి అంటుంది. మీనా, శ్రుతి, రవి తిడతారు. దాంతో బాలు తన డబ్బు ఇచ్చి శివను ఇవ్వమంటాడు.

ఇటుక రాయి ఎత్తితే పుచ్చలేచిపోతుంది

వద్దని మీనా అంటుంది. మా శివ మాకు జీవితాంతం తోడుగా ఉంటాడని మీనా అంటుంది. వాడికి పెళ్లి కాదా. అప్పుడు ఇదే మాట అను అని ప్రభావతి అంటుంది. ఇప్పుడే వీళ్లు విడిపోవాలని కోరుకుంటున్నావా అని బాలు అంటాడు. సత్యం తిడతాడు. శివ వెళ్లిపోతాడు. మౌనిక కోసం ఎదురుచూస్తుంటారు. మౌనిక సౌకర్యాల గురించి ప్రభావతి గొప్పగా చెబితే.. రోహిణి గురించి చెప్పి శ్రుతి చురకలు వేస్తుంది.

రోహిణి కోపంగా చూస్తే తగ్గు.. ఏమాత్రం భయపడను అని శ్రుతి అంటుంది. మీరే మౌనిక దగ్గరికి వెళ్లండని మీనా అంటుంది. వీడు వెళ్తే రాఖీ కట్టించుకుని రాడు కట్టు కట్టించుకుని వస్తాడు. వాళ్లు చేతులు విరగ్గొట్టి పంపిస్తారని ప్రభావతి అంటుంది. ఎవడు నా మొగుడు మీద చేయి వేసేది. ఇటుక రాయి ఎత్తానంటే పుచ్చలేచిపోతుంది మీనా అంటుంది.

గొడవ చేయనని సత్యంకు మాటిచ్చిన బాలు

ఏంటే రౌడీలా మాట్లాడుతున్నావ్ అని ప్రభావతి అంటుంది. నా మొగుడిని కొట్టేంతవాన్ని తీసుకురండి. వాడి చేయో నా మొగుడి చేయే తేలుస్తానని మీనా అంటుంది. మనోజ్, రవిని మాత్రం వెళ్లమంటుంది ప్రభావతి. సత్యం ముగ్గురిని వెళ్లమంటాడు. బాలును మాత్రం కోపం తెచ్చుకోకండని మీనా అంటుంది. అక్కడ ఏం జరిగినా గొడవ చేయనని, ఏం అనని మాట ఇస్తావా అని సత్యం అడిగితే.. బాలు మాటిస్తాడు.

బాలు, మనోజ్, రవి వెళ్తారు. మరోవైపు సంజు యువజన నాయకుడుగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంటాడు. అది చూసి రాఖీ గురించి మౌనిక, సువర్ణ బాధపడుతుంటారు. మౌనిక ఇంటికి ముగ్గురు అన్నదమ్ములు వస్తారు. మనోజ్ పోజులు కొడుతుంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks