Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రోహిణి వైపు మొగ్గుచూపుతున్నావా అని ప్రభావతి అడిగితే.. లేదని మనోజ్ అంటాడు. రోహిణి చేసిన తప్పులు, మోసాలను గుర్తు చేస్తుంది. ఇన్ని చేసినా టాబ్లెట్ ఇస్తే మింగావ్, జావ ఇస్తే మింగావంటుంది.
నాకోసమేగా చేసింది

మలేషియా అని కబుర్లు చెప్పి అవి నిజంగానే కబుర్లు అని తేల్చింది అని ప్రభావతి అంటుంది. రోహిణి దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ మంచిదే కదమ్మా. ఏం చేసిన నా కోసమేగా చేసింది అని రోహిణికి సపోర్ట్ చేస్తాడు. అప్పుడే వచ్చి రోహిణి మాటలు వింటుంటుంది. నువ్వు దానికి మంచిది అని సర్కారు స్టాంప్ ఇవ్వకు. పెళ్లి అయినా తర్వాత అయిన నిజాలు చెప్పాలిగా. బాలుగాడు వచ్చి చెప్పేదాకా చెప్పలేదని కోప్పడుతుంది ప్రభావతి.
నువ్వు దాని వల్లో పడితే నీ ఇష్టం.. చంపేస్తా.. మళ్లీ దాని ప్రస్తావన తీసుకొస్తే. ఏది కావాలన్న నన్నే అడుగు. దాన్ని పిలిస్తే ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది ప్రభావతి. చేయి కాల్చుకున్న ఉపయోగం లేకపోయిందని రోహిణి అనుకుంటుంది. మరోవైపు రోహిణి చేయి కాల్చుకున్నదాని గురించి మీనా, శ్రుతి మాట్లాడుకుంటారు.
శ్రుతి రెచ్చిపోయి మాట్లాడుతుంది. అప్పుడే రోహిణి వస్తుంది. చేయి చూస్తుంది. శ్రుతి సెటైర్లు వేస్తుంటే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా అని మీనాను అంటుంది రోహిణి. నేను మీకు స్టాండప్ కమెడియన్‌లా కనిపిస్తున్నాగా రోహిణి అంటుంది. ఇలా మాట్లాడుతుంటే అలాగే అనిపిస్తుందని శ్రుతి పంచ్ వేస్తుంది. తను మన తోడికోడలు అలా అనకు అని మీనా అంటుంది.
పుండు మీద కారం చల్లుతున్నావా
తను మనల్ని అలా చూసిందా. మలేషియా అని, ఆస్తులు అని ఎంత బిల్డప్ కొట్టింది అని శ్రుతి అంటుంది. పుండు మీద కారం చల్లుతున్నావా శ్రుతి అని రోహిణి అంటుంది. మా సంగతి వదిలేయ్. అయినా ఆంటీ నమ్మట్లేదుగా అని శ్రుతి అంటుంది. అత్తయ్య ఎంత చెప్పిన నమ్మదు. నన్నే చూస్తున్నావుగా. నేను నిజాయితీగా ఉన్నా కాబట్టే అప్పుడప్పుడు నోరు మూయించగలుగుతున్నాను. నీకు అత్తయ్య జీవిత ఖైదు విధించారు అని మీనా అంటుంది.
{{/usCountry}}తను మనల్ని అలా చూసిందా. మలేషియా అని, ఆస్తులు అని ఎంత బిల్డప్ కొట్టింది అని శ్రుతి అంటుంది. పుండు మీద కారం చల్లుతున్నావా శ్రుతి అని రోహిణి అంటుంది. మా సంగతి వదిలేయ్. అయినా ఆంటీ నమ్మట్లేదుగా అని శ్రుతి అంటుంది. అత్తయ్య ఎంత చెప్పిన నమ్మదు. నన్నే చూస్తున్నావుగా. నేను నిజాయితీగా ఉన్నా కాబట్టే అప్పుడప్పుడు నోరు మూయించగలుగుతున్నాను. నీకు అత్తయ్య జీవిత ఖైదు విధించారు అని మీనా అంటుంది.
{{/usCountry}}నువ్వు ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఒక మార్గం ఉంది. కామాక్షి పిన్ని. నువ్వు పిన్నితో మాట్లాడి అత్తయ్యను మనస్ఫూర్తిగా క్షమించమని అడుగు. పిన్ని సహాయం చేస్తుంది. ఏదో చెప్పాలనిపించి చెప్పాను. తర్వాత నీ ఇష్టం అని మీనా అంటుంది. తర్వాత సత్యం దగ్గరికి వెళ్లి మీనా మాట్లాడుతుంది. ప్రభావతి ఏదోటి అంటే.. కౌంటర్ ఇస్తుంది మీనా.
ప్రభావతిని తిడతాడు సత్యం. నాకు పెద్దో ఆర్డర్ రూ. 5 లక్షలు డిపాజిట్ కడితే వస్తుందని చెప్పానుగా అని మీనా అంటుంది. డబ్బులు కట్టలేక ఆర్డర్ పోయిందా. నాకు ముందే తెలుసు. నీకు అంత స్థాయిలేదని లోకంలో అందరికి తెలుసు అని అంటుంది ప్రభావతి. అయ్యో దివ్యదృష్టితో చూశారా అని మీనా సెటైర్లు వేస్తుంది. మీనాను సత్యం చెప్పమంటాడు.
నోరెళ్లబెట్టిన ప్రభావతి
ఆర్డర్ నాకే రాబోతుంది. డిపాజిట్ కోసం ఐదు లక్షలు దొరికాయని మీనా చెబుతుంది. పొలమారిన ప్రభావతి నిజమేనా అడుగుతుంది. 5 లక్షలు చూపిస్తే కానీ నమ్మరని తెలుసు అన్న మీనా ప్రభావతికి డబ్బు చూపిస్తుంది. 5 లక్షలు చూసి షాకై నోరెళ్లబెడుతుంది ప్రభావతి. ఊహించలేదు కదా అత్తయ్య, ఇకనుంచి మీ ఊహలకు అతీతంగా జరుగుతాయని మీనా అంటుంది.
మండపానికి మీనా వెళ్లిపోతుంది. అర్జంట్‌గా చింతామణికి ఫోన్ చేయాలని ప్రభావతి అంటుంది. ఎవరికి అని సత్యం అడిగితే.. కామాక్షికి అని అబద్ధం చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు మండపం మేనేజర్ దగ్గరికి వెళ్లి ఇంకా ఆ మీనాకోసం ఎదురుచూస్తున్నారా అని అడుగుతుంది. ఆ మీనాకు ఐదు లక్షలు తెచ్చే రేంజ్ లేదు. నాకు ఆర్డర్ ఇవ్వండని చింతామణి అంటుంది.
తనకు మా బాస్ బాగా తెలుసు. మా బాస్‌కు చెబితే సమస్య అవుతుంది. ఇప్పుడు మీరిచ్చే చెక్ కంటే మీనా గారి డిజైన్స్ చాలా బాగా నచ్చాయని మేనేజర్ అంటాడు. డిజైన్స్ నచ్చాయో అదే నచ్చిందో అని చింతామణి మనసులో అనుకుంటుంది. తన అనుభవం గురించి చెప్పి మీనాకు మాత్రమే ఇవ్వడానికి ఆంతర్యం ఏంటో అని చింతామణి అంటుంది.
చింతామణి చేసిన మోసం గురించే
అది మా ఓనర్‌ని అడగండి. ఇదివరకు వేరేచోట మోసం చేసిన వ్యక్తి గురించి ఓనర్‌కి చెబితే అతని జాబ్ పోయిందని చింతామణి మోసాన్నే చెబుతాడు మేనేజర్. మా ఓనర్ మాటే నా మాట. కాసేపు ఆగమని చెబుతాడు మేనేజర్. దాంతో పక్కకు వెళ్లిపోతుంది చింతామణి. ప్రభావతి కాల్ చేస్తుంది. నీకు చేదు వార్త చెప్పాల్సి వస్తుంది. మీనాకు 5 లక్షలు దొరికాయని ప్రభావతి ఉప్పు అందిస్తుంది.
అది ఆటోలో వస్తుంది. నేను ఆపలేకపోయాను అని ప్రభావతి అంటుంది. సరే నేను చూసుకుంటానని చింతామణి కాల్ కట్ చేస్తుంది. రౌడీలను పిలిపిస్తుంది చింతామణి. చింతామణి ఓ ప్లాన్ చెప్పి పంపిస్తుంది. మరోవైపు ఆటోలో వెళ్తూ ఆర్డర్ గురించి మురిసిపోతుంది. మీనా ఆటోలో రావడం చూసి ఇలా అయితే ఇబ్బంది అవుతుందని రౌడీలు అనుకుంటారు.
దిగినచోట లాక్కోని పారిపోదామని ఇంకో రౌడీ అంటాడు. ఆటోను ఫాలో అవుతారు. మీనాకు తన ఫ్రెండ్స్ కాల్ చేసి తాము కూడా వస్తున్నామని, స్టేజ్ కొలత తీసుకుందామని చెబుతారు. ఓ చోట ఆటో ఆగిపోతుంది. ఆటో డ్రైవర్ దిగి రిపేర్ చేస్తుంటాడు. మీనా ఆటో దిగుతుంది. టైమ్ పట్టేలా ఉందని డ్రైవర్ చెప్పడంతో మీనా నడుచుకుంటూ వెళ్తుంది.
హాస్పిటల్‌లో మీనా
మీనాను రౌడీలు ఫాలో అవుతారు. మీనా డబ్బు లాక్కునేందుకు ప్రయత్నిస్తారు. మీనా కొడుతుంది. అయనా ఇద్దరు పట్టుకుంటారు. మీనా డబ్బు లాక్కొని ఇద్దరు పడిపోతారు. ఇంతలో ఆటోలో తన ఫ్రెండ్స్ వస్తారు. మీనా తలకు దెబ్బ తగలడంతో హాస్పిటల్‌లో ఉంటుంది. బాలు వస్తాడు.
అంత డబ్బు నీ దగ్గర ఉందని వాళ్లకెలా తెలిసిందని బాలు అడుగుతాడు. అదే అనుమానంగా ఉందని మీనా అంటుంది. దీని వెనుక ఎవరున్నారో కనిపెట్టాలని బాలు అంటాడు. అంటే బాలు ఆ దొంగలను, నిజాన్ని కనుక్కోడానికి వేట మొదలుపెడతాడు. మరోవైపు మీనా డబ్బు దొంగతనం చేశామని రౌడీలు చెబితే తన దగ్గరికి తీసుకురమ్మని చింతామణి చెబుతుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.