Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. తాను ఏం చేసినా విజయవంతంగా పని పూర్తి చేసే బాలుకి షాక్ తగులుతుంది. చింతామణి ఇంట్లో ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్ల ప్లాన్ ఫెయిలై శృతి దొరికిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.
అరుణ్ విషయం తెలిసి మీనాలో ఆందోళన

అరుణ్ తల్లి గురించి మీనాకి సుమతి చెప్పే సీన్ తో సీరియల్ సోమవారం (సెప్టెంబర్ 28) ఎపిసోడ్ మొదలైంది. ఆమె తన కాబోయే అత్తగారని, వాళ్ల దగ్గరే రూ.3 లక్షలు తీసుకొని నీకు ఇచ్చానని ఆమె చెప్పడంతో మీనా షాక్ తింటుంది. అప్పటి నుంచి ఆమె కంగారు మరింత పెరుగుతుంది. ఈ విషయం నాకు ముందే చెబితే వద్దనేదాన్ని కదా.. పోతే ఓ ఆర్డర్ పోయేదేమో కానీ ఇక్కడ నీ జీవితమే పోయే ప్రమాదం ఉంది.. వాళ్లు నీ గురించి ఏమనుకుంటారు అంటూ మీనా టెన్షన్ పడుతుంది.
కానీ సుమతి ఆమె సర్ది చెబుతుంది. తన బంగారం అమ్మయినా వాళ్ల డబ్బు వాళ్లకిచ్చేద్దామంటుంది. కానీ మీనా ఆమెకు వద్దని చెప్పి ఇంటికి బయలుదేరుతుంది. దారిలోనూ దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా బాలుకి అదే విషయం చెప్పి బాధ పడుతుంది. కానీ బాలు తన దగ్గర ఓ ప్లాన్ ఉందంటూ రాజేష్ ని ఇంటికి పిలుస్తాడు.
బాలు ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్ల ప్లాన్.. రాజేష్, రవి, శృతి ఎంట్రీ
ఆ తర్వాత అందరూ కలిసి ఇంటిపైకి వెళ్తారు. బాలు ప్లాన్ లో రాజేష్ తోపాటు రవి, శృతి కూడా ఉంటారు. మీనా డబ్బు ఆ చింతామణి ఇంట్లోనే ఉందని, అందువల్ల మనం ఇప్పుడు ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్ల రూపంలో ఆ ఇంటికి వెళ్లి ఆ డబ్బును వెనక్కి తీసుకొద్దాం అని బాలు అంటాడు. మరి ఆ చింతీ తనను గుర్తు పడుతుంది, తన గొంతు గుర్తు పడుతుంది అని శృతి అంటుంది. అందుకే ఆ చింతీని కొంతసేపు కామాక్షి అత్త ఇంట్లోనే ఉండేలా ప్లాన్ చేశాను.. ఆమెకు కూడా అందుకు ఒప్పుకుంది అని బాలు చెబుతాడు.
ప్లాన్ బాగానే ఉన్నా రవి మాత్రం టెన్షన్ పడుతుంటాడు. దొరికిపోతే మనం జైలుకి వెళ్లాల్సి వస్తుందని అంటాడు. దీంతో శృతి అతన్ని తిడుతుంది. నువ్వసలు మగాడివేనా అని అనడంతో అతడు ఇక చాలు ఆపు అని అంటాడు. ఆ తర్వాత మీనా డబ్బు గురించి పడిన కష్టం గురించి బాలు చెప్పడంతో వదిన డబ్బు కోసమైనా సరే వెళ్దాం.. నేనూ వస్తాను అని రవి అంటాడు. తర్వాత అందరూ సై అంటారు.
చింతామణి ఇంటికి బాలు అండ్ టీమ్.. కామాక్షి ఇంటికి చింతామణి
{{/usCountry}}ప్లాన్ బాగానే ఉన్నా రవి మాత్రం టెన్షన్ పడుతుంటాడు. దొరికిపోతే మనం జైలుకి వెళ్లాల్సి వస్తుందని అంటాడు. దీంతో శృతి అతన్ని తిడుతుంది. నువ్వసలు మగాడివేనా అని అనడంతో అతడు ఇక చాలు ఆపు అని అంటాడు. ఆ తర్వాత మీనా డబ్బు గురించి పడిన కష్టం గురించి బాలు చెప్పడంతో వదిన డబ్బు కోసమైనా సరే వెళ్దాం.. నేనూ వస్తాను అని రవి అంటాడు. తర్వాత అందరూ సై అంటారు.
చింతామణి ఇంటికి బాలు అండ్ టీమ్.. కామాక్షి ఇంటికి చింతామణి
{{/usCountry}}ఆ తర్వాత తాము అనుకున్నట్లే అందరూ ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్లలాగే రెడీ అయి చింతామణి ఇంటికి వెళ్తారు. ఆమె కారు ఉండటంతో వీళ్లు బయటే కారులో వేచి చూస్తుంటారు. చింతామణి ఉందని తెలియడంతో రవి వణికిపోతుంటే బాలు, శృతి ధైర్యం చెబుతారు. తర్వాత చింతామణి బయటకు వస్తుంది. కామాక్షి ఇంటికి బయలుదేరుతుంది. అది చూసిన బాలు అండ్ టీమ్ ఇక లోని వెళ్లడానికి రెడీ అవుతుంది. అప్పటికే రెడీ చేసుకున్న ఐడీ కార్డులను వాళ్లు మెడలో వేసుకుంటారు.
కామాక్షికి ఫోన్.. చింతామణిని వదలొద్దంటూ..
ఆ తర్వాత కామాక్షికి బాలు ఫోన్ చేస్తాడు. చింతామణి ఇప్పుడే మీ ఇంటికి బయలుదేరింది. ఆమెను అక్కడే హౌస్ అరెస్ట్ చేయమని బాలు చెబుతాడు. తాను చూసుకుంటానని, అయినా ఈ పూజ చేస్తే కనక వర్షం కురుస్తుందని ఆమెకు ఆశ పెట్టాను అని కామాక్షి చెబుతుంది.
మరి దానికి ఏర్పాట్లు చేయలేదు కదా అని బాలు అడిగితే.. ఈ మధ్య పంతుళ్లే ప్యాకేజీలాగా అన్నీ చేస్తున్నారు కదా.. వాళ్లే తీసుకొస్తారని చెబుతాను అని కామాక్షి అంటుంది. తర్వాత రవి ఫోన్ తీసుకొని ఆమెను వదలొద్దు అత్త.. ఆమె వస్తే మేము అరెస్ట్ అవుతామని భయపడుతూ చెబుతాడు. బాలు ఫోన్ లాక్కొని కట్ చేసి ఇంట్లోకి తీసుకెళ్తాడు.
చింతామణి ఇంట్లో బాలు అండ్ టీమ్ హడావిడి
ఆ తర్వా త అందరూ కలిసి చింతామణి ఇంట్లోకి వెళ్తారు. అక్కడున్న పనోళ్లు వీళ్లను పట్టించుకోరు. దీంతో అందరూ హడావిడి చేస్తుంటారు. ఒక వ్యక్తిని రాజేష్ కొట్టడంతో మిగిలిన వాళ్లు కూడా భయపడతారు. చింతామణికి ఫోన్ చేయకుండా అందరి దగ్గరికి నుంచి ఫోన్లు లాక్కుంటారు. తర్వాత ఇంట్లో సోదాలు మొదలు పెడతారు. కానీ వాళ్లకు ఎక్కడా డబ్బు కనిపించదు.
చింతామణికి దొరికిపోయిన శృతి
అయితే అప్పటికే చింతామణి కడుపు గడబిడతో బాధపడుతూ ఉంటుంది. కామాక్షి ఇంటికి వెళ్లినట్లే వెళ్లి మళ్లీ బాత్రూమ్ పిలవడంతో తిరిగి ఇంటికి పరుగెత్తుకొస్తుంది. అప్పటికి బాలు అండ్ టీమ్ ఇంట్లోనే ఉండటంతో ఆమెను చూసి షాక్ తింటారు. వెనుక డోరు నుంచి అందరూ పారిపోతారు. కానీ శృతి మాత్రం ఇంట్లో చిక్కుకుపోతుంది. అప్పుడే చింతామణి వచ్చి ఆమెను చూస్తుంది. శృతి దొరికిపోయింది అంటూ బాలుకి రవి చెప్పి టెన్షన్ పడుతుంటాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.