...
...
Next Story

Gunde Ninda Gudi Gantalu Today Episode: దొరికిన మీనా 5 లక్షలు- నవ్వులపాలైన రోహిణి- అత్త, మామ ముందే బాలుకు మీనా ముద్దు

Gunde Ninda Gudi Gantalu Serial September 29th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ సెప్టెంబర్ 29వ తేది ఎపిసోడ్‌లో అప్పటివరకు చింతామణి అసిస్టెంట్ రూమ్ వెతికారని వర్కర్ చెప్పడంతో పైకి వెళ్లి వెతుకుతారు బాలు వాళ్లు. లాకర్ కీస్ దొరుకుతాయి. వాటిని ఓపెన్ చేయగానే మీనా 5 లక్షల డబ్బు కవర్ దొరుకుతుంది.

Published on: Sep 29, 2026, 07:31:12 IST
Advertisement

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో చింతామణి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్‌గా వెళ్లిన బాలు, రవి, శ్రుతి, రాజేష్ రూ. 5 లక్షల డబ్బు కోసం వెతుకుతుంటారు. మరోవైపు చింతామణికి మోషన్స్ రావడం వల్ల కారును ఇంటికి తిప్పమంటుంది.

చింతామణి అవస్థలు

గుండె నిండా గుడి గంటలు సీరియల్ సెప్టెంబర్ 29 ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ సెప్టెంబర్ 29 ఎపిసోడ్

మరోవైపు మీరు ఇప్పటివరకు వెతికింది అసిస్టెంట్ రూమ్ సర్. డబ్బు బంగారం అయితే పైన రూమ్‌లో ఉంటాయని అక్కడ పనిచేసే వర్కర్ చెబుతాడు. దాంతో పైకి వెళ్లి బాలు వాళ్లు వెతుకుతారు. మరోవైపు చింతామణి కారును ఆపమంటుంది. కడుపునొప్పిగా ఉందని చింతామణి అంటుంది. వాటర్ బాటిల్, ట్యాబ్లెట్స్ తీసుకొస్తానంటాడు అసిస్టెంట్.

మరోవైపు రవి భయపడుతుంటాడు. రవితోనే వర్కర్స్‌ను బెదిరించేలా చేస్తాడు బాలు. బుడ్డ సార్ తిడుతున్నాడురా అని వర్కర్స్ వెళ్లిపోతారు. తర్వాత లాకర్ కీస్ రవికి దొరుకుతాయి. బాలు లాకర్ కీస్ తీస్తాడు. ఆరెంజ్ కలర్ కవర్ దొరుకుతుంది. అందులో ఐదు లక్షలు ఉంటాయి. వాటిని బాలు లెక్కపెట్టి అందరికి థ్యాంక్స్ చెబుతాడు బాలు.

బాలు వాళ్లు కిందకు దిగుతారు. ఏం దొరకలేదా సర్ అని వర్కర్ అడిగితే.. దొరికితే చేతుల్లో ఉండేవిగా అని బాలు అంటాడు. అప్పుడే చింతామణి వస్తుంది. అది బాలు వాళ్లు చూస్తారు. ఈ ఇంటికి ఇంకోదారి ఉందా అని అడుగుతారు. వంటగది నుంచి ఉందని వర్కర్ చెబుతాడు. దాంతో ఆ వైపు బాలు వాళ్లు పరుగెడతారు. ఇంతలో శ్రుతి వాచ్ పక్కనున్న స్టాండ్‌కు చిక్కుకుంటుంది.

పోవే చింతి..

అవును అని పైకి వెళ్లిపోతుంది చింతామణి. కారు దగ్గరికి శ్రుతి వెళ్తుంది. కారులో అంతా బయలుదేరుతారు. ఎక్కడైన కాలువలో ఐడీ కార్డ్స్ అన్ని పడేయమని రాజేష్‌తో చెబుతాడు బాలు. మరోవైపు మీనా టెన్షన్ పడుతుంటుంది. బాలు కాల్ చేసి సక్సెస్ మీనా. రూ. 5 లక్షలు డబ్బు దొరికిందని బాలు చెబుతాడు. నీ డబ్బు, సుమతి డబ్బు అంతా దొరికింది. ఎవరి మాట పోదు అని బాలు అంటాడు.

నా చెల్లి జీవితంపై మచ్చ పడకుండా ఉంటుందని కన్నీటి బాష్పాలు రాలుస్తుంది మీనా. బాలు వాళ్లు ఇంటికి వస్తారు. అందరిని పిలుస్తాడు. డ్రైవర్ ఏంటీ ఆఫీసర్‌లా కనిపిస్తున్నాడని ప్రభావతి అంటుంది. ఈ వేషమంతా ఏంట్రా అని సత్యం అడుగుతాడు. ఐదు లక్షలు తీసి మీనాకు ఇవ్వమని సత్యంకు ఇస్తాడు బాలు. ప్రభావతి, మనోజ్ నోరు వెళ్లబెడతారు.

కర్త కర్మ క్రియ అంతా అమ్మనే

నీ ఫ్రెండ్, శిష్యురాలు కొట్టేసిన డబ్బు ఇదే అని బాలు అంటాడు. దొరికేసిందా అని ప్రభావతి అంటే.. దాని ఇంట్లోనే దొరికిందని శ్రుతి అంటుంది. బాలు గురించి గొప్పగా చెబుతుంది మీనా. అసలు ఏం జరిగిందో చెప్పురా అని సత్యం అడుగుతాడు. దీనంతటికి కర్త, కర్మ, క్రియ అంతా అమ్మనే. మీనా నుంచి డబ్బులు ఎత్తుకెళ్లింది దొంగలు కాదు. చింతామణి మనుషులు అని బాలు జరిగింది చెబుతాడు బాలు.

అలాంటి మనిషితో నీకేం పని, ఎందుకు దగ్గరికి రానిస్తున్నావ్ అని సత్యం నిలదీస్తాడు. ఒక్కటే ప్రశ్న.. నా దగ్గర డబ్బులున్న విషయం మీకే చెప్పాను. ఆ చింతామణికి మీరు చెబితేనేగా తెలిసింది అని మీనా అంటుంది. కచ్చితంగా ఆంటీనే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటుంది అని శ్రుతి అంటుంది. ఆపండి. నేను కేవలం తనను శిష్యురాలిగా మాత్రమే చూస్తున్నా. ఇదే చింతామణి స్థానం కోసం ఎగబాకుతుందని ప్రభావతి అంటుంది.

అనవసరంగా అత్తయ్య మీద బురదచల్లుతున్నారని రోహిణి అంటుంది. పలికింది చిలక. నువ్వు నాకేం వత్తాసు పలకనక్కర్లేదు. నేను నిన్ను ఎత్తుకోని ఊరేగను అని చివాట్లు పెడుతుంది ప్రభావతి. దాంతో శ్రుతి నవ్వుతుంది. అత్తకు సపోర్ట్ చేసి నవ్వులపాలు అవుతుంది రోహిణి. అసలు డబ్బు ఎలా తెచ్చారా అని మనోజ్, సత్యం అడుగుతారు.

ఇది చాలా పెద్ద క్రైమ్

జరిగిన డ్రామా అంతా చెబుతాడు బాలు. ఇది చాలా పెద్ద క్రైమ్. దొరికింటే ఇరుక్కునేవారని మనోజ్ అంటాడు. మీరు చాలా చేశారు. దొరికేలా చేస్తే చెరోదిక్కు ఉండేవారని బాలు పంచ్ ఇస్తాడు. కానీ, చెబుతుంటేనే భయంగా ఉంది. ఇలాంటివి ఇంకెప్పుడు చేయకండని సత్యం అంటాడు. మీనా డబ్బు తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టి మొక్కుకుంటుంది.

మరోవైపు బాత్రూమ్ నుంచి చింతామణి బయటకు వస్తుంది. ఆ మీనా గ్యాంగ్ వచ్చి ఆదాయపు పన్ను శాఖ వారని చెప్పి ఇల్లంతా సోదా చేసి చివరికి బీరువా లాకర్ కూడా ఓపెన్ చేశారట అని అసిస్టెంట్ చెబుతాడు. వర్కర్ జరిగింది చెబుతాడు. ఇంతలో మీనా కాల్ చేస్తుంది.

ఇప్పుడు నేనంటే ఏంటో తెలిసి ఉండాలి. నువ్వు కొట్టేసిన డబ్బు నా భర్త తిరిగి సంపాదించాడని మీనా అంటుంది. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి చెబుతానని చింతామణి అంటుంది. దానికంటే ముందు ఆ 5 లక్షలు ఎలా వచ్చాయో చెప్పాలి. అలాగే నీ వీడియోలు చూపిస్తే ఏమవుతావో గుర్తుపెట్టుకో అని మీనా మాస్ వార్నింగ్ ఇస్తుంది.

బాలుకు మీనా ముద్దు

ఇలా ఎవరికి భయపకుండా నీ పని నువ్వు చేసుకో అని సత్యం అంటాడు. ఇలా అందరి అసూయలు కలిసి చేసే పని మీనాను ఎక్కడికో తీసుకెళ్తాయి అని బాలు అంటాడు. దాంతో బాలుకు అత్త, మామ అందరి ముందే బుగ్గకు ముద్దు పెడుతుంది మీనా. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks