Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో సత్యం, ప్రభావతి ఇంట్లో వరలక్ష్మీ వ్రతం ఏర్పాట్లు జరుగుతాయి. తనను కూర్చోవద్దన్న అత్తను పడేయడానికి రోహిణి మరో ప్లాన్ చేస్తుంది. ఆ ప్లాన్ ఆమె విషయంలో వర్కౌట్ అయినా.. మనోజ్ మనసు మాత్రం కరగదు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
వరలక్ష్మీ వ్రతానికి ఇంట్లో ఏర్పాట్లు.. రోహిణికి నో ఛాన్స్

సుశీల ఫోన్ చేసి ఇంట్లో వరలక్ష్మీ వ్రతం జరిపించిండని చెప్పే సీన్ తో సీరియల్ శనివారం (సెప్టెంబర్ 5) ఎపిసోడ్ మొదలైంది. దీంతో ఇంట్లో వ్రతం కోసం ఏర్పాట్లు చేయడానికి సిద్ధమవుతుంటారు. అసలు వరలక్ష్మీ వ్రతం ఎందుకు చేస్తారని అత్తను శృతి అడుగుతుంది. పోయి పోయి ఆమెను అడుగుతావా అని బాలు ఎగతాళి చేస్తాడు.
భర్తలు బాగుండాలని కోరుకుంటూ భార్యలు ఈ వ్రతం చేస్తారని, ఆ రోజు వచ్చిన వారికి వాయనం ఇచ్చి, కాళ్లకు పసుపు రాస్తారని మీనా చెబుతుంది. దీంతో తాను కూడా వ్రతం చేస్తానని రోహిణి అంటుంది. అయితే ఈ వ్రతంలో రోహిణి ఎట్టి పరిస్థితుల్లోనూ కూర్చోవద్దని ప్రభావతి ఆర్డర్ వేసి వెళ్లిపోతుంది. దీంతో ఆమె బిక్కమొహం వేస్తుంది.
తోటి కోడళ్ల సింపథీ కోసం రోహిణి ప్లాన్.. కడిగిపారేసిన శృతి
ఆ తర్వాత కిచెన్ లో మీనా, శృతి కలిసి రోహిణి గురించి కాస్త జాలి చూపిస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అది విన్న రోహిణి.. వీళ్ల సింపథీని వాడుకొని వ్రతంలో కూర్చోవాలని అనుకొని వెళ్తుంది. అయితే అక్కడ ప్లాన్ రివర్స్ అవుతుంది. తాను వ్రతంలో కూర్చోవడానికి మీరే కాస్త అత్తయ్య, మామయ్యతో మాట్లాడొచ్చు కదా అని రోహిణి వాళ్లను అడుగుతుంది.
ఇక శృతి అందుకుంటుంది. దానికి నీకైనా సిగ్గుండాలి.. మాకైనా సిగ్గుండాలి.. ఇంతకుముందు నీ తరఫున మాట్లాడితే మమ్మల్ని జోక్యం చేసుకోవద్దని అన్నావ్.. ఇప్పుడే మొహం పెట్టుకొని వచ్చావ్.. అయినా ఇన్ని మోసాలు చేసిన నిన్ను ఇంట్లో ఉండనివ్వడమే గొప్ప.. నేనే మీ అత్తని అయి ఉంటే చితకబాదేదాన్ని.. అయినా నువ్వు కాబట్టి ఛీ అన్నా, ముఖం మీద ఉమ్మినా తుడుచుకొని ఉంటున్నావ్.. మేమైతే అలా ఉండేవాళ్లం కాదు.. నీ భర్త కూడా వేస్ట్ గాడు కాబట్టి ఆంటీ నిన్ను అంత కొట్టినా అడ్డు రాలేదు.. మా భర్తలు అలా కాదు అంటూ నోటికొచ్చిన మాటలన్నీ అంటుంది.
{{/usCountry}}ఇక శృతి అందుకుంటుంది. దానికి నీకైనా సిగ్గుండాలి.. మాకైనా సిగ్గుండాలి.. ఇంతకుముందు నీ తరఫున మాట్లాడితే మమ్మల్ని జోక్యం చేసుకోవద్దని అన్నావ్.. ఇప్పుడే మొహం పెట్టుకొని వచ్చావ్.. అయినా ఇన్ని మోసాలు చేసిన నిన్ను ఇంట్లో ఉండనివ్వడమే గొప్ప.. నేనే మీ అత్తని అయి ఉంటే చితకబాదేదాన్ని.. అయినా నువ్వు కాబట్టి ఛీ అన్నా, ముఖం మీద ఉమ్మినా తుడుచుకొని ఉంటున్నావ్.. మేమైతే అలా ఉండేవాళ్లం కాదు.. నీ భర్త కూడా వేస్ట్ గాడు కాబట్టి ఆంటీ నిన్ను అంత కొట్టినా అడ్డు రాలేదు.. మా భర్తలు అలా కాదు అంటూ నోటికొచ్చిన మాటలన్నీ అంటుంది.
{{/usCountry}}దీంతో రోహిణి ముఖం మాడిపోతుంది. నువ్వు నన్ను తిడుతున్నావో, జాలి చూపిస్తున్నావో అర్థం కావడం లేదని రోహిణి అంటుంది. మీ సాయం అవసరం లేదులే.. నా సంగతి నేను చూసుకుంటానని రోహిణి అనడంతో చూశావా ఈమె అసలు క్యారెక్టర్ ఇదీ అని శృతి మళ్లీ తిడుతుంది. దీంతో రోహిణి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మీనా మాత్రం ఆమె తరఫున మనమే మాట్లాడదామని అంటుంది.
విద్య దగ్గర రోహిణి బాధ.. వ్రతంలో కూర్చుంటానని పంతం
తర్వాత విద్య దగ్గరికి వెళ్తుంది రోహిణి. ఆమె దగ్గర తన బాధ చెప్పుకుంటుంది. అయినా నువ్వు చేసిన మోసాలంటూ విద్య కూడా రోహిణినే తిడుతుంది. తల్లినే చంపిన దానివి అని అనడంతో రోహిణి ఫీలవుతుంది. తన తల్లి గురించి మాత్రం అలా మాట్లాడకు అని అంటుంది.
అయితే ఇంత జరిగినా ఆమెలో ఎలాంటి మార్పు రాదు. ఎలాగైనా సరే తాను వ్రతంలో కూర్చుంటానని, ఇంటి పెద్ద కోడలిగా తానే ఈ వ్రతం ముందుండి జరిపిస్తానని, అత్తయ్యే తనను పిలిచి కూర్చోబెట్టేలా చేస్తానని పంతానికి పోతుంది. ఈ వ్రతంతో మనోజ్ పై తనకు ఎంత ప్రేమ ఉందో నిరూపిస్తానని అంటుంది.
రోహిణి మరో ఎత్తుగడ.. అత్త దగ్గరికి సోదమ్మ
కామాక్షి ఇంట్లో ఉన్న అత్త ప్రభావతి దగ్గరికి ఓ సోదమ్మను పంపిస్తుంది. ఆమెకు ముందే ఏం చెప్పాలో కూడా చెబుతుంది. తనను వ్రతంలో కూర్చోబెట్టేలా చేయాలని స్పష్టం చేస్తుంది. దీంతో కామాక్షి ఇంటికి ఆ సోదమ్మ వెళ్తుంది. కంచి కామాక్షి కొలువైన ఇల్లు అని కామాక్షిని చూసి అనడంతో ఆమె మురిసిపోయి సోదమ్మను లోనికి తీసుకెళ్తుంది. అక్కడ ప్రభావతికి సోది చెప్పమని అడుగుతుంది.
ప్రభావతికి ఇష్టం లేకపోయినా కామాక్షి బలవంతంగా కూర్చోబెడుతుంది. ఆ తర్వాత నీ మొగుడి పేరు నిజం, మనసు నిజం.. నీకు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్లు.. పెద్దోడు అన్నీ మింగేస్తుంటాడు.. రెండో వాడు లోపల ఏదీ దాచుకోడు.. మూడోవాడు కక్కలేక మింగలేక అన్నట్లు ఉంటాడు అని చెబుతుంది. పెద్ద కోడలు ఎన్నో మోసాలు చేసిందనీ చెబుతుంది. దీంతో ఆమె చెప్పేవన్నీ నిజాలని అనుకొని ప్రభావతి ఆమె మాటలను నమ్మడం ప్రారంభిస్తుంది.
కొడుకును కోటీశ్వరున్ని చేస్తుందంటూ సోది.. ప్రభావతి సందిగ్ధం
అయినా సరే పెద్ద కోడలు ఓ నక్షత్రం పేరు పెట్టుకొని వచ్చింది.. ఆమెను అన్ని విషయాల్లో ముందుంచాలని, పూజలు, వ్రతాలు ఆమెతో చేయించాలని అంటుంది. ఆమె పేరు రోహిణి.. నక్షత్రం పేరు కదా అని ప్రభావతి అనుకుంటుంది. ఆమె చాలా అదృష్టవంతురాలు.. ఆమె పక్కనుంచే నీ పెద్ద కొడుకు కోటీశ్వరుడు అవుతాడు.. లేదంటే మింగడానికి ఏమీ మిగలదు అని సోదమ్మ చెబుతుంది.
దీంతో ప్రభావతి ఆలోచనలో పడుతుంది. రోహిణిని తానే వ్రతంలో కూర్చోవద్దని చెప్పానని, ఇప్పుడు తానే కూర్చోబెడితే తన పరువు పోతుందని, మీనా, శృతి నవ్వుకుంటారని, బాలుగాడు ఏడిపిస్తాడని భయపడుతుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదని అంటుంది.
కరగని మనోజ్ మనసు
ఇటు ఇంట్లో వరలక్ష్మీ వ్రతం ఏర్పాట్లు చేస్తుంటారు. రోహిణిని పక్కన నిల్చోబెట్టి మీనా, శృతి, మౌనిక వ్రతం పనుల్లో ఉంటారు. మౌనిక రావడం చాలా ఆనందంగా ఉందని ప్రభావతి అంటుంది. ఆ తర్వాత వ్రతంలో ముగ్గురూ జంటలుగా కూర్చొంటేనే నువ్వూ కూర్చోవాలని అని రోహిణికి ప్రభావతి స్పష్టంగా చెబుతుంది. అయితే మనోజ్ మాత్రం అందుకు ఒప్పుకోడు. అతని మనసు కరగదు. రోహిణి బతిమాలినా సరే.. నీతో పూజలో కూర్చోవడం ఇష్టం లేదంటూ వెళ్లిపోతాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.