...
...
Next Story

Gunde Ninda Gudi Gantalu Today Episode: పరువు నిలబెట్టావంటూ బాలుని మెచ్చుకున్న ప్రభావతి.. గుణకు ఎడాపెడా ఇచ్చేసిన రోహిణి

Gunde Ninda Gudi Gantalu Serial September 7th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ సెప్టెంబర్ 7 ఎపిసోడ్ లో బాలుని తొలిసారి మెచ్చుకుంటుంది ప్రభావతి. అటు దినేష్ పేరు చెప్పి రోహిణిని బ్లాక్‌మెయిల్ చూడాలని చూసిన గుణకు ఆమె గట్టిగానే ఇచ్చుకుంటుంది.

Published on: Sep 7, 2026, 07:07:52 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ కూడా వరలక్ష్మీ వ్రతం ఏర్పాట్లు చుట్టూనే సాగింది. రోహిణిని ఎలా కూర్చోబెట్టాలా అని ఆలోచిస్తూ వచ్చిన ప్రభావతికి ఆ పని బాలు చేసి పెడతాడు. అటు గుణ మరోసారి రోహిణిని బ్లాక్‌మెయిల్ చేయాలని చూసి భంగపడతాడు.

రోహిణికి సపోర్ట్ చేయాలా వద్దా అన్నదానిపై చర్చ

Gunde Ninda Gudi Gantalu Today Episode: పరువు నిలబెట్టావంటూ బాలుని మెచ్చుకున్న ప్రభావతి.. గుణకు ఎడాపెడా ఇచ్చేసిన రోహిణి
Gunde Ninda Gudi Gantalu Today Episode: పరువు నిలబెట్టావంటూ బాలుని మెచ్చుకున్న ప్రభావతి.. గుణకు ఎడాపెడా ఇచ్చేసిన రోహిణి

బాలు, రవి, శృతి, మీనా డైనింగ్ టేబుల్ దగ్గర మాట్లాడుకునే సీన్ తో సీరియల్ సోమవారం (సెప్టెంబర్ 7) ఎపిసోడ్ మొదలైంది. రోహిణికి సపోర్ట్ చేయాలా వద్దా అన్నదానిపై వాళ్లు మాట్లాడుకుంటారు. బాలు కూడా శృతిలాగే ఆమెకి సపోర్ట్ చేసి మళ్లీ మాటలు పడటం అవసరమా అని అంటాడు.

శృతి కూడా మీలాగే తయారైంది.. రోహిణిని నానా మాటలు అన్నది.. అది కూడా ఆమె మనసులో పెట్టుకుంది అని మీనా చెప్పడంతో నువ్వు నా జిరాక్స్ కాపీలా తయారయ్యావని బాలు ఆమెతో అంటాడు. రోహిణికి సపోర్ట్ చేయాలా వద్దా అన్నది మీరే తేల్చుకోండి అని బాలు స్పష్టం చేస్తాడు. సత్యంతో మాట్లాడాలని మీనా నిర్ణయించుకుంటుంది.

గుణకు దినేష్ ఫోన్..

అటు గుణకు డబ్బుల కొరత ఏర్పడుతుంది. ఇచ్చిన అప్పులు సరిగా వసూలు కావు. శివ ఉంటే బాగా చూసుకుండే వాడని అతని మనుషులు చెబుతారు. దీంతో ఆ బాలుగాడే వాడిని దూరం చేశాడని గుణ తిట్టుకుంటాడు. అప్పుడే గుణకు దినేష్ ఫోన్ చేస్తాడు. ఎలా ఉన్నావ్.. నా బంగారు బాతు ఎలా ఉందని అడుగుతాడు.

అయితే వాడి పేరు చెప్పి రోహిణి దగ్గర డబ్బు వసూలు చేద్దామనుకొని ఆమెకు ఫోన్ చేస్తాడు. దినేష్ గాడు మళ్లీ బెదిరిస్తున్నాడు.. అర్జెంటుగా రూ.2 లక్షలు కావాలట.. లేదంటే నీ సీక్రెట్స్ ఇంట్లో వాళ్లకు చెబుతానంటున్నాడు.. వాడితో ఎందుకు గొడవ.. ఆ డబ్బేదో నాకు పంపించు.. నేను వాడికి పంపిస్తా అంటాడు.

దీంతో రోహిణికి అనుమానం వస్తుంది. దినేష్ కు డబ్బు కావాలంటే నేరుగా నాకే ఫోన్ చేస్తాడు.. మధ్యవర్తి అవసరం లేదు.. ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర వేయకు అని గుణకు క్లాస్ పీకి ఫోన్ కట్ చేస్తుంది రోహిణి. దీంతో ఇక్కడా వర్కౌట్ కాలేదని గుణ అనుకుంటాడు.

రోహిణి తరఫున సత్యంతో మాట్లాడిన మీనా, శృతి

అటు మీనా, శృతి మాట్లాడుకుంటూ ఉండగా సత్యం వస్తాడు. రోహిణి గురించి అడుగుదామని వాళ్లు డిసైడవుతారు. అప్పుడే ఆమె కూడా వస్తుంది. మీరు మాకొక మాట ఇవ్వాలి.. ఓ మాట సాయం చేయాలి అని అడుగుతారు. వ్రతంలో రోహిణిని కూర్చోవద్దని అత్తయ్య చెప్పింది.. అమ్మమ్మ చెప్పినట్లు ముగ్గురితోనూ వ్రతం చేయించేలా చేయండి అని రిక్వెస్ట్ చేస్తారు. ఆమెను ఒప్పించడం కష్టమే అని సత్యం అంటాడు.

అప్పుడే ప్రభావతి లోనికి వస్తూ ఉంటుంది. సోదమ్మ చెప్పిన మాట ప్రకారం తనకు తానుగా రోహిణిని ఎలా వ్రతంలో కూర్చోమని చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో మీనా, శృతి, సత్యం మాటలు విని తన పని సులువైందని, వాళ్లు బతిమాలితే ఒప్పుకున్నట్లు బిల్డప్ ఇద్దాం అని అనుకుంటుంది.

రెచ్చిపోయిన ప్రభావతి.. శృతికి వార్నింగ్.. బాలు నాటకం

ఇంట్లోకి అడుగుపెట్టిన ప్రభావతిని రోహిణి గురించి సత్యం అడుగుతాడు. కానీ ప్రభావతి మాత్రం ఒప్పుకోదు. ఆ మోసగత్తె కూర్చోవడం ఇష్టం లేదని కరాఖండిగా చెబుతుంది. ఒప్పుకుంటే ఏమవుతుంది అని శృతి అనడంతో ఆమెపై విరుచుకుపడుతుంది. అసలు నువ్వేమనుకుంటున్నావ్.. అత్తంటే గౌరవం లేదా.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే దానిని చూసినట్లే నిన్ను కూడా చూస్తాను అని గట్టి వార్నింగ్ ఇస్తుంది.

ఇదంతా విన్న బాలు ఓ నాటకం మొదలు పెడతాడు. సుశీలతో ఫోన్ లో మాట్లాడుతున్నట్లుగా వ్రతం గురించి చెబుతూ కిందికి వస్తాడు. ముగ్గురు కోడళ్లతోనూ చేయిస్తోందని, ఏమైనా మార్పులు ఉంటే నీకు చెబుతానని అంటాడు. అది విన్న ప్రభావతి రోహిణి కూర్చోవడానికి అంగీకరిస్తుంది. నాకు ఇష్టం లేకపోయినా నా కొడుకు బాగుండాలని ఒప్పుకుంటున్నాను అని అంటుంది. వెళ్తూ వెళ్తూ బాలుని చూసి.. నేను ఎక్కడా తగ్గకుండా చేశావ్.. నా పరువు నిలబెట్టావ్ రా అని మనసులో అనుకుంటుంది ప్రభావతి. అత్తయ్యే తనకు తానుగా ఒప్పుకునేది.. వీళ్లంతా ఓవరాక్షన్ చేశారని రోహిణి కూడా మనసులో అనుకొని వెళ్లిపోతుంది.

రోహిణిని చూసి మనోజ్ ఫిదా.. కల కంటూ..

ఇక వ్రతం రోజు ఉదయమే రోహిణి చక్కగా రెడీ అవుతుంది. పట్టు చీర కట్టుకొని ఇళ్లంతా సాంబ్రాణితో ధూపం పెడుతుంది. అది చూసిన మనోజ్ ఫిదా అవుతాడు. తులసి చుట్టూ తిరుగుతున్న రోహిణిని చూస్తాడు. తన భార్యలాగా కాదు.. దేవతలా కనిపిస్తోందని, ఆ వరలక్ష్మీ దేవే వచ్చిందా అన్నట్లుగా ఉందని మనోజ్ అనుకుంటాడు. కట్ చేస్తే ఇదంతా రోహిణి కల అని అర్థమవుతుంది. ఈరోజు ఎలాగైనా తన ప్రేమను మనోజ్ కు చూపించి తనవైపుకు తిప్పుకుంటాను అని రోహిణి అనుకుంటుంది.

మారని మనోజ్.. రోహిణిని దూరం పెట్టి.. ప్రభావతి వార్నింగ్

వెళ్లి మనోజ్ ను లేపుతుంది. కానీ అతడు మాత్రం చిరాకు పడతాడు. గుడ్ మార్నింగ్ అని చెబితే.. పొద్దున్నే నీ ముఖం చూసిన తర్వాత గుడ్ మార్నింగ్ ఏంటి.. బ్యాడ్ మార్నింగే అని విసుక్కుంటాడు. రోహిణిని పట్టించుకోకుండా వెళ్లిపోతాడు. అప్పుడే రోహిణిని ప్రభావతి పిలుస్తుంది. వ్రతం గురించి చెబుతూ ఆమెకు గట్టి వార్నింగ్ ఇస్తుంది. వ్రతం ఎలా చేయాలో వివరిస్తుంది. వ్రతంలో ఏమేం ఉండాలి.. ఎలా చేయాలి.. వ్రతం పూర్తయిన తర్వాత ఏం చేయాలన్నది వివరంగా చెప్పడంతో రోహిణి అదంతా విని కంగారు పడుతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks