...
...
Next Story

Gunde Ninda Gudi Gantalu Promo: చింటు స్కూల్లోనే సత్యం జాబ్.. బాలు, సత్యంకి దొరికిపోయిన రోహిణి

Gunde Ninda Gudi Gantalu Promo: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఏప్రిల్ 23 ఎపిసోడ్ ప్రోమోలో రోహిణికి కొత్త కష్టం వచ్చి పడుతుంది. చింటు చదివే స్కూల్లోనే సత్యంకు జాబ్ వస్తుంది. ఇది ఆమె జీవితాన్ని మరో మలుపు తిప్పబోతోందని స్పష్టమవుతోంది.

Published on: Apr 23, 2026, 14:14:48 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Gunde Ninda Gudi Gantalu Promo: గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజుకో మలుపుతో ప్రేక్షకులను కట్టి పడేస్తోంది. సత్యం అండ్ ఫ్యామిలీ చుట్టూ తిరిగే ఈ కథలో ఇంటి పెద్ద కోడలు రోహిణి తన పెళ్లిని కాపాడుకోవడం కోసం చేసే పనులు.. మిగిలిన వాళ్లకు చిక్కులు తెచ్చి పెడుతూ ఉంటాయి. అయితే తాజా ఎపిసోడ్ లో ఆమె నాటకం బయటపడే పరిస్థితి కనిపిస్తుంది.

ఉద్యోగానికి బయలుదేరిన సత్యం

Gunde Ninda Gudi Gantalu Promo: చింటు స్కూల్లోనే సత్యం జాబ్.. బాలు, సత్యంకి దొరికిపోయిన రోహిణి
Gunde Ninda Gudi Gantalu Promo: చింటు స్కూల్లోనే సత్యం జాబ్.. బాలు, సత్యంకి దొరికిపోయిన రోహిణి

గుండె నిండా గుడి గంటలు సీరియల్ తాజా ఎపిసోడ్ ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది. ఇందులో సత్యం ఉద్యోగానికి వెళ్లడానికి రెడీ అవుతాడు. బాలు వద్దని వారిస్తున్నా వినడు. తన భార్య చేసిన తప్పుకు తాను ఈ ఉద్యోగం చేయాల్సిందే అని సత్యం పట్టుబడతాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో బాలుయే తన కారులో సత్యాన్ని దిగబెట్టడానికి వెళ్తాడు.

చింటు చదివే స్కూల్లోనే సత్యం ఉద్యోగం

బాలుని సత్యం ఓ స్కూలు దగ్గరికి తీసుకెళ్తాడు. తాను ఉద్యోగం చేయబోయే స్కూల్ ఇదేనని అతడు అంటాడు. అప్పుడే రోహిణి కూడా చింటుని తీసుకొని ఆటోలో వస్తుంది. అప్పుడే సత్యం ఉద్యోగం చేయబోయేది చింటు చదివే స్కూల్లోనే అని తెలుస్తుంది. బాలు, సత్యం గేటు బయట ఉండటం చింటు చూస్తాడు. బాలు అంకుల్ అని అంటాడు. వాళ్లను చూసి రోహిణి షాక్ తింటుంది.

ఆమె బాలు, సత్యంకు దొరికిపోతుందా? చింటుకి, తన తల్లికి ఓ కొత్త జీవితం ఇద్దామనుకున్న రోహిణికి ఇప్పుడు సత్యం రూపంలో మరో సమస్య ఎదురు కానుందా? దీనిని ఆమె ఎలా అధిగమిస్తుంది? ఎలాంటి ఎత్తుగడలు వేస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇది తెలియాలంటే గుండె నిండా గుడి గంటలు సీరియల్ నెక్ట్స్ ఎపిసోడ్ చూడాల్సిందే.

700 ఎపిసోడ్లు వైపు దూసుకెళ్తూ..

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe