గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 579వ ఎపిసోడ్ మొత్తం బాలు, మీనా, మనోజ్ చుట్టే తిరుగుతుంది. తమ కొత్త కారును బాలు, మీనా.. రాజేష్ కు రెంట్ కు ఇవ్వగా.. అటు మనోజ్ తనకు వచ్చిన లేఖ చూసి భయపడుతూ జ్యోతిష్యుడి దగ్గరకు వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
మౌనిక గురించి చెప్పి ఏడ్చిన బాలు.. ఓదార్చిన మీనా

గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం (డిసెంబర్ 19) ఎపిసోడ్ మౌనిక గురించి మీనాకు చెబుతూ బాలు ఏడ్చే సీన్ తో మొదలైంది. అసలు మౌనిక అలా ఎందుకు చేసింది.. ఆ రోజు జరిగినదాన్ని మనసులో పెట్టుకొని అలా చేసిందా అని బాలు బాధపడతాడు. మీనా అతన్ని ఓదారుస్తుంది. ఫంక్షన్ హడావిడిలో ఉండి సంజూ పక్కనే ఉండటం వల్ల అలా చేసి ఉండొచ్చు.. తర్వాత ఆమెనే ఫోన్ చేస్తుంది.. అతిగా ఆలోచించొద్దని ఓదారుస్తుంది.
అటు మౌనికతో మెల్లగా తన భార్య ఎలా ఉండాలో అలా మారుతున్నావని సంజూ అంటాడు. బాలుతో నువ్వు ఎలా ప్రవర్తించావో చూశానని, అలాగే ఉండమని అంటాడు. అప్పుడే మీనా ఫోన్ చేస్తుంది. కానీ మౌనిక కట్ చేస్తుంది. అది చూసి సంజూ మరింత మురిసిపోతాడు. అటు మీనా ఆందోళన చెందుతుంది.
లెటర్ గురించే ఆలోచిస్తూ మనోజ్ ఆందోళన.. ప్రభావతికి ఫోన్
ఇటు ఇంట్లో మనోజ్ తనకు వచ్చిన లెటర్ గురించే ఆలోచిస్తూ రాత్రి నిద్ర కూడా పోడు. ఎవరి వల్ల సమస్యలు వస్తాయా అని ఆలోచిస్తూ.. రోహిణినీ అనుమానిస్తాడు. తర్వాత తల్లి ప్రభావతికి ఫోన్ చేసి పెరట్లోకి రమ్మంటాడు. ఆమె మరే ఉపద్రవం తెచ్చాడో అనుకుంటూ వెళ్తుంది. అక్కడికి వెళ్లిన తర్వాత ఆ లెటర్ గురించి చెబుతాడు.
అయినా తల్లిని అని కూడా చూడకుండా అన్ని మాటలు అన్న తర్వాత నిన్ను ఎందుకు పట్టించుకోవాలి.. నిన్ను నేను నమ్మను.. ఆ బాలుగాడిని అయినా నమ్ముతాను కానీ నిన్ను నమ్మను అని మరోసారి మనోజ్ ను ప్రభావతి కొడుతుంది. తల్లి కూడా నమ్మకపోవడంతో మనోజ్ బాధపడుతూ వెళ్లిపోతాడు.
రాజేష్‌కు బాలు కారు రెంట్.. మనోజ్‌కు కడిగి పారేసిన మీనా
{{/usCountry}}అయినా తల్లిని అని కూడా చూడకుండా అన్ని మాటలు అన్న తర్వాత నిన్ను ఎందుకు పట్టించుకోవాలి.. నిన్ను నేను నమ్మను.. ఆ బాలుగాడిని అయినా నమ్ముతాను కానీ నిన్ను నమ్మను అని మరోసారి మనోజ్ ను ప్రభావతి కొడుతుంది. తల్లి కూడా నమ్మకపోవడంతో మనోజ్ బాధపడుతూ వెళ్లిపోతాడు.
రాజేష్‌కు బాలు కారు రెంట్.. మనోజ్‌కు కడిగి పారేసిన మీనా
{{/usCountry}}ఇటు బాలు తాను కొత్తగా కొన్న కారును తన ఫ్రెండ్ రాజేష్ కు రెంట్ కు ఇస్తాడు. సత్యం చేతుల మీదుగా తాళాలు అందుకొని తన ఆశీర్వదించమని రాజేష్ కోరతాడు. బాలు పెద్ద బిజినెస్‌మ్యాన్ కావాలని రాజేష్ అనడంతో ఎవడు పడితే వాడు కాలేడు.. దానికో స్టేటస్ ఉండాలని మనోజ్ అంటాడు.
దీంతో మీనా అతన్ని కడిగి పారేస్తుంది. షాపులో మోసపోవాలి.. దాని కోసం నా నగలు అమ్ముకోవాలి.. బిజినెస్‌మ్యాన్ అంటే ఇలాంటి స్టేటస్‌లే ఉండాలని మీనా దెప్పిపొడుస్తుంది. తన భర్తను ఎందుకు అంటున్నావని రోహిణి అంటే.. ఇక నుంచి తన భర్తను ఎవరు తక్కువ చేసినా ఇలాగే ఉంటుందని మీనా స్పష్టం చేస్తుంది.
దీంతో ప్రభావతి జోక్యం చేసుకొని బాలు, మీనాలను అవమానించేలా మాట్లాడుతుంది. మీనా కూడా గట్టిగానే సమాధానం ఇచ్చి.. మా ఆయన ఎన్ని కార్లు కొంటాడో చూడండి అని మరో శపథం చేయబోతుండగా.. బాలు అడ్డుకుంటాడు. ఇప్పటికే రెండు ఉన్నాయి.. అవి పూర్తయిన తర్వాత చేద్దువుగానీ అంటాడు. సత్యం మరోసారి ప్రభావతిని తిట్టి వెళ్లిపోతాడు.
పార్క్ ఫ్రెండ్‌తో కలిసి జ్యోతిష్యుడి దగ్గరికి మనోజ్..
ఇటు మనోజ్ కు ఏం చేయాలో తోచక తన పార్క్ ఫ్రెండ్ కు ఫోన్ చేస్తాడు. అతనికి కూడా ఆ లెటర్ విషయం చెబితే.. నీ వల్లే మరొకరికి సమస్య కదా అని అతడూ ఎగతాళి చేస్తాడు. తర్వాత ఇద్దరూ కలిసి జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తారు. అతడు మనోజ్ ను చూసి త్వరలోనే నీకు పెద్ద ఆపద రాబోతోందని అనడంతో మనోజ్ మరింత టెన్షన్ పడతాడు. దానికి పరిహారంగా రోజుకో రంగు బట్టలు వేసుకోమంటాడు.
మరోవైపు ఇంట్లో రవి తమ రెస్టారెంట్ లో బెస్ట్ కపుల్ కాంపిటీషిన్ నిర్వహిస్తున్నారని, గెలిచిన వారికి రూ.లక్ష ఇస్తారని చెబుతాడు. దీంతో మనోజ్, రోహిణి, ప్రభావతి ఆ డబ్బుకు ఆశపడతారు. బాలు, మీనా కూడా ఈ పోటీకి సిద్ధమవుతారు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.