...
...
Next Story

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: రోహిణికి ఎదురు తిరిగిన సుగుణ.. బాలు, మీనాలకే దత్తతకిస్తానంటూ.. మళ్లీ మోసపోయిన మనోజ్

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (ఫిబ్రవరి 3) ఎపిసోడ్ లో రోహిణికి సుగుణ ఎదురు తిరగడం హైలైట్ గా చెప్పొచ్చు. చింటుపై హక్కు తనకే ఉంటుందని.. బాలు, మీనాకు దత్తతకు ఇస్తానని చెబుతుంది. ఇటు రోహిణి చేతుల్లో మనోజ్ మరోసారి మోసపోతాడు.

Published on: Feb 3, 2026, 06:53:05 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 611వ ఎపిసోడ్ లో రోహిణి మరోసారి తన మాటలతో మనోజ్ ను బురిడీ కొట్టిస్తుంది. అతడు మళ్లీ మోసపోతాడు. అటు చింటు కోసం మరోసారి సుగుణ దగ్గరికి వెళ్తారు బాలు, మీనా. దీంతో కన్న కూతురినే సుగుణ ఎదురిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

రోడ్డుపై బాలు, మీనా గొడవ.. పోలీస్ ఫైన్

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: రోహిణికి ఎదురు తిరిగిన సుగుణ.. బాలు, మీనాలకే దత్తతకిస్తానంటూ.. మళ్లీ మోసపోయిన మనోజ్
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: రోహిణికి ఎదురు తిరిగిన సుగుణ.. బాలు, మీనాలకే దత్తతకిస్తానంటూ.. మళ్లీ మోసపోయిన మనోజ్

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (ఫిబ్రవరి 3) ఎపిసోడ్ రోడ్డుపై బాలు, మీనా గొడవతోనే మొదలవుతుంది. ఎవరూ తగ్గకుండా ఒకరినొకరు తిట్టుకుంటారు. ఇంతలో పోలీస్ వస్తాడు. రూ.500 ఫైన్ కట్టండి అని అనడంతో మీనా దిగి వచ్చి.. అతడు తన భర్త అని చెబుతుంది. దీంతో పోలీస్ వెళ్లిపోతాడు. ఇద్దరూ కలిసి తనను బకరాను చేశారా అని బాలు కారులో వచ్చిన ప్యాసెంజర్ బాధపడతాడు. ఇంటికి రా నీ సంగతి చూస్తానంటూ మీనా వెళ్లిపోతుంది.

ఇటు హాస్పిటల్లో తల్లి సుగుణకు రోహిణి సేవలు చేస్తుంటుంది. అప్పుడే సిస్టర్ అక్కడికి రావడంతో తల్లి బాగోగులు చూసుకోవడానికి ఎవరైనా కావాలని చెబుతుంది. తానే చూసుకుంటానని అనడంతో ఆమె సంతోషపడుతుంది.

రోహిణికి మనోజ్ ఫోన్.. అబద్ధం చెప్పి..

అదే సమయంలో రోహిణికి మనోజ్ ఫోన్ చేస్తాడు. తాను విద్య దగ్గరికి వచ్చానని ఆమె అబద్ధం చెబుతుంది. అప్పుడే విద్య షాపుకు వస్తుంది. దీంతో మనోజ్ మరోసారి ఎక్కడున్నావని రోహిణిని అడిగితే.. ఆమె విద్య దగ్గరే ఉన్నానని అంటుంది.

అటు ఇంట్లో మీనా ఆవేశంతో ఊగిపోతుంది. బాలు రాగానే అతనిపైకి వంటింట్లో గ్లాసులు, ప్లేట్లు విసిరేస్తుంది. దీంతో బాలు రాజీకి వస్తాడు. మొదట్లో బెట్టు చేసిన ఆమె తర్వాత దిగి వస్తుంది. రోడ్డుపై పడిన గొడవ, అనుకున్న మాటలకు ఒకరికొకరు క్షమాపణ చెప్పుకుంటారు. మీనా కోసం బాలు హల్వా తీసుకొస్తాడు. ఈ మధ్య మనం తరచూ గొడవ పడుతున్నాం.. ఇలా అయితే పిల్లలెలా పుడతారని మీనా అంటుంది. పిల్లలంటే గుర్తుకు వచ్చింది.. చింటు గురించి ఆమె ఏమీ చెప్పలేదు.. రేపు వెళ్దామని బాలు అంటాడు.

నిలదీసిన మనోజ్.. బురిడీ కొట్టించిన రోహిణి

అప్పుడే రోహిణి కూడా ఇంటికి వస్తుంది. ఆమెను చూడగానే మనోజ్ కోపం కట్టలు తెంచుకుంటుంది. ఎందుకు అబద్ధం చెప్పావ్.. నేను నీకు ఎప్పుడైనా చెప్పానా.. ఎవరి దగ్గరికి వెళ్లావ్.. ఇదే మొదటిసారా ఇంతకుముందు కూడా వెళ్లావా అని నిలదీస్తాడు. రోహిణి రివర్స్ అవుతుంది. మరోసారి మనోజ్ ను మాటలతో మాయ చేస్తుంది.

నీ కోసమే పక్క ఊరిలో స్వామీజీ దగ్గరికి వెళ్లాను.. మంత్రించిన మాల తీసుకొచ్చానని చెబుతుంది. నమ్మడం లేదా అయితే అతనితోనే మాట్లాడు అంటూ విద్యకు ఫోన్ చేసి ఏదేదో మాట్లాడుతుంది. అవసరం లేదులే అంటూ మనోజ్ కరిగిపోతాడు. ఆమె తెచ్చిన మాల దేవుడి దగ్గర పెట్టి ఉదయమే వేసుకుంటానని వెళ్లడంతో రోహిణి ఊపిరి పీల్చుకుంటుంది.

రవి పల్లీ పట్టీ.. ప్రభావతి కోసం మళ్లీ మీనాతో గొడవ

ఇటు కిచెన్ లో రవి పల్లీ పట్టీ చేస్తుంటే శృతి వచ్చి టేస్ట్ చేసి సూపర్ అంటుంది. అటు మీనాకు కూడా తీసుకెళ్లి ఇస్తుంది. ఇంత బాగా చేస్తున్నావంటే వీటిని మనం విదేశాలకు పంపించి బిజినెస్ చేయొచ్చని శృతి చెబుతుంది. రెస్టారెంట్ పెట్టిన తర్వాత చేద్దామని రవి అంటాడు. అప్పుడే ప్రభావతి వస్తుంది. దీంతో మరోసారి మీనాతో గొడవ పడినట్లు రవి, శృతి నటిస్తారు. ఆమె ఎంతో ఆనందంతో బయటకు వెళ్లిపోతుంది.

బాలు, మీనా సుగుణ దగ్గరికి వెళ్తారు. చింటు దత్తత విషయం ఆమెకు చెబుతారు. దీంతో ఆమె సంతోషిస్తుంది. రోహిణికి ఫోన్ చేసి ఆ విషయం చెబితే ఆమె తిడుతుంది. చింటును తానే పెంచానని, అతనిపై తనకే హక్కు ఉంటుందని, తాను బాలు, మీనాలకు దత్తత ఇస్తానని తేల్చి చెబుతుంది. దీంతో రోహిణి షాక్ తింటుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks