...
...
Next Story

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మనోజ్ క్రైమ్ కథ- రోహిణిని ఇటుకతో కొట్టబోయిన ప్రభావతి- లక్ష అడ్వాన్సుతో అద్దె ఇల్లు

గుండె నిండా గుడి గంటలు ఫిబ్రవరి 6 ఎపిసోడ్‌లో కామాక్షి చేసిన వంట ప్రయోగం బెడిసికొట్టడంతో ప్రభావతి అవస్థలు పడిందని తెలుస్తుంది. మనోజ్ తనకు వచ్చిన లెటర్ గురించి ప్రభావతికి చెబుతాడు. ఇంతలో రోహిణి పైకి వస్తే ఇటుకతో కొట్టబోతుంది ప్రభావతి. 20 వేల అద్దె, లక్ష అడ్వాన్సుతో రెంట్‌కు ఇల్లు చూస్తుంది రోహిణి.

Published on: Feb 6, 2026, 08:29:16 IST
Advertisement

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో మీనా వండిన బిర్యానీ తిని ప్రభావతి అవస్థలు పడుతుంది. మీనాను రోహిణి అంటుంది. మీనా కౌంటర్ వేస్తుంది. మీనా చేసిన బిర్యానీ తన పుట్టింట్లో ఇచ్చి, బయట కొని ఉంటుందని ప్రభావతి అంటుంది.

ఊరు గొప్ప పేరు దిబ్బ

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఫిబ్రవరి 6 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఫిబ్రవరి 6 ఎపిసోడ్‌

వాళ్లేమైనా గతి లేనివాళ్లా అని మీనా అంటే.. ఈ పార్లరమ్మలా ఒకరు జైలులో, మరొకరు పైలోకంలో ఉన్నారా. ఊరు గొప్ప పేరు దిబ్బ అని బాలు అంటాడు. కావాలంటే హోటల్ బిల్ చూడమంటుంది ప్రభావతి. ఆ బిల్ చూసిన బాలు డేట్ చూడమంటాడు. డిసెంబర్ 31 నాటి బిల్ అని సత్యం చూసి చెబుతాడు.

నా పుట్టింటిని అనడమేనా అని అత్త ప్రభావతిని అంటుంది మీనా. ఇంతలో సత్యంకు రంగ కాల్ చేసి చెల్లెమ్మకు ఎలా ఉందని అడుగుతాడు. సత్యం చెబుతాడు. అదంతా మా కామాక్షి వల్ల. అదేదో లంబ లంబా అనే వంట ప్రయోగం చేసి పచ్చ కర్పూరంకు బదులు హారతి కర్పూరం వేసిందట. ఇప్పుడే కడుపు వాష్ చేసి సిలెన్ పెట్టారు. హాస్పిటల్‌లో ఉన్నామని అని రంగ చెబుతాడు.

దాంతో రోహిణి జారుకుంటే ఎక్కడికి అని మీనా నిలదీస్తుంది. అంతా ప్రభావతిని అనేసి వెళ్లిపోతారు. అలా కామాక్షి వంట ప్రయోగం బెడిసి కొడుతుంది. లెటర్‌లో రాసింది మనోజ్‌ కలలో అనుకుంటాడు. లేచి మళ్లీ ఆ లెటర్ చదువుతాడు. వెళ్లి లెటర్ గురించి ప్రభావతికి చెబుతాడు. ఆ లెటర్ చదివిని ప్రభావతి షాక్ అవుతుంది. నాకు గుండెపోటు ఏంట్రా అని ప్రభావతి అంటుంది.

మనోజ్ క్రైమ్ కథ

ఇంతకీ ఎవడ్రా వాడు అని ప్రభావతి అంటే.. వాడ దొంగ అట అని మనోజ్ అంటాడు. ఇంతలో ఏదో చప్పుడు అయితే ఆ దొంగ వచ్చినట్లున్నాడు అని మనోజ్ భయపడుతాడు. పక్కన ఉన్న ఇటుక తీసుకుని ప్రభావతి, మనోజ్ దాక్కుంటారు. కానీ, రోహిణి వస్తుంది. రోహిణిని కొట్టేందుకు ఇటుక ఎత్తుతుంది ప్రభావతి. అత్తయ్య అనేసరికి ఇటుక దించేస్తుంది ప్రభావతి.

ఎవరిని చంపేయాలని ప్లాన్ చేస్తున్నారని రోహిణి అంటుంది. దాంతో లెటర్ కథ చెబుతాడు మనోజ్. ఆ లెటర్ చదివిన రోహిణి దీనికా భయపడేది. ఎవరో ఆటపట్టిస్తున్నాడు అని రోహిణి అంటుంది. వాడు దొంగట. అప్పుడప్పుడు జైలుకు వెళ్తాడట అని మనోజ్ అంటే.. కొంపదీసి దినేష్ గాడా అని రోహిణి డౌట్ పడుతుంది.

ఉలిక్కిపడిన బాలు

పోలీసులకు కంప్లైంట్ ఇద్దామంటే రోహిణి వద్దంటుంది. సెక్యూరిటీని పెడదామంటుంది. మరోవైపు నిద్రలో ఉలిక్కిపడి లేస్తాడు బాలు. మీనా నీళ్లు ఇస్తుంది. ఇద్దరం గొడవ పడినట్లు కల వచ్చిందని బాలు అంటాడు. తప్పు మీరే చేసి ఉంటారని మీనా అంటుంది. ఇద్దరు వాదించుకుంటారు. పీడకల నిజమయ్యేట్లు ఉందని మీనా చెప్పడంతో బాలు సైలెంట్ అవుతాడు.

ఇప్పుడే ఈ కల వచ్చింది. మా బామ్మ ఉంటే దిష్టి తీసేదని బాలు అంటాడు. దాంతో మీనానే బాలుకు అర్ధరాత్రి దిష్టి తీస్తుంది. తర్వాత ఇద్దరు పడుకుంటారు. మీనాపై కాలు వేస్తాడు బాలు. తర్వాత చేయి వేస్తాడు. మీనా వారించడంతో బాలు అటువైపు ముడుచుకుని పడుకుంటాడు. మీనా బుజ్జగిస్తుంది. మరోవైపు అద్దె ఇల్లు కోసం రోహిణి, విద్య ఓ ఇంట్లోకి వెళ్తారు.

రోహిణి, విద్య వాళ్లు అడిగే ప్రశ్నలకు ఇంటి యజమాని పంచ్‌లు వేస్తాడు. అమ్మా, కొడుకు నేను ఉంటామని, భర్త దుబాయ్‌లో ఉంటాడని రోహిణి చెబుతుంది. అయితే ఇల్లు ఇవ్వనని, ఇదివరకు దుబాయ్‌లో మొగుడు ఉంటాడని చెప్పి ఒకావిడ దిగింది. తర్వాత మొగుడు వచ్చి కొట్టాడు. ఆ తర్వాత అతన్ని పోలీసులు తీసుకెళ్లారు. ఆ తర్వాత కాలనీ వాళ్లంతా నన్ను పచ్చడి చేశారు అని ఇంటి యజమాని అంటాడు.

లక్ష అడ్వాన్స్‌తో ఇంటి అద్దె

నాకు అబద్ధం చెప్పేవాళ్లు, మోసం చేసేవాళ్లు నచ్చరు అని ఇంటి ఓనర్ అంటాడు. ఇది ఇప్పటికీ అబద్ధం చెప్పలేదు. మోసం అంటేనే తెలియదు అని విద్య అంటుంది. దాంతో ఇల్లు చూపిస్తాడు ఓనర్. కానీ, అద్దె 20 వేలు, అడ్వాన్స్ లక్ష అని చెబుతాడు. సరే రెండు రోజుల్లో ఇస్తానని టోకెన్ అడ్వాన్ ఇస్తుంది రోహిణి. మూడో రోజు వస్తే ఈ టోకెన్ అడ్వాన్స్ కూడా ఇవ్వను అని ఇంటి ఓనర్ అంటాడు.

దాంతో రోహిణి, విద్య వాళ్లు వెళ్లిపోతారు. లక్ష గురించి మాట్లాడుకుంటారు. మరోవైపు రాజేష్ పడిపోయి ఉంటే.. తాగి ఉన్నాడని ఫ్రెండ్స్ అంటాడు. ఈ బతుకులు మారవురా అని రాజేష్ మైకంలో అంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe