గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 600వ ఎపిసోడ్ లో బాలు, మీనా తమ స్నేహితుల మాటలతో ఒకరి గురించి మరొకరు అర్థం చేసుకోవడానికి సిద్ధమవుతారు. అయితే ఎపిసోడ్ చివర్లో రెండో ప్రెగ్నెన్సీ కోసం హాస్పిటల్ కు వచ్చి మరోసారి మీనాకు దొరికిపోతుంది రోహిణి. ఆమె పదేపదే ఎందుకు వస్తుందో తెలుసుకొని బాలుకి చెబుతుంది.
మీనాకు పార్వతి ఫోన్

గుండె నిండా గుడి గంటలు సోమవారం (జనవరి 19) ఎపిసోడ్ మీనాకు ఆమె స్నేహితులు బాలుని మళ్లీ ఎలా దారికి తెచ్చుకోవాలో చెప్పే సీన్ తో మొదలవుతుంది. అప్పుడే తల్లి పార్వతి కూడా ఫోన్ చేసి తాను అల్లుడిని కలిశానని, శివ విషయంలోనే అసంతృప్తిగా ఉన్నాడని చెబుతుంది.
ఆ తర్వాత భర్తను దారికి తెచ్చుకోవాలంటే మంచం, కంచెం రెండే దార్లని స్నేహితులు చెబుతారు. తన ముఖం చూడటానికి కూడా ఇష్టపడటం లేదని చెప్పడంతో అయితే కంచెం దారిలో వెళ్లాలని, బాలుకి ఇష్టమైన చికెన్ చేయాలని చెబుతారు. ఆమె సరే అంటుంది.
బాలు కళ్లు తెరిపించిన మహిళ
ఇటు ట్రిప్ కోసం వెళ్లిన బాలుకి ఓ మహిళ కళ్లు తెరిపిస్తుంది. తన కారులో ఎక్కినప్పటి నుంచీ ఆమె ఏడుస్తూనే ఉంటడంతో ఏం జరిగిందని అడుగుతాడు. తన అన్న హాస్పిటల్లో ఉన్నాడని, అయితే గతంలో తన భర్తతో గొడవ పడటంతో అతన్ని చూడటానికి కూడా వెళ్లకూడదని ఆయన ఆర్డర్ వేశారని, అందుకే తెలియకుండా వెళ్తున్నానని అంటుంది. పెళ్లియినంత మాత్రాన పుట్టింటికి పూర్తిగా దూరం కావాలా అని ఆమె అడగడంతో బాలు కూడా మీనా విషయంలో ఆలోచనలో పడతాడు. ఒకరకంగా తన కళ్లు తెరుచుకుంటాయి.
చింటు కోసం స్కూల్ చూసిన రోహిణి
ఇటు షాపులో ఉన్న రోహిణి దగ్గరికి తాము కొత్తగా స్కూల్ పెట్టామని ఇద్దరు మహిళలు వస్తారు. వాళ్లను స్కూలు గురించి ఆరా తీస్తుంది. పూర్తి వివరాలు తీసుకుంటుంది. ఎవరిని జాయిన్ చేస్తారని అడిగితే మా అబ్బాయినే అని రోహిణి అంటుంది. వెంటనే అక్కడికి వచ్చిన మనోజ్ మీ అబ్బాయి ఏంటని అడుగుతూ రోహిణిపై సందేహపడతాడు. కంగారు పడిన రోహిణి.. మా పార్లర్ లో పని చేస్తున్న అమ్మాయి వాళ్ల అబ్బాయి అని కవర్ చేస్తుంది. అలాగా అని అతడు అంటాడు.
బాలుకి రాజేష్ సలహా
{{/usCountry}}ఇటు షాపులో ఉన్న రోహిణి దగ్గరికి తాము కొత్తగా స్కూల్ పెట్టామని ఇద్దరు మహిళలు వస్తారు. వాళ్లను స్కూలు గురించి ఆరా తీస్తుంది. పూర్తి వివరాలు తీసుకుంటుంది. ఎవరిని జాయిన్ చేస్తారని అడిగితే మా అబ్బాయినే అని రోహిణి అంటుంది. వెంటనే అక్కడికి వచ్చిన మనోజ్ మీ అబ్బాయి ఏంటని అడుగుతూ రోహిణిపై సందేహపడతాడు. కంగారు పడిన రోహిణి.. మా పార్లర్ లో పని చేస్తున్న అమ్మాయి వాళ్ల అబ్బాయి అని కవర్ చేస్తుంది. అలాగా అని అతడు అంటాడు.
బాలుకి రాజేష్ సలహా
{{/usCountry}}ఇటు ఫ్రెండ్ రాజేష్ దగ్గరికి వెళ్తాడు బాలు. తన కారులో ఎక్కిన మహిళ తనతో చెప్పుకున్న బాధల గురించి రాజేష్ కు చెబుతాడు. పుట్టింటికి దూరం కావాలా అని ఆమె అన్న మాట తనకు గట్టిగా తగిలిందని అంటాడు. దీంతో రాజేష్ కూడా బాలుకి సర్ది చెబుతాడు. మీనా విషయంలోనూ ఇలాగే ఆలోచించాలని, తమ్ముడు ఏవో రెండు తప్పులు చేశాడని పూర్తిగా దూరం పెట్టదు కదా అని చెబుతాడు.
అంతేకాదు మనోజ్ విషయం గురించి కూడా చెప్పి.. అతనితో మాట్లాడొద్దని ఎప్పుడైనా చెప్పిందా.. మీ అమ్మ గురించి చాడీలు చెప్పిందా.. ఒకవేళ మౌనికను నీతో మాట్లాడొద్దని సంజూ అంటే నువ్వు ఊరుకుంటావా.. అంటూ నిలదీస్తాడు. దీంతో తప్పు తెలుసుకున్న బాలు.. వెంటనే మీనాతో మాట్లాడతానని వెళ్తాడు.
బాలు కోసం మీనా చికెన్..
ఇటు ఇంట్లో బాలు కోసం మీనా చికెన్ వండుతుంది. ఆ గుమగుమలకు శృతి, మనోజ్, రవి కూడా టెంప్ట్ అయిపోతారు. అదే సమయంలో ప్రభావతి మాత్రం తనదైన స్టైల్లో మీనాను దెప్పి పొడిస్తే.. అత్తతో ఆడుకుంటుంది శృతి. దీంతో ఈ పిల్ల రోజురోజుకీ మరీ ఎక్కువవుతోంది.. తనకు అస్సలు మర్యాద ఇవ్వడం లేదని బాధపడుతుంది. ఆ విషయంలోనూ మీనాను నిందిస్తుంది. ఇటు అందరూ మీనా వండిన చికెన్ ను ఇష్టంగా తింటారు.
అటు మరోసారి రోహిణిని హాస్పిటల్లో మీనా, సుమతి చూస్తారు. మళ్లీ మళ్లీ ఎందుకు వస్తుందో అని సందేహిస్తారు. సుమతి వెళ్లి రిసెప్షన్ లో రోహిణి గురించి ఆరా తీస్తుంది. ఆమె రెండోసారి ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకోవడానికి వచ్చిందని తెలుస్తుంది. అదే విషయం మీనాతో చెబితే.. అంటే ఇప్పటికే రోహిణికి ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిందని అర్థమవుతుంది. అవే విషయం బాలుకి చెబుతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగస్తుంది.