గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 607వ ఎపిసోడ్ లో మీనాపై మరింత కక్ష కడతారు ప్రభావతి, రోహిణి. ఆమె తనను చంపడానికి ప్లాన్ చేసిందంటూ కాలు జారి పడిన ప్రభావతి నిందలు వేస్తుంది. అయితే మీనాకు సపోర్ట్ గా శృతి కాస్త గట్టిగానే క్లాస్ పీకడంతో ప్రభావతి ఆమెకు చెక్ పెట్టడానికి తల్లి శోభ దగ్గరికి వెళ్తుంది.
శృతికి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయిన ప్రభావతి

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (జనవరి 28) ఎపిసోడ్ ప్రభావతి, మనోజ్ లను భయపడే సీన్ తో మొదలవుతుంది. దెయ్యం అంటూ మీనానే తనను భయపెట్టిందని ఆమెను తిడుతుంది ప్రభావతి. దీంతో శృతి జోక్యం చేసుకొని అది తన పని అని చెబుతుంది.
ఆమెకు కూడా వార్నింగ్ ఇచ్చి ప్రభావతి వెళ్లిపోతుంది. ఆ తర్వాత అనవసరంగా అత్తయ్యతో పెట్టుకున్నామని మీనా బాధపడుతుంది. ఏం కాదులే అని శృతి ఆమెకు సర్ది చెబుతుంది. మరుసటి రోజు ఉదయం బాలు రాగానే జరిగిన విషయం చెబుతుంది. అతడు కూడా ఆమెకు సర్ది చెబుతాడు. ఒళ్లు నొప్పులుగా ఉన్నాయనడంతో అతనికి కాపడం పెట్టడానికి వేడి నూనె తీసుకురావడానికి మీనా వెళ్తుంది.
రవికి శృతి షర్ట్ గిఫ్ట్.. ఇద్దరి మధ్య గొడవ
ఇటు రవి కోసం శృతి ఓ షర్ట్ గిఫ్ట్ గా తెస్తుంది. కానీ అలాంటిదే తన దగ్గర ఉండటంతో అది పాత షర్ట్ కొత్త కవర్లో పెట్టి ఇస్తావా అని అడుగుతాడు. దీంతో శృతి గొడవ పడుతుంది. ఇద్దరూ తిట్టుకుంటారు. మీ అమ్మ ఇలా అంటే మీ అమ్మ అలా అని అనుకుంటారు. దీంతో శృతి కోపంతో వెళ్లిపోతుంది. అప్పుడే నూనె తీసుకొని వస్తున్న మీనాను గుద్దడంతో నూనె కింద పడిపోతుంది. మీనాకు సారీ చెప్పి శృతి మళ్లీ రూమ్ లోకి వెళ్లిపోతుంది.
కాలు జారి కింద పడిన ప్రభావతి
ఇటు కింద పడిన నూనె చూసుకోకుండా ప్రభావతి బయటకు వెళ్లడానికి వచ్చి కాలు జారి కింద పడుతుంది. ఆమెను పట్టుకోవడానికి వెళ్లి మీనా కూడా పడుతుంది. అప్పుడే అందరూ వస్తారు. ఈ మీనా కావాలనే తనను చంపడానికి ఇలా ప్లాన్ చేసిందని ప్రభావతి అంటే.. రోహిణి, మనోజ్ కూడా ఆమెకు సపోర్ట్ చేస్తారు. మరింత రెచ్చగొడతారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడొద్దని ప్రభావతితో అంటుంది మీనా. ప్రభావతిని లేపడానికి వెళ్లి మనోజ్ కూడా కింద పడతాడు.
ప్రభావతి, రోహిణికి క్లాస్ పీకిన శృతి
{{/usCountry}}ఇటు కింద పడిన నూనె చూసుకోకుండా ప్రభావతి బయటకు వెళ్లడానికి వచ్చి కాలు జారి కింద పడుతుంది. ఆమెను పట్టుకోవడానికి వెళ్లి మీనా కూడా పడుతుంది. అప్పుడే అందరూ వస్తారు. ఈ మీనా కావాలనే తనను చంపడానికి ఇలా ప్లాన్ చేసిందని ప్రభావతి అంటే.. రోహిణి, మనోజ్ కూడా ఆమెకు సపోర్ట్ చేస్తారు. మరింత రెచ్చగొడతారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడొద్దని ప్రభావతితో అంటుంది మీనా. ప్రభావతిని లేపడానికి వెళ్లి మనోజ్ కూడా కింద పడతాడు.
ప్రభావతి, రోహిణికి క్లాస్ పీకిన శృతి
{{/usCountry}}ఇటు అందరూ వెళ్లిపోయిన తర్వాత మనోజ్, ప్రభావతి, రోహిణి కలిసి మీనా గురించి తప్పుగా మాట్లాడతారు. ఆమె కావాలని ఇలా చేసిందని ప్రభావతి అంటే.. ఈ మధ్య మీనా పూర్తిగా మారిపోయిందని, నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేస్తోందని రోహిణి రెచ్చగొడుతుంది. ఇదంతా విన్న శృతి వచ్చి అత్తాకోడళ్లిద్దరినీ చెడామడా తిడుతుంది.
మీనా నూనె పడేసిందే అనుకున్నాం.. మీ కళ్లు ఎక్కడ పెట్టుకున్నారని అత్తను నిలదీయడంతో ఆమె షాక్ తింటుంది. మీనాకు ఎందుకంతలా సపోర్ట్ చేస్తున్నావని రోహిణి అంటుంది. మీకు మీనాను తిట్టడానికి ఏదో ఒక సాకు కావాలి.. అది లేకపోతే మీరే క్రియేట్ చేసుకుంటారు.. ఇక నుంచి మీనా జోలికి వచ్చే ముందు ఆలోచించుకోండని ఇద్దరికీ కాస్త గట్టిగానే ఇచ్చుకొని శృతి వెళ్లిపోతుంది.
అత్త కోసం మీనా నాటు వైద్యం
ఇటు ఇంత జరిగినా అత్త కోసం మీనా తపనపడుతుంది. ఆమె కాలు బెణకడంతో నాటు వైద్యం చేయాలని అనుకుంటుంది. అదే విషయం బాలుకి చెబితే అతడు కూడా తిడతాడు. తేలు నీళ్లలో కొట్టుకుపోతుందని బయటకు తీస్తే.. అది మనల్నే కుడుతుందని, తన తల్లికి నువ్వు సేవలు చేసినా ఆమె నిన్ను తిడుతూనే ఉంటుందని అంటాడు.
అయినా మీనా మాత్రం ప్రభావతి కోసం తన ఫ్రెండ్ చెప్పిన నాటు వైద్యం చేయడానికి రెడీ అవుతుంది. ఇటు ప్రభావతి గదిలోకి వెళ్లి మరీ ఆమెను మరింత రెచ్చగొడుతుంది రోహిణి. శృతి ఆగడాలకు చెక్ పెట్టడానికి ఆమె తల్లిని కలుస్తుంది ప్రభావతి. ఇంట్లో జరిగినవి ఆమెకు చెబుతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.