గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 593వ ఎపిసోడ్ లో సత్యం ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉంటుంది. దీనికి కారణం సుమతి డిగ్రీలో కాలేజ్ టాపర్ గా నిలవడమే. బాలు, మీనాతోపాటు రోహిణి, రవి, శృతి కూడా ఈ వార్త విని చాలా సంతోషిస్తారు. సుమతి కోసం రవి బిర్యానీ కూడా చేస్తానంటాడు. అయితే ఎపిసోడ్ చివర్లో క్రెడిట్ కార్డు అంటూ మనోజ్ మరో కొత్త పెంట పెట్టడానికి రెడీ అవుతుంటాడు.
పిల్లల కోసం రోహిణి ప్లాన్

గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురువారం (జనవరి 8) ఎపిసోడ్ తన ఫ్రెండ్ విద్యతో రోహిణి చింటు, పిల్లల గురించి మాట్లాడే సీన్ తో మొదలవుతుంది. చింటుని ఊరి నుంచి ఇక్కడికి తీసుకురావాలని అనుకుంటున్నట్లు చెప్పిన రోహిణి.. వాడిని ఇంటికి తీసుకురావాంటే మాత్రం తాను మొదట గర్భం దాల్చాలని అంటుంది. అలా జరిగితే చింటు గురించి మనోజ్ కు చెబుతానని, తనకు పిల్లలు పుట్టబోతున్నారంటే అతడు ఏమీ అనడని రోహిణి అంటుంది. దానికోసం మొదట డాక్టర్ దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది.
కాలేజ్ టాపర్‌గా సుమతి.. మీనా, బాలు సంబరం
ఇటు ఇంట్లో ఉన్న మీనాకు సుమతి ఫోన్ చేస్తుంది. తాను డిగ్రీలో కాలేజీ టాపర్ గా నిలిచానని అంటుంది. దీంతో మీనా కంట ఆనంద బాష్పాలు వస్తాయి. అది చూసిన బాలు ఏం జరిగిందని అంటాడు. ఫోన్ తీసుకొని సుమతితో మాట్లాడతాడు. తాను పాసైన విషయాన్ని సుమతి చెప్పడంతో అతడు ఎంతో సంతోషిస్తాడు. నీకు ఏం కావాలో చెప్పు తీసుకొస్తానని అంటాడు. నువ్వు, మీ అమ్మ చేసిన త్యాగాల వల్లే ఈరోజు సుమతి ఈ స్థాయికి వచ్చిందని మీనాను బాలు మెచ్చుకుంటాడు.
ప్రభావతి ఈర్శ్య.. మీనా ఎమోషనల్
వెంటనే ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లందరికీ చెప్పాలని అనుకుంటారు. మొదట సత్యంకు ఈ విషయం చెబుతారు. అతడు ఎంతో సంతోషిస్తాడు. మీనా చేసిన త్యాగాన్ని సత్యం కూడా కొనియాడుతాడు. ఇంతలో ప్రభావతి కూడా అక్కడికి వస్తుంది. విషయం తెలిసి అదో గొప్ప విషయమా అని కుళ్లకుంటుంది. మనోజ్ ప్రస్తావన తీసుకొస్తూ బాలు కాసేపు ఆమెతో ఆడుకుంటాడు.
{{/usCountry}}వెంటనే ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లందరికీ చెప్పాలని అనుకుంటారు. మొదట సత్యంకు ఈ విషయం చెబుతారు. అతడు ఎంతో సంతోషిస్తాడు. మీనా చేసిన త్యాగాన్ని సత్యం కూడా కొనియాడుతాడు. ఇంతలో ప్రభావతి కూడా అక్కడికి వస్తుంది. విషయం తెలిసి అదో గొప్ప విషయమా అని కుళ్లకుంటుంది. మనోజ్ ప్రస్తావన తీసుకొస్తూ బాలు కాసేపు ఆమెతో ఆడుకుంటాడు.
{{/usCountry}}అదే సమయంలో మీనా ఎమోషనల్ అవుతుంది. సుమతి, శివలను చదివించడానికి తన తల్లి ఎంత కష్టపడిందో చెబుతూ కంటతడి పెడుతుంది. అది చూసి తానేం అన్నానని ప్రభావతి అనడంతో సత్యం ఆమెను తిడతాడు.
ఎంతో సంతోషించిన రోహిణి, శృతి, రవి
అప్పుడే అక్కడికి రోహిణి, మనోజ్, రవి, శృతి కూడా వస్తారు. వాళ్లకు కూడా ఈ విషయం చెబుతారు. రోహిణి, శృతి, రవి ఎంతో సంతోషిస్తారు. సుమతి కోసం తాను బిర్యానీ చేసి పెడతానని, నువ్వు ఇవాళ రెస్ట్ తీసుకోవాలని వదినతో రవి అంటాడు. సుమతికి తాను వాచ్ గిఫ్ట్ గా ఇస్తానని శృతి చెబుతుంది. అప్పుడే మీనాకు పార్వతి ఫోన్ చేస్తుంది. తల్లీకూతుళ్లు ఇద్దరూ కాస్త ఎమోషనల్ అవుతారు. గుడికి వెళ్తున్నానని, రమ్మని చెప్పడంతో బాలు, మీనా కూడా వెళ్లడానికి రెడీ అవుతారు.
మనోజ్‌కు క్లాస్ పీకిన రోహిణి
ఇటు షాపులో డబ్బు లెక్క పెడుతున్న రోహిణికి ప్రతి రోజూ రూ.2 వేలు తక్కువగా వస్తున్నాయని తెలుస్తుంది. ఆ విషయం మనోజ్ ను అడిగితే తాను బయట తింటున్నానని, అందుకే నెలకో రూ.30 వేలు తక్కువగా వస్తున్నాయని అంటాడు. తినడానికి అంత ఖర్చు పెడతావా అంటూ అతనికి క్లాస్ పీకుతుంది రోహిణి.
అప్పుడే మనోజ్ కు రూ.10 లక్షల లిమిట్ తో క్రెడిట్ కార్డు ఇస్తామని బ్యాంకు వ్యక్తి రావడంతో అతడు ఎగిరి గంతేస్తాడు. రోహిణి వద్దని వారిస్తున్నా ఏం కాదులే అని అతడు ఆ కార్డు తీసుకోవడానికి రెడీ అవుతాడు. ఆ క్రెడిట్ కార్డుతో మనోజ్ మళ్లీ కొంప ముంచుతాడేమో అన్న ఆందోళన రోహిణిలో మొదలవుతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.