...
...
Next Story

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: రోహిణి మోసాన్ని తెలుసుకున్న మనోజ్.. ఎవడిని కలుస్తున్నావంటూ.. తల్లికి శృతి వార్నింగ్

గుండె నిండా గుడి గంటలు సోమవారం (ఫిబ్రవరి 2) ఎపిసోడ్ లో రోహిణి తనను మోసం చేస్తున్న విషయం తెలుసుకుంటాడు మనోజ్. ఆమెను నిలదీస్తాడు. ఇటు రోడ్డుపైనే బాలు, మీనా గొడవపడటం, అటు తల్లికి శృతి ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడం చూడొచ్చు.

Published on: Feb 2, 2026, 07:55:31 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 610వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. రవి, శృతితో గొడవ వెనుక అసలు సీక్రెట్ ను సత్యానికి చెబుతాడు బాలు. దీంతో అతడూ నవ్వేస్తాడు. ఇటు తల్లి కోసం హాస్పిటల్ కు వెళ్లిన రోహిణి.. తనను మోసం చేస్తోందని అనుకొని మనోజ్ ఆమెను నిలదీస్తాడు.

బాలుని రోడ్డుపైనే నిలదీసిన సత్యం

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: రోహిణి మోసాన్ని తెలుసుకున్న మనోజ్.. ఎవడిని కలుస్తున్నావంటూ.. తల్లికి శృతి వార్నింగ్
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: రోహిణి మోసాన్ని తెలుసుకున్న మనోజ్.. ఎవడిని కలుస్తున్నావంటూ.. తల్లికి శృతి వార్నింగ్

గుండె నిండా గుడి గంటలు సీరియల్ సోమవారం (ఫిబ్రవరి 2) ఎపిసోడ్ బాలుని సత్యం రోడ్డుపైనే నిలదీసే సీన్ తో మొదలవుతుంది. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతోంది? రవి, శృతితో మీరు ఎందుకు గొడవపడుతున్నారు అని అడుగుతాడు. ఆ విషయం అమ్మని, శృతి వాళ్ల అమ్మని అడగండని బాలు అంటాడు.

అసలు ఏం జరిగిందని అడిగితే.. మీనా గురించి శృతి వాళ్ల అమ్మకి ప్రభావతి ఏం చెప్పిందో వివరిస్తాడు బాలు. దానికి మీరు ఎందుకు గొడవ పడుతున్నారని అడిగితే తమ ప్లాన్ గురించి వెల్లడిస్తాడు.

తమ ప్లాన్ గురించి చెప్పిన బాలు

విషయం తెలుసుకొని శృతి వాళ్లను అమ్మను నిలదీయడానికి మీనాతో కలిసి బాలు కారులో వెళ్తూ ఆవేశంతో ఊగిపోతుంటాడు. దీనివల్ల గొడవ మరింత పెద్దదవుతుంది తప్ప ఒరిగేదేమీ ఉండదని మీనా తన ప్లాన్ గురించి చెబుతుంది. ఇంటికి వెళ్లి రవి, శృతిలతో గొడవ పడదామని, అది గొడవ లాంటి గొడవ అని అంటుంది.

దీనికి బాలు ఓకే అంటాడు. ఇంటికి వచ్చిన తర్వాత రవి, శృతి గదిలోకి వెళ్లి గొడవ పడినట్లు, గట్టిగట్టిగా అరిచినట్లు నటిస్తారు. అసలు విషయం తెలుసుకున్న సత్యం ఊపిరి పీల్చుకుంటాడు. ఇంట్లో కొడుకులు, కోడళ్లు గొడవ పడుతుంటే చూసి సంతోషించే ఏకైక జీవి మీ అమ్మేనేమో అని బాలుతో అంటాడు.

తల్లికి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిన శృతి

దీంతో శోభ మండిపడుతుంది. తల్లితో ఇలాగే మాట్లాడతావా అని తిడుతుంది. నువ్వు చేసిన పనేంటని శృతి నిలదీస్తుంది. రవిని పెళ్లి చేసుకున్నాను.. ఇది నా ఇల్లు.. ఇక్కడి వాళ్లు నావాళ్లు.. నువ్వు జోక్యం చేసుకుంటే బాగుండదు అని వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తుంది.

హాస్పిటల్లో సుగుణ.. పరుగెత్తుకుంటూ వచ్చిన రోహిణి

ఇటు రోహిణి తల్లి సుగుణ కళ్లు తిరిగి పడిపోవడంతో హాస్పిటల్లో చేరుస్తారు. చింటూ ఏడుస్తూనే ఉంటాడు. డాక్టర్ ఆమెకు చికిత్స చేస్తుంది. విషయం తెలుసుకొని హాస్పిటల్ కు రోహిణి పరుగెత్తుకుంటూ వస్తుంది. అసలు ఏం జరిగిందని తల్లినే నిలదీస్తుంది. చాలా రోజులుగా ఇలాగే అవుతోందని ఆమె చెబుతుంది.

డాక్టర్ కూడా రోహిణిని పక్కకు పిలిచి క్లాస్ పీకుతుంది. ఆమెను మీరైనా దగ్గరుండి చూసుకోండి.. లేదంటే ఎవరినైనా ఆమె దగ్గర ఉంచండి.. హార్ట్ పేషెంట్ ను ఇలా వదిలేస్తారా అని అంటుంది. దీంతో రోహిణి ఆలోచనలో పడుతుంది. అమ్మని చూసుకోవడానికి ఎవరినైనా చూడాలని అనుకుంటుంది.

రోడ్డు మీదే బాలు, మీనా గొడవ

ఇటు పెళ్లి చూపులకు వెళ్తున్న ఓ ప్యాసెంజర్ ను ఎక్కించుకుంటాడు బాలు. అతడు పెళ్లి గురించి తలచుకొని భయపడుతుంటే ధైర్యం చెబుతాడు. మీనా గురించి చెబుతూ తమ పెళ్లి జీవితం ఎంత బాగుందో వివరిస్తాడు. అంతలోనే స్కూటీపై వెళ్తూ మీనా.. బాలు కారుకి అడ్డంగా వస్తుంది. దీంతో ఇద్దరూ రోడ్డు మీదా గొడవ పడతారు. అది చూసి ఆ ప్యాసెంజర్ షాక్ తింటాడు. ఒకరినొకరు నానా మాటలు అనుకుంటారు.

ఇటు మనోజ్ కు రోహిణి ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నావ్ అని అడుగుతాడు. తాను విద్య దగ్గరికి వచ్చినట్లు చెబుతుంది. అప్పుడే విద్య షోరూమ్ కి రావడంతో మనోజ్ షాక్ తింటాడు. అటు విద్యకు ఫోన్ చేసిన రోహిణి అటు వైపు వెళ్లొద్దని అంటుండగానే.. తాను ఇప్పటికే షాపులో ఉన్నానని చెబుతుంది. దీంతో రోహిణిపై మనోజ్ లో అనుమానం మొదలవుతుంది. ఇంటికి రాగానే ఆమెను నిలదీస్తాడు. ఎవడిని కలవడానికి వెళ్లావ్.. ఇదే మొదటిసారా అని అడుగుతాడు. దీంతో రోహిణి షాక్ తింటుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe