Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ టుడే ఎపిసోడ్ లో మీనా, బాలుకు ఇంట్లో కొత్త కష్టాలు రానున్నాయి. రోహిణి తాను అనుకున్నది సాధించి మొత్తానికి ఆ వీడియోను గుణకు ఇవ్వడం, అతడు ఆ వీడియోతో ఓ మాస్టర్ ప్లాన్ వేయడంతో ప్రభావతి చేతికి ఆ వీడియో వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
ఫోన్ కోసం వెతుకుతూ బాలు కంగారు

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (మార్చి 24) ఎపిసోడ్ బాలు తన ఫోన్ కోసం వెతుకుతూ కంగారు పడే సీన్ తో మొదలవుతుంది. బాలు, మీనా ఇంట్లో అంతా వెతుకుతుంటారు. రోహిణి ఏమీ తెలియనట్లు వచ్చి ఏం జరుగుతుందని అడుగుతుంది. పీకలదాకా తాగితే ఇలాగే జరుగుతుందని అంటుంది. దీంతో బాలు ఆమెకు వార్నింగ్ ఇస్తాడు. ఫంక్షన్ హాల్లో పడిపోయిందే చూసొస్తానని వెళ్తాడు. ఇక నీ పనైపోయినట్లే అని రోహిణి మనసులో అనుకుంటుంది.
గుణతో రోహిణి డీల్
అటు రోహిణి ఆ వీడియో తీసుకొని గుణ దగ్గరికి వెళ్తుంది. వాళ్లను చూడగానే వీడియో పంపించండి అని గుణ అడుగుతాడు. కానీ ముందు తాము చెప్పిన పని చేయాలని, ఆ దినేష్ గాడిని తీసుకురావాలని రోహిణి, విద్య అంటారు. దీంతో గుణ తన మనుషులను పంపిస్తాడు. దినేష్ వచ్చిన తర్వాతే వీడియో పంపిస్తానని రోహిణి చెబుతుంది.
శివ వీడియో కోసం బాలు ఆందోళన
ఇటు బాలు ఫంక్షన్ హాల్లోనూ తన ఫోన్ కోసం అంతా వెతుకుతాడు. రాజేష్ తో కలిసి టెన్షన్ పడుతూ అంతటా చూస్తాడు. కానీ ఎక్కడా దొరకదు. ఆ ఫోన్లో శివ వీడియో ఉందని, అది బయటపడితే చాలా ప్రమాదం అని రాజేష్ తో బాలు అంటాడు. పోలీసులకు ఫిర్యాదు చేద్దామని రాజేష్ అంటే బాలు వద్దంటాడు. ఆ ఫోన్ ఎవరి చేతుల్లోనూ పడొద్దని మాత్రం కోరుకోవాలని చెబుతాడు.
దినేష్‌ను తీసుకొచ్చిన గుణ మనుషులు
మరోవైపు మొత్తానికి దినేష్ ను గుణ మనుషులు తీసుకొస్తారు. అతని కంట పడకుండా రోహిణి, విద్య పక్కకు వెళ్లి దాక్కుంటారు. అతన్ని ఒక్క గుద్దు గుద్ది.. గదిలో కట్టిపడేయండని తన మనుషులకు చెబుతాడు. ఆ తర్వాత రోహిణి తన దగ్గర ఉన్న వీడియోను గుణకు పంపిస్తుంది. దానిని చూడగానే ఇది కదా తనకు కావాల్సింది అని గుణ అనుకుంటాడు. ఇక ఆ దినేష్ గాడు మీవైపు రాకుండా తాను చూసుకుంటానని చెబుతాడు. దీంతో రోహిణి ఎంతో సంతోషంగా అక్కడి నుంచి వెళ్తుంది.
అత్తకు క్లాస్ పీకిన మీనా
{{/usCountry}}మరోవైపు మొత్తానికి దినేష్ ను గుణ మనుషులు తీసుకొస్తారు. అతని కంట పడకుండా రోహిణి, విద్య పక్కకు వెళ్లి దాక్కుంటారు. అతన్ని ఒక్క గుద్దు గుద్ది.. గదిలో కట్టిపడేయండని తన మనుషులకు చెబుతాడు. ఆ తర్వాత రోహిణి తన దగ్గర ఉన్న వీడియోను గుణకు పంపిస్తుంది. దానిని చూడగానే ఇది కదా తనకు కావాల్సింది అని గుణ అనుకుంటాడు. ఇక ఆ దినేష్ గాడు మీవైపు రాకుండా తాను చూసుకుంటానని చెబుతాడు. దీంతో రోహిణి ఎంతో సంతోషంగా అక్కడి నుంచి వెళ్తుంది.
అత్తకు క్లాస్ పీకిన మీనా
{{/usCountry}}ఇంట్లో బాలు, మీనా కంగారు పడుతుండగా సత్యం వచ్చి ఫోన్ పోయిందటగా అని అడుగుతాడు. ఇంతలో ప్రభావతి వచ్చి తాగితే ఒంటి మీద బట్టలు ఉన్నాయా కూడా తెలియదు.. అయినా కారు నడిపే వాడికి ఫోన్ ఎందుకు అని అంటుంది. దీంతో మీనా రెచ్చిపోతుంది. ఇంట్లో మీరేం చేస్తున్నారని.. లక్షలు సంపాదిస్తున్నారా.. మీకు ఫోన్ ఎందుకు.. మోసం చేసేవాడికి ఫోన్ ఎందుకు అంటూ ప్రభావతిని, మనోజ్ ను కలిపి తిడుతుంది. ఒక్క మాటకే తనకు అంత క్లాస్ పీకుతావా అని ప్రభావతి అంటుంది. ఆ తర్వాత ఆమెను అక్కడి నుంచి పంపించేస్తాడు సత్యం.
వీడియో అంటూ నోరు జారిన బాలు
ఫోన్ పోతే పోనీ.. కొత్త ఫోన్ కు తాను డబ్బులు ఇస్తానని సత్యం అంటాడు. కొత్త ఫోన్ కొనుక్కోగలనని, కానీ ఆ ఫోన్ లో ఎంతో ముఖ్యమైన వీడియో ఉందంటూ బాలు నోరు జారుతాడు. వీడియోనా అని మీనా అడిగితే.. అదే ముఖ్యమైన సమాచారం ఉందని కవర్ చేసుకుంటాడు. తాను తిరుపతి ట్రిప్ కు వెళ్తున్నానని చెప్పి బాలు వెళ్లిపోతాడు.
శివ వీడియో బయటపెట్టడానికి గుణ మాస్టర్ ప్లాన్
శివ దొంగతనం వీడియో దొరకడంతో గుణ దానిని బయటపెట్టడానికి ఓ మాస్టర్ ప్లాన్ వేస్తాడు. హర్యానాలో ఉన్న తన ఫ్రెండ్ కు ఫోన్ చేసి ఆ వీడియోను ఎలా బయటపెట్టాలో చెబుతాడు. ఇక ఆ బాలు, మీనా పనైపోయినట్లే అని గుణ అంటాడు.
ఇంట్లో మీనా వంట చేస్తుండగా ఆమె తలపై బల్లి పడుతుంది. కంగారుపడి ఆమె దానిని విసిరేయగా అది ప్రభావతిపై పడుతుంది. మనోజ్, రోహిణి వెంటనే ఫోన్ లో బల్లిశాస్త్రం చూసి మీనాకు ప్రాణగండం ఉందని, ప్రభావతికి మాత్రం అంతా కలిసి రానుందని అంటారు. అది విని మీనా మరింత కంగారు పడి బాలుకు ఫోన్ చేస్తుంది.
ఇటు ఆ వీడియో మొత్తానికి మనోజ్, ప్రభావతి కంట పడుతుంది. అది చూసి ఇక నా ప్రళయ తాండవం చూస్తారు అని రోహిణితో అంటుంది ప్రభావతి. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.