...
...
Next Story

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలు ఫోన్ ఎత్తుకొచ్చిన విద్య.. రోహిణికి మరో గండం.. సంజూకి క్లాస్ పీకిన సువర్ణ

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మార్చి 2 ఎపిసోడ్ లో సత్యం, ప్రభావతి ఇంట్లో బొమ్మల కొలువు సందడి చూడొచ్చు. అయితే అదే సమయంలో బాలు ఫోన్ నుంచి వీడియో పంపించడానికి రోహిణి ప్రయత్నం, ఆమెకు మరో గండం రావడం, అటు సంజూకి సువర్ణ క్లాస్ పీకడం కూడా చూడొచ్చు.

Published on: Mar 2, 2026, 08:04:45 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ మొత్తం బొమ్మల కొలువు, అటు మౌనిక, సంజూ చుట్టూనే తిరిగింది. బాలుని గుణ దగ్గర ఇరికించడానికి రోహిణి చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. అదే సమయంలో పూజకి రమ్మని సుగుణకు ఫోన్ చేసి చెప్పిన బాలు.. రోహిణిని ఇరికిస్తాడు.

అత్తను హేళన చేసిన మీనా

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలు ఫోన్ ఎత్తుకొచ్చిన విద్య.. రోహిణికి మరో గండం.. సంజూకి క్లాస్ పీకిన సువర్ణ
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలు ఫోన్ ఎత్తుకొచ్చిన విద్య.. రోహిణికి మరో గండం.. సంజూకి క్లాస్ పీకిన సువర్ణ

గుండె నిండా గుడి గంటలు సీరియల్ సోమవారం (మార్చి 2) ఎపిసోడ్ అత్త ప్రభావతిని మీనా హేళన చేసే సీన్ తో మొదలవుతుంది. ఆమె చాలా దారుణంగా పాడింది కాబట్టే తాను బాగా పాడినట్లు ఫీలయ్యానని బాలుతో మీనా అంటుంది. అప్పుడే అతడు సరదాగా ప్రభావతి వచ్చినట్లుగా నటిస్తాడు. దీంతో మీనా భయపడుతుంది. అప్పుడే బాలు రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లగా మీనా అడ్డుకొని వెళ్లిపోతుంది.

తల్లి కాబోతున్నానని చెప్పిన మౌనిక.. సంజూకి క్లాస్ పీకిన తండ్రి

ఇటు మౌనిక రిపోర్టులను మార్చి ఆమె తల్లి అయ్యే అవకాశం లేదన్నట్లుగా నకిలీ రిపోర్టులు తయారు చేయిస్తాడు సంజూ తండ్రి. వీటిని చూపించి సంజూకి మరో పెళ్లి చేయిస్తానని అనుకుంటాడు. అప్పుడే సంజూ, మౌనిక ఇంటికి వస్తారు. మౌనిక ఎంతో సంతోషంగా తాను తల్లి కాబోతున్న విషయం చెబుతుంది. దీంతో సువర్ణ చాలా సంతోషిస్తుంది. ఆమె నోరు తీపి చేస్తుంది. దీంతో సంజూ తండ్రి షాక్ తింటాడు. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత సంజూకి క్లాస్ పీకుతాడు.

సత్యం ఇంట్లో బొమ్మల కొలువు సందడి

ఇటు బొమ్మల కొలువు కోసం మీనా బస్తీ వాళ్లు వస్తారు. వాళ్లను చూసిన ప్రభావతి చిన్న చూపు చూస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది. అది విని ఊరి నుంచి వచ్చిన డాక్టర్ సంధ్య.. ప్రభావతికి క్లాస్ పీకుతుంది. రోహిణికి కాదు.. మీకు పరీక్షలు చేయించాలి.. మనిషిని మనిషిగా చూడలేకపోతున్న మీ మెదడును పరీక్ష చేయించాలని క్లాస్ పీకుతుంది. దీంతో సుశీల, బాలు, సత్యం చప్పట్లు కొడతారు. అది చూసి ప్రభావతి సిగ్గుతో తలదించుకుంటుంది.

బాలు పరువు తీయడానికి వచ్చిన గుణ.. రోహిణికి ఫోన్

బాలు పరువు తీసి, ఇంట్లో వాళ్ల ముందు విలన్ ను చేయడానికి ఫామ్ హౌజ్ దగ్గరికి వస్తాడు గుణ. బయటి నుంచే రోహిణికి ఫోన్ చేస్తాడు. ఆ వీడియో పంపించాలని అడుగుతాడు. బాలు పోన్ దొరకడం లేదని, ఎలాగైనా పంపిస్తానని రోహిణి చెబుతుంది. అందరూ సంతోషంగా ఉంటే తన బతుకు మాత్రం ఇలా అయిపోయిందని విద్యతో చెప్పి రోహిణి బాధపడుతుంది.

బాలు ఫోన్ ఎత్తుకొచ్చిన విద్య.. గుణకు వీడియో పంపిన రోహిణి

ఆ తర్వాత బాలు ఫోన్ ను విద్య ఎత్తుకొస్తుంది. అది చూసి సంతోషించిన రోహిణి వెంటనే అందులో నుంచి వీడియోను మొదట తన ఫోన్ కు, తర్వాత గుణకు పంపిస్తుంది. ఇదంతా అవసరమా.. బాలు, మీనా సంతోషంగా ఉన్నారు.. ఇప్పుడిలా చేయడం ఎందుకు అని విద్య అంటుంది. తాను అనుకున్నది సాధించే వరకు ఏం చేయాల్సి వచ్చినా చేస్తానని రోహిణి స్పష్టం చేస్తుంది.

విద్య, రోహిణిలను నిలదీసిన బాలు..

ఇటు మీనా వెంట పడుతూ బాలు వస్తాడు. అప్పుడే మీనా వచ్చి రోహిణి ఢీకొట్టడంతో ఆమె చేతుల్లో ఉన్న బాలు ఫోన్ కింద పడిపోతుంది. అది చూసి తన ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చిందని బాలు నిలదీస్తాడు. ఇందాక తానే ఫొటోలు తీయాలని విద్యకు ఇచ్చినట్లు మీనా చెబుతుంది. ఆ ఫోన్ నీకు ఇవ్వడానికే రోహిణికి తాను ఇచ్చినట్లు విద్య చెబుతుంది. అయితే ఇద్దరినీ అనుమానంగా చూస్తూ బాలు వెళ్లిపోతాడు. కానీ ఆ తర్వాత వీడియో చూసిన గుణ.. తనకు తప్పుడు వీడియో పంపించావని, అసలు వీడియో పంపమని రోహిణికి ఫోన్ చేసి చెబుతాడు. దీంతో ఫోన్ తన చేతుల్లో లేదని రోహిణి మళ్లీ ఫీలవుతుంది.

సంజూకి క్లాస్ పీకిన సువర్ణ

ఇటు తల్లి కాబోతున్న సంతోషంలో ఉంటుంది మౌనిక. ఆమెకు ఉత్సాహాన్నిచ్చేలా అత్త సువర్ణ మాట్లుడుతూ ఉంటుంది. అప్పుడే సంజూ అక్కడికి వస్తాడు. అసలు నేనెప్పుడూ నీతో సంతోషంగా లేను.. అన్యోన్యంగా లేను.. నీ కడుపులో బిడ్డకు కారణం నేనేనా అని అడుగుతాడు. దీంతో సువర్ణ అతని చెంప చెల్లుమనిపిస్తుంది. ఒకప్పుడు మీ నాన్న ఇదే ప్రశ్న తనను అడిగి ఉంటే.. ఇప్పుడు నువ్వు ఉండేవాడివే కాదని తిడుతుంది.

సుగుణకు బాలు ఫోన్.. పూజకు రమ్మని ఆహ్వానం

మరోవైపు ఇంట్లో జరిగే పూజకు రమ్మని చింటు అమ్మమ్మ సుగుణకు బాలు ఫోన్ చేస్తాడు. చింటూ ఫోన్ ఎత్తి అమ్మమ్మకు ఇస్తాడు. దీంతో ఆమె షాక్ తింటుంది. ఇంట్లో పూజకు రమ్మని అంటాడు. తాను రానని అంటున్నా కారు పంపిస్తాను.. కచ్చితంగా రావాల్సిందే అని ఫోన్ పెట్టేస్తాడు బాలు. ఆ విషయం వెంటనే రోహిణికి ఫోన్ చేసి చెబుతుంది సుగుణ. దీంతో తనకు మరో గండం రాబోతోందని తలుచుకొని రోహిణి వణికిపోతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe