గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 535వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఇంట్లో కొత్త గది కోసం రచ్చ జరగడం నుంచి చివర్లో రోహిణి బదులు మీనా కిడ్నాప్ కావడం వరకు ఈ ఎపిసోడ్ ఉత్కంఠగా అనిపించింది. అయితే అత్త ప్రభావతిని మీనా మరోసారి చెడామడా తిట్టడం ఇందులో హైలైట్ అని చెప్పొచ్చు.
ఇంట్లో దీపావళి వేడుకల ప్లాన్

గుండె నిండా గుడి గంటలు సీరియల్ సోమవారం (అక్టోబర్ 20) ఎపిసోడ్ ఇంట్లో అందరూ దీపావళి వేడుకల ప్లాన్ చేయడంతో మొదలవుతుంది. శృతి అమ్మ వాళ్లు పండుగ కోసం పిలుస్తున్నారని, కానీ ఇంట్లో ఇద్దరు కోడళ్లతో లక్ష్మీ పూజ చేయించాలని అనుకుంటున్నట్లు ప్రభావతి చెబుతుంది.
మనకు ముగ్గురు కోడళ్లు లక్ష్మీ, పార్వతి, సరస్వతిలా ఉన్నారు.. ముగ్గురితో చేయించాలని సత్యం అంటాడు. మీకు ముగ్గురు కొడుకులే కాదు మౌనిక కూడా ఉంది.. ఆమెను కూడా పిలవండని మీనా అంటుంది. పిలుద్దామంటూ మౌనికకు ప్రభావతి ఫోన్ చేస్తుంది. మీ అల్లుడుగారు బిజినెస్ పని మీద వెళ్తున్నారు.. నన్నూ తీసుకెళ్తున్నారు రావడం కుదరదని అనడంతో సరే అని ప్రభావతి ఫోన్ పెట్టేస్తుంది.
మేడ మీద కొత్త రూమ్ కట్టిస్తున్న సత్యం
ఆ తర్వాత మేడ మీద మరో గది కోసం తనకు తెలిసిన వాళ్లను సత్యం పిలుస్తాడు. వాళ్లు వచ్చి మేడ మీద కొలతలు తీసుకుంటారు. అందరూ పైకి వెళ్లి ఏం చేస్తున్నారని ఆశ్చర్యంగా అడుగుతారు. ఇల్లు అమ్మేస్తున్నారా అని మనోజ్ అంటాడు. కొత్త గది కోసం కొలతలు తీసుకుంటున్నారు అని రవి చెబుతాడు. గది కోసం రోజూ గొడవలు ఎందుకు.. కొత్త గది కట్టిస్తున్నానని సత్యం అంటాడు. అయితే రూ.5 లక్షలు అవుతాయని ఆ వచ్చిన వ్యక్తి చెబుతాడు. అంత డబ్బు అనడంతో అందరూ షాకవుతారు.
ఇంట్లో మళ్లీ రచ్చ.. లోన్ తీస్తానన్న సత్యం
దీంతో కిందికి వచ్చిన తర్వాత మరోసారి రచ్చ జరుగుతుంది. అంత డబ్బు పెట్టి ఇప్పుడు అవసరమా అని ప్రభావతి, మనోజ్ అంటారు. నిన్నేమైనా డబ్బు అడుగుతున్నారా.. ఎందుకలా ఉలిక్కి పడతావ్ అంటూ మనోజ్ ను నిలదీస్తాడు రవి. మీరు నెలనెలా ఇచ్చిన డబ్బులతోనే కడతానని సత్యం అంటాడు.
{{/usCountry}}దీంతో కిందికి వచ్చిన తర్వాత మరోసారి రచ్చ జరుగుతుంది. అంత డబ్బు పెట్టి ఇప్పుడు అవసరమా అని ప్రభావతి, మనోజ్ అంటారు. నిన్నేమైనా డబ్బు అడుగుతున్నారా.. ఎందుకలా ఉలిక్కి పడతావ్ అంటూ మనోజ్ ను నిలదీస్తాడు రవి. మీరు నెలనెలా ఇచ్చిన డబ్బులతోనే కడతానని సత్యం అంటాడు.
{{/usCountry}}అలా కట్టాలంటే మూడేళ్లు పడుతుందని రోహిణి అంటుంది. ఇంటిపై లోన్ తీస్తానని సత్యం అనడంతో ప్రభావతి రచ్చ చేస్తుంది. ఇది మా నాన్న ఇచ్చిన ఇల్లు, తాకట్టు ఎందుకు పెడతారు అని అడుగుతుంది. అయినా పనికి రాని వాళ్ల కోసం తన తండ్రి ఇచ్చిన ఇంటిని తాకట్టు పెట్టనివ్వను అని తేల్చి చెబుతుంది.
అత్త ప్రభావతికి క్లాస్ పీకిన మీనా.. చప్పట్లు కొట్టిన రవి, శృతి
వాళ్లకేమి గది అవసరం లేదు.. గుడిసె చాలు.. ఇంతకుముందు గదుల్లో ఉన్నారా ఏంటని ప్రభావతి అంటుంది. దీంతో బాలు తల్లిపై మండిపడతాడు. అటు మీనా అందుకుంటుంది. ఎవరు గుడిసెలో ఉన్నారు.. ఎప్పుడైనా మా ఇంటికి వచ్చారా.. మీలాగే మా ఇంట్లో ఒక్కో కొడుకుని, కూతురిని వేర్వేరుగా చూసే అలవాటు లేదు.. ఏది ఉన్నా అందరం కలిసే పంచుకుంటాం.. అత్తగా అంటే పడే రోజులు పోయాయి అని మీనా కాస్త గట్టిగానే అత్తను తిడుతుంది. దీంతో రవి, శృతి చప్పట్లు కొడతారు.
ముగ్గురు కోడళ్లకూ సత్యం ఎర్ర చీరలు
అటు ఇంట్లో దీపావళి వేడుకల కోసం సిద్ధమవుతుంటారు. రవి పూలు కడుతుండగా.. మనోజ్ ఊరికే పక్కన నిలబడి బిల్డప్ ఇస్తుంటాడు. మీనా ముగ్గు వేస్తుంటుంది. మీ ఆయనను ఇప్పటికే ముగ్గులోకి దింపావు కానీ.. లోపల పిండి వంటలు ఎవరు చేస్తారని ప్రభావతి వచ్చి దెప్పిపొడుస్తుంది. మరోసారి అత్తకు మీనా క్లాస్ పీకుతుంది. రవి కూడా ఆమెకు సపోర్ట్ ఇస్తాడు. ఆ తర్వాత బాలు భారీ డబ్బాలో టపాసులు తీసుకొస్తాడు.
అటు సత్యం వెళ్లి ఇంట్లో అందరికీ కొత్త బట్టలు తీసుకొస్తాడు. ముగ్గురు కోడళ్లకూ అతడు ఎర్ర చీరలే తీసుకొస్తాడు. వాటిని చూసి అందరూ మురిసిపోతారు. ముగ్గురు కొడుకులు, కోడళ్లూ కొత్త బట్టలు వేసుకుంటారు. వాళ్లందరినీ చూసి ప్రభావతి మురిసిపోతూ దేవుడికి హారతి ఇచ్చి తీసుకొస్తుంది.
రోహిణి బదులు మీనా కిడ్నాప్
అటు రోహిణికి దినేష్ మరోసారి ఫోన్ చేసి బెదిరిస్తాడు. మనుషులను పెట్టి కొట్టించినా నీకు బుద్ధి రాలేదా అని రోహిణి అంటుంది. నాకు అర్జెంటుగా రూ.లక్ష కావాలని డిమాండ్ చేస్తాడు. అటు విద్య ఇంటికి వెళ్లి రోహిణి దినేష్ గురించి చెబుతుంది. దినేష్ కొందరు రౌడీలకు ఆమెను కిడ్నాప్ చేయమని చెబుతాడు. ఎర్ర చీర కట్టుకుందని అంటాడు. అయితే మీనా కూడా ఎర్ర చీర కట్టుకొని ఆ ఇంటి నుంచి బయటకు రావడంతో ఆమెనే అనుకొని వాళ్లు మీనాను కిడ్నాప్ చేస్తారు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.