గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 537వ ఎపిసోడ్ లో మీనాను బాలు.. బాలుని మీనా కాపాడటం చూడొచ్చు. అంతేకాదు ఇద్దరూ కలిసి దినేష్ ను పోలీసులకు అప్పగిస్తారు. అయితే ఆ తర్వాత ఇంట్లో శృతి తల్లి శోభ ఇంట్లో చిచ్చు పెడుతుంది. దీంతో బాలుపై సత్యం చేయి చేసుకునే పరిస్థితి తలెత్తుతుంది.
మీనా పారేసిన పూలను వెతుక్కుంటూ వెళ్లిన బాలు..

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (అక్టోబర్ 22) ఎపిసోడ్ మీనా కోసం బాలు వెతికే సీన్ తో మొదలవుతుంది. విద్య ఇంటి ముందు మీనా పారేసిన ఇంగ్లిష్ పూలను బాలు చూస్తాడు. తనను ఏ దారిలో తీసుకెళ్లారో వాటి ద్వారా చెప్పేలా మీనా తెలివిగా ఒక్కో పువ్వును దారిలో జారవిడుస్తూ వెళ్తుంది.
అటు నువ్వు చెప్పినట్లే ఆ అమ్మాయిని తీసుకొచ్చి కట్టేశామని రౌడీలు దినేష్ కు చెబుతారు. అయితే అక్కడ మీనా ఉండటం చూసి దినేష్ షాక్ తింటాడు. అయితే తనను జైలుకు పంపించిన బాలుపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదీ పనికొస్తుందని అనుకుంటాడు.
మనోజ్‌కు అబద్ధం చెప్పిన రోహిణి..
ఇటు దినేష్ కు ఇవ్వడానికి మరో రూ.50 వేలు కావడంతో ఇంటికి వెళ్లి మనోజ్ ను డబ్బులు అడుగుతుంది రోహిణి. విద్య తండ్రికి సర్జరీ అవసరమని అబద్ధం చెబుతుంది. అయితే మనోజ్ మాత్రం తన దగ్గర డబ్బులు లేవని అంటాడు. దీంతో అతన్ని రోహిణి తిడుతుంది.
అప్పుడే దినేష్ ఆమెకు ఫోన్ చేస్తాడు. మనోజ్ ఉండటంతో ఆమె ఫోన్ లిఫ్ట్ చేయదు. దీంతో అతడు వెంటనే డబ్బు తీసుకురాకపోతే ఇంటికి వస్తానని బెదిరింపు మెసేజ్ పంపిస్తాడు. దీంతో రోహిణి.. విద్య ఇచ్చిన గొలుసు ఇచ్చి మిగిలిన డబ్బుకు కాస్త సమయం అడుగుదామని అతని దగ్గరికి వెళ్తుంది.
దినేష్‌కు వార్నింగ్ ఇచ్చిన మీనా..
{{/usCountry}}అప్పుడే దినేష్ ఆమెకు ఫోన్ చేస్తాడు. మనోజ్ ఉండటంతో ఆమె ఫోన్ లిఫ్ట్ చేయదు. దీంతో అతడు వెంటనే డబ్బు తీసుకురాకపోతే ఇంటికి వస్తానని బెదిరింపు మెసేజ్ పంపిస్తాడు. దీంతో రోహిణి.. విద్య ఇచ్చిన గొలుసు ఇచ్చి మిగిలిన డబ్బుకు కాస్త సమయం అడుగుదామని అతని దగ్గరికి వెళ్తుంది.
దినేష్‌కు వార్నింగ్ ఇచ్చిన మీనా..
{{/usCountry}}అటు మీనా దగ్గరికి వెళ్లిన దినేష్ తన నాటకాల కోసం ఉపయోగించే గద, కిరీటం పెట్టుకుంటాడు. ఎవడ్రా నువ్వు అని మీనా అడిగితే.. ఈ రాజ్యానికి రాజుని అని అంటాడు. వెంటనే తనను వదిలేయాలని, లేదంటే తన భర్త వచ్చి మిమ్మల్ని చితగ్గొడతాడని వార్నింగ్ ఇస్తుంది. అంతలో మీనా చూపించిన పూల దారిలో బాలు అక్కడికి వస్తాడు. అది చూసిన దినేష్ మీనా అరవకుండా నోటికి ప్లాస్టర్ వేసి ఆమె కనిపించకుండా దాచేస్తాడు.
రౌడీలను చితకబాదిన బాలు, మీనా
మీనాను బంధించిన ఇంట్లోకి బాలు వస్తాడు. అక్కడికి రాగానే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇస్తాడు. ఆ తర్వాత దినేష్, రౌడీలు అతన్ని చుట్టుముడతారు. దినేష్ ను చూడగానే నువ్వా అంటూ అతని కాలర్ పట్టుకుంటాడు బాలు. నా భార్య ఎక్కడ అని అడిగితే.. రూ.లక్ష ఇచ్చి నీ భార్యను తీసుకెళ్లమని దినేష్ అంటాడు. దీంతో బాలు వాళ్లందరినీ చితగ్గొడతాడు.
యితే ఓ రౌడీ బాలు తలపై వెనుక నుంచి గదతో కొట్టడంతో అతడు స్పృహ కోల్పోతాడు. దీంతో అతన్ని కూడా కట్టేస్తారు. అప్పుడే మీనా తన కట్లు విప్పుకొని తన ఉగ్రరూపం చూపిస్తుంది. దినేష్ సహా మిగిలిన వాళ్లందరినీ చితకబాదుతుంది.
మీనాను తెగ పొగిడిన పోలీసులు, బాలు
దినేష్ ను కింద పడేసి పక్కనే ఉన్న త్రిశూలంతో అతనిపై దాడి చేయబోతుండగా.. పోలీసులు వస్తారు. అక్కడ సీన్ రివర్స్ కావడంతో వాళ్లు షాక్ తింటారు. నీ భార్యను కిడ్నాప్ చేశారన్నావ్.. ఇక్కడ చూస్తే ఆమెనే నిన్ను కాపాడుతోంది అని ఎస్సై అడుగుతాడు. ఈ వెధవలు తనను తలపై కొట్టడంతో స్పృహ కోల్పోయానని, అప్పుడే మీనా ఇలా చేసిందని చెబుతాడు. అదంతా అక్కడికి వచ్చిన రోహిణి చూస్తుంది. దినేష్ అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజుతాడని పోలీసులకు బాలు చెప్పడం విన్న రోహిణి వీళ్లకు నిజం తెలిసినట్లుందని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఆ తర్వాత ఎస్సై కూడా మీనా ధైర్యాన్ని పొగుడుతాడు. పోలీసులు వాళ్లను తీసుకెళ్లిన తర్వాత సత్యభామలా ఉగ్రరూపం చూపించావని బాలు కూడా మీనాను పొగుడుతాడు. ఈ విషయం మా అమ్మకు చెబితే ఇక ఎప్పుడూ నీ జోలికి రాదని అంటాడు. కానీ మీనా మాత్రం వద్దని అంటుంది. అటు రోహిణి నేరుగా విద్య దగ్గరికి వెళ్లి బాలు, మీనాలకు తన గురించి నిజం తెలిసిపోయిందని, ఇక తన రెండో పెళ్లి కూడా పెటాకులైనట్లే అని ఏడుస్తూనే ఉంటుంది.
పండుగ రోజే చిచ్చు పెట్టిన శోభ
అటు పండుగ రోజే సత్యం ఇంట్లో శృతి తల్లి శోభ చిచ్చు పెడుతుంది. ఇంట్లో గది కోసం గొడవలు జరుగుతున్నాయని తెలిసి వచ్చానని, అప్పట్లో మా ఆయన లోన్ ఇప్పించకపోతే మీరు ఈ మాత్రం ఇల్లు కూడా కట్టుకోలేకపోయేవారని అందరి ముందే అంటుంది. దీంతో బాలు ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. ఏం మాట్లాడుతున్నారు.. ముందు బయటకు వెళ్లండి అంటూ ఆమె మీదికి వెళ్తాడు. దీంతో సత్యం బాలు చెంప పగలగొడతాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.