తెలుగులో అల్లు అర్జున్ హీరోగా దేశముదురు సినిమాతో హీరోయిన్ గా హన్సిక మోత్వానీ కెరీర్ స్టార్ట్ చేసింది. ఆమె పర్సనల్ లైఫ్ లో చాలా ట్విస్ట్ లు ఉన్నాయి. తాజాగా సోహైల్ ఖతూరియా నుంచి ఆమె విడాకులు తీసుకుంది. ముంబయిలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు వీళ్లకు విడాకులు మంజూరు చేసింది. అయితే హన్సికపై నెటిజన్లు ఇప్పుడు తెగ ఫైర్ అవుతున్నారు.
హన్సిక, సోహైల్ పెళ్లి

హన్సిక మోత్వానీ, సోహైల్ ఖతూరియా పెళ్లికి ముందు కొంతకాలం డేటింగ్ ఛేశారు. 2022లో జైపూర్‌లోని ముండోటా ఫోర్ట్ అండ్ ప్యాలెస్‌లో ఘనంగా వీళ్ల వెడ్డింగ్ జరిగింది. అయితే 2022, జులై 2 నుంచి వీళ్లు సెపరేట్ గా ఉంటున్నారు. ఇప్పుడు అఫీషియల్ గా విడాకులు తీసుకున్నారు.
నెటిజన్లు ఫైర్
హన్సిక మోత్వానీపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అయితే దీనికో కారణం ఉంది. సోహైల్ ఖతూరియా ఫస్ట్ రింకీ బజాజ్ ను పెళ్లి చేసుకున్నాడు. రింకీ బజాజ్ ఎవరో కాదు హన్సిక మోత్వానీ క్లోజ్ ఫ్రెండ్. రింకీ, సోహైల్ పెళ్లికి హన్సిక వెళ్లింది. ఈ వెడ్డింగ్ లో ఆమె తెగ సందడి చేసింది.
ఫస్ట్ భార్యను వదిలేసి
రింకీ, సోహైల్ పెళ్లి తర్వాత సోహైల్, హన్సిక క్లోజ్ అయ్యారని అంటున్నారు. దీంతో రింకీని సోహైల్ వదిలేశాడనే అభిప్రాయాలున్నాయి. రింకీని వదిలేసి హన్సికను సోహైల్ పెళ్లి చేసుకున్నాడని చెప్తారు. ఇప్పుడు సోహైల్, హన్సిక విడాకులు తీసుకున్నారు. దీంతో కర్మ ఎవరిని వదలదని నెటిజన్లు హన్సికపై తీవ్రంగా మండిపడుతున్నారు.
కర్మ నుంచి తప్పించుకోలేరు
‘‘కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరు. ప్రతి ఒక్కరూ దాన్ని ఎదుర్కోవాల్సిందే’’.. ఇదీ ఓ నెటిజన్ పెట్టిన పోస్టు. తన ఫ్రెండ్ భర్తను హన్సిక పెళ్లి చేసుకోవడాన్ని ఉద్దేశించి ఈ యూజర్ ఇలా పోస్టు పెట్టినట్లు తెలుస్తోంది.
{{/usCountry}}‘‘కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరు. ప్రతి ఒక్కరూ దాన్ని ఎదుర్కోవాల్సిందే’’.. ఇదీ ఓ నెటిజన్ పెట్టిన పోస్టు. తన ఫ్రెండ్ భర్తను హన్సిక పెళ్లి చేసుకోవడాన్ని ఉద్దేశించి ఈ యూజర్ ఇలా పోస్టు పెట్టినట్లు తెలుస్తోంది.
{{/usCountry}}బెస్ట్ ఫ్రెండ్ భర్త
‘‘బెస్ట్ ఫ్రెండ్ భర్తను పెళ్లి చేసుకోవడం ఏంటీ? ఫ్రెండ్ పెళ్లికి అటెండ్ కావడం, వాళ్లకు డివోర్స్ అయ్యాక అతణ్నే పెళ్లి చేసుకోవడం ఏంటీ? నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు విడాకులు. ఈమెకు ఇంకా తమిళనాడులో గుడి కట్టారు. పిచ్చి జనాలు’’ అని ఓ యూజర్ కాస్త ఘాటుగానే ఎక్స్ లో విమర్శించాడు.
భరణం కోరకుండా
సాధారణంగా విడాకులు తీసుకునే అమ్మాయిలు తమ మాజీ భర్త నుంచి భరణం కోరుతారు. కొన్ని కోట్ల భరణం తీసుకున్న మహిళలు వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ హన్సిక మాత్రం సోహైల్ నుంచి ఎలాంటి భరణం తీసుకోలేదు. భరణం వద్దని ఆమె చెప్పినట్లు తెలిసింది. చిన్న చిన్న కారణాలకే గొడవలు పడటం వల్ల హన్సిక, సోహైల్ విడాకులు తీసుకున్నారని సమాచారం.