ప్రముఖ నటి హన్సిక మోత్వానీ, ఆమె భర్త, వ్యాపారవేత్త సోహైల్ కతూరియా అధికారికంగా విడిపోయారు. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్ట్ వీరికి పరస్పర అంగీకారంతో విడాకులు మంజూరు చేసింది. గత కొంతకాలంగా వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారనే వార్తలు వస్తుండగా, తాజా కోర్టు తీర్పుతో ఆ ప్రచారానికి తెరపడింది. ఎలాంటి భరణం ఆశించకుండానే హన్సిక తన దారి తాను చూసుకుంది.
హన్సిక విడాకులకు కారణమేంటి?

హన్సిక తరపు న్యాయవాది అద్నాన్ షేక్ కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం.. వివాహం జరిగిన కొద్ది కాలానికే హన్సిక, సోహైల్ మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. ఇద్దరి వ్యక్తిత్వాలు, జీవనశైలి, ఆలోచనా విధానాల్లో పొంతన లేకపోవడంతో చిన్న చిన్న విషయాలకే గొడవలు జరుగుతుండేవి. వీటిని సర్దుబాటు చేసుకునేందుకు కుటుంబ సభ్యులు, స్నేహితులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.
చివరికి కలిసి ఉండటం అసాధ్యమని భావించిన ఈ జంట.. జులై 2, 2024 నుండి విడివిడిగా జీవిస్తున్నారు. ఆ తర్వాత ఒక అవగాహనకు వచ్చి పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు.
భరణం, స్త్రీధనం తిరస్కరించిన హన్సిక
ఈ విడాకుల వ్యవహారంలో హన్సిక తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా విడాకుల సమయంలో భరణం (Alimony) డిమాండ్ చేయడం సహజం. కానీ హన్సిక మాత్రం సోహైల్ నుండి ఎటువంటి భరణం గానీ, స్త్రీధనం గానీ ఆశించడం లేదని కోర్టుకు స్పష్టం చేసింది. ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేకుండానే గౌరవప్రదంగా విడిపోవాలని ఆమె నిర్ణయించుకుంది.
హన్సిక పెళ్లి విశేషాలు
హన్సిక, సోహైల్ పెళ్లి డిసెంబర్ 4, 2022న జైపూర్‌లోని ముండోటా కోటలో అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లి వేడుకను 'లవ్, షాదీ, డ్రామా' పేరుతో ఒక రియాలిటీ డాక్యుమెంటరీగా ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ చేశారు.
సోహైల్ మొదటి భార్య రింకీ బజాజ్ హన్సికకు స్నేహితురాలు కావడంతో వీరి పెళ్లి సమయంలో కొంత వివాదం నడిచింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా 'శకలక బూమ్ బూమ్', 'కోయి మిల్ గయా' సినిమాలతో కెరీర్ ప్రారంభించిన హన్సిక.. ఆ తర్వాత దేశముదురు సినిమాతో టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఆమె తన కెరీర్‌పై దృష్టి సారించింది.
{{/usCountry}}సోహైల్ మొదటి భార్య రింకీ బజాజ్ హన్సికకు స్నేహితురాలు కావడంతో వీరి పెళ్లి సమయంలో కొంత వివాదం నడిచింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా 'శకలక బూమ్ బూమ్', 'కోయి మిల్ గయా' సినిమాలతో కెరీర్ ప్రారంభించిన హన్సిక.. ఆ తర్వాత దేశముదురు సినిమాతో టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఆమె తన కెరీర్‌పై దృష్టి సారించింది.
{{/usCountry}}