Hanuman Ansh OTT: ఓటీటీలోకి హనుమాన్ అంశ్.. ఈ చిన్న సినిమా ఓటీటీ డీల్ ఎన్ని కోట్లో తెలుసా?

Hanuman Ansh OTT: 'హనుమాన్ అంశ్' డిజిటల్ వేదికపై సందడి చేయడానికి సిద్ధమైంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత కథ ఆధారంగా శోభినవ్ సత్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 27న సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ ఓటీటీ డీల్ ఇప్పుడు ప్రధానంగా వార్తల్లో నిలుస్తోంది.

Published on: Nov 13, 2026, 22:06:08 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Hanuman Ansh OTT: ఈ ఏడాది బాలీవుడ్ లోనే కాదు.. ఇండియన్ సినిమాలోనే అత్యధిక లాభాలు గడించిన సినిమాల్లో ఒకటి హనుమాన్ అంశ్. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి.. బాక్సాఫీస్ దగ్గర రూ.400 కోట్లకుపైగా కొల్లగొట్టిన ఈ మూవీ.. ఇటు ఓటీటీ, శాటిలైట్ హక్కుల ద్వారా కూడా భారీగానే వెనుకేసుకుంది.

Hanuman Ansh OTT: ఓటీటీలోకి హనుమాన్ అంశ్.. ఈ చిన్న సినిమా ఓటీటీ డీల్ ఎన్ని కోట్లో తెలుసా?
Hanuman Ansh OTT: ఓటీటీలోకి హనుమాన్ అంశ్.. ఈ చిన్న సినిమా ఓటీటీ డీల్ ఎన్ని కోట్లో తెలుసా?

ఓటీటీ, శాటిలైట్ హక్కులకు ఎన్ని కోట్లంటే?

బాలీవుడ్ హంగామా రిపోర్ట్ ప్రకారం.. 'హనుమాన్ అంశ్' చిత్ర నిర్మాతలు పోస్ట్-థియేట్రికల్ హక్కుల విక్రయం ద్వారా ఏకంగా రూ. 63 కోట్ల భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్, టెలివిజన్ ప్రసార హక్కులు రెండింటినీ సోనీ సొంతం చేసుకుంది.

నవంబర్ 27 నుంచి సోనీ లివ్ (Sony LIV) ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుండగా, త్వరలోనే సోనీ మ్యాక్స్ (Sony MAX) ఛానెల్‌లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం కానుంది. టీవీ ప్రసార తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

ఈ డీల్ గురించి ఇండస్ట్రీ వర్గాలు స్పందిస్తూ.. "సింగిల్ స్క్రీన్ల నుంచి మల్టీప్లెక్స్‌ల వరకు, మెట్రో నగరాల నుంచి మారుమూల గ్రామాల వరకు ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. థియేటర్లలో చూడలేకపోయిన వారు, మళ్లీ మళ్లీ చూడాలనుకునే ప్రేక్షకులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. అందుకే డిజిటల్, శాటిలైట్ రెండింటిలోనూ భారీ వ్యూయర్‌షిప్ వస్తుందనే నమ్మకంతో సోనీ సంస్థ రూ. 63 కోట్లు వెచ్చించడానికి వెనుకాడలేదు" అని తెలిపాయి.

యశ్ 'టాక్సిక్', 'మీర్జాపూర్' పోటీని తట్టుకుని 226 రెట్ల లాభాలు!

ఎలాంటి స్టార్ హీరోలు లేకుండా కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన 'హనుమాన్ అంశ్' సాధించిన విజయం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరిచింది. విడుదలైన సమయంలో రాకింగ్ స్టార్ యశ్ నటించిన భారీ పాన్-ఇండియా చిత్రం 'టాక్సిక్', క్రేజీ ప్రాజెక్ట్ 'మీర్జాపూర్: ది మూవీ' వంటి దిగ్గజ సినిమాల నుంచి గట్టి పోటీ ఎదురైంది.

మొదటి రెండు వారాలు నెమ్మదిగా సాగినప్పటికీ, ప్రేక్షకుల నుంచి వచ్చిన అద్భుతమైన మౌత్ టాక్ కారణంగా మూడో వారం నుంచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ మొదలైంది. సాక్నిల్క్ (Sacnilk) గణాంకాల ప్రకారం, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 453.32 కోట్ల లైఫ్ టైమ్ గ్రాస్ వసూలు చేసి, తన బడ్జెట్ కంటే దాదాపు 226.66 రెట్లు అధిక ఆదాయాన్ని ఆర్జించి చరిత్ర సృష్టించింది.

మద్యం, మాంసాహారం లేని 'సాత్విక' సక్సెస్ పార్టీ!

ఈ అద్భుత విజయాన్ని పురస్కరించుకుని చిత్ర నిర్మాతలు ముంబైలో ఒక గ్రాండ్ సక్సెస్ పార్టీని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే సాధారణ బాలీవుడ్ పార్టీలకు భిన్నంగా, సినిమాలోని ఆధ్యాత్మిక భావానికి అనుగుణంగా ఈ వేడుకను ప్లాన్ చేయడం విశేషం.

ఈ సక్సెస్ పార్టీలో అతిథులకు కేవలం స్వచ్ఛమైన శాకాహార, సాత్విక భోజనాన్ని మాత్రమే వడ్డించనున్నారు. వేడుకలో ఎక్కడా మద్యంగానీ, మాంసాహార వంటకాలు గానీ ఉండవని సినీ వర్గాలు వెల్లడించాయి.

చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద పెద్ద సంచలనం సృష్టించిన 'హనుమాన్ అంశ్', నవంబర్ 27 నుంచి సోనీ లివ్ వేదికగా డిజిటల్ రికార్డులను కూడా తిరగరాయడానికి సిద్ధంగా ఉంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More